సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వంతో జూడాల చర్చలు సఫలమయ్యాయి. మంత్రి దామోదర రాజనర్సింహ హామీతో జూడాలు సమ్మె విరమించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ, జూడాలతో తాను రెండు సార్లు చర్చించానని తెలిపారు. వైద్య శాఖలో సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామన్నారు. 8లో ఆరు డిమాండ్లకు మంత్రి సానుకూలత వ్యక్తం చేశారు.
కాగా, అంతకుముందు తెలంగాణ ప్రభుత్వం రెండు జీవోలను జారీ చేసింది. ఉస్మానియా, గాంధీ ఆసుపత్రుల జూడాల వసతిగృహాల నిర్మాణానికి జీవో విడుదల చేసింది. కాకతీయ వైద్య కళాశాలలో రహదారుల పునరుద్ధరణకు నిధులు విడుదల చేస్తూ జీవో జారీ చేసింది. ఉస్మానియా, గాంధీ ఆసుపత్రులతో పాటు కాకతీయ వర్సిటీకి రూ.204.85 కోట్లు కేటాయించింది. ఉస్మానియా వసతి భవనాలు, రోడ్లకు రూ.121.90 కోట్లు, గాంధీ ఆసుపత్రికి రూ.79.50 కోట్లు, కాకతీయ యూనివర్శిటీలో సీసీ రోడ్లకు రూ.2.75 కోట్లు మంజూరు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment