Udhayanidhi Stalin
-
మరోసారి మతపరమైన వ్యాఖ్యలు చేసిన ఉదయనిధి స్టాలిన్
సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ గతేడాది వివాదాస్పద వ్యాఖ్యలు చేసి పోలీసు కేసులు ఎదుర్కొన్న తమిళనాడు ఉప ముఖ్యమంత్రి, డీఎంకే పార్టీ యువనేత ఉదయనిధి స్టాలిన్ మరోసారి మతపరమైన వ్యాఖ్యలు చేశారు. చెన్నైలో గురువారం జరిగిన క్రిస్మస్ కార్యక్రమంలో ఉదయనిధి మాట్లాడుతూ.. తనను తాను గర్వించదగిన క్రైస్తవుడిగా ప్రకటించుకున్నారు. తనకు అన్ని మతాలు సమానమని, మత సామరస్యానికి కట్టుబడి ఉన్నామని పునరుద్ఘాటించారు. మతం పేరుతో విభజించేవారిని, విద్వేషాన్ని చిమ్మేవారికి తాను వ్యతిరేకమని స్పష్టం చేశారు. నాకు అన్ని మతాలు సమానం‘గత ఏడాది క్రిస్మస్ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు నేను క్రిస్టియన్‌నని సగర్వంగా చెప్పాను. ఇది పలువురు సంఘీలకు చిరాకు తెప్పించింది. ఈ రోజు మళ్లీ చెబుతున్నా. నేను గర్వించదగిన క్రైస్తవుడిని. నేను క్రిస్టియన్ని అని మీరు అనుకుంటే, క్రిస్టియన్ని. ముస్లింనని మీరు అనుకుంటే, ముస్లింను. హిందువు అనుకుంటే, నేను హిందువును. నాకు అన్ని మతాలు సమానం. అన్ని మతాలు మనకు ప్రేమను చూపించడమే నేర్పుతాయి’అని నొక్కి చెప్పారు.బీజేపీ–అన్నాడీఎంకే మధ్య రహస్య పొత్తుమతాన్ని రాజకీయ లబ్ది కోసం వాడుకునే వారు విద్వేషాలు, విభజనను వ్యాప్తి చేస్తున్నారని ఉపముఖ్యమంత్రి ఆరోపించారు. ‘ఇటీవల అలహాబాద్‌కు చెందిన ఓ న్యాయమూర్తి ఒక మతాన్ని కించపరిచేలా మాట్లాడటం చూశాం. ఆయన ముస్లింలపై విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారు. అలాంటి వ్యక్తి న్యాయమూర్తి పదవిలో ఉంటే ఆయన కోర్టులో న్యాయం ఎలా ఆశిస్తాం?’ అని ప్రశ్నించారు. ఆయనను తొలగించడానికి లోక్‌సభలో ప్రవేశపెట్టిన తీర్మానానికి కాంగ్రెస్, డీఎంకే ఎంపీలు సంతకాలు చేసినా, అన్నాడీఎంకే ఎంపీలు మాత్రం సంతకాలు చేయలేదన్నారు. ‘‘బీజేపీకి బానిసలుగా కొనసాగుతున్నారు కాబట్టే.. రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరించిన న్యాయమూర్తిని తొలగించాలని కోరుతూ చేసిన తీర్మానానికి అన్నాడీఎంకే మద్ధతివ్వలేదు’’ అని అన్నాడీఎంకేను విమర్శించారు.చదవండి: మీరూ ఏదో ఒకరోజు సీఎం అవుతారుబీజేపీ–అన్నాడీఎంకే మధ్య రహస్య పొత్తు కొనసాగుతోందని, రాజ్యాంగ విలువల కంటే రాజకీయ విధేయతకే అన్నాడీఎంకే ప్రాధాన్యమిస్తోందని ఆయన ఆరోపించారు. కాగా, సనాతన ధర్మంపై గతేడాది ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా పెద్ద దుమారాన్నే రేపాయి. ఆయనపై చాలా చోట్ల పోలీసు కేసులు నమోదయ్యాయి. -
మరికొన్ని గంటల్లో డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్!
