గోకవరం స్టేట్‌బ్యాంక్ ఏటీఎంలో చోరీకి యత్నం | gokavaram Stat bank ATM Attempts stolen | Sakshi
Sakshi News home page

గోకవరం స్టేట్‌బ్యాంక్ ఏటీఎంలో చోరీకి యత్నం

Published Thu, Aug 14 2014 12:54 AM | Last Updated on Sat, Sep 2 2017 11:50 AM

గోకవరం స్టేట్‌బ్యాంక్ ఏటీఎంలో చోరీకి యత్నం

గోకవరం స్టేట్‌బ్యాంక్ ఏటీఎంలో చోరీకి యత్నం

 గోకవరం : స్థానిక స్టేట్ బ్యాంక్ ఏటీఎంలో చోరీకి దొంగలు యత్నించారు. పోలీసుల కథనం ప్రకారం... గ్రామంలో ఎంపీపీ ప్రధాన  పాఠశాల ఎదురుగా ఉన్న ఎస్‌బీఐ ఏటీఎంలో బుధవారం గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి యత్నించారు. ఏటీఎంలో రెండు మెషీన్లు ఉండగా, ఒకదానిని తెరిచేందుకు తీవ్రంగా యత్నించారు. అక్కడ ఉన్న సీసీ కెమెరాను ధ్వంసం చేశారు. ఏటీఎంలో నగదు ఉంచేందుకు రాజమండ్రికి చెందిన రైటర్స్ సేఫ్ గార్డ్స్ అనే ప్రైవేటు సంస్థకు చెందిన సిబ్బంది బుధవారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో ఏటీఎం వద్దకు వచ్చారు. ఏటీఎం మెషీన్ అడుగు భాగం, సీసీ కెమెరా ధ్వంసమై ఉండడాన్ని గుర్తించి వారు ఏటీఎం ఆఫీసర్ జి.ఆనంద్ విజయ్‌కుమార్‌కు సమాచారం అందించారు. దీనిపై ఆయన గోకవరం పోలీస్‌స్టేషన్‌లో బుధవారం రాత్రి ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న గోకవరం ఎస్సై ఆర్.శివాజీ సిబ్బందితో  ఏటీఎం వద్దకు చేరుకుని పరిశీలించారు. ఏటీఎంలో ధ్వంసమైన సీసీ కెమెరాను స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం అర్థరాత్రి సమయంలో ఈ సంఘటన జరిగి ఉంటుందని భావిస్తున్నారు. సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఎస్సై తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement