జర్మనీ యువతిపై ఆటోడ్రైవర్ అఘాయిత్యం | German Woman Allegedly Raped By Auto-Driver In Delhi | Sakshi
Sakshi News home page

జర్మనీ యువతిపై ఆటోడ్రైవర్ అఘాయిత్యం

Published Sun, Feb 28 2016 9:49 AM | Last Updated on Sat, Jul 28 2018 8:53 PM

జర్మనీ యువతిపై ఆటోడ్రైవర్ అఘాయిత్యం - Sakshi

జర్మనీ యువతిపై ఆటోడ్రైవర్ అఘాయిత్యం

న్యూఢిల్లీ:  దేశ రాజధాని ఢిల్లీలో 19 ఏళ్ల జర్మనీ యువతిపై దారుణం జరిగింది. ఓ ఆటో డ్రైవర్‌తోపాటు కొందరు వ్యక్తులు ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. గత ఏడాది డిసెంబర్‌లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ఢిల్లీ పోలీసులు ప్రస్తుతం బాధితురాలి వాంగ్మూలం సేకరిస్తున్నారు. ఈ ఘటన గురించి ఢిల్లీలో ఉన్నప్పుడే వెల్లడించడానికి భయపడిన బాధితురాలు జర్మనీ వెళ్లిపోయక ఈమెయిల్ ద్వారా ఢిల్లీ మహిళా కమిషన్‌ (డీసీడబ్ల్యూ)కు ఫిర్యాదు చేసింది. డీసీడబ్ల్యూ నోటీసు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

తన అసైన్‌మెంట్‌లో భాగంగా ఓ స్వచ్ఛంద సంస్థ తరఫున పనిచేసేందుకు జర్మనీ యువతి ఢిల్లీ వచ్చింది. గత ఏడాది డిసెంబర్ 14న రాత్రి 8 గంటల సమయంలో సెంట్రల్ ఢిల్లీలో తాను హోటల్‌ నుంచి బయటకు వచ్చిన ఆమె తిరిగి వెళ్లేటప్పుడు హోటల్‌కు దారిమరిచిపోయింది. అక్కడే ఉన్న ఆటో డ్రైవర్‌ను సాయం కోరగా.. అతను హోటల్ దగ్గర దిగబెడతానని చెప్పి.. ఓ నిర్మానుష్య ప్రదేశంలోకి తీసుకెళ్లి ఆమెపై అత్యాచారం జరిపాడు. ఎలాగోలా అక్కడినుంచి తప్పించుకొని వీధుల్లోకి రాగా.. ఆ ఆటోడ్రైవర్ కీచకుడు మరో నలుగురి వెంటపెట్టుకొని వచ్చి.. మరోసారి ఆమెపై సామూహికంగా లైంగిక దాడికి పాల్పడ్డాడు.

ఈ ఘటన సందర్భంగా ఒకడి నాలుకను ఆమె కొరికేసింది. ఆ తర్వాత ఓ వ్యక్తి సాయంతో అతికష్టం మీద తన హోటల్‌కు చేరిన బాధితురాలు స్వదేశానికి వెళ్లిపోయింది. దేశం కాని దేశంలో తనపై జరిగిన అఘాయిత్యం గురించి పోలీసులకు మొదట తెలిపేందుకు మొదట భయపడ్డానని బాధిత యువతి తెలిపింది. ఈ మేరకు పోలీసులు ఆమె ఫిర్యాదును స్వీకరించి దర్యాప్తు జరుపుతున్నారు. నిందితుల ముఖాలను ఆమె గుర్తించలేకపోతున్నదని, అయితే దర్యాప్తుకు మాత్రం పూర్తిగా సహకరిస్తున్నదని పోలీసులు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement