deputy chief minister
-
మహరాష్ట్ర సీఎంగా ఫడ్నవీస్.. డిప్యూటీ సీఎంగా షిండే!
ముంబై: మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. సీఎం ఎంపికపై మహాయుతి కూటమి మధ్య గత పదిరోజులుగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడినట్లే కనిపిస్తోంది. మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రిగా బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ఖాయమైనట్లు సమాచారం. ప్రస్తుతం ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న ఏక్నాథ్ షిండే డిప్యూటీ సీఎం బాధ్యతలు చేపట్టబోతున్నట్లు సంబంధిత వర్గాలు తాజాగా వెల్లడించాయి. ఇక డిసెంబరు 5న మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం జరగనున్నట్లు తెలుస్తోంది. ముంబైలోని ఆజాద్ మైదాన్‌లో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లు కూడా చకచకా జరిగిపోతున్నాయి. ఈసారి కూడా ఇద్దరు డిప్యూటీ సీఎంలు ఉండనుండగా.. షిండేతో పాటు ఎన్సీపీ నేత అజిత్ పవార్ అదే రోజున ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.అయితే కేబినెట్ కూర్పు ఇంకా పూర్తి కాని కారణంగా.. ఆ రోజు సీఎం, ఇద్దరు డిప్యూటీ సీఎంలు మాత్రమే ప్రమాణం చేయనున్నట్లు సమాచారం. మరోవైపు బుధవారం బీజేపీ శాసనసభాపక్ష నేతల సమావేశం జరగనుంది. ఇందులో కొత్త సీఎంను ఎమ్మెల్యేలు ఎన్నుకోనున్నారు. కాగా, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతికూటమి భారీ విజయాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే. కూటమిలోని బీజేపీకి 132 సీట్లు, షిండే శివసేనకు 57, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీకి 41 సీట్లు దక్కాయి. ఈ నేపథ్యంలో అత్యధిక సీట్లు సాధించిన బీజేపీనే ఈసారి సీఎం పదవి చేపట్టబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. కానీ సీఎం పదవి వదులుకునేందుకు ఏక్నాథ్ షిండే సుముఖంగా లేనట్లు శివసేన వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే సీఎం పదవి, శాఖల కేటాయింపుపై మహాయుతి కూటమి మధ్య గత కొంతకాలంగా ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఇక అనేక రోజుల చర్చల తర్వాత షిండే మహాయుతి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేయడానికి అంగీకరించినట్లు తెలుస్తోంది. -
ఉచిత బస్సును సమీక్షిస్తాం: శివకుమార్
బెంగళూరు: కర్నాటక మహిళలకు కల్పిస్తున్న ఉచిత బస్సు ప్రయాణ సదుపాయాన్ని సమీక్షిస్తామని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వెల్లడించారు. టికెట్లు కొనుక్కొని ప్రయాణించేందుకు పలువురు మహిళలు ముందుకు వస్తున్నందున ఈ పథకాన్ని సమీక్షిస్తామని తెలిపారు. కర్నాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో ఐరావత క్లబ్ క్లాస్ 2.0 బస్సులను బుధవారం ప్రవేశపెట్టాక శివకుమార్ మాట్లాడారు. ‘సోషల్ మీడియా ద్వారా, ఈ–మెయిళ్ల ద్వారా చాలామంది మహిళలు టికెట్లకు డబ్బులు చెల్లించి ప్రయాణిస్తామని మమ్మల్ని సంప్రదిస్తున్నారు. దీనిపై చర్చిస్తాం’ అని శివకుమార్ తెలిపారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని కల్పించే శక్తి పథకం కాంగ్రెస్ కన్నడనాట ఇచ్చిన ఐదు ప్రధాన హామీల్లో ఒకటనే విషయం తెలిసిందే. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కిందటేడాది జూన్ 11న శక్తి పథకాన్ని ప్రారంభించింది. ఈనెల 18 నాటికి 311 కోట్ల ఉచిత ప్రయాణాలు జరగ్గా.. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 7,507 కోట్లను దీనిపై వెచ్చించింది. ‘‘ 5 నుంచి 10 శాతం మంది మహిళలు టికెట్లకు డబ్బు చెల్లించేందుకు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నా.. కండక్టర్లు తీసుకోవడం లేదని ఫిర్యాదు చేస్తున్నారు. రవాణా మంత్రి రామలింగా రెడ్డితో దీనిపై చర్చిస్తాను’’ అని శివకుమార్ వివరించారు. -
మరికొన్ని గంటల్లో డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్!
చెన్నై: తమిళనాడు డిప్యూటీ సీఎంగా మంత్రి ఉదయనిధి స్టాలిన్ పగ్గాలు అందుకోనున్నట్లు అధికార డీఎంకేలో ఎప్పటి నుంచో వార్తలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్.. తన తనయుడికి డిప్యూటీ సీఎం పదవి కట్టబెట్టనున్నారని కొంతకాలంగా జోరుగా ప్రచారం జరుగోతంది.ఈ క్రమంలోనే డిప్యూటీ సీఎంగా ఉదయనిధి ఖరారు అయినట్లు తెలుస్తోంది. కేవలం మరికొన్నిగంటల్లో ఆయన డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాల సమాచారం. అధికారిక ప్రకటన వెలువడగానే.. ఉదయనిధి కొత్త పగ్గాలు చేపట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై 24 గంటల్లో స్పష్టత రానుంది.చదవండి: Kolkata: వెనక్కి తగ్గని వైద్యులు.. ఆగని నిరసనలుకాగా ఉదయనిధి ప్రస్తుతం డీఎంకే కేబినెట్లో క్రీడా, యువజన సంక్షేమ శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. అదేవిధంగా చెన్నై మెట్రో రైలు ఫేజ్-2 వంటి ప్రత్యేక కార్యక్రమాల అమలుకు సంబంధించిన కీలక శాఖలను కూడా నిర్వహిస్తున్నారు.మరోవైపు డిప్యూటీ వార్తలను ఉదయనిధి ఇప్పటికే కొట్టి పారేసిన విషయం తెలిసిందే. మీడియాలో వస్తున్న వార్తలు వట్టి పుకార్లేనని, ముఖ్యమంత్రి మాత్రమే దానిపై నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు. ఇక ఈ వార్తలపై సీఎం ఎంకే స్టాలిన్ ఇటీవలే స్పందిస్తూ.. ఉదయనిధి డిప్యూటీ సీఎం అయ్యే టైమ్ ఇంకా రాలేదంటూ చెప్పుకొచ్చారు. అయితే 2026లో ఉదయనిధి స్టాలిన్ ముఖ్యమంత్రి అవుతారని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. -
నోరెత్తని పవనం.. అసలు ఆ కథేంటి?
జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ శాసనసభ ఎన్నికలకు ముందు చేసిన ఒక ప్రసంగం వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో పవన్ కల్యాణ్ ఏమన్నారంటే.. ఏది పెట్టుకున్నా ఒన్ టైమ్ డబ్బు పది లక్షల చొప్పున ఐదువందల మంది యువతకు ఇస్తే అది ఎంతమందికి ఉపాధి అవుతుంది. ప్రతి నియోజకవర్గం నుంచి సంవత్సరానికి ఐదువందల మందికి ఇలా ఇస్తే ఎందరికి ఉపయోగపడుతుంది! మీ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. నా కొడుకుకు నేను పెట్టుబడి పెడతాను. మీకు ఎవరు పెడతారు! అంతా మన కుటుంబమే అనుకుంటాం. ఆ కుటుంబానికి ఏమి చేయాలి! యువతకు ఈ డబ్బు ఇవ్వడానికి ఏడాదికి పదివేల కోట్లు అవసరం అవుతుంది. ఒక్క ఇసుకలోనే పదివేల కోట్ల దోపిడీ జరుగుతోంది. దీనిని ఆపి యువతకు పది లక్షల చొప్పున ఇస్తే ఆంధ్రప్రదేశ్‌లో యువత ఎందుకు అభివృద్ది పథంలోకి వెళ్లదు?.. అని పవన్ ప్రశ్నించారు.పవన్ కల్యాణ్‌కు ఆ రోజుల్లో ఇలాంటి విన్నూత్నమైన ఆలోచనలు చాలానే వచ్చేవి. వాటిని ఆయన దాచుకోకుండా యువతను అట్రాక్ట్ చేయడానికి బాగానే వాడుకున్నారు. ఈ మధ్య జిల్లా కలెక్టర్ల సమావేశంలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ చంద్రబాబు అనుభవం నుంచి తాను నేర్చుకుంటున్నట్లు చెప్పారు. మంచిదే. ఎవరి అనుభవం నుంచి అయినా మంచిని గ్రహిస్తే సంతోషించవలసిందే. కాని పవన్ కల్యాణ్ ఏమి గ్రహించారో తెలియదు కాని, ఎన్నికలకు ముందే చంద్రబాబు మాదిరి ఎలాంటి ఆచరణసాధ్యం కాని హామీల గురించి ఊదరగొట్టాలన్నది నేర్చుకున్నట్లున్నారు. అందుకే ఇలాంటి కొత్త ఐడియాలను ఆయన ప్రచారంలో పెట్టారు.పవన్ కల్యాణ్ చెప్పినదాని ప్రకారం నిజంగానే ఒక్కో యువకుడికి పది లక్షల చొప్పున ఇవ్వగలిగితే గొప్ప విషయమే. ఏడాదికి 500 మందికి ఇలా పది లక్షలు ఇవ్వాలని ఆయన అన్నారు.దాని ప్రకారం ఏపీలోని 175 నియోజకవర్గాలకు కలిపి సంవత్సరానికి 8750 కోట్ల వ్యయం అవుతుంది. ఐదేళ్లకు కలిపి నలభైమూడువేల ఏడువందల ఏభై కోట్ల మేర ఖర్చు చేస్తే సరిపోతుంది. యువతకు ఇచ్చే పది లక్షల ఆదారంగా వారు పది మందికి ఉపాది కల్పిస్తే ఎంతమందికి ఉద్యోగాలు ఇవ్వవచ్చో కదా అని పవన్ కల్యాణ్ అన్నారు. పవన్ కల్యాణ్ చెబుతున్నారు కనుక అది జరిగి తీరుతుందని ఆయన అభిమానులు చాలామంది ఆశించి ఉండవచ్చు.జనసేన కార్యకర్తలు తమకు పదేసి లక్షల చొప్పున డబ్బులు వస్తే, తమ జీవితాలు మారిపోతాయని భావించి ఉండవచ్చు. దాని ప్రభావం ఎన్నికలలో కూడా విశేషంగానే పడిందని అనుకోవాలి. భారీ ఆధిక్యతతో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి విజయం సాధించింది. పవన్ కల్యాణ్ ఉప ముఖ్యమంత్రి కూడా అయ్యారు. చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌ల తర్వాత క్యాబినెట్లో పవన్ కల్యాణ్ కీలకమైన వ్యక్తి అయ్యారు. పంచాయతీరాజ్, అటవీ, పర్యావరణ శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. బాగానే ఉంది. పంచాయతీలన్నీ ఆయన చేతిలో ఉంటాయి కనుక, తను ప్రకటించిన పది లక్షల రూపాయలు యూత్‌కు ఇచ్చే స్కీమ్ ఆరంభించి ఉంటే, ఈపాటికి ప్రతి గ్రామంలో కొద్ది మందికి అయినా మంచి ఉపాధి లభించి ఉండేది.కాని అదేమిటో ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఈ విషయం గురించి అసలు ప్రస్తావించడం లేదు. బహుశా మర్చిపోయారో, యువత కూడా మర్చి పోయి ఉంటుందిలే అనుకున్నారో కాని దాని ఊసే ఎత్తడం లేదు. చంద్రబాబు అనుభవం నుంచి పరిపాలనను నేర్చుకుంటున్నానని ఆయన అన్నారు. ఎన్నికలలో గెలిచిన తర్వాత హామీలను ఎలా ఎగవేయాలన్న విషయాన్ని కూడా బహుశా ముఖ్యమంత్రి అనుభవం నుంచి పవన్ నేర్చుకున్నారేమో అనే చమక్కులు వినిపిస్తున్నాయి.అసలు ఈ మద్యకాలంలో పవన్ కల్యాణ్ ప్రజలకు సంబందించిన హామీల గురించి పెద్దగా మాట్లాడడం లేదు. గెలిచామా! పదవిలోకి వచ్చామా! అధికారాన్ని అనుభవిస్తున్నామా! అన్నచందంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఎన్నికల వాగ్దానాలు ప్రకటించినప్పుడు చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు కలిసే చేశారు. మహానాడులో చెప్పిన సూపర్ సిక్స్ హామీలతో పాటు పలు ఇతర వాగ్దానాలతో టీడీపీ, జనసేన సంయుక్త మానిఫెస్టోని ప్రకటించాయి. పవన్ తన ఎన్నికల ప్రచారాలలో వాటి గురించి చాలా ప్రముఖంగా ప్రస్తావించేవారు. ఉదాహరణకు తల్లికి వందనం కింద ప్రతి ఇంటిలో ఉన్న విద్యార్థులందరికి పదిహేనువేల రూపాయల చొప్పున డబ్బులు ఇస్తామని పవన్ కల్యాణ్ పదే, పదే చెప్పారు. వలంటీర్లను మొదట అవమానించినా, తదుపరికాలంలో తాము కూడా ఆ వ్యవస్థను కొనసాగిస్తామని, ఒక్కో వలంటీర్‌కు నెలకు పదివేల రూపాయల చొప్పున గౌరవ వేతనం ఇస్తామని ఆయన ఆయా సభలలో చెప్పారు.ఇలా ఒక్కటేమిటి! అనేక వాగ్దానాలను చంద్రబాబు, లోకేష్‌లతో పాటు పవన్ కల్యాణ్ కూడా విస్తారంగా ప్రచారం చేశారు. ప్రస్తుతం వాటి మాటే ఎత్తడం లేదు. వాటికి తోడు పవన్ కల్యాణ్ తన సొంత ఆలోచనల ప్రకారం పది లక్షల రూపాయల చొప్పున ప్రతి యువతకు ఇస్తామని ప్రతి పాదించారు. ఇసుక దోపిడీని ఆపితే ఇది సాధ్యమేనని ఆయన అప్పట్లో అన్నారు. ఆ రోజుల్లో ఇసుక ద్వారా ప్రభుత్వానికి ఏడాదికి 700 కోట్ల వరకు ఆదాయం సమకూరేది.అయినా దోపిడీ అని ప్రచారం చేశారు. కూటమి గెలిచిన తర్వాత టీడీపీ, జనసేన పార్టీల నేతలు దొరికినకాడికి దొరికినంత ఇసుకను దోచుకుపోయారు. పేరుకు ఉచితం అయినా, భారీ మొత్తాన్నే ప్రైవేటు వ్యక్తులు వసూలు చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి.మరి ఇసుక దోపిడీ ఆపితే పదివేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి వచ్చేవన్న పవన్ ఇప్పుడు ఎందుకు దాని గురించి ఆలోచించడం లేదు? ఇసుక సంగతి పక్కనబెడితే తన మద్దతుతోనే టీడీపీ అధికారంలోకి వచ్చిందని భావిస్తున్న పవన్ కల్యాణ్ తలచుకుంటే ఈ పది లక్షల స్కీమును చంద్రబాబుతో అమలు చేయించలేరా? అన్న ప్రశ్న వస్తుంది. పవన్ కల్యాణ్ ఈ విషయం గురించి చంద్రబాబుతో చర్చించే ధైర్యం అన్నా చేస్తారా? అని కొంతమంది సందేహం వ్యక్తం చేస్తున్నారు. లేదూ అచ్చంగా చంద్రబాబు మాదిరే మాటమార్చేస్తే అదే పాలన అనుభవం అని భావిస్తే ఏ గొడవ ఉండదు. మరి పాపం పది లక్షల సాయం వస్తుందని ఆశించి ఓట్లు వేసిన జనసేన కార్యకర్తలు, యువత ఇంకెంతకాలం వేచి ఉండాలో!– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
ఉదయనిధి స్టాలిన్‌కు డిప్యూటీ సీఎం పదవి.. మంత్రి రియాక్షన్ ఇదే!
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తనయుడు, యువజన సంక్షేమ శాఖ మంత్రి ఉదయనిధి స్టాలిన్ ఉప ముఖ్యమంత్రిగా పదోన్నతి పొందనున్నారనే ఊహాగానాలు వెల్లువెత్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ విషయంపై ఆయన శనివారం స్పందించారు. డీఎంకే ఒక కుటుంబమని.. తమ ప్రభుత్వంలోని మంత్రులంతా డిప్యూటీ సీఎంలేనని పేర్కొన్నారు. గతంలో కూడా తాను ఇదే చెప్పానని తెలిపారు.‘డీఎంకేలోని మంత్రులందరూ మా ముఖ్యమంత్రికి డిప్యూటీలు. నాకు ఏ పెద్ద పదవి లేదా బాధ్యత ఇచ్చినా.. నా మనసుకు దగ్గరయ్యేది డీఎంకే యువజన విభాగం కార్యదర్శి పదవే. నాకు ఏ పదవి వచ్చినా డీఎంకే యువజన విభాగం ఎప్పటికీ మర్చిపోలేను. నాకు డిప్యూటీ సీఎం పదవిపై అనేక వార్తలు వచ్చాయి. అది ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది’ అని పేర్కొన్నారు. -
యమునా తీరే.. ఎవరికి వారే
లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో పేలవ ఫలితాల దెబ్బకు రాష్ట్ర బీజేపీలో అంతర్గత కుమ్ములాటలు ఒక్కసారిగా తెరపైకి వస్తున్నాయి. 2019తో పోలిస్తే యూపీలో బీజేపీ అనూహ్యంగా సగానికి సగం స్థానాలు కోల్పోవడం తెలిసిందే. పార్టీ కేంద్రంలో వరుసగా మూడోసారి సొంతంగా మెజారిటీ సాధించడంలో విఫలమవడానికి ఇదే ప్రధాన కారణంగా నిలిచింది. దీన్ని కమలనాథులు సీరియస్‌గా తీసుకున్నారు. రాష్ట్ర పారీ్టలోనూ, యోగి కేబినెట్లోనూ త్వరలో భారీ మార్పుచేర్పులకు రంగం సిద్ధమవుతోంది. దీంతోపాటు సీఎం యోగి ఆదిత్యనాథ్ దూకుడుకు పగ్గాలు వేసేందుకు అధిష్టానమే ప్రయతి్నస్తున్నట్టు చెబుతున్నారు. యోగి ప్రభుత్వంపై సాక్షాత్తూ సొంత పారీ్టకే చెందిన ఉప ముఖ్యమంత్రి మౌర్య బాహాటంగా విమర్శలు... రాష్ట్ర పార్టీ చీఫ్‌తో కలిసి ఆయన హస్తిన యాత్రలు... మోదీ, నడ్డా తదితర పెద్దలతో భేటీ... ఇవన్నీ అందులో భాగమేనని రాజకీయంగా జోరుగా చర్చ జరుగుతోంది...!ఉత్తరప్రదేశ్ బీజేపీ చీఫ్ భూపేంద్రసింగ్ చౌదరి బుధవారం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఉప ముఖ్యమంత్రి కేశవ్‌ప్రసాద్ మౌర్యతో కలిసి ఆయన మంగళవారమే హస్తిన చేరుకున్నారు. అదే రాత్రి బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో మౌర్య గంటకు పైగా సమావేశమయ్యారు. అనంతరం చౌదరి కూడా నడ్డాతో విడిగా భేటీ అయ్యారు. నిజానికి యోగి, మౌర్య మధ్య మొదటినుంచీ సత్సంబంధాలు లేవు. యోగి అభీష్టానికి వ్యతిరేకంగా మౌర్యకు అధిష్టానం డిప్యూటీ సీఎం పదవి కట్టబెట్టింది. ఈ నేపథ్యంలో మౌర్య, యూపీ బీజేపీ చీఫ్ హస్తిన యాత్ర రాష్ట్రంలో రాజకీయ కలకలం రేపుతోంది. మౌర్య నెల రోజులుగా కేబినెట్ సమావేశాలకు వరుసగా డుమ్మా కొడుతూ వస్తున్నారు. యూపీలో త్వరలో 10 అసెంబ్లీ స్థానాలకు కీలక ఉప ఎన్నికలు జరగనున్నాయి. వాటి సన్నద్ధత కోసం మంత్రులతో యోగి ఏర్పాటు చేసిన భేటీకి కూడా మౌర్య వెళ్లలేదు. పైగా నెల రోజులుగా ఢిల్లీలోనే మకాం వేసి సీనియర్ కేంద్ర మంత్రులు, పార్టీ పెద్దలను వరుస పెట్టి కలుస్తూ వస్తున్నారు. జూలై 14న కూడా నడ్డాతో చాలాసేపు మంతనాలు జరిపారు. ఆ భేటీతో... ఆదివారం లఖ్‌నవూలో జరిగిన బీజేపీ రాష్ట్రస్థాయి ప్రతినిధుల సమావేశం యూపీలో రాజకీయ వేడిని ఒక్కసారిగా పెంచేసింది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎంపీ అభ్యర్థులు, బీజేపీ నేతలు, ప్రతినిధులు కలిపి 3,500 మందికి పైగా పాల్గొన్న ఆ భేటీలో వేదిక మీదే యోగి, మౌర్య మధ్య పరోక్షంగా మాటల యుద్ధం సాగింది. మౌర్య ప్రసంగిస్తూ, ‘ప్రభుత్వం కంటే పారీ్టయే మిన్న. కనుక పారీ్టదే పై చేయిగా వ్యవహారాలు సాగాలి’’ అంటూ బాహాటంగా వ్యాఖ్యలు చేశారు. దాంతో అంతా విస్తుపోయారు. ప్రభుత్వ వ్యవహారాల్లో బీజేపీ నేతల మాట పెద్దగా చెల్లడం లేదని పారీ్టలో యోగి వ్యతిరేకులు చాలాకాలంగా వాపోతున్నారు. అధికారులకు యోగి పూర్తి స్వేచ్ఛ ఇవ్వడమే ఇందుకు కారణమని ఆరోపిస్తున్నారు. అందుకే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేతలు, కార్యకర్తలు దూకుడుగా పని చేయలేదని, రాష్ట్రంలో దారుణ ఫలితాలకు ప్రధాన కారణాల్లో ఇదీ ఒకటన్నది వారి వాదన. ఎస్పీ, బీఎస్పీ సానుభూతిపరులైన అధికారులకు కీలక పదవులు కట్టబెట్టారంటూ వారంతా యోగిపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని సీఎం సమక్షంలోనే మౌర్య మాటల తూటాలు పేల్చారు. ‘‘కార్యకర్తలే కీలకం. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు అందరూ వారిని గౌరవించాల్సిందే. నేనైనా ముందు బీజేపీ కార్యకర్తను. తర్వాతే డిప్యూటీ సీఎంను’’ అన్నారు. ‘‘కార్యకర్తల బాధే నా బాధ. ప్రతి కార్యకర్తకూ నా ఇంటి తలుపులు నిత్యం తెరిచే ఉంటాయి’’ అంటూ నర్మగర్భ వ్యాఖ్యలూ చేశారు. యోగి సమక్షంలోనే ప్రభుత్వ పనితీరును తప్పుబట్టేలా మౌర్య ఇలా మాట్లాడటం వెనక అధిష్టానం ఆశీస్సులున్నట్టు చెబుతున్నారు. అయితే మౌర్య అనంతరం మాట్లాడిన యోగి కూడా ఏమాత్రం వెనక్కు తగ్గలేదు. ప్రభుత్వ పనితీరు ఏమాత్రం మారబోదని అదే వేదిక నుంచి కుండబద్దలు కొట్టారు. ఆ వెంటనే మౌర్య, చౌదరి హస్తిన వెళ్లడం, మోదీ, నడ్డా తదితరులతో భేటీ కావడం చకచకా జరిగిపోయాయి. అనంతరం తాజాగా బుధవారం ఎక్స్ పోస్టులో కూడా ‘ప్రభుత్వం కంటే పారీ్టయే పెద్ద’దన్న వ్యాఖ్యలను మౌర్య పునరుద్ఘాటించారు. వీటన్నింటినీ బేరీజు వేసి చూస్తే యూపీకి సంబంధించి బీజేపీ అధిష్టానం త్వరలో ‘పెద్ద’ నిర్ణయం తీసుకోవచ్చంటూ యోగి వ్యతిరేక వర్గం జోరుగా ప్రచారం చేస్తోంది. లోక్‌సభ ఎన్నికల తర్వాత యోగిని సీఎం పదవి నుంచి తప్పించడం ఖాయమని ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం పదేపదే చెబుతూ వస్తుండటం తెలిసిందే.యోగి సంచలన వ్యాఖ్యలు అధిష్టానం మనోగతాన్ని పసిగట్టిన యోగి ముందుగానే వ్యూహాత్మకంగా పై ఎత్తులు వేస్తున్నారని అంటున్నారు. అతి విశ్వాసమే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ కొంప ముంచిందని మూడు రోజుల క్రితం ఆయన ఏకంగా బహిరంగ సభలోనే వ్యాఖ్యలు చేయడం ఉద్దేశపూర్వకమేనని భావిస్తున్నారు. ఇవి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. బీజేపీ అధిష్టానం ఇప్పటికిప్పుడు యోగిని మార్చడం వంటి భారీ నిర్ణయాలకు వెళ్లకపోయినా అసెంబ్లీ ఉప ఎన్నికల్లో సత్ఫలితాలు రాబట్టలేకపోతే ఆయనకు ఇబ్బందులు తప్పేలా లేవు. మరోవైపు బీజేపీ ఇంటి పోరుపై విపక్షాలన్నీ చెణుకులు విసురుతున్నాయి. యూపీకి ముగ్గురు సీఎంలున్నారంటూ కాంగ్రెస్, సమాజ్‌వాదీ సహా ఎద్దేవా చేస్తున్నాయి. అంతర్గత కుమ్ములాటల్లో మునిగి తేలుతూ పాలనను గాలికొదిలారంటూ దుయ్యబడుతున్నాయి. మౌర్య, మరో డిప్యూటీ సీఎం బ్రిజేశ్ పాఠక్ కూడా సీఎంలుగానే వ్యవహరిస్తున్నారన్నది వాటి విమర్శల ఆంతర్యం. ఈ నేపథ్యంలో ఉప ఎన్నికల్లో అత్యధిక స్థానాలను నెగ్గడం యోగికి అత్యవసరం. రాష్ట్ర పార్టీ కీలక నేతల సహాయ నిరాకరణ నేపథ్యంలో ఈ కఠిన పరీక్షలో ఆయన ఏ మేరకు నెగ్గుకొస్తారన్నది ఆసక్తికరం. – సాక్షి, నేషనల్ డెస్క్ -
మిస్సింగ్ అమ్మయిలు!.. పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడా ?
-
ఉప ముఖ్యమంత్రిగా పవన్ బాధ్యతల స్వీకరణ
-
బెంగళూరు గొంతెండుతోంది
‘‘అవడానికి మాదో లగ్జరీ అపార్ట్మెంట్. కానీ ఏం లాభం? నెల రోజులుగా చుక్క నీటికీ దిక్కు లేక అల్లాడుతున్నాం! 24 గంటలూ రావాల్సిన నల్లా నీళ్లు ఏ రాత్రి వేళో వస్తున్నాయి. అవీ మురికిమయం! స్నానపానాలకే కాదు, చివరికి టాయ్‌లెట్ అవసరాలకు కూడా నీరు లేదు. సరిగా నీళ్లు కూడా పోయక ఏ ఫ్లాట్‌లో చూసినా టాయ్లెట్లు భరించలేనంతగా కంపు కొడుతున్నాయి. దాంతో రెసిడెంట్లు మూకుమ్మడిగా ఖాళీ చేసి వెళ్లిపోతున్నారు. అలా వెళ్లలేనివాళ్లం విధిలేక పక్కనే ఉన్న ఫోరం సౌత్ మాల్‌లోకి వెళ్లి టాయ్‌లెట్ అవసరాలు తీర్చుకుంటున్నాం!’’ – రెడిట్‌లో ఓ బెంగళూరు వాసి పెట్టిన పోస్టిది! అలాంటిదేమీ లేదంటూ సదరు అపార్ట్మెంట్ అసోసియేషన్ ఖండించినా ఈ పోస్టు ప్రస్తుతం తెగ వైరలవుతోంది. దీనికి బెంగళూరు టెకీల నుంచి విపరీతమైన స్పందన వెల్లువెత్తుతోంది. తమ నీటి కష్టాలకు అంతు లేదంటూ వర్ణిస్తూ వారు పెడుతున్న పోస్టులతో ఇంటర్నెట్ హోరెత్తిపోతోంది... దేశ ఐటీ రాజధాని బెంగళూరు గొంతెండిపోతోంది. తీవ్ర నీటి కొరతతో అల్లాడుతోంది. గుక్కెడు తాగునీటి కోసం జనం అలో లక్ష్మణా అంటూ అలమటిస్తున్నారు. నగరవ్యాప్తంగా బోర్లన్నీ చుక్క నీరైనా లేకుండా ఎండిపోయాయి. నగరంలో ఏటా వేసవిలో నీటి కొరత మామూలే అయినా ఈసారి మాత్రం సమస్య చాలా దారుణంగా ఉంది. ఇంకా వేసవి మొదలైనా కాకముందే నీటి కొరత తారస్థాయికి చేరింది. కోట్లు పెట్టి లగ్జరీ అపార్ట్మెంట్లలో ఫ్లాట్లు కొనుక్కున్న వాళ్లు కూడా కనీసం స్నానానికైనా నీళ్లు లేక లబోదిబోమంటున్నారు. సమర్థమైన ప్రత్యామ్నాయ ఏర్పాట్లేవీ చేయలేక ప్రభుత్వ యంత్రాంగం కూడా ప్రస్తుతానికి చేష్టలుడిగింది. రాష్ట్రవ్యాప్తంగా నీటి ఎద్దడి నెలకొని ఉందంటూ ప్రకటించింది! నీటి సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ఇప్పటికే తాలూకా స్థాయిలో కంట్రోల్ రూములు, హెల్ప్లైన్లు ఏర్పాటు చేసింది. బెంగళూరులో నీటి సమస్య నివారణకు ఎంతదూరమైనా వెళ్తామంటూ ఉప ముఖ్యమంత్రి డి.కె.శివకుమార్ చేసిన ప్రకటనలు ఇప్పటికైతే కార్యరూపం దాల్చలేదు. పరిస్థితి పూర్తిగా చేయి దాటకుండా చూసేందుకు నగరంలో నీటి వాడకంపై రాష్ట్ర జల బోర్డు కఠిన ఆంక్షలు విధించింది. కార్లు కడిగేందుకు, మొక్కలకు, మెయింటెన్స్, నిర్మాణ పనులకు తాగునీటి వాడకాన్ని పూర్తిగా నిషేధిస్తున్నట్టు ప్రకటించింది. ఉల్లంఘిస్తే రూ.5,000 జరిమానా తప్పదని హెచ్చరించింది. బెంగళూరులోనే గాక కర్ణాటకవ్యాప్తంగా నీటి ఎద్దడి ఆందోళనకర స్థాయిలోనే ఉంది. గత సీజన్లో వర్షాభావమే ఈ దుస్థితికి కారణమన్న ప్రభుత్వ ప్రకటనపై జనం మండిపడుతున్నారు. ఇంతటి సమస్య తప్పదని ముందే తెలిసి కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లేవీ చేయలేదంటూ దుయ్యబడుతున్నారు. ‘‘నిజానికి మూడు నెలలుగా నీటి సమస్య వెంటాడుతోంది. నెల నుంచి పరిస్థితి మరీ విషమించింది’’ అంటూ వాపోతున్నారు. ట్యాంకర్ల రేట్లు చుక్కల్లోకి... ► బెంగళూరులో ఏకంగా 60 శాతం జనం నీటి కోసం వాటర్ ట్యాంక్‌ల మీదే ఆధారపడ్డారు! అదను చూసి ప్రైవేట్ ట్యాంకర్లు రేట్లు ఎడాపెడా పెంచేశాయి. ► మామూలు రోజుల్లోనే 6,000 లీటర్ల ట్యాంకర్‌కు రూ.600, 8,000 లీటర్లకు రూ.800, 12 వేల లీటర్ల ట్యాంకరైతే రూ.1,000 చార్జి చేస్తారు. ► ఈ రేట్లకు జీఎస్టీ అదనం. పైగా దూరం 5 కి.మీ. దాటితే మరో రూ.200 దాకా పెరుగుతుంది. ► ఇప్పుడు ప్రైవేట్ ట్యాంకర్లు రెట్టింపు, అంతకుమించి వసూలు చేస్తున్నాయంటూ జనం గగ్గోలు పెడుతున్నారు. ► దాంతో ట్యాంకర్ల రేట్లకు పరిమితి విధిస్తామన్న ప్రభుత్వ ప్రకటన ఎక్కడా పెద్దగా అమలు కావడం లేదు. ► ఇవేం ధరలంటూ గట్టిగా నిలదీస్తే ట్యాంకర్వాలాలు ఆ కాలనీల ముఖం కూడా చూడటం లేదు. ► మున్సిపాలిటీ నల్లాల వద్ద క్యూ లైన్లు కిలోమీటర్లు దాటేస్తున్నాయి. అక్కడా ఒక్క బిందెకు మించి ఇవ్వడం లేదు! ► ఆర్వో ప్లాంట్ల ముందు కూడా ఒక్కరికి ఒక్క క్యానే అంటూ బోర్డులు దర్శనమిస్తున్నాయి! ► చాలా ప్లాంట్లు ‘నో వాటర్’ అంటూ బోర్డులు పెట్టి బ్లాకులో అడ్డగోలు రేట్లకు అమ్ముకుంటున్నాయి. ► నీటి ఎద్దడి దెబ్బకు రాష్ట్రవ్యాప్తంగా విద్యా సంస్థలు ఆన్లైన్ బాట పడుతున్నాయి. ఆన్లైన్ క్లాసులతో పని కానిస్తున్నాయి. ఎందుకింత సమస్య... ► 2023లో కర్ణాటకవ్యాప్తంగా నెలకొన్న వర్షా భావ పరిస్థితులు ప్రస్తుత నీటి సమస్యకు ప్రధాన కారణాల్లో ఒకటి. ► రాష్టంలో ఎక్కడ చూసినా భూగర్భ జలాలు అడుగంటాయి. కావేరీ బేసిన్‌లోని రిజర్వాయర్లన్నీ దాదాపుగా వట్టిపోయాయి. ► కర్ణాటకలోని 16 పెద్ద రిజర్వాయర్లలో 2023లో ఇదే సమయానికి సగం వరకున్న నీటిమట్టం ఈసారి 29 శాతానికి పడిపోయింది. ► బెంగళూరులో ఎక్కడ చూసినా బోర్లే దర్శనమిస్తుంటాయి. భూగర్భ జలాలను విచ్చలవిడిగా తోడేయడం నగరంలో నీటి ఎద్దడికి ప్రధాన కారణం. ► రియల్టీ బూమ్ నేపథ్యంలో రెండు దశాబ్దాలుగా నగరంలోని చెరువులు, నీటి ఆవాసాలన్నీ కాలనీలు, అపార్ట్మెంట్లుగా మారిపోయాయి. ఆ దెబ్బకు స్థానిక నీటి వనరులు పూర్తిగా కనుమరుగయ్యాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Maharashtra Politics: బారామతిలో ప‘వార్’!
ఎన్సీపీ పార్టీని చీల్చి బీజేపీ ప్రభుత్వంలో చేరి ఉపముఖ్యమంత్రి పదవి చేపట్టిన అజిత్ పవార్.. తన భార్యను రాజకీయ అరంగేట్రం చేయిస్తున్నారా? అందులోనూ దిగ్గజ నేత శరద్‌పవార్ కుమార్తె, సిట్టింగ్ ఎంపీ సుప్రియా సూలే ప్రాతినిధ్యం వహిస్తున్న‘బారామతి’ నుంచే బరిలో దింపుతున్నారా? అంటే ఎన్సీపీ వర్గాలు అవుననే అంటున్నాయి. ఈ వార్తలను బలం చేకూరుస్తూ ఇప్పటికే కొన్ని చోట్ల ‘బారామతి ఎంపీ సునేత్రా పవార్’ అంటూ భారీ హోర్డింగ్‌లనూ పెట్టేశారు. ఇక అధికారికంగా ప్రకటించడమే తరువాయి అనే పుకార్లు బారామతి నియోజకవర్గంలో షికార్లుచేస్తున్నాయి. అసలు సునేత్రా పేరు తెరమీదకు ఎందుకొచి్చంది? అనే ప్రశ్నకు ఆమె భర్త అజిత్ వ్యాఖ్యల్లో సమాధానం దొరుకుతుంది. శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో డెప్యూటీ సీఎం అజిత్ పవార్ భావోద్వేగంతో చేసిన ప్రసంగం ఈ వార్తలకు బలం చేకూర్చింది. బారామతి లోక్‌సభ స్థానం నుంచి ఎవరిని నిలపబోతున్నారో ఆయన స్పష్టంగా చెప్పకపోయినా.. ‘ ఈసారి బారామతిలో కొత్త అభ్యరి్థని నిలుపుతాం. తొలిసారి పోటీచేస్తున్న అభ్యరి్థ.. మన భవిష్యత్ తరాల సంక్షేమం కోసం అవిశ్రాంతంగా పనిచేయగలరు. కొందరు ‘పాత’ భావోద్వేగాలతో ఓటేయాలని మిమ్మల్ని అడుగుతారు. పట్టించుకోకండి. జరగబోయే నిరంతర అభివృద్ధిని మాత్రమే దృష్టిలో పెట్టుకోండి. మొదటిసారి పోటీచేస్తున్నా ఆశీర్వదించండి. అభివృద్ధిని గెలిపించండి’ అని పిలుపునిచ్చారు. వెంటనే భార్య సునేత్రనే ఆయన రంగంలోకి దింపబోతున్నారని భావించిన ఎన్సీపీ పార్టీ వర్గాలు ఆ నియోజకవర్గం ప్రధాన కూడళ్లలో భారీ హోర్డింగ్‌లు పెట్టేశాయి. కాబోయే ఎంపీ సునేత్రా పవార్ అని రాసి ఉన్న ప్లెక్సీలతో బారామతిలో అప్పుడే ఎన్నికల కోలాహలం మొదలైంది. శరద్‌పవార్ కుటుంబానికి కంచుకోట ఈ నియోజకవర్గం. ఇక్కడ ఎన్సీపీ దిగ్గజ నేత శరదపవార్ కూతురు సుప్రియా సూలే సిట్టింగ్ ఎంపీగా కొనసాగుతున్నారు. 2009 ఏడాది నుంచి అప్రతిహతంగా ఆమె జైత్రయాత్ర కొనసాగుతోంది. ఆమెను ఢీకొట్టాలంటే తమ కుటుంబానికే చెందిన మహిళా అభ్యర్థి అయితేనే ఎన్నికల రణరంగంలో నెగ్గుకు రాగలరని అజిత్ పవార్ భావిస్తున్నారు. అందుకే భార్యను బరిలో నిలుపుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఎన్సీపీ పార్టీని అజిత్ పవార్ చీలి్చన నేపథ్యంలో పార్టీ ఓటర్లు సైతం రెండు వర్గాలుగా చీలే అవకాశముంది. అప్పుడు సుప్రియా, సునేత్రలలో ఎవరు గెలుపు తలుపు తట్టగలరో వేచి చూడాల్సిందే. ఎవరీ సునేత్రా? అజిత్ భార్యగా తప్పితే రాజకీయ వర్గాల్లో ఎవరికీ తెలియని పేరు సునేత్ర. ఆమె చాలా సంవత్సరాలుగా సామాజిక కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. శరద్‌పవార్‌కు ఒకప్పటి సన్నిహిత నేత, మాజీ మంత్రి పద్మసిన్హా పాటిల్ చెల్లెలే ఈమె. ప్రత్యక్ష రాజకీయాలు ఈమెకు కొత్త. ఎని్వరాన్‌మెంట్ ఫోరమ్ ఆఫ్ ఇండియా పేరిట ఒక ఎన్జీవోను సునేత్ర నడుపుతున్నారు. సేంద్రీయ వ్యవసాయం, సేంద్రీయ ఎరువుల వినియోగాన్ని ఈమె అమితంగా ప్రోత్సహిస్తున్నారు. పర్యావరణహిత గ్రామాల స్థాపనకు కృషిచేస్తున్నారు. ప్రముఖ విద్యాసంస్థ ‘విద్యా ప్రతిష్ఠాన్’కు ట్రస్టీగా ఉన్నారు. ఫ్రాన్స్‌లోని మేథో సంస్థ వరల్డ్ ఎంటర్ప్రెన్యూర్íÙప్ ఫోరమ్‌లో 2011 నుంచి భాగస్వామిగా కొనసాగుతున్నారు. అయితే ఈమె మెల్లిగా ప్రచారకార్యక్రమాలు మొదలెట్టినట్లు తెలుస్తోంది. 2019లో సుప్రియాపై పోటీచేసి ఓడిపోయిన బీజేపీ మహిళా అభ్యర్థి కంచన్ రాహుల్ కౌల్‌ను ఈవారమే కలిసి చర్చించారని వార్తలొచ్చాయి. అజిత్, సునేత్రలకు ఇద్దరు కుమారులు. జై పవార్, పార్థపవార్. 2019లో మావాల్ లోక్‌సభ స్థానం నుంచి పోటీచేసి పార్థపవార్ ఓటమిని చవిచూశారు. కంచుకోట బారామతి పవార్ల కుటుంబానికి పుణె జిల్లాలోని బారామతి పెట్టనికోట. గత 55 సంవత్సరాలుగా ఇక్కడ వీరిదే హవా. తొలిసారిగా మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో 1967లో బారామతి ఎమ్మెల్యే నియోజకవర్గం నుంచి పోటీచేసి శరద్‌పవార్ గెలిచారు. తర్వాత 1972, 1978, 1980, 1985, 1990 అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే స్థానంలో ఘన విజయం సాధించారు. ఇదే బారామతి లోక్‌సభ స్థానం నుంచీ శరద్‌పవార్ 1984, 1996, 1999, 2004 ఎన్నికల్లో విజయఢంకా మోగించారు. అజిత్ పవార్ సైతం 1991లో ఇదే లోక్‌సభ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహించారు. ఇక్కడి నుంచి అజిత్ ఏకంగా ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుతం బారామతి ఎమ్మెల్యే అజితే. 2009 నుంచి సుప్రియా సూలే ఇక్కడ ఎంపీగా గెలుస్తూ వస్తున్నారు. ఇక్కడ ఈసారి సునేత్రను దింపితే స్పష్టంగా ‘పవర్’ప్లే మొదలైనట్లే. పెదనాన్న కొడుకైన అజిత్.. సుప్రియాకు అన్నయ్య అవుతారు. ఆ లెక్కన వదినా, మరదళ్ల పోరులో గెలుపెవరిదో చూడాలి మరి! – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఆమె రాజవంశపు యువరాణి, రాయల్ ఫ్యాషన్ ఐకాన్! ఏకంగా డిప్యూటీ సీఎంగా..!
రాజవంశానికి చెందిన ఓ యువరాణి రాజకీయాల్లో రావడమే గాక ఏకంగా డిప్యూటి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఆమె రాజకీయ ప్రస్థానం సాగింది. ఎలా అత్యున్నత పదవిని అలకరించగలిగారు తదితరాల గురించే ఈ కథనం!. దియా కుమారి 1971లో జన్మించారు. ఆమె జైపూర్ రాజరిక రాష్ట్రానికి చివరి పాలక మహారాజా మాన్సింగ్II మనవరాలు. జైపూర్‌కు చెందిన మహారాజా సవాయి భవానీసింగ్, హెచ్ హెచ్ మహారాణి, పద్మినీ దేవిల ఏకైక కుమార్తె. ఆమెకు ముగ్గురు పిల్లలు, హెచ్‌హెచ్ సవాయి పద్మనాభ్ సింగ్, యువరాణి గౌరవి కుమారి, హెచ్‌హెచ్ లక్షరాజ్ ప్రకాష్, సిర్మౌర్ మహారాజా. దియా కుమారి ఎన్నో మహిళా సంక్షేమ కార్యక్రమాలతో ప్రజలను మనసును దోచుకుంది. రాజరికంలో పెరిగిన ఆమె తండ్రి దాతృత్వాన్ని వారసత్వంగా తీసుకుని ప్రజలకు సంబంధించిన ఎన్నో సేవా కార్యక్రమాలను చురుగ్గా ముందుండి చేసేది. ఆమె ప్రస్తుతం జైపూర్‌లో ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం సిటీ ఫ్యాలెస్‌లో నివాసం ఉంటున్నారు. మాన్సింగ్ మ్యూజియం నిర్వహణకు కూడా సాయం అందిస్తున్నారు. రాజరికం ఆధునికత కలగలిసిన మహిళ దియా కుమారి. ఆమె తన విధ్యాభ్యాసాన్ని భారత్, యూకేలలో పూర్తి చేశారు. రాజకీయ ప్రస్థానం.. 2013లో దియా కుమారీ బీజేపీలో చేరి రాజకీయాల్లోకి తెరంగేట్రం చేశారు. మహిళల హక్కులు, విద్య, గ్రామీణాభివృద్ధి కోసం తన వాణిని వినిపించడమే గాక, అందుకు సంబంధించిన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఆ తర్వాత లోక్‌సభకు ఎన్నికయ్యారు. రాజకీయాలతో సంబంధం లేకుండానే స్వతహాగా ఎన్నో దాతృత్వ కార్యక్రమాలు చేశారు. ఆమె ప్రిన్సెస్ దియా కుమారి ఫౌండేషన్‌ను స్థాపించింది. దీని ద్వారా పిల్లలకు విద్య, ఆరోగ్య సంరక్షణ, మహిళా నైపుణ్యాభివృద్ధి వంటి కార్యక్రమాలను చేస్తున్నారు. దియా కుమారీ సాంప్రదాయ కళలను, చేతిపనులు, సంగీతం, నృత్యం వంటి వాటిని ఎంతగానో ప్రోత్సహిస్తుంది. వివాదాస్పద అంశాలు.. తాజ్ మహల్‌ని సొంతం చేసుకోవాలని కోర్టులో దావా వేశారు. తాజ్‌మహల్‌ను నిర్మించే స్థలం తన కుటుంబానికి చెందినదని, అందుకే ఆ ఆస్తి తనకే చెందుతుందని ఇటీవల ఆమె వాదనలు వినిపించారు. తమ వద్ద సరైన డాక్యుమెంటేషన్ ఉందని, అవసరమైతే కోర్టుకి సమర్పిస్తామని కూడా ఆమె స్పష్టం చేశారు. బహిరంగా బోల్డ్ స్టేట్మెంట్లు ఇచ్చి తరుచుగా వార్తల్లో నిలవడం ఏదీఏమైన రాజవంశం నేపథ్యం నుంచి రాజకీయాల్లోకి రావడం ఒక ఎత్తు అయితే. మహామహులే రాజకీయాల్లో ఎదురుదెబ్బలతో బొక్కబోర్లాపడినవారు ఎందరో ఉన్నారు. కానీ ఈమె అప్రతిహాసంగా రాజకీయాల్లో దూసుకుపోవడమే గాక డిప్యూటీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం విశేషం. (చదవండి: 'బ్లడ్ మనీ డీల్': మరణశిక్ష పడ్డ కూతురు కోసం ఓ తల్లి చేస్తున్న సాహసం!) -
డీకే శివకుమార్‌కు సుప్రీంలో ఊరట
న్యూఢిల్లీ: కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు సోమవారం సుప్రీంకోర్టులో ఊరట లభించింది. అవినీతి కేసులో తమ దర్యాప్తును నిలుపుదల చేస్తూ గతంలో కర్ణాటక హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వును సీబీఐ సుప్రీంకోర్టులో సవాల్ చేయగా దానిని సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఫిబ్రవరి పదో తేదీన హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం ఇచ్చిన ఉత్తర్వులో కలగజేసు కోబోమని బెంచ్ స్పష్టంచేసింది. గతంలో కర్ణాటక హైకోర్టు సీబీఐ దర్యాప్తుపై స్టేను పలుమార్లు పొడిగించడం తెల్సిందే. -
కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ను కలిసిన వైఎస్ షర్మిల
-
డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం
-
కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్య.. శివకుమార్ ఒక్కరే డిప్యూటీ సీఎం: కేసీ వేణుగోపాల్
Updates: ►కర్ణాటక విజయంతో కాంగ్రెస్‌లో జోష్ వచ్చిందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు. ఈ మేరకు గురువారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యేల అభిప్రాయాలను పార్టీ పరిశీలకులు హైకమాండ్‌కు అందజేశారని పేర్కొన్నారు.. సీఎంపై ఏకాభిప్రాయం కోసం రెండు, మూడు రోజులుగా చర్చలు జరిపినట్లు తెలిపారు. కర్ణాటక కొత్త సీఎంగా సిద్ధరామయ్యను ఎంపిక చేసినట్లు వెల్లడించారు. శివకుమార్ ఒక్కరే డిప్యూటీ సీఎంగా ఉంటారని తెలిపారు. పీసీసీ చీఫ్‌గా కూడా డీకే కొనసాగుతారని చెప్పారు. ఎల్లుండి(శనివారం) ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, మంత్రుల ప్రమాణ స్వీకారం ఉంటుందన్నారు. ►డిప్యూటీసీఎం పదవికి డీకే శివకుమార్ అంగీకరించడం వెనక సోనియా గాంధీ ప్రముఖపాత్ర పోషించినట్లు తెలుస్తోంది. సీఎ పదవిని కాదని రెండో స్థానాన్ని ఓకే చేసేలా ఆయన్ను సోనియా బుజ్జగించినట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. పార్టీ ప్రయోజనాలు, గాంధీ కుటుంబం కోసం శివకుమార్ ‘త్యాగం’ చేశారని, డిప్యూటీ సీఎం పదవికి అంగీకరించారని ఆయన సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయియి. ► ఢిల్లీలోని కేసీ వేణుగోపాల్ నివాసానికి సిద్ధరామయ్య, డీకే శివకుమార్ చేరుకున్నారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్‌తో చర్చల అనంతరం వీరు రాహుల్‌గాంధీని కలవనున్నారు. ► కర్ణాటక ముఖ్యమంత్రి ఎంపిక వ్యహహారం కొలిక్కివచ్చింది. ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్యను ప్రకటించడం లాంఛనమే! పార్టీ అధిష్టానంతో సుదీర్ఘ చర్చల అనంతరం కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ గురువారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ► ‘నేను పూర్తి సంతోషంగా లేను. కర్ణాటక ప్రజలకు ఇచ్చిన హామీలను మా ప్రభుత్వం నెరవేర్చాల్సి ఉంది. వచ్చే లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా, పార్టీ ప్రయోజననాల కోసం.. మా నాయకత్వం చెప్పిన ఫార్ములాకి అంగీకరిస్తున్నా’అని డీకేశీ పేర్కొన్నారు. న్యూఢిల్లీ: గత నాలుగు రోజులుగా ఉత్కంఠ రేపుతున్న కర్ణాటక ముఖ్యమంత్రి పీఠంపై సస్పెన్స్ వీడినట్లే తెలుస్తోంది. కర్ణాటక ప్రభుత్వ ఏర్పాటుపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీలు ఏకాభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. ఊహించినట్టుగానే మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ నేత సిద్ధరామయ్య మరోసారి కర్ణాటక సీఎం పీఠాన్ని అధిరోహించబోతున్నారు. ఇక రేసులో నిలిచిన డీకే శివకుమార్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకోబోతున్నారు. దీనిపై కాంగ్రెస్ హైకమాండ్ నేడు అధికారిక ప్రకటన వెలువరించనుంది. అర్దరాత్రి వరకు సాగిన చర్చలు బుధవారం పలు నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. తొలుత చెరొక రెండున్నరేళ్లు సీఎం పదవిలో ఉంటారని, తరువాత సిద్ధరామయ్యే పూర్తి కాలం సీఎంగా ఉంటారని ప్రచారాలు సాగాయి. అయితే ఏఐసీసీ కర్ణాటక ఇంచార్జి రణ్‌దీప్ సుర్జేవాలాతోపాటు డీకే శివకుమార్ వీటిని ఖండించారు. తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని సూచించారు. ఢిల్లీలో గురువారం తెల్లవారు జామున వరకు కాంగ్రెస్ హైకమాండ్ తీవ్ర మంతనాలు జరిపింది. ముందు నుంచి ఢిల్లీలోనే ఉంటూ లాబియింగ్ చేసిన సిద్ధరామయ్య.. ఖర్గే, అనంతరం సోనియా గాంధీతో చర్చించారు. చదవండి: కర్ణాటక సీఎం పంచాయితీ...ఎందుకిలా..? ఢిల్లీకి వెళ్లడంతోనే ఈ చిక్కులు మెట్టుదిగిన డీకే! మరోవైపు డీకే శివకుమార్ కూడాఖర్గే, సోనియా, రాహుల్‌ను కలిశారు. అయితే అర్థరాత్రి జరిగిన చర్చలతో డీకే మెట్టు దిగినట్లు, రాజీ ఫార్ములాకు శివకుమార్ అంగీకరించినట్లు సమాచారం. మరోవైపు నేడు రాత్రి 7 గంటలకు కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. అనంతరం సిద్ధరామయ్య, డీకే శివకుమార్ గవర్నర్‌ను కలవనున్నారు. శనివారం ప్రమాణ స్వీకారం ఇక ఈనెల 20న మధ్యాహ్నం 12.30 గంటలకు సిద్ధరామయ్య సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. శనివారం బెంగళూరు కంఠీరవ స్టేడియంలో కాంగ్రెస్ అధిష్టానం సమక్షంలో ఈ ప్రమాణస్వీకారం జరగనుంది. పలు రాష్ట్రాల సీఎంలు సైతం హాజరుకానున్నారు. ఈ కార్యక్రమానికి అగ్రనేతలను ఆహ్వానించడం ద్వారా ప్రతిపక్షాల ఐక్యతను చాటాలని కాంగ్రెస్ యోచిస్తోంది. చదవండి: ‘చేతి’కి అధికారం ఇచ్చాక? సీఎం సీటు షేరింగ్.. ఓ ఫ్లాప్ ఫార్ములా..! -
కర్ణాటక సీఎం పీఠంపై వీడిన సస్పెన్స్
-
తేజస్వీ యాదవ్‌కు పుత్రికోత్సాహం!
కేంద్ర మాజీ మంత్రి, బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలు యాదవ్ తనయుడు తేజస్వీ యాదవ్‌కు పండంటి ఆడబిడ్డ జన్మించింది. ఈ మేరకు బిహార్ డిప్యూటీ ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ తన నవజాత బిడ్డతో దిగిన ఫోటోను ట్విట్టర్లో పంచుకున్నారు. ఇది తనకు దేవుడు పంపిన గిఫ్ట్ అని అన్నారు. కుమార్తె రూపంలో దేవుడి పంపించిన బహుమతిగా అభివర్ణించారు. తేజస్వీ యాదవ్ రాచెల్ గోడిన్హోను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ జంటకు ఇది తొలి సంతానం. ఈమేరకు తేజస్వీ యాదవ్ సోదరి రోహిణి ఆచార్య కూడా ట్విట్టర్ వేదికగా ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇప్పుడూ మా ఇల్లు ఆనందకరమైన కీచులాటతో ధ్వనిస్తుంది. దేవుడు అలాంటి ఆనందాన్ని మాకు బహుమతిగా ఇచ్చాడు అని రోహిణి ట్వీట్ చేశారు. (చదవండి: రాహుల్ గాంధీ అంశం: కాంగ్రెస్ వాయిదా తీర్మానం.. ఖర్గే ఆదేశిస్తే రాజీనామాకు సిద్ధమన్న కోమటిరెడ్డి) -
మన దేశానికి ఇద్దరు పితామహులు: డిప్యూటీ సీఎం భార్య కీలక వ్యాఖ్యలు
నాగ్‌పూర్: మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ భార్య అమృతా ఫడ్నవిస్ ప్రధాని నరేంద్ర మోదీని రాష్ట్ర పితామహులుగా అభివర్ణించారు. మన దేశానికి ఇద్దరు పితామహులు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ కాలానికి జాతి పితా మహాత్మా గాంధీ అయితే నేటీ సరికొత్త భారతావనికి పితామహులు నరేంద్ర మోదీ అంటూ ప్రధానిపై పొగడ్తలు జల్లు కురిపించారు అమృతా ఫడ్నవిస్. ఈ మేరకు అమృతా ఫడ్నవిస్ నాగ్‌పూర్ రచయితల సంఘం నిర్వహించిన కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె నరేంద్ర మోదీని రాష్ట్ర పితాగా వ్యవహరించారు. దీంతో మరి మహాత్మా గాంధీ ఏమవుతారంటూ విలేకరులు ప్రశ్నించారు. దీంతో ఆమె సమర్థించుకుంటూ ఆ కాలంలో మహాత్మా గాంధీ జాతి పితా, ప్రస్తుతం నరేంద్ర మోదీ అంటూ కవర్ చేశారు. ఆమె ఇలా మోదీని పొగడ్తలతో ముంచెత్తడం మొదటి సారి కాదు. 2019లో ప్రధానికి పంపిన ట్విట్టర్ సందేశంలో కూడా మన దేశ పితామహుడు నరేంద్ర మోదీజీకి జన్మదిన శుభాకాంక్షలు. సమాజ అభ్యున్నతి కోసం అవిశ్రాంతంగా పనిచేయడంలో మాకు స్ఫూర్తి మీరే అని పోస్ట్ చేశారు. ఆమె తరుచు ఇలా సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతూ వార్తలో నిలుస్తుంటారు. అంతకు మునుపు ఉద్ధవ్ థాక్రేపై విరుచుపడి వార్తల్లో నిలిచారు. కాగా, శివసేన తిరుగుబాటు నాయకుడు ఏక్నాథ్ షిండే సీఎం కాగానే ఆమె భర్త దేవేంద్ర ఫడ్నవిస్ డిప్యూటీ ముఖ్యమంత్రి అయ్యిన సంగతి తెలిసిందే. (చదవండి: ముంబైలో దారుణం..అందరూ చూస్తుండగా కత్తితో దాడి చేసి..) -
Delhi Liquor Scam: బీజేపీలో చేరితే కేసులు ఎత్తేస్తామన్నారు
