German woman
-
అమ్మనా జర్మనీ కోడలా?.. వైరల్
సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు ప్రతీ మనిషి గౌరవం పెంచేవే. వాటిని మరొకరితో పంచుకున్నప్పుడు ఆ ఫీలింగ్ మరోలా ఉంటుంది. అదే స్నేహం, పెళ్లి వంకతో ఎల్లలు దాటిపోతే!. తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. జర్మనీకి చెందిన ఓ యువతి.. ఉల్లిగడ్డలను పొలంలో నాట్లు వేస్తూ కనిపించింది. ఇక్కడి యువకుడిని పెళ్లి చేసుకోవడంతోనే ఆమె ఆగిపోలేదు. ఇక్కడి సంస్కృతిని ఆకళింపు చేసుకుంటోంది. అత్తతో కలిసి పొలంలో నాట్ల పనులకు వెళ్లిందామె. నమస్తే జూలీ పేరుతో ఓ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ఆమె ఈ వీడియోను పోస్ట్ చేసింది. అత్తను అమ్మగా పేర్కొంటూ.. ఆమె వీడియోలో వివరణ ఇవ్వడం చూడొచ్చు. అమ్మ రియాక్షన్ ఎంతో బాగుంది. కుటుంబంతో సాధారణంగా జీవించడాన్ని ఆస్వాదిస్తున్నా. నా భర్త ఊరికి వచ్చి దాదాపు నెల అయ్యింది. నా కుటుంబంతో ఇలా గడపడం, ప్రకృతికి దగ్గరగా ఉండడం ఎంతో సంతోషాన్ని ఇస్తోంది అని పేర్కొన్నారామె.ఈ పరిణామం ఎక్కడిదో తెలియదుగానీ.. 26 మిలియన్ల మంది ఈ వీడియోను చూశా. ఎంతో మంది లైకులు, షేర్లు చేశారు. ఆమె అంకిత భావానికి, భారత సంస్కృతిని స్వీకరించడాన్ని అభినందిస్తున్నారు కూడా. View this post on Instagram A post shared by जूली शर्मा 🦋 (@namastejuli) -
మూడు దేశాల ముచ్చటైన కళ్యాణం
-
వారణాసికి జర్మన్ మహిళ
సాక్షి ప్రతినిధి, చెన్నై: ప్రపంచ దేశాలను చుట్టి వచ్చేందుకు జర్మనీ నుంచి చెన్నైకి వచ్చిన మహిళ తనకు జరిగిన అన్యాయాన్ని తలచుకుంటూ తల్లడిల్లిపోయింది. దుండగుల బారినపడి అత్యాచారానికి గురైన స్థితిలో ఇక చెన్నైలో ఉండలేనని బాధాతప్త హృదయంతో వారణాసి బయలుదేరి వెళ్లిపోయింది. భారత్‌లో విదేశీ పర్యాటకానికే మచ్చతెచ్చేలా చోటు చేసుకున్న అత్యాచార సంఘటన తమిళనాడు పోలీసులకు సవాల్‌గా మారింది. జర్మనీ మహిళకు చేదు అనుభవంతో పర్యాటక కేంద్రమైన మహాబలిపురం సందర్శకులు లేక వెలవెలబోతోంది. వివరాలు ఇలా ఉన్నాయి. జర్మనీ దేశానికి చెందిన జోస్టినా(38) అనే మహిళ సుమారు 15 మంది విదేశీ పర్యాటకులతో కలిసి గత నెల 26వ తేదీన మహాబలిపురానికి చేరుకున్నారు. అక్కడికి సమీపంలోని పట్టిపులం బీచ్ ఒడ్డున సన్బాత్లో ఉన్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు ఆమెపై అత్యాచారం చేశారు. పోలీసు ఉన్నతాధికారులు మహాబలిపురంలోనే మకాం వేసి నాలుగు ప్రత్యేక బృందాల ద్వారా నిందితుల కోసం గాలింపు ప్రారంభించారు. జర్మనీ మహిళ ఇచ్చిన పోలికలతో ప్రధాన నిందితుని ఊహాచిత్రం సిద్ధం చేశారు. నిందితుల ఆచూకీ కోసం బీచ్‌లోని దుకాణదారులను, జాలర్లను విచారించారు. ఈనెల 3వ తేదీన పోలీసులు ఐదు వాహనాల్లో మహాబలిపురం, పుదూర్, యారైయూర్కుప్పం, దేవనేరి, సూలోరికాడు, నెమ్మేలి, పుదు నమ్మేలి, పుదియకల్పాక్కంలోని తొమ్మిది మత్స్యకార గ్రామాలకు వెళ్లారు. ఆయా గ్రామాల నుంచి 600 మందికి పైగా యువకులను వేర్వేరుగా నిలబెట్టి ఫొటోలు తీశారు. సంఘటన జరిగిన రోజున అక్కడికి సమీపంలోని ఒక లగ్జరీ అతిథిగృహంలో మందు, విందు జరిగినట్లు తెలుసుకున్నారు. ఈ విందుకు హాజరైన వ్యక్తుల్లో నిందితులు ఉన్నారనే కోణంలో విచారణ జరుపుతున్నారు. మంగళవారం వరకు జరిగిన విచారణ సందర్భంగా 36 మంది యువకులను జర్మన్ మహిళ ముందు హాజరుపరిచారు. 600 ఫొటోలను చూపారు. అయితే వీరిలో నిందితులు లేరని ఆమె పోలీసులకు చెప్పారు. ఇక ఉండలేను : బాధిత మహిళ ఎంతో ఉత్సాహంగా చెన్నైకి వచ్చిన నేను చేదు అనుభవంతో ఇక మహాబలిపురంలో ఉండలేనని బాధిత మహిళ పోలీసుల ముందు వాపోయారు. ఇక్కడి జ్ఞాపకాలకు దూరంగా ఉత్తరప్రదేశ్‌లోని వారణాసికి వెళుతున్నట్లు చెప్పి మంగళవారం సాయంత్రం మహాబలిపురంలోని కాటేజ్‌ను ఖాళీ చేశారు. నిందితులను గుర్తించేందుకు మరికొంత కాలం తమకు అందుబాటులో ఉండాలని, బాధితురాలు లేకుంటే కేసు ముందుకు సాగదని పోలీసులు ఆమెను బతిమాలినా కన్నీళ్లుపెట్టుకుంటూ తిరస్కరించారు. సుమారు 15 మంది విదేశీయులతో ఎంతో సరదాగా మహాబలిపురం చేరుకున్న జోస్టినా పోలీసు విచారణలతో చివరకు ఒంటరిగా మిగిలారు. ఆ తరువాత దయనీయమైన స్థితిలో ఒంటరిగా మహాబలిపురాన్ని వీడి వారణాసికి వెళ్లిపోయారు. జర్మనీ మహిళపై జరిగిన అత్యాచారం సంఘటనతో హతాశురాలైన విదేశీ పర్యాటకులు హడావుడిగా మహాబలిపురంలోని కాటేజీలు, లాడ్జీలను ఖాళీ చేసి వెళ్లిపోయారు. స్వదేశీ, విదేశీ పర్యాటకులతో కళకళలాడుతుండే మహాబలిపురం బోసిపోయింది. పోలీసులకు సవాల్: అత్యాచార సంఘటన జరిగి మూడు రోజులు దాటినా నిందితుల ఆచూకీ తెలియకపోవడం పోలీసులకు సవాల్‌గా మారింది. మహాబలిపురం మహిళా పోలీస్‌లు మరో నలుగురు అనుమానితులను పట్టుకుని వారణాసి వెళ్లేందుకు మంగళవారం సాయంత్రం ఎయిర్‌పోర్టులో ఉన్న జర్మన్ మహిళ ముందు ప్రవేశపెట్టారు. అయితే వారు కూడా కాదని ఆమె చెప్పడంతో ఆ నలుగురిని విడిచిపెట్టారు. పోలీసుల చిట్టాలో ఉన్న పాత నేరస్తులెవరూ ఆత్యాచారానికి పాల్పడలేదని తేలియడంతో కొత్త నిందితులపై దృష్టిపెట్టారు. సంఘటన జరిగిన రోజు, అంతకు ముందురోజు మహాబలిపురం లాడ్జీలు, అతిథిగృహాలు, కాటేజీల్లో ఎవరున్నారో తెలుసుకునేందుకు సీసీ కెమెరాల పుటేజీలను పరిశీలిస్తున్నారు. బుధ, గురువారాల్లో నిందితులు పట్టుబడకుంటే ప్రత్యేక పోలీసు దళాలను రంగంలోకి దించాలని పోలీసు ఉన్నతాధికారులు భావిస్తున్నారు. -
జర్మనీ యువతిపై ఆటోడ్రైవర్ అఘాయిత్యం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో 19 ఏళ్ల జర్మనీ యువతిపై దారుణం జరిగింది. ఓ ఆటో డ్రైవర్‌తోపాటు కొందరు వ్యక్తులు ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. గత ఏడాది డిసెంబర్లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ఢిల్లీ పోలీసులు ప్రస్తుతం బాధితురాలి వాంగ్మూలం సేకరిస్తున్నారు. ఈ ఘటన గురించి ఢిల్లీలో ఉన్నప్పుడే వెల్లడించడానికి భయపడిన బాధితురాలు జర్మనీ వెళ్లిపోయక ఈమెయిల్ ద్వారా ఢిల్లీ మహిళా కమిషన్ (డీసీడబ్ల్యూ)కు ఫిర్యాదు చేసింది. డీసీడబ్ల్యూ నోటీసు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. తన అసైన్‌మెంట్‌లో భాగంగా ఓ స్వచ్ఛంద సంస్థ తరఫున పనిచేసేందుకు జర్మనీ యువతి ఢిల్లీ వచ్చింది. గత ఏడాది డిసెంబర్ 14న రాత్రి 8 గంటల సమయంలో సెంట్రల్ ఢిల్లీలో తాను హోటల్ నుంచి బయటకు వచ్చిన ఆమె తిరిగి వెళ్లేటప్పుడు హోటల్‌కు దారిమరిచిపోయింది. అక్కడే ఉన్న ఆటో డ్రైవర్‌ను సాయం కోరగా.. అతను హోటల్ దగ్గర దిగబెడతానని చెప్పి.. ఓ నిర్మానుష్య ప్రదేశంలోకి తీసుకెళ్లి ఆమెపై అత్యాచారం జరిపాడు. ఎలాగోలా అక్కడినుంచి తప్పించుకొని వీధుల్లోకి రాగా.. ఆ ఆటోడ్రైవర్ కీచకుడు మరో నలుగురి వెంటపెట్టుకొని వచ్చి.. మరోసారి ఆమెపై సామూహికంగా లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన సందర్భంగా ఒకడి నాలుకను ఆమె కొరికేసింది. ఆ తర్వాత ఓ వ్యక్తి సాయంతో అతికష్టం మీద తన హోటల్‌కు చేరిన బాధితురాలు స్వదేశానికి వెళ్లిపోయింది. దేశం కాని దేశంలో తనపై జరిగిన అఘాయిత్యం గురించి పోలీసులకు మొదట తెలిపేందుకు మొదట భయపడ్డానని బాధిత యువతి తెలిపింది. ఈ మేరకు పోలీసులు ఆమె ఫిర్యాదును స్వీకరించి దర్యాప్తు జరుపుతున్నారు. నిందితుల ముఖాలను ఆమె గుర్తించలేకపోతున్నదని, అయితే దర్యాప్తుకు మాత్రం పూర్తిగా సహకరిస్తున్నదని పోలీసులు తెలిపారు. -
నలుగురికి జన్మనివ్వబోతున్న 65 ఏళ్ల బామ్మ
బెర్లిన్: ఇంట్లో కూర్చొని మనవళ్లతో ఆడుకునే వయసులో తల్లి కాబోతోంది ఓ వృద్ధురాలు. అది కూడా నలుగురు పిల్లలకి ఒకే సారి జన్మనివ్వబోతోంది. జర్మనికి చెందిన అనిగ్రట్ అనే 65 ఏళ్ల బామ్మ మరికొద్ది రోజుల్లో ఒకే కాన్పులో నలుగురు పిల్లలకి జన్మనివ్వబోతోంది. ప్రస్తుతం అనిగ్రట్ ఐదు నెలల గర్భవతి. తన తొమ్మిదేళ్ల కూతురు బుజ్జిబాబు గానీ, పాప కానీ కావలని కోరడంతో గర్భందాల్చినట్టు చెప్పింది. ఇప్పటికే అనిగ్రట్కు 13 మంది పిల్లలు ఏడుగురు మనవళ్లు,మనవరాళ్లు ఉన్నారు. టీచర్‌గా పని చేసిన అనిగ్రట్ ఇటీవటే రిటైర్ అయింది. వీర్యకణాలు, అండాన్ని దాతల ద్వారా సేకరించి కృత్రిమ పద్ధతుల ద్వారా గర్భందాల్చింది. ఈ వయసులో కూడా పిల్లల్ని పెంచే ఓపిక పుష్టిగా ఉందని చెప్పుతోంది.