సాక్షి, సినిమా : బాలీవుడ్ లెజెండరీ నటుడు, డిస్కో డాన్సర్ మిథున్ చక్రవర్తి అనారోగ్య కారణాలతో సినిమాలకు, రాజకీయాలకు దూరమైన విషయం తెలిసిందే. ఆయన వారసుడిగా సినిమాల్లోకి అడుగుపెట్టిన మహాక్షయ్ చక్రవర్తి .. హీరోగా మాత్రం విఫలం అయ్యాడు. 2015 లో ఇష్కేదార్రియాన్ చిత్రంతో పలకరించినప్పటికీ అది డిజాస్టరే అయ్యింది. దీంతో తర్వాత అతనికి అసలు అవకాశాలే రాలేదు.
అయితే బుల్లితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యాడు. ఇదిలా ఉంటే ప్రస్తుతం లాస్ ఏంజెల్స్‌లో ఉన్న మహాక్షయ అక్కడ ఓ మహిళతో ఫోటో దిగి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఆమె ఎవరో కాదు.. ప్రముఖ పోర్న్ స్టార్ కైడెన్ క్రాస్. అందం మరియు నిజాయితీ ఆమె సొంతం అంటూ అడల్ట్ స్టార్‌తో దిగిన ఫోటోను సంతోషంగా షేర్ చేశాడు. అయితే ఆ ఫోటోపై కొందరు కాస్త తేడా కామెంట్లు చేశారనుకోండి.
ఇదిలా ఉంటే స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నిర్మాతగా మారి తొలిసారి బుల్లితెరపై నిర్మిస్తున్న ఓ షోలో మహాక్షయ్ నటించబోతున్నాడు. ప్రముఖ మల్లయోధుడు ది గ్రేట్ గామా(గులాం మహ్మద్ భక్ష్) బయోపిక్ ఆధారంగా అది తెరకెక్కుతోంది.
Comments
Please login to add a commentAdd a comment