Mithun Chakraborty (actor)
-
నటుడు మిథున్ చక్రవర్తికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు
-
హాస్పిటల్లో ఉంటే ప్రధాని ఫోన్ చేసి తిట్టారు: నటుడు
కరోనా తర్వాత పరిస్థితులు మారిపోయాయి. ఎప్పుడు ఏ అనారోగ్య సమస్య తలెత్తుతుందో అర్థం కాని పరిస్థితి! అప్పటిదాకా ఆరోగ్యంగా కనిపించినవాళ్లు కూడా సడన్‌గా ఛాతీ నొప్పి, గుండెపోటు, ఇలా రకరాకల సమస్యలతో ఆస్పత్రిపాలవుతున్నారు. మూడు రోజుల క్రితం బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి సైతం తీవ్రమైన ఛాతీ నొప్పితో కోల్‌కతాలోని ఓ ఆస్పత్రిలో చేరాడు. చికిత్స అనంతరం సోమవారం డిశ్చార్జ్ అయ్యాడు. బాగానే ఉన్నా.. తన ఆరోగ్య పరిస్థితి గురించి మాట్లాడుతూ.. 'నేను బాగానే ఉన్నాను. ఎలాంటి సమస్యా లేదు. కాకపోతే నా ఆహారపు అలవాట్లను కాస్త నియంత్రణలో ఉంచుకోవాలి. ఇక నేను నా పని మొదలుపెట్టాలి. రేపటి నుంచి షూటింగ్లో జాయిన్ అవ్వాలి. ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ఫోన్ చేసి మాట్లాడారు. ఇటీవలే పద్మ భూషణ్ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసినందుకు తిట్టారు' అని చెప్పుకొచ్చాడు. కాగా మిథున్ చక్రవర్తి హిందీ, బెంగాలీ, ఒడియా, భోజ్‌పురి, తమిళ భాషల్లో కలిపి 350 సినిమాలు చేశాడు. సినీ పరిశ్రమకు అందించిన సేవలకుగానూ కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ఇతడికి పద్మ భూషణ్ అవార్డు ప్రకటించింది. చదవండి: సెల్వతో పనిచేయడం ఇష్టమే.. మాజీ భర్త సినిమాపై సోనియా ఆసక్తికర వ్యాఖ్యలు -
మిథున్ చక్రవర్తికి వచ్చిన ఇస్కీమిక్ స్ట్రోక్ అంటే..?
ప్రఖ్యాత బాలీవుడ్ నటుడు, బీజేపీ నేత మిథున్ చక్రవర్తి గత శనివారమే తీవ్ర అస్వస్థతకు గురయ్యిన సంగతి తెలిసింది. దీంతో ఆయనను కుటుంబసభ్యులు కోల్‌కతాలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. అయితే ఆస్పత్రి విడుదల చేసిన అధికారిక ప్రకటన ప్రకారం.. 73 ఏళ్ల మిధున్ తన పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నట్లు ప్రకటనలో పేర్కొంది. వైద్య పరీక్షల్లో మిథున్ బ్రెయిన్‌కి సంబంధించిన ఇస్కీమిక్ సెరెబ్రోవాస్కులర్ స్ట్రోక్‌కి గురయ్యినట్లు తెలిపింది. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని, నెమ్మదిగా కోలుకుంటున్నారని పేర్కొంది. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ఆయనను పద్మ విభూషణ్‌తో సత్కరించిన సంగతి తెలిసిందే. అది జరిగిన కొద్దిరోజులకే మిథున్ ఇలా అస్వస్థతకు గురవ్వడం బాధకరం. అయితే మిథున్ చక్రవర్తి ఎదుర్కొంటున్న ఈ ఇస్కీమిక్ సెరెబ్రోవాస్కులర్ స్ట్రోక్ అంటే ఏమిటీ? ఎందువల్ల ఇది వస్తుంది? ఇస్కీమిక్ స్ట్రోక్ అంటే.. మెదడులో కొంత భాగానికి రక్త సరఫరా జరకపోయినా లేదా తగ్గినా ఈ ఇస్కీమిక్ సెరెబ్రోవాస్కులర్ స్ట్రోక్ సంభవిస్తుంది. దీంతో మెదడు కణజాలానికి ఆక్సిజన్ వంటి పోషకాలు అందకుండా పోతాయి. వెంటనే మెదడు కణాలు నిమిషాల్లో చనిపోవడం ప్రారంభమవుతుంది. ఈ తర్వాత రోగి పరిస్థితి విషమంగా అయిపోతుంది. అలాగే మెదడుకు సంబంధించిన మరొక ప్రమాదకరమైన స్ట్రోక్ ఒకటి ఉంది. దీని గురించి తరుచుగా వింటుంటాం. అదే బ్రెయియన్ హెమరేజిక్ స్ట్రోక్. ఇది మెదడులోని రక్తనాళం లీక్ అయినప్పుడు లేదా పగిలిపోయి మెదడులో రక్తస్రావం జరిగితే ఈ స్ట్రోక్ రావడం జరుగుతుంది. ఇక్కడ రక్తం మెదడు కణాలపై ఒత్తిడి పెంచి దెబ్బతీస్తుంది. చాలమందికి ఎదుర్కొనే స్ట్రోక్ ఇది. అయితే ఇస్కీమిక్ స్ట్రోక్ అనేది చాలా అరుదుగా వస్తుందని చెప్పొచ్చు. పైగా ఈ పరిస్థితి కాస్త క్రిటికల్ అనే చెప్పొచ్చు కూడా. లక్షణాలు.. BREAKING: PM @narendramodi dials #MithunChakraborty, inquiring about his health. https://t.co/MPrYMLT0J1 — Sai Ram B (@SaiRamSays) February 11, 2024 మాట్లాడటం, ఇతరులు ఏమి చెబుతున్నారో అర్థం చేసుకోవడంలో సమస్యలు తలెత్తుతాయి. ముఖం చేతులు లేదా కాలులో తిమ్మిరిగా లేదా పక్షవాతానికి గురవ్వడం ఒకటి లేదా రెండు కళ్లల్లో కనిపించే సమస్యలు తలనొప్పి నడకలో ఇబ్బంది ఆకస్మికంగా మైకం కమ్మడం ఏదీఏమైనా స్ట్రోక్ అనేది మెడికల్ ఎమర్జెన్సీ అనే చెప్పాలి. దీనికి వెంటనే చికిత్స పొందడం చాలా ముఖ్యం. ఇలాంటి సమయాల్లో రోగికి అత్యవసరమైన వైద్య సహాయం త్వరగా పొందితే మెదడు పూర్తి స్థాయిలో దెబ్బతినకుండా ఇతర స్ట్రోక్‌లు రాకుండా నియత్రించగలుగుతామని వైద్యులు చెబుతున్నారు. -
గుండె నొప్పితో ఆసుపత్రిలో చేరిన స్టార్ హీరో
ప్రముఖ బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి అస్వస్థతకు గురయ్యారు. ఆయన కోల్‌కతాలోని అపోలో ఆసుపత్రిలోని అత్యవసర విభాగం నందు చికిత్స పొందుతున్నారు. నేడు (ఫిబ్రవరి 10) ఉదయం ఆయనకు గుండె నొప్పి రావడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. కానీ ఆయన ఆరోగ్య విషయంపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మిథున్ చక్రవర్తికి 2024 జనవరి 25న కేంద్ర ప్రభుత్వం 'పద్మ భూషణ్' అవార్డును ప్రకటించిన విషయం తెలిసిందే. బెంగాలీ కుటుంబానికి చెందిన మిథున్ చక్రవర్తి బాలీవుడ్లో ఎన్నో సినిమాల్లో నటించి ప్రముఖ నటుడిగా గుర్తింపు పొందారు. మిథున్ గతంలో కిడ్నీ సమస్యతో బాధపడ్డారు. సుమారు రెండేళ్ల క్రితం బెంగళూరులోని ఓ ఆసుపత్రిలో ఆయనకు ఆపరేషన్ జరిగింది. మళ్లీ ఇప్పుడు ఛాతీ వద్ద నొప్పి రావడంతో ఆయన కోల్‌కతాలోని ఆపోలో ఆసుపత్రిలో చేరారు. కారణాలు పూర్తిగా తెలియాల్సి ఉంది. దీంతో త్వరగా ఆయన కోలుకోవాలని కోరుతూ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఒకప్పుడు హీరోగా బెంగాలీ, హిందీ ఇండస్ట్రీలలో దుమ్మురేపిన మిథున్ చక్రవర్తి. శ్రీదేవి సరసన అనేక చిత్రాల్లో నటించారు. 'ది కశ్మీర్ ఫైల్స్' చిత్రంలో మిథున్ మెప్పించిన విషయం తెలిసిందే. -
ఒకపుడు నక్సలైట్.. హీరోగా 180 ఫ్లాప్స్.. అయినా తగ్గని స్టార్డమ్!
సూపర్ స్టార్లు బాలీవుడ్‌ను ఏడుతున్న సమయంలో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు నటుడు మిథున్ చక్రవర్తి. 1970-80ల కాలంలో చలనచిత్ర పరిశ్రమ అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర, జీతేంద్ర, వినోద్ ఖన్నా, రాజేష్ ఖన్నా లాంటి సూపర్ స్టార్ల హవా నడుస్తోంది. అలాంటి టైంలో హీరోగా ఎంట్రీ ఇచ్చి సూపర్ స్టార్‌గా నిలిచాడు. ఇప్పటికీ మిథున్ స్టార్డమ్ ఏ మాత్రం తగ్గ లేదు. తాజాగా కేంద్ర ప్రభుత్వ ప్రకటించిన ప్రతిష్టాత్మక పద్మ అవార్డుల్లో మిథున్ చక్రవర్తికి పద్మభూషణ్ అవార్డు ప్రకటించిన సందర్భంగా స్పెషల్ స్టోరీ. బాలీవుడ్ ఎంట్రీ తరువాత చాలామంది స్టార్స్ తమ కెరీర్లో ప్లాప్ సినిమాలను చాలానే ఇచ్చారు. కానీ మిథున్ రూటే సెపరేట్. 47 ఏళ్ల కెరీర్లో ఏకంగా 180 ఫ్లాప్ చిత్రాలను ఖతాలో వేసుకున్న ఏకైక బాలీవుడ్ స్టార్ మిథున్ చక్రవర్తి. తాను నటించిన 370 సినిమాల్లో దాదాపు 200 సినిమాలు అతను చూడను కూడా చూడలేదని ఒక ఇంటర్వ్యూలో స్వయంగా వెల్లడించాడు మిథున్. 47 మూవీలు డిజాస్టర్లు మిగుల్చుకున్న హీరో కూడా ఆయనే. 1990వ దశకంలో, మిథున్ వరుసగా అత్యధిక ఫ్లాప్ చిత్రాల రికార్డును నెలకొల్పాడు . 1993-98లో బ్యాక్-టు-బ్యాక్ 33 చిత్రాలు అట్టర్ ఫ్లాప్. అయితేనేం మిథున్ చక్రవర్తి సూపర్ స్టార్‌గా భావిస్తున్నారు ఫ్యాన్స్. చదవండి: పట్టుచీరలో మెరిసిన మాధురి, ఆ చీర ధర ఎంతో తెలుసా? మిథున్ చక్రవర్తి సూపర్ స్టార్డమ్ వెనుక కారణం ఏమిటంటే 50 హిట్ చిత్రాలే. ముఖ్యంగా 1976లో మృగయ సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. తొలి సినిమాకే ఉత్తమ నటుడిగా తన తొలి జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకున్నాడు. ఇక ఆ తరువాత డిస్కో డ్యాన్సర్ సినిమాతో ‘ఐ యామ్ డిస్కో డ్యాన్సర్’ పాటతో భారీ పాపులారిటీ తెచ్చుకున్నాడు. ఈ మ్యూజిక్ అప్పట్టో దేశమంతా మారుమోగి పోయింది. అంతేకాదు భారతదేశంలోనే 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన తొలి చిత్రంగా నిలిచింది ఈ బ్లాక్ బస్టర్ మూవీ. మిథున్ ఎక్కడ పుట్టాడు? 1950 జూన్ 16న కోలకత్తాలో జన్మించిన మిథున్ B.Sc, పూణేలోని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ నుంచి గ్రాడ్యుయేషన్ చేసాడు. వేలాదిమంది ఇతర బెంగాలీ యువకుల మాదిరిగానే నక్సలిజం పట్ల ఆకర్షితుడై 1960ల చివరలో పోరాటం బాట పట్టాడు. కొంతకాలం అజ్ఞాతంలో కూడా ఉన్నాడు. అయితే మిథున్ సోదరుడు ఘోర ప్రమాదంలో మరణించడంతో ఇంటికి తిరిగి రావాల్సి వచ్చింది. అలా సినిమాల్లోకి హీరోగా మిథున్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత వెనుదిరిగి చూడలేదు.హిట్స్, ఫ్లాప్స్‌తో లెక్కలేకుండా వరుస సినిమాలతో డైరెక్టర్లు, నిర్మాతల ఫ్యావరేట్‌గా అవతరించాడు. ఎంతో కష్టపడి హీరో స్థాయికి ఎదిగాననీ, ఒక దశలో హీరో కావాలనే తన కల నెరవేరదేమో అనుకొని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డట్టు పలు సందర్భాల్లో మిథున్ చక్రవర్తి చెప్పాడు. యోగితా బాలిని మిథున్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు మిథున్. వీరికి ముగ్గురు కుమారులు మిమో, నమషి, ఉస్మాయ్. కుమార్తె దిషానిని దత్తత తీసుకున్నారు. కుమారుడు నమాషి బ్యాడ్‌బాయ్ చిత్రంతో తెరంగేట్రం చేశాడు. నటనతో పాటు, వ్యాపారం, టీవీ హోస్ట్‌గా, బ్రాండ్ ఎండార్స్మెంట్ల ద్వారా కూడా సంపాదిస్తున్నారు. మిథున్ చక్రవర్తి నెట్‌వర్త్ దాదాపు రూ.400 కోట్లు అని అంచనా. అనేక రియల్ ఎస్టేట్ ఆస్తులతోపాటు, మెర్సిడెస్ బెంజ్ 1975, టయోటా ఫార్చ్యూనర్, ఫోర్డ్ ఎండీవర్‌తో సహా అనేక విలాసవంతమైన కార్లు కూడా ఉన్నాయి. రాజకీయ జీవితం తొలుత టీఎంసీ ఎంపీగా ఎన్నికైన మిథున్, ఆ తరువాత ఎంపీగా రాజీనామా చేసి మరీ 2021 పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికలకు ముందు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో బీజేపీలో చేరాడు. -
నాకు కలర్ తక్కువని హీరోయిన్స్ దూరం పెట్టారు: సీనియర్ హీరో
'ఐయామ్ ఎ డిస్కో డ్యాన్సర్..' పాట వినగానే హిందీ సినిమాల్లో హీరోగా గుర్తింపు తెచ్చుకున్న బెంగాలీ నటుడు మిథున్ చక్రవర్తి గుర్తుకొస్తాడు. 40 ఏళ్ల క్రితం మిథున్ హీరోగా నటించిన డిస్కో డ్యాన్సర్ సినిమాలోని ఈ పాట అప్పటికీ, ఇప్పటికీ పాపులరే.. అయితే కెరీర్ తొలినాళ్లలో తనతో నటించడానికి ఎవరూ అంతగా ఆసక్తి చూపించలేదట. కలర్ తక్కువని పెద్ద హీరోయిన్స్ అతడిని దూరం పెట్టేవారట. పుట్టుకతో వచ్చిన రంగును ఎలాగూ మార్చలేం కాబట్టి తన డ్యాన్స్‌తో అందరినీ ఆకట్టుకోవాలనుకున్నాడు. చివరకు అందరూ తన రంగు గురించి కాకుండా డ్యాన్స్ గురించి మాట్లాడుకునేలా చేశాడు. డ్యాన్స్ వల్ల నా కలర్ పక్కనపెట్టారు తాజాగా ఓ ఇంటర్వ్యూలో మిథున్ చక్రవర్తి మాట్లాడుతూ.. 'నన్ను హీరోగా చూశాక జనాలు నాపై చాలా అంచనాలు పెట్టుకున్నారు. నా కొడుకును కూడా హీరో చేసేయొచ్చు అనుకున్నారు. నేను సామాన్య ప్రజల హీరోగా మారాను. కామన్ మ్యాన్‌కు సూపర్‌స్టార్ అవడం అనేది నాకు గొప్ప విషయం. నేను నా కాళ్లను కదిలిస్తూ డ్యాన్స్ చేస్తే ఎవరూ నా రంగు గురించి పట్టించుకోరనుకున్నాను. అదే నిజమైంది. నా డ్యాన్స్ వల్ల నా కలర్‌ను మర్చిపోయారు. ఎందుకంటే నలుపు రంగులో ఉన్నందున ఎవరూ నన్ను