అందరూ రాఖీ పండుగను తమ సోదరులకు తమ ప్రియమైన వ్యక్తులకు కట్టి సెలబ్రేట్ చేసుకుంటారు. మరికొంతమంది మనల్ని రక్షించే రక్షక భటులకు కట్టడం వంటివి చేస్తుంటారు. ఒక్కొకరు ఒక్కో పద్ధతిలో తమకు నచ్చిన రీతిలో ఈ పండుగను సెలబ్రేట్ చేసుకున్నారు. కానీ ఇక్కడొక మహిళ మాత్రం ఏకంగా చిరుతకే రాఖీ కంటే తన గొప్ప మనసుని చాటుకుంది.
ఏం జరిగిందంటే...చిరుతకి రాఖీ కట్టడమా! అని ఆశ్యర్యపోకండి. ఔను రాజస్తాన్‌లోని ఓ మహిళ చిరుతపులికి రాఖీ కట్టింది. అనారోగ్యానికి గురైన చిరుత పులిని అటవీ శాఖకు అప్పగిస్తూ ఆ చిరుతకు రాఖీ కట్టింది. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోను ఇండియన్ ఫారెస్ట్ అధికారి సుశాంత నంద శుక్రవారం ట్విట్టర్‌లో షేర్ చేశారు.
ఆయన భారతీయులు జంతువుల పట్ల అమితమైన ప్రేమను కనబరుస్తూ వాటితో సామరస్యంగా ఉంటారని క్యాప్షన్ జోడించి మరీ పోస్ట్ చేశారు. దీంతో ఈ ఫోటో నెట్టింట తెగ వైరల్ అయింది. ప్రపంచం మానువులకు మాత్రమే కాదని దేవుడు అన్ని రకాల జంతువులను సృష్టించాడని ఒకరు, వన్యప్రాణుల పట్ల మహిళలా ప్రేమగా వ్యవహరించాలని మరోకరు సదరు మహిళను ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు.
For ages, man & animal in India have lived in harmony with unconditional love to the wild.
— Susanta Nanda IFS (@susantananda3) August 12, 2022
In Rajasthan, a lady shows this unfettered love to our wild by tying a Rakhi(symbol of love & brotherhood ) to an ailing Leopard before handing over to Forest Department.
(As received) pic.twitter.com/1jk6xi1q10
(చదవండి: నడి రోడ్డు పై సొమ్మసిల్లి పడిపోయిన గుర్రం... తిట్టిపోస్తున్న జనాలు)
Comments
Please login to add a commentAdd a comment