
జూనియర్ డాక్టర్లపై చర్యలు తప్పవు: రాజయ్య
గ్రామాల్లో వైద్య సేవలు అందించకపోతే జూనియర్ డాక్టర్లపై చర్యలు తప్పవని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి రాజయ్య చెప్పారు.
గ్రామాల్లో వైద్య సేవలు అందించకపోతే జూనియర్ డాక్టర్లపై చర్యలు తప్పవని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి రాజయ్య చెప్పారు. జీవో నెంబర్ 1022 ప్రకారం వాళ్లపై చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు.
తన కొడుకు, కూతురు ఇద్దరూ కూడా వైద్యులేనని, వాళ్లు గ్రామీణ ప్రాంతాలకు వెళ్లి వైద్య సేవలు అందిస్తారని రాజయ్య చెప్పారు. జూనియర్ డాక్టర్ల సమ్మె విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించక తప్పదని ఆయన అన్నారు.