హీరోగా అంగీకరించలేకపోయారు. ఆ సందర్భంలో నాకు చాలా బాధేసేది. ఏడ్చేవాడిని కూడా! ఆ హీరోయిన్ ఒక్కరే నన్ను పొగిడారు పెద్ద హీరోయిన్స్ నావైపు కన్నెత్తి చూసేవారు కాదు.. నాతో నటించడానికి ఇష్టపడేవారు కాదు. నన్నసలు వాళ్లు హీరోగానే చూడలేదు. నాతో పని చేస్తే వారికి ఎటువంటి ఫేమ్ రాదని నన్ను పక్కనపెట్టేవాళ్లు. సరిగ్గా ఆ సమయంలో జీనత్ అమన్ వచ్చింది. ఇతడు చాలా బాగున్నాడు.. ఇతడితో నటించడానికేంటి సమస్య అని నా సరసన హీరోయిన్గా నటించింది. ఇక అప్పటినుంచి నా కెరీర్ బ్రేకుల్లేకుండా దూసుకెళ్లింది' అని చెప్పుకొచ్చాడు మిథున్ చక్రవర్తి. చదవండి: చై మంచివాడు, సామ్ ఆ ఫోటో డిలీట్ చేసినందుకు నాపై ద్వేషం: ప్రీతమ్ -
ప్రభాస్‌కు విలన్‌గా రంగంలోకి బాలీవుడ్ నటుడు?
బాహుబలితో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగాడు. ప్రస్తుతం ఆయన ఆ స్థాయిలోనే సినిమాలు చేస్తున్నాడు. ఆయన హీరోగా ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘రాధేశ్యామ్’. పూజా హెగ్డే హీరోయిన్. యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణా మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేసేందుకు మేకర్స్ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. అందుకు అనుగుణంగా ప్రభాస్‌కి విలన్‌గా బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తిని రంగంలోకి దించే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఇదే నిజమైతే వెంకటేశ్, పవన్ కల్యాణ్ ‘గోపాల గోపాల’ తర్వాత మిథున్‌కు ఇది మరో తెలుగు సినిమా అవుతుంది. ఈ సినిమాలో కృష్ణంరాజు కూడా ఓ ముఖ్యపాత్ర చేస్తున్నారని భోగట్టా. కాగా ఇటలీలో తొలి షెడ్యూల్‌ని పూర్తి చేసుకున్న ఈ సినిమా 1970లో సాగే పీరియాడికల్ లవ్‌స్టోరీగా తెరకెక్కుతోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లోనే ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ వేసిన సెట్లో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ ఏడాది చివరికి మూవీని విడుదల చేసేలా టీం ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. కాగా ప్రభాస్ ప్రస్తుతం ఓం రౌత్ డెరెక్షన్‌లో ‘ఆదిపురుష్’, కేజీఎఫ్ డెరక్టర్ ప్రశాంత్ నీల్‌తో ‘సలార్’, టాలీవుడ్ డెరెక్టర్ నాగ అశ్విన్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. -
వైరల్.. పోర్న్ స్టార్‌తో నటుడి కొడుకు
సాక్షి, సినిమా : బాలీవుడ్ లెజెండరీ నటుడు, డిస్కో డాన్సర్ మిథున్ చక్రవర్తి అనారోగ్య కారణాలతో సినిమాలకు, రాజకీయాలకు దూరమైన విషయం తెలిసిందే. ఆయన వారసుడిగా సినిమాల్లోకి అడుగుపెట్టిన మహాక్షయ్ చక్రవర్తి .. హీరోగా మాత్రం విఫలం అయ్యాడు. 2015 లో ఇష్కేదార్రియాన్ చిత్రంతో పలకరించినప్పటికీ అది డిజాస్టరే అయ్యింది. దీంతో తర్వాత అతనికి అసలు అవకాశాలే రాలేదు. అయితే బుల్లితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యాడు. ఇదిలా ఉంటే ప్రస్తుతం లాస్ ఏంజెల్స్‌లో ఉన్న మహాక్షయ అక్కడ ఓ మహిళతో ఫోటో దిగి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఆమె ఎవరో కాదు.. ప్రముఖ పోర్న్ స్టార్ కైడెన్ క్రాస్. అందం మరియు నిజాయితీ ఆమె సొంతం అంటూ అడల్ట్ స్టార్‌తో దిగిన ఫోటోను సంతోషంగా షేర్ చేశాడు. అయితే ఆ ఫోటోపై కొందరు కాస్త తేడా కామెంట్లు చేశారనుకోండి. ఇదిలా ఉంటే స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నిర్మాతగా మారి తొలిసారి బుల్లితెరపై నిర్మిస్తున్న ఓ షోలో మహాక్షయ్ నటించబోతున్నాడు. ప్రముఖ మల్లయోధుడు ది గ్రేట్ గామా(గులాం మహ్మద్ భక్ష్) బయోపిక్ ఆధారంగా అది తెరకెక్కుతోంది. -
పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు
ఈరోజు మీతో పాటు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు: మిథున్ చక్రవర్తి (నటుడు); ఇంతియాజ్ అలి (దర్శకుడు, రచయిత) ఈరోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 3. వీరు ఈ సంవత్సరమంతా సంతోషాలతో ఉత్సాహంగా, ఉల్లాసంగా గడుపుతారు. విషయ పరిజ్ఞానాన్ని పొందుతారు. కార్యదక్షులుగా పేరుతెచ్చుకుంటారు. నాస్తికులు కూడా ఆస్తికులుగా మారతారు. ధార్మిక, ఆధ్యాత్మిక విషయాలలో పట్టు సాధిస్తారు. సద్గురువుల సాంగత్యం ఏర్పడుతుంది. ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. రచయితలు, వక్తలు, సంగీత గురువులకు ప్రభుత్వ గుర్తింపు, ప్రోత్సాహకాలూ లభిస్తాయి. న్యాయపరమైన లావాదేవీలు, కోర్టుకే సులు అనుకూలించవు కాబట్టి, వాటి జోలికి వెళ్లకుండా ఉండటం మంచిది. కొత్త కొత్త కోర్సులు చేయాలని కోరిక కలుగుతుంది. అర్ధంతరంగా ఆపేసిన చదువును కొనసాగిస్తారు. ఆధ్యాత్మిక విషయాల్లో పడి సంసార జీవితాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల కొత్త ఇబ్బందులు ఎదురవుతాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపించే ప్రమాదం ఉంది. లక్కీ నంబర్స్: 1,2,5; లక్కీ కలర్స్: పర్పుల్, గ్రే, ఎల్లో, క్రీమ్, వైట్; లక్కీ డేస్: సోమ, మంగళ, గురువారాలు సూచనలు: కుటుంబానికి ప్రాధాన్యం ఇవ్వటం, గురుశ్లోకం చదవటం, దక్షిణామూర్తిని ఆరాధించటం, గురువులను, పెద్దలను గౌరవించటం, వృద్ధులను, అనాథలను ఆదుకోవడం. - డా. మహమ్మద్ దావూద్, జ్యోతిష, సంఖ్యాశాస్త్ర నిపుణులు