గోకవరం (తూర్పుగోదావరి) : వేధింపులు తాళలేక ఇంటి నుంచి బయటకు వెళ్లి ఆత్మహత్య చేసుకున్న యువతికి న్యాయం చేయాలంటూ మహిళా సంఘాలవారు ఆందోళనకు దిగారు. నిందితులను కఠినంగా శిక్షించాలని గురువారం సాయంత్రం గోకవరం పోలీస్ స్టేషన్ ఎదుట బాధితురాలి బంధువులతో కలిసి ధర్నాకు దిగారు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం గ్రామానికి చెందిన బాల స్వాతి(22) పాల్‌టెక్నిక్ పూర్తిచేసి ఇంట్లోనే ఉంటోంది. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన పిల్లి ఆనంద్‌బాబు తనను ప్రేమించాల్సిందిగా వెంటపడి వేధిస్తుండేవాడు.
దీంతో యువతి తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో గ్రామ పెద్దల సమక్షంలో పంచాయితీ చేశారు. అయినా ఆనంద్ వేధింపులు మానుకోకపోగా తన స్నేహితులు శివ, వీరబాబులతో కలిసి మరింత ఎక్కువగా వేధిస్తుండటంతో.. మనస్తాపానికి గురైన స్వాతి ఈ నెల 15న ఇంట్లో నుంచి బయటకు వెళ్లి బుధవారం శవమై తేలింది. వేధింపుల వల్లే యువతి మృతిచెందిందని ఆగ్రహించిన మహిళా సంఘాలవారు గురువారం మృతదేహంతో గోకవరం పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు.
యువతి మృతదేహంతో పీఎస్ ఎదుట ధర్నా
Published Thu, Dec 17 2015 6:19 PM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM
Advertisement
Advertisement