delhi rape
-
చనిపోయినట్లు నటించి.. రేపిస్టు నుంచి తప్పించుకుంది
ఆ అమ్మాయి వయసు కేవలం ఎనిమిదేళ్లు. ఢిల్లీలోని కిరారి అనే ప్రాంతంలో అత్యాచారానికి గురైంది. ఆ తర్వాత చనిపోయినట్లు నటించి, రేపిస్టు బారి నుంచి తప్పించుకుంది. అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో ఆరుబయట మంచం మీద పడుకొని ఉన్న చిన్నారిని ఓ దుర్మార్గుడు ఎత్తుకుపోయాడు. ఆమెకు తర్వాత మెలకువ వచ్చి చూసేసరికి ఇంట్లో కాకుండా వేరే ఎక్కడో.. ఎవరి పక్కనో ఉన్నట్లు గమనించి గట్టిగా అరిచేందుకు ప్రయత్నించింది. కానీ, అతడు ఆమె నోరు మూసేశాడు. తర్వాత అతడు తనను చంపేస్తాడేమోనన్న భయంతో ఆమె కదలకుండా ఉండిపోయి, చనిపోయినట్లు నటించింది. దాంతో నిందితుడు బాగా భయపడ్డాడు. ఆమెను గిల్లి చూశాడు. అయినా ఆమె కదల్లేదు. అతడు దూరంగా వెళ్లగానే ఆమె లేచి ఇంటివైపు పరుగు తీసింది. అది చూసి అతడు కూడా ఆమెను పట్టుకునే ప్రయత్నం చేశాడు గానీ, రాయి తగిలి కింద పడిపోయాడు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంటికి వచ్చిన తర్వాత చిన్నారి దుస్తుల మీద రక్తపు మరకలు చూసి తల్లిదండ్రులు హడలిపోయారు. తనకు పొత్తికడుపులో నొప్పిగా ఉందని చెప్పి, తర్వాత ఏడుస్తూ జరిగిన ఘోరం వివరించింది. ఆ చిన్నారి ఓ ప్రైవేటు స్కూల్లో మూడో తరగతి చదువుతోంది. -
జర్మనీ యువతిపై ఆటోడ్రైవర్ అఘాయిత్యం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో 19 ఏళ్ల జర్మనీ యువతిపై దారుణం జరిగింది. ఓ ఆటో డ్రైవర్‌తోపాటు కొందరు వ్యక్తులు ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. గత ఏడాది డిసెంబర్లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ఢిల్లీ పోలీసులు ప్రస్తుతం బాధితురాలి వాంగ్మూలం సేకరిస్తున్నారు. ఈ ఘటన గురించి ఢిల్లీలో ఉన్నప్పుడే వెల్లడించడానికి భయపడిన బాధితురాలు జర్మనీ వెళ్లిపోయక ఈమెయిల్ ద్వారా ఢిల్లీ మహిళా కమిషన్ (డీసీడబ్ల్యూ)కు ఫిర్యాదు చేసింది. డీసీడబ్ల్యూ నోటీసు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. తన అసైన్‌మెంట్‌లో భాగంగా ఓ స్వచ్ఛంద సంస్థ తరఫున పనిచేసేందుకు జర్మనీ యువతి ఢిల్లీ వచ్చింది. గత ఏడాది డిసెంబర్ 14న రాత్రి 8 గంటల సమయంలో సెంట్రల్ ఢిల్లీలో తాను హోటల్ నుంచి బయటకు వచ్చిన ఆమె తిరిగి వెళ్లేటప్పుడు హోటల్‌కు దారిమరిచిపోయింది. అక్కడే ఉన్న ఆటో డ్రైవర్‌ను సాయం కోరగా.. అతను హోటల్ దగ్గర దిగబెడతానని చెప్పి.. ఓ నిర్మానుష్య ప్రదేశంలోకి తీసుకెళ్లి ఆమెపై అత్యాచారం జరిపాడు. ఎలాగోలా అక్కడినుంచి తప్పించుకొని వీధుల్లోకి రాగా.. ఆ ఆటోడ్రైవర్ కీచకుడు మరో నలుగురి వెంటపెట్టుకొని వచ్చి.. మరోసారి ఆమెపై సామూహికంగా లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన సందర్భంగా ఒకడి నాలుకను ఆమె కొరికేసింది. ఆ తర్వాత ఓ వ్యక్తి సాయంతో అతికష్టం మీద తన హోటల్‌కు చేరిన బాధితురాలు స్వదేశానికి వెళ్లిపోయింది. దేశం కాని దేశంలో తనపై జరిగిన అఘాయిత్యం గురించి పోలీసులకు మొదట తెలిపేందుకు మొదట భయపడ్డానని బాధిత యువతి తెలిపింది. ఈ మేరకు పోలీసులు ఆమె ఫిర్యాదును స్వీకరించి దర్యాప్తు జరుపుతున్నారు. నిందితుల ముఖాలను ఆమె గుర్తించలేకపోతున్నదని, అయితే దర్యాప్తుకు మాత్రం పూర్తిగా సహకరిస్తున్నదని పోలీసులు తెలిపారు. -
ఉబర్ పై దావా ఉపసంహరణ
శాన్ ఫ్రాన్సిస్కో: ఉబర్ క్యాబ్ సంస్థపై న్యాయపోరాటం చేస్తున్న భారత మహిళ వెనక్కు తగ్గారు. ఉబర్ పై వేసిన దావాను స్వచ్ఛందంగా ఉపసంహరించుకున్నారు. ఈ మేరకు మంగవాళం కోర్టు పిటిషన్ దాఖలు చేశారు. ఢిల్లీలో ఉబర్ క్యాబ్ డ్రైవర్ తనపై అత్యాచారానికి పాల్పడి, దాడి చేశాడని గతేడాది ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. అమెరికా కేంద్రంగా ఆన్ లైన్ లో కారు సేవలు అందిస్తున్న ఉబర్ పై ఈ ఏడాది జనవరిలో ఫెడరల్ కోర్టులో దావా వేశారు. కనీస భద్రతా ప్రమాణాలు పాటించడంలో ఉబర్ విఫలమైందని ఆమె కోర్టు కెక్కారు. అయితే తమపై బురద చల్లేందుకే దావా వేశారని ఉబర్ వాదించింది. చివరకు ఆమె స్వచ్ఛందంగా దావా వెనక్కు తీసుకుంది. అయితే ఇరు వర్గాల మధ్య ఎటువంటి ఒప్పందం కుదిరిందో వెల్లడి కాలేదు. కాగా, అత్యాచారానికి పాల్పడిన ఉబర్ డ్రైవర్ ను గత డిసెంబర్ లో ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో అతడు డ్రైవర్ గా చేరినట్టు గుర్తించారు. -
తుపాకితో బెదిరించి.. బాలికపై సామూహిక అత్యాచారం
దేశరాజధానిలో అత్యాచారాల పర్వం ఆగడం లేదు. పశ్చిమ ఢిల్లీ ప్రాంతంలో పదో తరగతి చదువుతున్న ఓ బాలికను ఆమెకు తెలిసున్న ఐదుగురు కలిసి తుపాకి చూపించి బెదిరించి.. సామూహిక అత్యాచారం చేశారు. ఉత్తమ్ నగర్ ప్రాంతానికి చెందిన ఈ బాలిక వారం రోజుల క్రితం స్కూలుకు వెళ్తుండగా, దారిలో అటకాయించిన నిందితులు పశ్చిమ ఢిల్లీలోని ఓ ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ ఒకరి తర్వాత ఒకరుగా అత్యాచారం చేశారు. నిందితులు ఐదుగురిలో ముగ్గురు మైనర్లు. ఈ విషయం ఎవరికైనా చెబితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని తనను తుపాకితో బెదిరించినట్లు బాలిక తన ఫిర్యాదులో పోలీసులకు తెలిపింది. అత్యాచారం సంఘటనను నిందితులు సెల్ఫోన్లో రికార్డు చేశారని కూడా బాధితురాలు చెప్పింది. అయితే, పోలీసులకు మాత్రం నిందితుల వద్ద తుపాకి ఏమీ దొరకలేదు. తనకు ఒంట్లో బాగోలేదని బాలిక వారం రోజుల తర్వాత చెప్పడంతో ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పుడు తల్లిదండ్రులకు విషయం తెలిసింది. ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్నామని, 20 ఏళ్ల నిందితుడిని వాళ్ల ఇంట్లోనే అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు.