బహిరంగ మూత్ర విసర్జన చేస్తున్న రాజస్తాన్ మంత్రి ( వైరలైన ఫొటో)
జైపూర్: ఓవైపు స్వచ్ఛ్ భారత్ కోసం దేశ ప్రజలంతా కృషి చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిస్తుంటే.. మరోవైపు ఆయన పార్టీకే చెందిన రాజస్తాన్ మంత్రి శంభు సింగ్ ఖేటసర్ మాత్రం బహిరంగ మూత్ర విసర్జన చేసి నవ్వులపాలయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఇక ఆ సదరు మంత్రిగారు తమ ముఖ్యమంత్రి వసుంధర రాజే పోస్టర్ పక్కనే మూత్ర విసర్జన చేయడం విశేషం. తను చేసిన ఈ పనిని ఇది పెద్దవారి సాంప్రదాయమని సమర్ధించుకోవడం మరో విశేషం. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసిన ఓ భారీ బహిరంగ సభకు హాజరయ్యే క్రమంలో శంభు సింగ్ బహిరంగ మూత్ర విసర్జన చేశారు.
దీనిపై మీడియా వివరణ కోరగా.. తను తమ సీఎం పోస్టర్ పక్కన మూత్ర విసర్జన చేయలదని, ఓ గోడపక్కన చేశానని, అక్కడ ఎలాంటి పోస్టర్ లేదని తెలిపారు. అంతేకాకుండా ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన స్వచ్ఛ్ భారత్ ఉద్దేశం బహిరంగ మల విసర్జన చేయవద్దని కానీ, మూత్ర విసర్జన కాదని చెప్పుకొచ్చారు. మల,మూత్ర విసర్జనలు రెండు వేర్వేరన్నారు. బహిరంగ మల విసర్జన వల్ల వ్యాధులొస్తాయని, కానీ మూత్ర విసర్జన వల్ల ఎలాంటి సమస్య ఉండదని తెలిపారు. తను ఈ పని చేసిన చోటు చాలా విశాల ప్రాంతమని, అక్కడ జనవాసం లేకపోవడంతో అసలు సమస్యే ఉండదని ఈ రాజస్తాన్ మంత్రి అభిప్రాయపడ్డారు. ఆ రోజు ఉదయం నుంచి బిజీగా గడిపానని, దగ్గరల్లో ఎక్కడా టాయిలెట్స్ లేవన్నారు.
#India A state Minister in Rajasthan a northern Indian state has landed in a controversy after a photo of him urinating near a wall went viral on social media. Minister Shambhu Singh Khatesar said urinating in the open was "an age-old tradition". pic.twitter.com/L3bzR405rT
— Eugene Makai (@EugeneMakai) October 7, 2018
Comments
Please login to add a commentAdd a comment