న్యూఢిల్లీ/అహ్మదాబాద్: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణంలో అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీని వీడి, బీజేపీలో చేరితే తనపై కేసులన్నీ ఎత్తివేయడంతోపాటు ఢిల్లీ ముఖ్యమంత్రి పదవి కట్టబెడతామంటూ ఆఫర్ ఇచ్చారని చెప్పారు. సీబీఐ, ఈడీ నమోదు చేసిన కేసుల నుంచి విముక్తి కల్పిస్తామంటూ బీజేపీ నుంచే ఈ సందేశం వచ్చిందని పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం ట్వీట్ చేశారు. అనంతరం గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం ఆయన కేజ్రీవాల్‌తో కలిసి గుజరాత్‌కు వచ్చారు. ‘‘బీజేపీకి నేను ఇచ్చే సమాధానం ఇదే. నేను మహారాణా ప్రతాప్ వారసుడిని. రాజ్‌పుత్‌ను. తల నరుక్కోవడానికైనా సిద్ధమే గానీ, కుట్రదారుల ఎదుట, అవినీతిపరుల ఎదుట తలవంచే ప్రసక్తే లేదు. నాపై పెట్టినవన్నీ తప్పుడు కేసులే. మీకు చేతనైంది చేసుకోండి’’ అని ట్విట్టర్లో తేల్చిచెప్పారు. బీజేపీ ఇచ్చిన రెండు ఆఫర్లతో తన వద్దకు వచ్చిన వ్యక్తిని చూసి ఆశ్చర్యానికి గురయ్యానని మీడియాతో చెప్పారు. నాయకులను బీజేపీలో చేర్పించడమే ఆ వ్యక్తి పని అన్నారు. ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తనకు రాజకీయ గురువు అని, ఆయన వద్దనే రాజకీయాల్లో ఓనమాలు నేర్చుకున్నానని, ముఖ్యమంత్రో, ప్రధానమంత్రో కావడానికి రాజకీయాల్లోకి రాలేదంటూ అతడికి తేల్చిచెప్పానని సిసోడియా వెల్లడించారు. తాను నిజాయితీ పరుడినని, కేసులతో భయపెట్టలేరని తేల్చిచెప్పారు. దేశంలో ప్రతి చిన్నారికి నాణ్యమైన విద్యనందించాలన్నదే తన కల అని, అందుకోసం కృషి చేస్తూనే ఉంటానని పేర్కొన్నారు. అయితే, తనకు ఆఫర్ ఇచ్చిన వ్యక్తి ఎవరన్నది సిసోడియా బహిర్గతం చేయలేదు. కాగా, బీజేపీ ఆఫర్‌కు సంబంధించి తమ వద్ద ఆడియో టేపులున్నాయని, సమయం వచ్చినప్పుడు వాటిని బయటపెడతామని పార్టీలోని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. సిసోడియా భారతరత్నకు అర్హుడు: కేజ్రీవాల్ విద్యాశాఖ మంత్రిగా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రమాణాలను మెరుగుపర్చిన మనీశ్ సిసోడియా భారతరత్న పురస్కారానికి అర్హుడని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పష్టంచేశారు. కానీ, కేంద్ర ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కోసం ఆయనను వెంటాడుతోందని ఆక్షేపించారు. సన్మానించాల్సింది పోయి వేధింపులకు గురిచేయడం ఏమిటని నిలదీశారు. కేజ్రీవాల్ సోమవారం అహ్మదాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. ఢిల్లీ విద్యా విధానాన్ని న్యూయార్క్ టైమ్స్ ప్రతిక ప్రశంసించిందని గుర్తుచేశారు. ఐదేళ్లలో అద్భుతాలు చేసిన వ్యక్తిపై సీబీఐ దాడులు చేయడం మీకు సిగ్గనిపించడం లేదా? అని కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 70 ఏళ్లలో ప్రభుత్వాలు చేయని అద్భుతాలను సిసోడియా చేశారని, ఆయనకు భారతరత్న దక్కాలని ఉద్ఘాటించారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సిసోడియాతోపాటు తనను కూడా అరెస్టు చేస్తారేమోనని అనుమానం వ్యక్తం చేశారు. గుజరాత్లో 27 ఏళ్ల బీజేపీ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని ఆరోపించారు. రాష్ట్రంలో ఆమ్ ఆద్మీ పార్టీని గెలిపిస్తే నాణ్యమైన విద్య, వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు. ఆప్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రలు ఢిల్లీలో తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రలు జరుగుతున్నాని సీఎం కేజ్రీవాల్ ఆరోపించారు. ఇతర రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చినట్లుగానే తమ ప్రభుత్వాన్ని సైతం పడగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. అందులో భాగంగా సీబీఐ, ఈడీతో సోదాలు చేయించారని విమర్శించారు. నిజానికి లిక్కర్ పాలసీకి, సీబీఐ–ఈడీ సోదాలకు సంబంధం లేదన్నారు. ‘ఆపరేషన్ కమలం’ విఫలమైందని ట్విట్టర్లో కేజ్రీవాల్ స్పష్టం చేశారు. దమ్ముంటే పేరు బయటపెట్టండి: బీజేపీ మనీశ్ సిసోడియా ఆరోపణలను బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ ఖండించారు. బీజేపీ తరఫున ఆఫర్ ఇచ్చిన వ్యక్తుల పేర్లను దమ్ముంటే బయటపెట్టాలని సిసోడియాకు సవాలు విసిరారు. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా స్పందిస్తూ.. సిసోడియా మతిభ్రమించి మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. లిక్కర్ పాలసీ వ్యవహారంలో అవినీతి ఆరోపణల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి ఆప్ నేతలు డ్రామాలు అడుతున్నారని మండిపడ్డారు. ఆరోపణలకు సమాధానం చెప్పలేక ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ దూరంగా పారిపోతున్నారని ఎద్దేవా చేశారు. మీరు నిజంగా నిజాయితీపరులైతే 24 గంటల్లోగా స్పందించండి అని కేజ్రీవాల్‌కు సూచించారు. కేజ్రీవాల్ నివాసం వద్ద బీజేపీ ధర్నా ఢిల్లీలో సీఎం కేజ్రీవాల్ నివాసం వద్ద బీజేపీ కార్యకర్తలు ధర్నా చేపట్టారు. ఎక్సైజ్ పాలసీని వ్యతిరేకిస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు ఆదేశ్ గుప్తా ప్రసంగించారు. సీబీఐ నమోదు చేసిన కేసులో మొదటి నిందితుడైన డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను తక్షణమే మంత్రివర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ప్రజల సొమ్మును దోచుకొనేందుకు లిక్కర్ మాఫియాకు అనుమతులు ఇచ్చారన్నారు. -
అనుమానాస్పద బోటుపై మహారాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన
సాక్షి, ముంబై: రాయ్‌గఢ్ జిల్లాలోని హరిహరేశ్వర్ బీచ్‌కు కొట్టుకొచ్చిన అనుమానాస్పద బోటుపై మహారాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు డిప్యూటీ సీఎం గురువారం అసెంబ్లీలో మాట్లాడుతూ.. బోటు వ్యవహారంలో ఉగ్రవాద కోణం లేదని చెప్పారు. ప్రస్తుతానికి భయపడాల్సిన అవసరం లేదన్నారు. అయితే పడవలో మందుగుండు సామాగ్రీ ఎందుకు ఉన్నాయో ఇప్పుడే చెప్పలేమన్న డిప్యూటీ సీఎం.. దీనిపై సమగ్ర దర్యాప్తు జరగుతోందన్నారు. ప్రాథమిక సమాచారం మేరకు.. కొట్టుకొచ్చిన బోటు ఆస్రేలియాకు చెందిన హాన్ అనే మహిళదని తెలిపారు. తన భర్త జేమ్స్ హర్బర్ట్‌తో కలిసి మస్కట్ మీదుగా యూరప్ వెళ్తుండగా పడవ ప్రమాదానికి గురైనట్లు తెలిపారు. జూన్ 26న ఇంజిన్ ఫెయిల్ అవ్వడం వల్ల బోటు ప్రమాదానికి లోనైందన్నారు. బోట్లో ఉన్న వారిని కొరియా షిప్ రక్షించిందని పేర్కొన్నారు. చదవండి: రాయ్‌గఢ్‌లో బోటు కలకలం.. మూడు ఏకే 47.. ఇంకా అయితే ధ్వంసమైన పడవ మాత్రం సముద్ర జలాల్లో కలిసిపోయి అలలకు రాయ్‌గఢ్ తీరానికి కొట్టుకు వచ్చిందన్నారు. అయినప్పటికీ ఫెస్టివల్ సీజన్ కావడంతో ఈ ప్రమాదంపై ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించినట్లు వెల్లడించారు.ప్రస్తుతం స్థానిక పోలీసులు, యాంటీ టెర్రర్ స్క్వాడ్లు కేసు దర్యాప్తు చేస్తున్నారని వెల్లడించారు. ప్రజలు జరుపుకునే దహీ హండీ, వినాయకచవితి పండుగలకు పటిష్ట భద్రత కల్పిస్తామని పేర్కొన్నారు. కాగా మహారాష్ట్రలోని రాయగఢ్ జిల్లా హరిహరేశ్వర తీరం వద్దకు గురువారం ఓ అనుమానాస్పద బోటు కొట్టుకు వచ్చిన విషయం తెలిసిందే. బోటులో మూడు ఏకే 47 రైఫిళ్లు, తూటాలు, మరికొన్ని ఆయుధాలు ఉన్నాయి. దీంతో ఉగ్రవాదుల కట్రమోనని భావించిన అధికారులు, పోలీసులు రాయ్‌గఢ్ వ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించారు. -
బీజేపీ సంబరాలకు ఫడ్నవీస్ దూరం
ముంబై: మహారాష్ట్ర సీఎం అవుతారని అంతా భావించగా బీజేపీ అధిష్టానం అనూహ్య నిర్ణయంతో ఉప ముఖ్యమంత్రి పదవితో సరిపెట్టుకున్న దేవేంద్ర ఫడ్నవీస్ ఈ పరిణామంపై అసంతృప్తిగా ఉన్నారా? ఆయన వ్యవహార శైలి ఈ అనుమానాలను బలపరిచేలానే ఉందంటున్నారు. మహారాష్ట్రలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వచ్చినందుకు శుక్రవారం రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన సంబరాలకు ఆయన డుమ్మా కొట్టారు. హైదరాబాద్‌లో జరుగుతున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు కూడా హాజరు కాబోరని సమాచారం. ఆదివారం నుంచి జరిగే రెండు రోజుల అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలకు సంబంధించిన చర్చల్లో ఫడ్నవీస్ బిజీగా ఉన్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. షిండే ప్రభుత్వానికి బయటి నుంచి మద్దతిస్తామని ఆయన గురువారం ప్రకటించడం, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా దాన్ని వెంటనే ఖండించడం తెలిసిందే. బీజేపీ కూడా ప్రభుత్వంలో చేరుతుందని, ఫడ్నవీస్ డిప్యూటీ సీఎం అవుతారని నడ్డా ప్రకటించారు. 2014 నుంచి 19 దాకా ఐదేళ్ల పాటు ఫడ్నవీస్ మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న విషయం తెలిసిందే. ఆ సమయంలో షిండే ఆయన కేబినెట్లో మంత్రిగా పని చేశారు. ఇప్పుడు షిండే మంత్రివర్గంలో ఫడ్నవీస్ డిప్యూటీ సీఎంగా చేరాల్సి వచ్చింది! మరోవైపు షిండే ప్రమాణస్వీకారం ముగుస్తూనే ఎన్సీపీ నేత ధనంజయ్ ముండేతో ఫడ్నవీస్ భేటీ అయినట్టు చెబుతున్నారు. అయితే ఫడ్నవీస్ డిప్యూటీ అవడం అనూహ్యమేమీ కాదని మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రకాంత్ పాటిల్ చెప్పుకొచ్చారు. ‘‘ఇది చాలా మందికి షాకిచ్చిందని నాకు తెలుసు. కానీ ఇందులో అనూహ్యమేమీ లేదు. హిందూత్వ భావజాలాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు షిండేకు సీఎం పోస్టు ఇవ్వాలని బీజేపీ నిర్ణయించింది. కానీ షిండే స్వయంగా ఫడ్నవీస్‌ను తన మంత్రివర్గంలో చేరాల్సిందిగా కోరారు. దాంతో ఢిల్లీ పెద్దల అనుమతితో ఆయన చేరారు’’ అని చెప్పారు. మనకింద పని చేసిన వ్యక్తి సారథ్యంలో పని చేయాలంటే ఎంతో పెద్ద మనసుండాలన్నారు. -
నీట మునిగిన డిప్యూటీ సీఎం నివాసం; వీడియో వైరల్
పట్నా: బిహార్ రాజధాని పట్నాలో శుక్రవారం కురిసిన భారీ వర్షానికి ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి రేణుదేవి నివాసం నీటమునిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భారీ వర్షం దాటికి ఆమె నివాసం ఎదుట ఒకటిన్నర అడుగుమేర నీరు నిలిచిపోయింది. శుక్రవారం రాత్రి కొద్ది గంటల్లోనే కురిసిన జడివానకు 145 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో పెద్ద ఎత్తున రోడ్లు నీట ముగగా.. కాలువలు పొంగి పొర్లాయి. ప్రస్తుత సీజన్లో వర్షాలు భారీగా పడడం సాధారణమేనని వాతావరణ కేంద్ర శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో రుతుపవనాల ప్రభావం భారీగా ఉందని తెలిపారు. రాబోయే 24 గంటల్లో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాస్త్రవేత్తలు చెప్పారు. వాతావరణ శాఖ శనివారం ఎల్లో, ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. చదవండి: 15 ఏళ్ల క్రితం తప్పించుకున్నాడు.. తాజాగా అరెస్ట్ నర్సు నిర్వాకం, ఖాళీ సిరంజితోనే వ్యాక్సిన్.. వీడియో వైరల్ #WATCH | Water accumulates outside Bihar's Deputy Chief Minister Renu Devi's residence in Patna due to rain pic.twitter.com/P1cy4g7ivO — ANI (@ANI) June 26, 2021 -
బిహార్ డిప్యూటీ సీఎంగా మహిళకు చాన్స్!
పట్నా: బిహార్ మంత్రి మండలిలో ఏ పార్టీకి అధిక ప్రాధాన్యం, ఎవరెవరికి అవకాశం దక్కనుందనే ఉత్కంఠకు మరికొన్ని గంటల్లో తెరపడనుంది. సోమవారం సాయంత్రం 4.30 గంటలకు జేడీయూ అధినేత నితీశ్ కుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతోపాటు మరో 12 మంది మంత్రులుగా ప్రమాణం స్వీకారం చేయనున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. 73 స్థానాలు గెలుపొందిన బీజేపీకి మంత్రి మండలిలో అధిక ప్రాధాన్యం ఉండనుంది. బీజేపీ నేతలు తారా కిశోర్ ప్రసాద్, రేణు దేవికి ఉప ముఖ్యమంత్రి పదవులు దక్కనున్నాయి. బీజేపీ లెజిస్లేటివ్ నేతగా తారా కిశోర్ ప్రసాద్, ఉప నేతగా రేణు దేవి ఎన్నికవడం ఈ వార్తలకు బలం చేకూరుస్తోంది. బీజేపీ నేత నంద కిశోర్ స్పీకర్‌గా ప్రమాణం చేయనున్నారు. జేడీయూ నుంచి విజయ్ చౌదరి మరోమారు మంత్రి పదవి చేపట్టనున్నారు. హెచ్ఏఎం పార్టీ నుంచి సంతోష్ సుమన్, వీఐపీ పార్టీ నుంచి ముఖేశ్ సాహ్ని మంత్రులుగా ప్రమాణం చేస్తారని సమాచారం. జేడీయూ నేత విజేంద్ర యాదవ్, జేడీయూ బిహార్ ప్రెసిడెంట్ అశోక్ చౌదరి, తారాపూర్ ఎమ్మెల్యే మేవాలాల్ చౌదరి, ఫూల్పూర్ ఎమ్మెల్యే షీలా కుమారి మంత్రులుగా ప్రమాణం చేయనున్నట్టు తెలిసింది. ఇక ప్రస్తుత నితీశ్ కేబినెట్లో డిప్యూటీ సీఎం సుశీల్ మోదీకి ఈసారి మొండిచేయి ఎదురవనుంది. అయితే, ఆయనకు కేంద్రంలో పదవీ బాధ్యతలు ఇస్తారని తెలిసింది. ఇక 243 అసెంబ్లీ స్థానాలున్న బిహార్‌లో ఎన్డీఏ కూటమి 125 స్థానాల్లో గెలుపొందిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో మేజిక్ ఫిగర్ 122 సీట్లు. ఆర్జేడీ-కాంగ్రెస్-లెఫ్ పార్టీల మహాగఠ్ బంధన్ 110 స్థానాలు మాత్రమే సాధించింది. బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, హోమంత్రి అమిత్ షా నితీశ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరుకానున్నారు. -
చంద్రబాబు రాజకీయాల నుంచి తప్పుకోవాలి
సాక్షి, కడప : చంద్రబాబునాయుడుకు వయసు మీద పడిందని, ఆయన రాజకీయాల నుంచి వైదొలగడమే ఉత్తమమని ఏపీ ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా పేర్కొన్నారు. ఆయన కుమారుడు నారా లోకేశ్ చేష్టలను భరించలేకనే టీడీపీకి చెందిన రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరారని ఆరోపించారు. ముఖ్యమంత్రిగా ఐదేళ్లలో చంద్రబాబు ఎన్నో అవినీతి పనులకు పాల్పడ్డారని, తొందర్లోనే ఆయన జైలుకు వెళ్లడం ఖాయమని స్పష్టం చేశారు. అందుకే ముందు జాగ్రత్తగా తన అవినీతిలో భాగస్వామ్యులుగా ఉన్న ఎంపీలను బీజేపీలో చేర్పించారనేది జగమెరిగిన సత్యమని ఎద్దేవా చేశారు. కాగా టీడీపీ రాజ్యసభ సభ్యులైన సుజనాచౌదరి, సీఎం రమేశ్,టీజీ వెంకటేశ్‌లు నిన్న ఉపరాష్ట్రపతిని కలిసి తమను బీజేపీలో విలీనం చేయాలని కోరిన సంగతి తెలిసిందే. -
ఆళ్ల నాని ఔదార్యం
సాక్షి, ఏలూరు: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని మానవత్వం చాటుకున్నారు. రోడ్డు ప్రమాద బాధితులకు సాయం అందించి నిజమైన ప్రజాసేవకుడిగా నిలిచారు. విజయవాడ జాతీయ రహదారిలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో ముగ్గురు గాయాలపాలయ్యారు. అదే రహదారిలో వెళుతున్న వైద్యశాఖ మంత్రి ఈ ఘటనను చూసి వెంటనే స్పందించి తన కాన్వాయ్‌లో క్షతగాత్రులను విజయవాడ ఆస్పత్రికి పంపించారు. ఏలూరు నుండి అమరావతిలోని అసెంబ్లీకి వెళుతున్న ఆళ్ల నాని విజయవాడ దాటుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. క్షతగాత్రులు బాధపడుతున్న దృశ్యాన్ని చూసిన ఆయన వెంటనే కారును ఆపి బాధితులను ఆసుపత్రికి తరలించారు. ముగ్గురిలో ఇద్దరికి ప్రాథమికి చికిత్స అనంతరం డాక్టర్లు పంపించివేశారు. మరొక క్షతగాత్రుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడికి మంత్రి ఆళ్ళ నాని 10 వేల రూపాయలు ఆర్థిక సహాయం చేసి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. గాయపడిన వ్యక్తి గుంటూరు సమీపంలోని వెంకటాయపాలెంకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఔదార్యం చూపిన ఉప ముఖ్యమంత్రిపై సర్వత్రా అభినందనలు కురుస్తున్నాయి.