quadruplets
-
గొంతు నొప్పితో ఆసుపత్రికి : డాక్టర్ చెబితే ‘ఏప్రిల్ పూల్’ అనుకుంది..చివరికి!
అనుకోకుండా, ఊహించని పరిణామాలు అద్భుతాలుగా నిలుస్తాయి. ఈ అద్భుతాల్లో మహాఅద్భుతాలు మరికొన్ని ఉంటాయి. అలాంటి అద్భుతం కమ్..షాకింగ్ లాంటి ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. ఆలస్యం చేయకుండా వివరాలను తెలుసుకుందాం పదండి!అమెరికాలోని ఇల్లినాయిస్కు చెందిన 20 ఏళ్ల నర్సింగ్ అసిస్టెంట్ కాట్లిన్ యేట్స్(Katelyn Yates)కు కూడా నమ్మలేని అనుభవం ఎదురైంది. గొంతు నొప్పిగా ఉండటంతో ఒకరోజు ఆసుపత్రికి వెళ్లింది. వైద్యులు ఎక్స్‌రే తీయించుకోమని సలహా ఇచ్చారు. అయితే ఎక్స్‌రేకి వెళ్లి ముందు ఒకసారి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించుకోవాలని కూడా సూచించారు. ఎందుకంటే గర్భధారణ సమయంలో ఎక్స్‌రేలు ప్రమాదకరం. రేడియేషన్ పిండానికి హాని కలిగించే అవకాశం ఉన్నందున ముందుగానే గర్భంతో లేమనే నిర్ధారణ అవసరం. ఇక్కడే కాట్లిన్సంతోషంతో ఉక్కిరిబిక్కిరయ్యే విషయం తెలుసుకుంది. అదీ కూడా నమ్మశక్యంగాని విధంగా కాట్లిన్ గర్భవతి అని తేలింది. ఇందులో ఆశ్చర్యం ఏముందు అనుకుంటున్నారా? ఆమె గర్బంలో పెరుగుతోంది ఏకంగా నలుగురు. ముందు షాకైనా, ఏప్రిల్ ఫూల్స్ డే కదా.. డాక్టర్ జోక్ చేస్తున్నారులే అని లైట్ తీసుకుంది కేట్లిన్. చివరికి విషయం తెలిసి మురిసి పోయింది.కానీ పిల్లలకు జన్మనివ్వడానికి చాలా కష్టపడింది. అయితే ఆమె భర్త జూలియన్ బ్యూకర్ కేట్లిన్కు పూర్తిగా సపోర్ట్ అందించాడు. ధైర్యం చెప్పాడు. ఎందుకంటే కాట్లిన్‌కు ప్రీక్లంప్సియా అనే అరుదైన వ్యాధి వచ్చింది. ఇది ప్రమాదకరమైన అధిక రక్తపోటుకు కారణమయ్యే తీవ్రమైన పరిస్థితి. ఫలితంగాఆమెకు రక్తపోటు పెరిగి, కాలేయం, మూత్రపిండాలు పనిచేయడం మానేశాయి. ఒక దశలో ఆమె శ్వాస అందక ఇబ్బంది పడింది. దీంతో కేవలం 28 వారాలు , 4 రోజులలో, వైద్యులు సిజేరియన్ చేసి నాలుగురు పిల్లలకు ప్రసవం చేశారు. ఎలిజబెత్ టేలర్, జియా గ్రేస్ , ఐడెంటికల్ ట్విన్స్‌గా మాక్స్ ఆష్టన్ , ఇలియట్ రైకర్ జన్మించారు. నెలలు నిండకుండానే పుట్టడంతో ఎలిజబెత్ కేవలం ఒక పౌండ్, రెండు ఔన్సులు, మాక్స్ బరువు రెండు పౌండ్లు, ఆరు ఔన్సులు మాత్రమే ఉన్నారు. తరువాత నాలుగు నెలల్లో బాగా పుంజుకుని బరువు పెరగడంతో కెట్లిన్, ఆమె భర్త జూలియన్ బ్యూకర్ సంతోషంలో మునిగిపోయారు. ఒకేసారి నలుగురు పిల్లలు జన్మించడం చాలా అరుదు అన్నారు ఆసుపత్రి గైనకాలజిస్ట్ మెఘనా లిమాయే. ఇదీ చదవండి : 50లో కూడా శిల్పం లాంటి బాడీ...ఇదిగో సింపుల్ వర్కౌట్ -
నాలుగేళ్ల ఎదురుచూపు.. ఒకే కాన్పులో నలుగురు పిల్లలు
రాజస్థాన్‌లోని టోంక్‌లో ఒక గర్భిణి ఒకేసారి నలుగురు శిశువులకు జన్మనిచ్చింది. ఈ ఉదంతం వజీర్పురా గ్రామంలో చోటుచేసుకుంది. ఆ మహిళ పెళ్లయిన నాలుగేళ్లకు గర్భం దాల్చింది. ఆమె ఒకే కాన్పులో ఏకంగా నలుగురు శిశువులకు జన్మనివ్వడంతో ఆ దంపతుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. గర్భిణికి చికిత్సనందించిన డాక్టర్ షాలినీ అగర్వాల్ మాట్లాడుతూ ఆదివారం సాయంతం ఆ మహిళను ఆసుపత్రికి తీసుకు వచ్చారని, అర్ధరాత్రి దాటాక ఆమెకు పురిటి నొప్పులు వచ్చాయన్నారు. తరువాత ఆమెకు డెలివరీ చేశామన్నారు. సోమవారం ఉదయం 5 గంటల 51 నిముషాలకు తొలి శిశువు జన్మించిందని, తరువాత ఒక్కొక్కరుగా నాలుగు నిముషాల్లో ముగ్గురు శిశువులు జన్మించారని తెలిపారు. ఆ నలుగురు శిశువుల్లో ఇద్దరు మగశిశువులు, ఇద్దరు ఆడ శిశువులని, వారంతా ఆరోగ్యంగానే ఉన్నారని తెలిపారు. ఆ మహిళ గర్భం ధరించిన రెండవ నెలలోనే ఆమె కడుపులో నాలుగు పిండాలు ఉన్నట్లు గుర్తించామని డాక్టర్ షాలిని తెలిపారు. నాల్గవ నెలలో గర్భశ్రావం అయ్యే పరిస్థితి ఉండటంతో ప్రత్యేక చికిత్స అందించామన్నారు. దీంతో ఆమెకు గర్భం నిలిచిందని, ఇప్పుడు డెలివరీ చేయగలిగామని డాక్టర్ షాలిని తెలిపారు. మెడికల్ సైన్స్‌లో కవల పిల్లలు, ముగ్గురు పిల్లలు జన్మించడం అనేది జరుగుతుంటుంది. కానీ నలుగురు శిశువులు జన్మించడం అనేది బహ అరుదుగా జరుగుతుంది. 10 వేల ప్రసవాలలో ఒక గర్భిణి విషయంలోనే ఇలా జరుగుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇది కూడా చదవండి: నరహంతకుడు జనరల్ డయ్యర్‌ను మహాత్మాగాంధీ ఎందుకు క్షమించారు? -
ఒకే కాన్పులో ముగ్గురు మగ బిడ్డలు, ఆడపిల్ల
బొమ్మనహళ్లి/హుబ్లీ: ఒక కాన్పులో కవలలు జన్మిస్తే విశేషం. ముగ్గురు పుడితే వింత. ఏకంగా నలుగురు జన్మిస్తే పెద్ద విడ్డూరమే. కర్ణాటకలోని హుబ్లీలో ఓ గర్భిణి నలుగురు బిడ్డలకు జన్మనిచ్చారు. హావేరి జిల్లాలోని సవణూరు గ్రామానికి చెందిన మహబూబ్ బీ అనే గర్భిణి నెలలు నిండడంతో ప్రసవం కోసం హుబ్లీలోని ప్రభుత్వ కిమ్స్ ఆస్పత్రిలో చేరారు. ఆదివారం నొప్పులు రావడంతో వైద్యులు సిజేరియన్ కాన్పు చేశారు. ముగ్గురు మగ బిడ్డలు, ఆడపిల్ల జన్మించారు. ఒక్కో బిడ్డ బరువు రెండు కేజీల వరకూ ఉందని వైద్యులు తెలిపారు. తల్లీ బిడ్డలు ఆరోగ్యంగా ఉన్నారు. ఆమెకు ఇది రెండవ కాన్పు. మొదటి ప్రసవంలో ఒక కొడుకు పుట్టాడు. -
ఒకే కాన్పులో నలుగురు ఆడపిల్లలు
రాంగోపాల్‌పేట్ (హైదరాబాద్) : ప్రతి ఏడు లక్షలమందిలో ఒకరు ఒకే కాన్పులో నలుగురు బిడ్డలకు జన్మనిచ్చే అరుదైన ఘటన సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చోటుచేసుకుంది. తూర్పుగోదావరి జిల్లా తునికి పట్టణానికి చెందిన జి.శేఖర్, నళిని భార్యాభర్తలు. శేఖర్ వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు కాగా నళిని గృహిణి. నళిని గర్భం దాల్చినప్పటి నుంచి సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రిలో ప్రతి నెలా వైద్య పరీక్షలు చేయడంతోపాటు ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. నెలలు నిండటంతో ఈ నెల 4వ తేదీన శుక్రవారం రాత్రి ఆస్పత్రికి తీసుకువెళ్లారు. సీనియర్ గైనకాలజిస్టులు భాగ్యలక్ష్మి, మాధవీలతలతో పాటు 15 మంది వైద్య బృందం నళినికి ఆపరేషన్ నిర్వహించి పురుడుపోశారు. పుట్టిన నలుగురు ఆడ శిశువులూ ఆరోగ్యంగా ఉండటంతోపాటు 1.2 కేజీల చొప్పున బరువున్నారు. తల్లి నళిని కూడా సంపూర్ణ ఆరోగ్యంగా ఉందని వైద్యులు చెప్పారు. -
65 ఏళ్ల వయసులో నలుగురికి జన్మనిచ్చింది!
జర్మనీకి చెందిన ఓ బామ్మగారు సరికొత్త రికార్డు సృష్టించింది. 65 ఏళ్ల వయసులో ఆమె ఒకేసారి నలుగురు పిల్లలకు జన్మనిచ్చింది. బెర్లిన్ నగరంలోని ఓ ఆస్పత్రిలో ముగ్గురు మగపిల్లలు, ఒక ఆడపిల్ల ఆనీగ్రెట్ రౌనిక్ అనే ఆ టీచర్‌కు పుట్టారు. పిల్లలు నలుగురూ క్షేమంగానే ఉన్నారని, అయితే వారికి ఏమైనా సమస్యలు రావని మాత్రం చెప్పలేమని వైద్యులు అంటున్నారు. వాళ్లంతా ఆమె గర్భం దాల్చిన 26వ వారంలోనే (ఏడో నెల) పుట్టడంతో కొన్ని సమస్యలు వచ్చే ప్రమాదం ఉందన్నారు. ఆనీగ్రెట్కు ఇప్పటికే 13 మంది పిల్లలున్నారు. ఇప్పుడు పుట్టినవాళ్లతో కలిసి మొత్తం 17 మంది పిల్లలయ్యారన్న మాట. తాను గర్భం దాలుస్తానని, ఫలదీకరణ చెందిన అండాలను తన గర్భాశయంలో ప్రవేశపెట్టాలని కోరగా.. వైద్యులు ముందు వద్దన్నారు. ఆమె శరీరం అందుకు సహకరిస్తుందో.. లేదోనని అనుమానపడ్డారు. అయితే ఆమె మాత్రం తనకు పిల్లలు కావాల్సిందేనని పట్టుబట్టడంతో వాళ్లు సరేననక తప్పలేదు. దాంతో బామ్మగారు ఆరు పదుల వయసు దాటిన తర్వాత నలుగురికి జన్మనిచ్చిందన్నమాట. -
నలుగురికి జన్మనివ్వబోతున్న 65 ఏళ్ల బామ్మ
బెర్లిన్: ఇంట్లో కూర్చొని మనవళ్లతో ఆడుకునే వయసులో తల్లి కాబోతోంది ఓ వృద్ధురాలు. అది కూడా నలుగురు పిల్లలకి ఒకే సారి జన్మనివ్వబోతోంది. జర్మనికి చెందిన అనిగ్రట్ అనే 65 ఏళ్ల బామ్మ మరికొద్ది రోజుల్లో ఒకే కాన్పులో నలుగురు పిల్లలకి జన్మనివ్వబోతోంది. ప్రస్తుతం అనిగ్రట్ ఐదు నెలల గర్భవతి. తన తొమ్మిదేళ్ల కూతురు బుజ్జిబాబు గానీ, పాప కానీ కావలని కోరడంతో గర్భందాల్చినట్టు చెప్పింది. ఇప్పటికే అనిగ్రట్కు 13 మంది పిల్లలు ఏడుగురు మనవళ్లు,మనవరాళ్లు ఉన్నారు. టీచర్‌గా పని చేసిన అనిగ్రట్ ఇటీవటే రిటైర్ అయింది. వీర్యకణాలు, అండాన్ని దాతల ద్వారా సేకరించి కృత్రిమ పద్ధతుల ద్వారా గర్భందాల్చింది. ఈ వయసులో కూడా పిల్లల్ని పెంచే ఓపిక పుష్టిగా ఉందని చెప్పుతోంది.