నలుగురికి జన్మనివ్వబోతున్న 65 ఏళ్ల బామ్మ | 65-year-old German woman expecting quadruplets defends pregnancy | Sakshi
Sakshi News home page

నలుగురికి జన్మనివ్వబోతున్న 65 ఏళ్ల బామ్మ

Published Wed, Apr 15 2015 11:12 AM | Last Updated on Sun, Sep 3 2017 12:20 AM

నలుగురికి జన్మనివ్వబోతున్న 65 ఏళ్ల బామ్మ

నలుగురికి జన్మనివ్వబోతున్న 65 ఏళ్ల బామ్మ

బెర్లిన్: ఇంట్లో కూర్చొని మనవళ్లతో ఆడుకునే వయసులో తల్లి కాబోతోంది ఓ వృద్ధురాలు. అది కూడా నలుగురు పిల్లలకి ఒకే సారి జన్మనివ్వబోతోంది. జర్మనికి చెందిన అనిగ్రట్ అనే 65 ఏళ్ల బామ్మ మరికొద్ది రోజుల్లో ఒకే కాన్పులో నలుగురు పిల్లలకి జన్మనివ్వబోతోంది.  ప్రస్తుతం అనిగ్రట్ ఐదు నెలల గర్భవతి. తన తొమ్మిదేళ్ల కూతురు బుజ్జిబాబు గానీ, పాప కానీ కావలని కోరడంతో గర్భందాల్చినట్టు చెప్పింది.

ఇప్పటికే అనిగ్రట్కు 13 మంది పిల్లలు ఏడుగురు మనవళ్లు,మనవరాళ్లు ఉన్నారు. టీచర్గా పని చేసిన అనిగ్రట్ ఇటీవటే రిటైర్ అయింది. వీర్యకణాలు, అండాన్ని దాతల ద్వారా సేకరించి కృత్రిమ పద్ధతుల ద్వారా గర్భందాల్చింది. ఈ వయసులో కూడా పిల్లల్ని పెంచే ఓపిక పుష్టిగా ఉందని చెప్పుతోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement