స్కాట్లాండ్ సీనియర్ క్రికెటర్.. మాజీ కెప్టెన్ కైల్ కోయెట్జర్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. కోయెట్జర్ కెప్టెన్సీలో స్కాట్లాండ్ పలు సంచలన విజయాలు సాధించింది. 2018లో అప్పటి ప్రపంచనెంబర్ వన్ ఇంగ్లండ్‌కు షాకిచ్చిన స్కాట్లాండ్ ఆ తర్వాత కూడా అతని కెప్టెన్సీలో విజయాలు సాధించింది.
గతేడాది మేలో కెప్టెన్సీ బాధ్యతల నుంచి పక్కకు తప్పుకున్న కోయెట్జర్ టి20లకు కూడా గుడ్‌బై చెప్పి కేవలం వన్డేలకు మాత్రమే పరిమితమయ్యాడు. తాజాగా బుధవారం అన్ని రకాల ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు కోయెట్జర్ ప్రకటించాడు. 2008లో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన కోయెట్జర్ స్కాట్లాండ్ తరపున 89 వన్డేల్లో 3192 పరుగులు, 70 టి20ల్లో 1495 పరుగులు చేశాడు.
వన్డేల్లో అతని ఖాతాలో ఐదు సెంచరీలు, 20 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 156 పరుగులు వన్డేల్లో కోయెట్జర్‌కు అత్యధిక స్కోరు. ఇక 2015 వన్డే వరల్డ్‌కప్‌లో బంగ్లాదేశ్‌పై కోయెట్జర్ ఆడిన 156 పరుగుల ఇన్నింగ్స్ అతని కెరీర్‌లో అత్యుత్తమ ప్రదర్శనగా చెప్పుకుంటారు. ఇక 2021 టి20 వరల్డ్‌కప్ సందర్భంగా క్వాలిఫయర్ రౌండ్‌లో అతని కెప్టెన్సీలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ నెగ్గి గ్రూప్ టాపర్‌గా సూపర్-12కు అర్హత సాధించడం కోయెట్జర్ కెరీర్‌లో పెద్ద ఘనత.
ఇక తన రిటైర్మెంట్‌పై స్పందించిన కోయెట్జర్..''ఇదే సరైన సమయం అని భావిస్తున్నా. స్కాట్లాండ్ క్రికెటర్‌గా.. కెప్టెన్‌గా నాకు వచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం గొప్పగా అనిపించింది. ఇన్నాళ్లు నాకు సహకరించిన స్కాట్కాండ్ క్రికెట్ సహా ఆటగాళ్లకు ప్రత్యేక కృతజ్ఞతలు'' అంటూ చెప్పుకొచ్చాడు.
THANK YOU KYLE ❤️👏🏏🏴https://t.co/qv6WHdkibU pic.twitter.com/XrZkebdlqo
— Cricket Scotland (@CricketScotland) March 22, 2023
చదవండి: అభిమానులను పిచ్చోళ్లను చేశారు
నాలుగేళ్ల తర్వాత స్వదేశంలో తొలి ఓటమి.. టీమిండియాకు మరో బిగ్ షాక్
Comments
Please login to add a commentAdd a comment