
సాక్షి, గోకవరం :రామచిలుక ఇంటి ఆవరణలో అరిస్తే చాలు ఆహ్లాదం ... ఇక కనుముందు కదలాడితే కనువిందే...అలాంటిది గాలివానకు చెట్టుపై నుంచి కింద పడి విలవిల్లాడుతూ గిలగిలా కొట్టుకుంటూ చనిపోతే...చూసినవారి మనసు చివుక్కుమంటుంది. అదే జరిగింది గోకవరం మండలంలో...బుధవారం కురిసిన ఈదురు గాలులతో కూడిన భారీ వర్షానికి రామచిలుకల జంట మృత్యువాతపడ్డాయి. ఓ భారీ వృక్షం కొమ్మ తొర్రలో నాలుగు రామచిలుకలు తలదాచుకుంటుండగా చెట్టు కొమ్మ విరిగి పడటంతో రెండు రామ చిలుకలు మృత్యువాత పడ్డాయి. మరో రెండు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుండగా స్థానిక యువకులు గుర్తించి సంరక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment