పెను విషాదం.. గుండెపోటుతో క్రికెటర్‌ మృతి.. వీడియో | 35-Year-Old Cricketer Dies Of Cardiac Arrest During Match In Pune | Sakshi
Sakshi News home page

పెను విషాదం.. గుండెపోటుతో క్రికెటర్‌ మృతి.. వీడియో

Published Fri, Nov 29 2024 11:57 AM | Last Updated on Fri, Nov 29 2024 12:17 PM

35-Year-Old Cricketer Dies Of Cardiac Arrest During Match In Pune

క్రికెట్‌ మైదానంలో పెను విషాదం చోటు చేసుకుంది. కార్డియాక్‌ అరెస్ట్‌ కారణంగా యువ ఆటగాడు మృతి చెందాడు. పూణేలోని ఛత్రపతి సంభాజి నగర్‌లో బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఉండే ఓ స్టేడియంలో క్రికెట్‌ మ్యాచ్‌ జరుగుతుండగా.. ఇమ్రాన్‌ పటేల్‌ అనే ఆటగాడు కార్డియాక్‌ అరెస్ట్‌ కారణంగా ప్రాణాలు కోల్పోయాడు. ఈ మ్యాచ్‌లో ఓపెనింగ్‌ బ్యాటర్‌గా బరిలోకి దిగిన ఇమ్రాన్‌ పటేల్‌.. కొన్ని ఓవర్ల పాటు బ్యాటింగ్‌ చేసిన అనంతరం ఛాతీ నొప్పి వస్తుందని అంపైర్లకు చెప్పాడు. పెవిలియన్‌కు వెళ్లే క్రమంలో ఇమ్రాన్‌ కుప్పకూలిపోయాడు. 

హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు నిర్దారించారు. ఇమ్రాన్‌కు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని.. పైపెచ్చు ఎప్పుడూ ఫిట్‌గా ఉండేవాడని తోటి క్రికెటర్లు చెప్పారు. ఇమ్రాన్‌కు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. చిన్న కూతురు నాలుగు నెలల పసి గుడ్డు. ఇమ్రాన్‌ అంత్యక్రియలకు జనం తండోపతండాలుగా వచ్చారు. 

బ్యాటింగ్‌ ఆల్‌రౌండర్‌ అయిన ఇమ్రాన్‌ పటేల్‌కు ఓ క్రికెట్‌ టీమ్‌ ఉంది. జీవనోపాధి కోసం అతను రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం మరియు జ్యూస్‌ షాప్‌ నడిపే వాడు. ఇమ్రాన్‌ మృతి స్థానికంగా విషాద ఛాయలు నింపింది. అచ్చం ఇమ్రాన్‌లాగే రెండు నెలల క్రితం ఇదే పూణేలో మరో స్థానిక క్రికెటర్‌ కూడా మృతి చెందాడు. హబీబ్‌ షేక్‌ అనే క్రికెటర్‌ మ్యాచ్‌ ఆడుతూ ప్రాణాలు కోల్పోయాడు.సెప్డెంబర్‌ 7న ఈ ఘటన జరిగింది. మృతుడు షుగర్‌ పేషంట్‌ అని తెలిసింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement