విదేశీ మహిళను ఓ నగల వ్యాపారి నిట్ట నిలువునా మోసం చేశాడు, నాణ్యమైన బంగారు నగలపేరుతో ఒకటి కాదు రెండు కాదు ఆరు కోట్ల రూపాయల దోపిడికి పాల్పడ్డాడు. ఈ ఘోరం రాజస్థాన్‌లో వెలుగుచూసింది. వివరాలు..
అమెరికాకు చెందిన చెరిష్ అనే మహిళ జైపూర్‌లోని జోహ్రీ బజార్‌లోని బంగారు దుకాణం యజమాని నుంచి బంగారు పాలిష్‌తో కూడిన బెండి అభరణాలను కొనుగోలు చేసింది. అయితే వాటికి అక్షరాల రూ. 6 కోట్లు వెచ్చించింది.
డాది ఏప్రిల్‌లో యూఎస్‌లో జరిగిన ఎగ్జిబిషన్‌లో ఆ ఆభరణాలను ప్రదర్శించింది. ఈ క్రమంలో అవి నకిలీవని తేలింది. వాటి విలువ కేవలం రూ. 300 మాత్రమేనని తెలిసి షాక్‌కు గురైంది. వెంటనే సదరు మహిళ జైపూర్‌కి వచ్చి షాప్ యజమాని గౌరవ్ సోనీని నిలదీసింది.
అయితే దుకాణం యాజమాని ఆమె ఆరోపణలను కొట్టిపాడేశాడు. దీంతో చెరిష్ జైపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అలాగే యూఎస్ ఎంబసీ అధికారుల నుంచి కూడా సహాయం కోరింది. స్పందించిన అధికారులు ఈ విషయాన్ని పరిశీలించవలసిందిగా జైపూర్ పోలీసులను కోరారు.
కాగా 2022లో ఇన్‌స్టాగ్రామ్ ద్వారా గౌరవ్ సోనీతో పరిచయం ఏర్పడిందని.. గత రెండేళ్లుగా ఆభరణాల కోసం ₹ 6 కోట్లు చెల్లించినట్లు ఆ మహిళ పోలీసులకు తెలిపింది. ప్రస్తుతం గౌరవ్, అతని తండ్రి రాజేంద్ర సోనీ పరారీలో ఉండగా.. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇద్దరి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment