![Rajasthan New Deputy Chief Minister Diya Kumari Royal Fashion Icon - Sakshi](/styles/webp/s3/article_images/2023/12/15/rajasthan.jpg.webp?itok=izcHiG_8)
రాజవంశానికి చెందిన ఓ యువరాణి రాజకీయాల్లో రావడమే గాక ఏకంగా డిప్యూటి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఆమె రాజకీయ ప్రస్థానం సాగింది. ఎలా అత్యున్నత పదవిని అలకరించగలిగారు తదితరాల గురించే ఈ కథనం!.
దియా కుమారి 1971లో జన్మించారు. ఆమె జైపూర్ రాజరిక రాష్ట్రానికి చివరి పాలక మహారాజా మాన్‌సింగ్II మనవరాలు. జైపూర్‌కు చెందిన మహారాజా సవాయి భవానీసింగ్, హెచ్ హెచ్ మహారాణి, పద్మినీ దేవిల ఏకైక కుమార్తె. ఆమెకు ముగ్గురు పిల్లలు, హెచ్‌హెచ్ సవాయి పద్మనాభ్ సింగ్, యువరాణి గౌరవి కుమారి, హెచ్‌హెచ్ లక్షరాజ్ ప్రకాష్, సిర్మౌర్ మహారాజా. దియా కుమారి ఎన్నో మహిళా సంక్షేమ కార్యక్రమాలతో ప్రజలను మనసును దోచుకుంది. రాజరికంలో పెరిగిన ఆమె తండ్రి దాతృత్వాన్ని వారసత్వంగా తీసుకుని ప్రజలకు సంబంధించిన ఎన్నో సేవా కార్యక్రమాలను చురుగ్గా ముందుండి చేసేది. ఆమె ప్రస్తుతం జైపూర్‌లో ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం సిటీ ఫ్యాలెస్‌లో నివాసం ఉంటున్నారు. మాన్‌సింగ్ మ్యూజియం నిర్వహణకు కూడా సాయం అందిస్తున్నారు. రాజరికం ఆధునికత కలగలిసిన మహిళ దియా కుమారి. ఆమె తన విధ్యాభ్యాసాన్ని భారత్, యూకేలలో పూర్తి చేశారు.
రాజకీయ ప్రస్థానం..
2013లో దియా కుమారీ బీజేపీలో చేరి రాజకీయాల్లోకి తెరంగేట్రం చేశారు. మహిళల హక్కులు, విద్య, గ్రామీణాభివృద్ధి కోసం తన వాణిని వినిపించడమే గాక, అందుకు సంబంధించిన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఆ తర్వాత లోక్‌సభకు ఎన్నికయ్యారు. రాజకీయాలతో సంబంధం లేకుండానే స్వతహాగా ఎన్నో దాతృత్వ కార్యక్రమాలు చేశారు. ఆమె ప్రిన్సెస్ దియా కుమారి ఫౌండేషన్‌ను స్థాపించింది. దీని ద్వారా పిల్లలకు విద్య, ఆరోగ్య సంరక్షణ, మహిళా నైపుణ్యాభివృద్ధి వంటి కార్యక్రమాలను చేస్తున్నారు. దియా కుమారీ సాంప్రదాయ కళలను, చేతిపనులు, సంగీతం, నృత్యం వంటి వాటిని ఎంతగానో ప్రోత్సహిస్తుంది.
వివాదాస్పద అంశాలు..
- తాజ్ మహల్‌ని సొంతం చేసుకోవాలని కోర్టులో దావా వేశారు. తాజ్‌మహల్‌ను నిర్మించే స్థలం తన కుటుంబానికి చెందినదని, అందుకే ఆ ఆస్తి తనకే చెందుతుందని ఇటీవల ఆమె వాదనలు వినిపించారు. తమ వద్ద సరైన డాక్యుమెంటేషన్ ఉందని, అవసరమైతే కోర్టుకి సమర్పిస్తామని కూడా ఆమె స్పష్టం చేశారు.
- బహిరంగా బోల్డ్ స్టేట్‌మెంట్‌లు ఇచ్చి తరుచుగా వార్తల్లో నిలవడం
ఏదీఏమైన రాజవంశం నేపథ్యం నుంచి రాజకీయాల్లోకి రావడం ఒక ఎత్తు అయితే. మహామహులే రాజకీయాల్లో ఎదురుదెబ్బలతో బొక్కబోర్లాపడినవారు ఎందరో ఉన్నారు. కానీ ఈమె అప్రతిహాసంగా రాజకీయాల్లో దూసుకుపోవడమే గాక డిప్యూటీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం విశేషం.
(చదవండి: 'బ్లడ్ మనీ డీల్': మరణశిక్ష పడ్డ కూతురు కోసం ఓ తల్లి చేస్తున్న సాహసం!)
Comments
Please login to add a commentAdd a comment