
రోజుకు 8 గంటల కంటే ఎక్కువ సమయం నిద్రపోయేవారిలో స్ట్రోక్ వచ్చే అవకాశం ఎక్కువని తాజా అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. 6-8 గంటలు నిద్రపోయే వారితో పోల్చితే వీరిలో ఈ సమస్య ఎక్కువట. స్ట్రోక్‌కు గురైన వారు ఆకస్మిక కార్డియాక్ అరెస్ట్ బారినపడి అకాల మరణాలకు గురౌతారని అధ్యయనాలు వెల్లడించాయి.
Effects & Health Risks of Oversleeping in Telugu: అమెరికన్ అకాడమీ ఆఫ్ న్యూరాలజీ మెడికల్ జర్నల్ ప్రచురించిన నివేదిక ప్రకారం.. సగటున 62 ఏళ్ల వయస్సున్న దాదాపు 32,000 మందిపై జరిపిన అధ్యయనాల్లో స్ట్రోక్ రిస్క్ గురించి పరిశోధకులు వివరించారు. మెదడులో రక్త ప్రసరణకు అంతరాయం కలిగితే మెదడు కణజాలాలు దెబ్బతింటాయి. ఫలితంగా స్ట్రోక్ వస్తుంది. రాత్రి పూట ఎనిమిది గంటల కంటే తక్కువ నిద్రపోయే వారితో పోలిస్తే, తొమ్మిది గంటలు లేదా అంతకంటే ఎక్కువ సమయం నిద్రపోయే వ్యక్తులకు స్ట్రోక్ ముప్పు 23% ఎక్కువని ఈ అధ్యయనం తెల్పుతోంది. ఐతే అతి తక్కువగా నిద్రపోతే వారిలో స్ట్రోక్ ప్రమాదం 82% ఎక్కువని ఈ నివేదిక తెల్పుతోంది.
చదవండి: కోమాలోకి వెళ్లి సొంత భాష మర్చిపోయి.. కొత్త భాష మాట్లాడుతోంది!!
మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. అధిక నిద్ర స్ట్రోక్‌కు దారితీస్తుందని పరిశోధకులు చెబుతున్నప్పటికీ, స్ట్రోక్ వచ్చినవారిలో తరచుగా నిద్రలేమి సమస్యలు తలెత్తుతాయని అధ్యయనాలు తెల్పాయి. అంతేకాకుండా జ్ఞాపక శక్తి తగ్గడం, విచారంగా ఉండటం వంటి రుగ్మతలు తలెత్తుతాయట.
ఫోర్టిస్ హాస్పిటల్ షాలిమార్ బాగ్ న్యూరాలజీ డైరెక్టర్ డాక్టర్ జైదీప్ బన్సాల్ ఏమంటున్నారంటే.. అధిక నిద్రకు, స్ట్రోక్ సంభవించడానికి మధ్య సంబంధం ఏ విధంగా ఉంటుందో స్పష్టంగా తెలియరాలేదు. ఐతే ఎక్కువగా నిద్రించేవారిలో కొలెస్ట్రాల్ స్థాయిలు, బరువు పెరుగుతున్నాయని.. ఈ రెండూ కారణాల వల్లే స్ట్రోక్ ప్రమాదం వస్తుందని వివరించారు.
చాలా మంది ఆరోగ్య నిపుణులు చెప్పేదేంటంటే.. ఆరోగ్యకరమైన ఆహారం, జీవనశైలిలో కొద్దిపాటి మార్పులు చేసుకుంటే 80% వరకు స్ట్రోక్ ప్రమాదాలను నివారించవచ్చని సూచిస్తున్నారు. నిశ్చల జీవనశైలికి బదులు వ్యాయామాలు చేయడం, జంక్ ఫుడ్, ధూమపానం, అధిక మద్యపానాలకు దూరంగా ఉండటం, తరచూ రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలను పర్యవేక్షించుకోవడం వంటివి అలవర్చుకోవాలని చెబుతున్నారు.
చదవండి: 120 కేజీల బరువున్న బాలికతో రోజుకు 3 వేల స్కిప్పింగ్‌లు.. చివరికి..
Comments
Please login to add a commentAdd a comment