సాక్షి, హైదరాబాద్ : తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలలో పిడుగులు పడే అవకాశం ఉన్నందున, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వాహణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి, కడియం, రాజానగరం, పశ్చిమ గోదావరి జిల్లాలోని చాగల్లు, నిడదవోలు, పెరవలి, ఆచంట, పోడూరు, పెనుమంట్ర, పెనుగొండ మండలాల పరిసర ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు వెల్లడించింది.
క్యుములోనింబస్ మేఘాల వల్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందాలని సూచనలు చేసింది. ఇక రాజమండ్రిలో గురువారం మధ్యాహ్నం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. భారీ ఈదురు గాలులతో కూడిన వర్షం పడుతోంది. కాగా గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో ఏదో ఒక చోట పిడుగులు పడుతూనే ఉన్నాయి. పిడుగుపాటుకు పలువురు మృత్యువాత కూడా పడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment