రామలింగేశ్వర స్వామి సేవలో చినరాజప్ప
తూర్పుగోదావరి : తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేట మండలం పుల్లేటికొర్రు గ్రామంలోని శ్రీ చౌడేశ్వరి సమేత రామలింగేశ్వరస్వామి ఆలయంలో త్రికతు హోమాలు, పూజలు ఘనంగా జరుగుతున్నాయి. ఆదివారం ఉదయం ఏపీ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప వీటిలో పాల్గొని స్వామివారిని సేవించుకున్నారు. అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికి ఆశీర్వదించారు. ఆలయంలో శనివారం ప్రారంభమైన విశేష పూజలు సోమవారం వరకు జరగనున్నాయి.
(అంబాజీపేట)