తొమ్మిది డిమాండ్లతో పాలనాధికారులకు వినతిపత్రం అందజేత
అన్ని ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో కొనసాగిన నిరసనలు
వైద్యసేవల్లో జాప్యంతో రోగుల ఇబ్బందులు
జూడాల ఆందోళనకు మంత్రి సీతక్క సంఘీభావం
గాంధీ ఆస్పత్రి: కోల్‌కతాలో విధి నిర్వహణలో ఉన్న వైద్యవిద్యార్థినిపై లైంగికదాడి, హత్యలకు నిరసనగా సికింద్రాబాద్ గాం«దీ ఆస్పత్రిలో జూనియర్ వైద్యులు నిరసన చేపట్టారు. బుధవారం అవుట్‌పేòÙంట్ విభాగ విధులను బహిష్కరించి, ఆస్పత్రి ప్రాంగణంలో ధర్నా, ర్యాలీ నిర్వహించారు.
దేశవ్యాప్తంగా వైద్యులు, వైద్య విద్యార్థులపై జరుగుతున్న దాడుల పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జూడాల సంఘం గాంధీ యూనిట్ అధ్యక్షుడు వంశీకృష్ణ మీడియాతో మాట్లాడుతూ ఇక్కడ పనిచేస్తున్న వైద్యులు, వైద్య విద్యార్థుల ప్రధానమైన 9 డి మాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరారు.
ఇవీ డిమాండ్లు
రెసిడెంట్, మహిళ, పురుష వైద్యులకు వేర్వేరు గా హైజెనిక్ డ్యూటీరూమ్‌లను ఏర్పాటు చే యాలని, డాక్టర్స్ గ్రీవెన్స్ రెడ్రెసెల్ కమిటీ ఏ ర్పాటు, వైద్యులు, వైద్యవిద్యార్థులు విధులు నిర్వహించే ప్రాంతాల్లో 24 గంటలూ సీసీ కెమె రాల పర్యవేక్షణ ఉండాలని, ఆస్పత్రి మెయిన్ ఎంట్రన్స్, అత్యవసర విభాగం, ఇతర ప్రదేశా ల్లో సెక్యూరిటీ గార్డులను నియమించి, పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలని, కళాశాల మైదానంలో అసాంఘిక కార్యకలాపాలను నిరోధించాలని, ఆస్పత్రి ప్రాంగణంలోని జయశంకర్ విగ్రహం నుంచి బాయ్స్ హస్టల్, ఇతర చీకటి ప్రదేశాల్లో వీధిదీపాలను ఏర్పాటు చేయాలని, ఆస్పత్రి ప్రాంగణంతోపాటు హాస్టల్స్ పరిసర ప్రాంతాల్లో వీధికుక్కలను నిరోధించాలని, పీజీ హాస్టల్‌కు సింగిల్ ఎంట్రీ, ఎగ్జిట్ వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి సెక్యూరిటీ వ్యవస్థను మరింత పటిష్టపర్చాలని కోరుతూ ఆస్పత్రి, మెడికల్ కాలేజీ పా లనాధికారులకు వి నతిపత్రం సమర్పించారు.
జూడాల ఓపీ విధుల బహిష్కరణ ఫలితంగా వైద్యసేవల్లో జాప్యంతో నిరుపేద రోగులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కాగా, అన్ని ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో బుధవారం ఈ నిరసన కార్యక్రమాలు కొనసాగాయి. గురు వారం కూడా విధులు బహిష్కరించి నిరసన కార్యక్రమాల్లో పాల్గొననున్నట్లు తెలంగాణ జూనియర్ డాక్టర్ల సంఘం ప్రధాన కార్యదర్శి ఐజాక్ న్యూటన్ తెలిపారు.
వైద్యులకు అండగా మేమున్నాం: మంత్రి సీతక్క
కోల్‌కతాలో వైద్యురాలిపై జరిగిన హత్యాచారం అత్యంత హేయమైన చర్య అని మంత్రి సీతక్క తీవ్రంగా ఖండించారు. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ రోగిని పరామర్శించిన అనంతరం అక్కడ ఆందోళన చేస్తున్న జూడాల వద్దకు వచ్చి సంఘీభావం ప్రకటించారు.
ఈ సందర్భంగా సీతక్క మీడియాతో మాట్లాడుతూ వైద్యులకు తాము అండగా ఉన్నామని భరోసా ఇచ్చారు. సీఎం రేవంత్‌రెడ్డితో మాట్లాడి, మహిళలపై దాడులు, లైంగిక వేధింపులు, హత్యాయత్నాలు జరగకుండా కఠినమైన చట్టాలను తేవడంతో పాటు ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలను రూపొందించి అమలు చేస్తామని హామీనిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment