నిద్రపోతున్నప్పుడే బెల్లీఫ్యాట్‌ని కరిగించే బెడ్‌టైమ్‌ 'టీ'..! | This BedTime Tea Helps Lose Belly Fat While You Are Sleeping! | Sakshi
Sakshi News home page

నిద్రపోతున్నప్పుడే బెల్లీఫ్యాట్‌ని కరిగించే బెడ్‌టైమ్‌ 'టీ'..!

Published Tue, Dec 3 2024 11:42 AM | Last Updated on Tue, Dec 3 2024 1:20 PM

This BedTime Tea Helps Lose Belly Fat While You Are Sleeping!

చాలామంది బానపొట్టతో ఇబ్బంది పడుతుంటారు. ఏ డ్రెస్‌ వేసుకోవాలన్న ఇబ్బెట్టుగా ఈ పొట్ట కనిపిస్తుంది. దీన్ని తగ్గించుకోవడం కూడా అంత ఈజీ కాదు. కాస్త శారీరక శ్రమతో పట్టుదలతో కష్టపడితే బెల్లీఫ్యాట్‌ తగ్గే అవకాశం ఉంటుంది. అయితే ఇది అందరికీ సాధ్యం కాకపోవచ్చు. అలాంటి వారు జస్ట్‌ ఈ టీతో నిద్రపోతున్నప్పుడే ఈ ఫ్యాట్‌ని కరిగించేసుకుని ఆరోగ్యంగా ఉండొచ్చని చెబుతున్నారు పోషకాహార నిపుణురాలు ఖ్యాతీ రూపానీ. రాత్రిపూట చిరుతిళ్లకు బదులుగా ఈ బొడ్డు బస్టింగ్‌ టీని సేవించడం మేలని అన్నారు. ఇంతకీ ఏంటా 'టీ'? అదెలా తయారు చేస్తారు వంటి వాటి గురించి సవివరంగా తెలుసుకుందామా..!.

ఈ టీ కోసం..

వాము, సొంపు గింజలు: వాము శరీంలోని అధిక నీటి శాతాన్ని తగ్గించి, పొట్ట ఉబ్బరం సమస్యను తగ్గిస్తుంది. ఇక సొంపు జీర్ణక్రియకు, గట్‌ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలోనూ సహాయపడుతుంది.

పసుపు: ఇది ప్రసిద్ధ యాంటీఆక్సిడెంట్‌, యాంటీ ఇన్ఫ్లమేటరీ పవర్‌హౌస్‌. ఇది శరీర కొవ్వుని నియంత్రించడంలో సమర్ధవంతంగా ఉంటుంది. అలాగే ఇన్సులిన్‌ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది. పైగా పరోక్షంగా బరువుని కూడా తగ్గిస్తుంది. 

ధనియాలు: ఇది రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రించి, జీర్ణక్రియను మెరుగ్గా ఉంచుతాయి. ఇది కూడా బరువు నిర్వహణకు ఉపయోగపడుతుంది. 

తయారీ విధానం: 
టేబుల్ స్పూన్ వాము, సొంపు తీసుకోవాలి. 
దీనికి 1/4 టీస్పూన్ తాజా పసుపు పొడి,  1 టేబుల్ స్పూన్ కొత్తిమీర గింజలను జోడించాలి.
ఆ తర్వాత 500-600 ml నీరు పోసి స్టవ్‌పై బాగా మరిగించాలి. 15 నిమిషాల తర్వాత వడకట్టి వేడివేడిగా ఆస్వాదించాలి. 

ప్రయోజనాలు..

  • హార్మోన్లను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా PCOS, అడెనోమయోసిస్‌ సమస్యలకు చెక్‌ పెడుతుంది. 

  • జీవక్రియ, ఇన్సులిన్ పనితీరును మెరుగ్గా ఉంచుతుంది

  • బరువు నిర్వహణకు ఉపయోగపడుతుంది

  • మంచి నిద్రను ప్రోత్సహిస్తుంది

నిద్రవేళల్లో ఈ టీని ఆరోగ్యకరంగా తయారుచేసుకుని తాగితే బెల్లీఫ్యాట్‌ కరగడమే గాక ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందగలరని పోషకాహారనిపుణురాలు ఖ్యాతీ రూపానీ చెబుతున్నారు.

(చదవండి: అన్నం సయించనప్పుడు ఇలా తీసుకుంటే మేలు..!)

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement