రాజస్థాన్‌లోని టోంక్‌లో ఒక గర్భిణి ఒకేసారి నలుగురు శిశువులకు జన్మనిచ్చింది. ఈ ఉదంతం వజీర్‌పురా గ్రామంలో చోటుచేసుకుంది. ఆ మహిళ పెళ్లయిన నాలుగేళ్లకు గర్భం దాల్చింది. ఆమె ఒకే కాన్పులో ఏకంగా నలుగురు శిశువులకు జన్మనివ్వడంతో ఆ దంపతుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
గర్భిణికి చికిత్సనందించిన డాక్టర్ షాలినీ అగర్వాల్ మాట్లాడుతూ ఆదివారం సాయంతం ఆ మహిళను ఆసుపత్రికి తీసుకు వచ్చారని, అర్ధరాత్రి దాటాక ఆమెకు పురిటి నొప్పులు వచ్చాయన్నారు. తరువాత ఆమెకు డెలివరీ చేశామన్నారు. సోమవారం ఉదయం 5 గంటల 51 నిముషాలకు తొలి శిశువు జన్మించిందని, తరువాత ఒక్కొక్కరుగా నాలుగు నిముషాల్లో ముగ్గురు శిశువులు జన్మించారని తెలిపారు. ఆ నలుగురు శిశువుల్లో ఇద్దరు మగశిశువులు, ఇద్దరు ఆడ శిశువులని, వారంతా ఆరోగ్యంగానే ఉన్నారని తెలిపారు.
ఆ మహిళ గర్భం ధరించిన రెండవ నెలలోనే ఆమె కడుపులో నాలుగు పిండాలు ఉన్నట్లు గుర్తించామని డాక్టర్ షాలిని తెలిపారు. నాల్గవ నెలలో గర్భశ్రావం అయ్యే పరిస్థితి ఉండటంతో ప్రత్యేక చికిత్స అందించామన్నారు. దీంతో ఆమెకు గర్భం నిలిచిందని, ఇప్పుడు డెలివరీ చేయగలిగామని డాక్టర్ షాలిని తెలిపారు.
మెడికల్ సైన్స్‌లో కవల పిల్లలు, ముగ్గురు పిల్లలు జన్మించడం అనేది జరుగుతుంటుంది. కానీ నలుగురు శిశువులు జన్మించడం అనేది బహ అరుదుగా జరుగుతుంది. 10 వేల ప్రసవాలలో ఒక గర్భిణి విషయంలోనే ఇలా జరుగుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: నరహంతకుడు జనరల్ డయ్యర్‌ను మహాత్మాగాంధీ ఎందుకు క్షమించారు?
Comments
Please login to add a commentAdd a comment