
ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫొటో
విన్నూత్నంగా ఫొటోలు దిగి.. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఓ జంటపై నెటిజన్లు మండిపడుతున్నారు. అసలు ‘మీకు బుద్దుందా.. ఇదో స్టుపిడ్ ఫొటో’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫొటోల పిచ్చితో ప్రాణాలను పొగుట్టుకుంటారా? ఏంటని ప్రశ్నిస్తున్నారు. మరి కామన్సెన్స్ లేకుండా ప్రవర్తించారని కామెంట్ చేస్తున్నారు. అమెరికాకు చెందిన కెల్లీ క్యాస్ట్లీ, కోడి అనే దంపతులు వినూత్న పోజ్‌లో ఉన్న ఫొటోను తమ ఇన్‌స్టాగ్రామ్‌లో గత మంగళవారం షేర్ చేశారు.
ఇంతకీ ఆ ఆమెరికా జంట షేర్ చేసిన ఫొటో ఏంటంటే.. కొండభాగాన ఉన్నట్లున్న స్విమ్మింగ్ పూల్‌లో అంచున అతను నిలబడగా.. అతని చేతిలో ఆమె ఒదిగిపోయింది. అయితే ఈ ఫొటో చూడటానికి ఆకట్టుకున్నా.. వారి ప్రాణాలకు ప్రమాదకరమనే విధంగా ఉంది. ఆమె అతని చేతిలో నుంచి జారితే ప్రాణాలు గాల్లో కలిసేటట్లుంది. ఇది చూసిన నెటిజన్లకు చిరెత్తుకొచ్చింది. దీంతో నెటిజన్లు ఆ జంటపై దుమ్మెత్తిపోసారు. అయితే ఈ దంపతులు మాత్రం పూర్తి జాగ్రత్తలు తీసుకునే తాము ఈ ఫొటో షూట్ చేశామన్నారు. ఆ పైబాగాన ఉన్న స్విమ్ పూల్ కింద మరో స్విమ్ పూల్ ఉందని, తమ ప్రాణాల గురించి అంత బాధపడాల్సిన అవసరం లేదని పేర్కొంది. దానికి సంబంధించిన ఫొటోలను కూడా షేర్ చేసింది. దీంతో ఈ ఫొటోలు ఇప్పుడు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment