సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు ప్రతీ మనిషి గౌరవం పెంచేవే. వాటిని మరొకరితో పంచుకున్నప్పుడు ఆ ఫీలింగ్ మరోలా ఉంటుంది. అదే స్నేహం, పెళ్లి వంకతో ఎల్లలు దాటిపోతే!.
తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. జర్మనీకి చెందిన ఓ యువతి.. ఉల్లిగడ్డలను పొలంలో నాట్లు వేస్తూ కనిపించింది. ఇక్కడి యువకుడిని పెళ్లి చేసుకోవడంతోనే ఆమె ఆగిపోలేదు. ఇక్కడి సంస్కృతిని ఆకళింపు చేసుకుంటోంది. అత్తతో కలిసి పొలంలో నాట్ల పనులకు వెళ్లిందామె. నమస్తే జూలీ పేరుతో ఓ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో ఆమె ఈ వీడియోను పోస్ట్ చేసింది.
అత్తను అమ్మగా పేర్కొంటూ.. ఆమె వీడియోలో వివరణ ఇవ్వడం చూడొచ్చు. అమ్మ రియాక్షన్ ఎంతో బాగుంది. కుటుంబంతో సాధారణంగా జీవించడాన్ని ఆస్వాదిస్తున్నా. నా భర్త ఊరికి వచ్చి దాదాపు నెల అయ్యింది. నా కుటుంబంతో ఇలా గడపడం, ప్రకృతికి దగ్గరగా ఉండడం ఎంతో సంతోషాన్ని ఇస్తోంది అని పేర్కొన్నారామె.ఈ పరిణామం ఎక్కడిదో తెలియదుగానీ.. 26 మిలియన్ల మంది ఈ వీడియోను చూశా. ఎంతో మంది లైకులు, షేర్లు చేశారు. ఆమె అంకిత భావానికి, భారత సంస్కృతిని స్వీకరించడాన్ని అభినందిస్తున్నారు కూడా.
Comments
Please login to add a commentAdd a comment