నేను.. డిప్యూటీ సీఎం పీఏని...
పెద్దాపురం :రాష్ట్ర డిప్యూటీ సీఎం, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప పీఏనంటూ డెరైక్టర్‌గా డీఎస్పీకే మస్కా కొట్టిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి, కటకటాల వెనక్కి పంపారు. స్థానిక పోలీసు స్టేషన్‌లో సోమవారం మధ్యాహ్నం డీఎస్పీ ఓలేటి అరవిందబాబు ఆ నిందితుడిని విలేకరుల ముందు హాజరుపరిచారు. డీఎస్పీ కథనం ప్రకారం... గత నెల 27న డిప్యూటీ సీఎం పీఏని మాట్లాడుతున్నానంటూ ఓ వ్యక్తి పెద్దాపురం డీఎస్పీ సెల్‌కు ఫోన్ చేశాడు. ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసు విషయంలో డిప్యూటీ సీఎం ఫలానా వ్యక్తికి న్యాయం చేయాలని సెల్ : 9440156511 నుంచి కాల్ వచ్చింది.
దీనిపై అనుమానం వచ్చిన డీఎస్పీ పెద్దాపురం పోలీసులను విచారణ జరపాలని అదే రోజు ఆదేశించారు. దీంతో సీఐ నాగేశ్వరరావు పర్యవేక్షణలో ఎస్సై శివకృష్ణ కేసు విచారణ చేపట్టారు. పెద్దాపురం పట్టణానికి చెందిన చిట్టూరి రాజేంద్రప్రసాద్ అనే వ్యక్తి నుంచి ఈ ఫోన్‌కాల్ వచ్చినట్టు నిర్ధారించుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించారు. చిట్టూరి రాజేంద్రప్రసాద్ స్వగ్రామం ప్రత్తిపాడు కాగా, రెండేళ్ల నుంచి పెద్దాపురంలో ఉంటున్నాడన్నారు. నిందితుడుని కోర్టులో హాజరుపరుస్తున్నట్టు ఆయన తెలిపారు. ఇలాంటి తప్పుడు ఫోన్‌కాల్స్ చేస్తూ బెదిరింపులకు దిగుతున్నవారిపై నిఘా ఉంచినట్టు ఆయన తెలిపారు.