65 ఏళ్ల వయసులో నలుగురికి జన్మనిచ్చింది! | 65 year old German teacher gives birth to quadruplets | Sakshi
Sakshi News home page

65 ఏళ్ల వయసులో నలుగురికి జన్మనిచ్చింది!

Published Sat, May 23 2015 4:16 PM | Last Updated on Sun, Sep 3 2017 2:34 AM

65 ఏళ్ల వయసులో నలుగురికి జన్మనిచ్చింది!

65 ఏళ్ల వయసులో నలుగురికి జన్మనిచ్చింది!

జర్మనీకి చెందిన ఓ బామ్మగారు సరికొత్త రికార్డు సృష్టించింది. 65 ఏళ్ల వయసులో ఆమె ఒకేసారి నలుగురు పిల్లలకు జన్మనిచ్చింది. బెర్లిన్ నగరంలోని ఓ ఆస్పత్రిలో ముగ్గురు మగపిల్లలు, ఒక ఆడపిల్ల ఆనీగ్రెట్ రౌనిక్ అనే ఆ టీచర్కు పుట్టారు. పిల్లలు నలుగురూ క్షేమంగానే ఉన్నారని, అయితే వారికి ఏమైనా సమస్యలు రావని మాత్రం చెప్పలేమని వైద్యులు అంటున్నారు. వాళ్లంతా ఆమె గర్భం దాల్చిన 26వ వారంలోనే (ఏడో నెల) పుట్టడంతో కొన్ని సమస్యలు వచ్చే ప్రమాదం ఉందన్నారు. ఆనీగ్రెట్కు ఇప్పటికే 13 మంది పిల్లలున్నారు. ఇప్పుడు పుట్టినవాళ్లతో కలిసి మొత్తం 17 మంది పిల్లలయ్యారన్న మాట.

తాను గర్భం దాలుస్తానని, ఫలదీకరణ చెందిన అండాలను తన గర్భాశయంలో ప్రవేశపెట్టాలని కోరగా.. వైద్యులు ముందు వద్దన్నారు. ఆమె శరీరం అందుకు సహకరిస్తుందో.. లేదోనని అనుమానపడ్డారు. అయితే ఆమె మాత్రం తనకు పిల్లలు కావాల్సిందేనని పట్టుబట్టడంతో వాళ్లు సరేననక తప్పలేదు. దాంతో బామ్మగారు ఆరు పదుల వయసు దాటిన తర్వాత నలుగురికి జన్మనిచ్చిందన్నమాట.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement