
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తనయుడు, యువజన సంక్షేమ శాఖ మంత్రి ఉదయనిధి స్టాలిన్ ఉప ముఖ్యమంత్రిగా పదోన్నతి పొందనున్నారనే ఊహాగానాలు వెల్లువెత్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ విషయంపై ఆయన శనివారం స్పందించారు. డీఎంకే ఒక కుటుంబమని.. తమ ప్రభుత్వంలోని మంత్రులంతా డిప్యూటీ సీఎంలేనని పేర్కొన్నారు. గతంలో కూడా తాను ఇదే చెప్పానని తెలిపారు.
‘డీఎంకేలోని మంత్రులందరూ మా ముఖ్యమంత్రికి డిప్యూటీలు. నాకు ఏ పెద్ద పదవి లేదా బాధ్యత ఇచ్చినా.. నా మనసుకు దగ్గరయ్యేది డీఎంకే యువజన విభాగం కార్యదర్శి పదవే. నాకు ఏ పదవి వచ్చినా డీఎంకే యువజన విభాగం ఎప్పటికీ మర్చిపోలేను. నాకు డిప్యూటీ సీఎం పదవిపై అనేక వార్తలు వచ్చాయి. అది ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది’ అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment