
కేంద్ర మాజీ మంత్రి, బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలు యాదవ్ తనయుడు తేజస్వీ యాదవ్‌కు పండంటి ఆడబిడ్డ జన్మించింది. ఈ మేరకు బిహార్ డిప్యూటీ ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ తన నవజాత బిడ్డతో దిగిన ఫోటోను ట్విట్టర్‌లో పంచుకున్నారు. ఇది తనకు దేవుడు పంపిన గిఫ్ట్ అని అన్నారు. కుమార్తె రూపంలో దేవుడి పంపించిన బహుమతిగా అభివర్ణించారు. తేజస్వీ యాదవ్ రాచెల్ గోడిన్హోను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.
ఈ జంటకు ఇది తొలి సంతానం. ఈమేరకు తేజస్వీ యాదవ్ సోదరి రోహిణి ఆచార్య కూడా ట్విట్టర్ వేదికగా ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇప్పుడూ మా ఇల్లు ఆనందకరమైన కీచులాటతో ధ్వనిస్తుంది. దేవుడు అలాంటి ఆనందాన్ని మాకు బహుమతిగా ఇచ్చాడు అని రోహిణి ట్వీట్ చేశారు.
(చదవండి: రాహుల్ గాంధీ అంశం: కాంగ్రెస్ వాయిదా తీర్మానం.. ఖర్గే ఆదేశిస్తే రాజీనామాకు సిద్ధమన్న కోమటిరెడ్డి)
Comments
Please login to add a commentAdd a comment