చెన్నై: తమిళనాడు డిప్యూటీ సీఎంగా మంత్రి ఉదయనిధి స్టాలిన్ పగ్గాలు అందుకోనున్నట్లు అధికార డీఎంకేలో ఎప్పటి నుంచో వార్తలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్.. తన తనయుడికి డిప్యూటీ సీఎం పదవి కట్టబెట్టనున్నారని కొంతకాలంగా జోరుగా ప్రచారం జరుగోతంది.ఈ క్రమంలోనే డిప్యూటీ సీఎంగా ఉదయనిధి ఖరారు అయినట్లు తెలుస్తోంది. కేవలం మరికొన్నిగంటల్లో ఆయన డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాల సమాచారం. అధికారిక ప్రకటన వెలువడగానే.. ఉదయనిధి కొత్త పగ్గాలు చేపట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై 24 గంటల్లో స్పష్టత రానుంది.చదవండి: Kolkata: వెనక్కి తగ్గని వైద్యులు.. ఆగని నిరసనలుకాగా ఉదయనిధి ప్రస్తుతం డీఎంకే కేబినెట్లో క్రీడా, యువజన సంక్షేమ శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. అదేవిధంగా చెన్నై మెట్రో రైలు ఫేజ్-2 వంటి ప్రత్యేక కార్యక్రమాల అమలుకు సంబంధించిన కీలక శాఖలను కూడా నిర్వహిస్తున్నారు.మరోవైపు డిప్యూటీ వార్తలను ఉదయనిధి ఇప్పటికే కొట్టి పారేసిన విషయం తెలిసిందే. మీడియాలో వస్తున్న వార్తలు వట్టి పుకార్లేనని, ముఖ్యమంత్రి మాత్రమే దానిపై నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు. ఇక ఈ వార్తలపై సీఎం ఎంకే స్టాలిన్ ఇటీవలే స్పందిస్తూ.. ఉదయనిధి డిప్యూటీ సీఎం అయ్యే టైమ్ ఇంకా రాలేదంటూ చెప్పుకొచ్చారు. అయితే 2026లో ఉదయనిధి స్టాలిన్ ముఖ్యమంత్రి అవుతారని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. -
చిత్రపరిశ్రమలో మీ జోక్యం ఎందుకు అంటూ విశాల్ ఫైర్
కోలీవుడ్ హీరో విశాల్ తమిళనాడు ప్రభుత్వంపై విమర్శలు చేశారు. సినిమా ఇండస్ట్రీలో ప్రభుత్వ జోక్యం ఎక్కువైందని ఆయన ఆరోపించారు. గత ప్రభుత్వం చిత్ర పరిశ్రమలో ఎలాంటి జోక్యం చేసుకోలేదని ఆయన గుర్తుచేశారు. ఈ క్రమంలో తన రత్నం సినిమా విడుదల సమయంలో జరిగిన సంఘటనను గుర్తు చేశారు.తమిళ చిత్రసీమలో రెడ్ జెయింట్ మూవీస్ ఆధిపత్యం గురించి బహిరంగంగానే విశాల్ మాట్లాడారు. ఆ సంస్థ అధినేత తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌పై కూడా విశాల్ విమర్శలు చేశారు. తను నటించిన రత్నం సినిమా విడుదలను కూడా అడ్డుకున్నారంటూ.. వారికి అలాంటి అధికారం ఎవరిచ్చారో చెప్పాలని ఆయన సూటిగా ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కడలూరులో ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వచ్చిన విశాల్ మీడియాతో సమావేశమై మాట్లాడారు. ఇక సినిమా రంగంపై డీఎంకే ప్రభుత్వం జోక్యం చేసుకుంటోందని సంచలన ఆరోపణ చేశాడు.ఆయన మాట్లాడుతూ.. 'తమిళ సినిమాకు ఈ ఏడాది చాలా కష్టం కాలంగా ఉంది. సినిమాలను కొనడానికి ఎవరూ ముందుకు రాకపోవడమే దీనికి కారణం. రాబోయే రోజుల్లో 10 పెద్ద సినిమాలు విడుదల కానున్నాయి. ఆ 10 సినిమాలు కూడా దీపావళి, దసరా, క్రిస్మస్ పండుగలను టార్గెట్ చేసుకుని విడుదలవుతున్నాయి. దీంతో చిన్న సినిమాలను కొనేవారు లేరు, విడుదల చేసేవారు లేరు. మంచి సినిమాలను ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. అయితే ఈ ఏడాది కమర్షియల్‌గా చిత్ర పరిశ్రమకు కష్టతరమైన సంవత్సరంగా మారనుంది. దీనికి ప్రధాన కారణం సినిమా పరిశ్రమలోకి ప్రభుత్వం చొచ్చుకు రావడమే.. ఇందులోకి ప్రభుత్వం ఎందుకు రావాలి..? గత ప్రభుత్వం ఇలాంటి పనులు చేయలేదు. అని విశాల్ తెలిపారు. తమిళనాడులో తాము షూటింగ్‌కి వెళ్లినప్పుడు తాగునీరు లేని గ్రామాలు ఎన్నో చూశామని విశాల్ అన్నారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పైగానే అవుతున్నా తాగునీరు లేని గ్రామాలు చూస్తున్నామంటే కాస్త విడ్డూరంగానే ఉందని ఆయన పేర్కొన్నారు. -
ఉదయనిధి స్టాలిన్‌కు డిప్యూటీ సీఎం పదవి.. మంత్రి రియాక్షన్ ఇదే!
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తనయుడు, యువజన సంక్షేమ శాఖ మంత్రి ఉదయనిధి స్టాలిన్ ఉప ముఖ్యమంత్రిగా పదోన్నతి పొందనున్నారనే ఊహాగానాలు వెల్లువెత్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ విషయంపై ఆయన శనివారం స్పందించారు. డీఎంకే ఒక కుటుంబమని.. తమ ప్రభుత్వంలోని మంత్రులంతా డిప్యూటీ సీఎంలేనని పేర్కొన్నారు. గతంలో కూడా తాను ఇదే చెప్పానని తెలిపారు.‘డీఎంకేలోని మంత్రులందరూ మా ముఖ్యమంత్రికి డిప్యూటీలు. నాకు ఏ పెద్ద పదవి లేదా బాధ్యత ఇచ్చినా.. నా మనసుకు దగ్గరయ్యేది డీఎంకే యువజన విభాగం కార్యదర్శి పదవే. నాకు ఏ పదవి వచ్చినా డీఎంకే యువజన విభాగం ఎప్పటికీ మర్చిపోలేను. నాకు డిప్యూటీ సీఎం పదవిపై అనేక వార్తలు వచ్చాయి. అది ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది’ అని పేర్కొన్నారు.