
'వచ్చే ఏడాది ముస్లిం, గిరిజనులకు 12శాతం రిజర్వేషన్లు'
రానున్న ఏడాదిలో ముస్లిం, గిరిజనులకు 12శాతం రిజర్వేషన్లు అమలు చేసేలా బిల్లును తీసుకోస్తామని ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ అన్నారు.
హన్మకొండ (వరంగల్ జిల్లా) : రానున్న ఏడాదిలో ముస్లిం, గిరిజనులకు 12శాతం రిజర్వేషన్లు అమలు చేసేలా బిల్లును తీసుకోస్తామని ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ అన్నారు. శనివారం వరంగల్ జిల్లా హన్మకొండలోని జాకరీయా ఫంక్షన్ హాల్‌లో జరిగిన ఈద్ మిలాప్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ఈవిధంగా వ్యాఖ్యానించారు.
మసీదుల్లో పని చేసే ఇమామ్‌లకు గౌరవ వేతనంగా రూ. 2వేల చెక్కులను ఇచ్చేందుకు మంత్రి వరంగల్ చేరుకున్నారు. కాగా మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం మృతికి సంతాప దినాల నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఇమామ్‌లు తమ బ్యాంకు ఖాతా నంబర్లును ఇస్తే ప్రతి నెలా నేరుగా వారి ఖాతాల్లోనే డబ్బులు జమ చేస్తామని చెప్పారు.