sitakka
-
జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఉంటాయి: మంత్రి సీతక్క
-
కేటీఆర్ కు నీతి, నిజాయితీ ఉంటే చర్చకు రావాలి: మంత్రి సీతక్క
-
అప్పటి పనులపై విచారణ జరిపి బిల్లులు చెల్లిస్తాం
సాక్షి, హైదరాబాద్: మాజీ సర్పంచ్‌లు ఆందోళన చెందొద్దని..పెండింగ్ బిల్లులు క్లియర్ చేస్తామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క స్పష్టం చేశారు. అప్పుడు జరిగిన పనులపై విచారణ జరిపి బిల్లులు చెల్లిస్తామన్నారు. తమ ప్రభుత్వం వచ్చాక సర్పంచ్‌లతో బలవంతంగా పనులు చేయించలేదని, బిల్లులు ఆపలేదన్నారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రాలేదని, అయినా బిల్లుల చెల్లింపు ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. ‘మీ బిల్లుల ను ఆపిన మాజీ మంత్రులకు మీరు వంత పాడటం తగదు. వారి రాజకీయ కుట్రలకు మాజీ సర్పంచ్ లు బలి కావొద్దు’అని కోరారు. 15వ ఫైనాన్స్ కమిషన్ నిధులు ఇంకా రాలేదని, అలాంటప్పుడు వాటి ని దారి మళ్లించే ప్రశ్న ఉత్పన్నం కాదన్నారు. మాజీ సర్పంచ్‌లను బీఆర్ఎస్ రెచ్చగొడుతున్నదని సోమ వారం ఒక ప్రకటనలో ఆగ్ర హం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నాయకుల ట్రాప్‌లో పడొద్దని సూచించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సర్పంచ్ల ఆత్మహత్యలు, పెండింగ్ బిల్లులపై పత్రికల్లో వచ్చిన కొన్ని వార్తా కథనాలను ఆమె మీడి యాకు విడుదల చేశారు. ‘బీఆర్ఎస్ ప్రభుత్వం సర్పంచ్‌లకు బిల్లులు ఇవ్వకపోగా, వారితో బలవంతంగా పనులు చేయించింది. ఏళ్ల తరబడి బిల్లులు చెల్లించకుండా వారి ఆత్మహత్యలకు కారణమైంది’ అని ఆరోపించారు. మాజీ మంత్రి హరీశ్‌రావు ఇప్పుడు మాజీ సర్పంచ్‌లపై ప్రేమ ఉన్నట్టుగా సన్నాయి నొక్కులు నొక్కుతున్నారన్నారు. ఆర్థిక మంత్రిగా హరీశ్ ఉన్నప్పుడే తమ బిల్లులు పెండింగ్‌లో పెట్టారని మాజీ సర్పంచ్‌లకు స్పష్టంగా తెలుసని, తాము వచ్చాక రూ. 580 కోట్లు చెల్లించామన్నారు. కేసీఆర్, హరీశ్‌ల ఇళ్ల ఎదుట ధర్నా చేయండి ‘డ్రామాలు చేయడం.. ఆత్మహత్యలకు పురికొల్పడం హరీశ్‌రావుకు అలవాటు. నాడు సర్పంచ్ల ఆత్మహత్యలకు కారణమై...నేడు తిరిగి వారిని రెచ్చ గొట్టే ప్రయత్నం చేస్తున్నారు. కేవలం స్వార్థ రాజకీయాల కోసమే హరీశ్, బీఆర్ఎస్ మాజీ సర్పంచ్‌లను వాడుకుంటోంది. గతంలో సర్పంచ్ల ఆత్మహత్యలకు కేసీఆర్, హరీశ్‌రావు కారణం కాదా ? బిల్లులు పెండింగ్‌లో పెట్టిన వారి ఇళ్ల ముందు మాజీ సర్పంచులు ధర్నా చేయాలి’ అని సీతక్క అన్నారు. -
25న ఇందిరాపార్క్ ధర్నాను విరమించుకోండి
సాక్షి, హైదరాబాద్: బీజేపీ నేతలు ఈ నెల 25న ఇందిరాపార్కు వద్ద తలపె ట్టిన ధర్నాను విరమించుకోవాలని, గత పదేళ్లలో మూసీ ప్రక్షాళనకు, మూసీ ప్రాంత ప్రజల సంక్షేమం, ఉపాధికి నయా పైసా కేటాయించని కేంద్రం ఎదుట ధర్నా చేయాలని మంత్రి సీతక్క హితవు పలికారు. యూపీఏ హయాంలో మూసీ ప్రక్షాళనకు రూ.335 కోట్లు మంజూరు చేస్తే, మోదీ పాలనలో పైసా మంజూరు కాకపోయినా కిషన్‌రెడ్డి ఎందుకు పెదవి విప్పలేదని మంగళవారం ఓ ప్రకటనలో నిలదీశారు. ఇతర నదుల ప్రక్షాళన కు నిధులిచ్చి మూసీ ప్రక్షాళనకు పైసా కేటాయించకపోవడం తెలంగాణపై కేంద్రం వివక్షతకు నిదర్శనం కాదా? అని ప్రశ్నించారు.సొంత నియోజకవర్గం మీదుగా మూసీ పారు తున్నా ఏనాడూ కేంద్రం నుంచి నిధులు తీసుకురాని కిషన్‌రెడ్డి ఇప్పుడు ధర్నాకు పిలుపునివ్వడం ఏమిటో ఆయన ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. మూసీ పరీవాహక ప్రాంతంలో బీజేపీకి చెందిన ముగ్గురు ఎంపీలు, ఒక కేంద్రమంత్రి ప్రాతిని ధ్యం వహిస్తున్నందున.. కేంద్రంతో చర్చించి హైదరాబాద్ జీవనరేఖగా భావించే మూసీ పునరుజ్జీవానికి రూ.10 వేల కోట్లు మంజూరు చేయించాలని డిమాండ్ చేశారు. గుజరాత్లో సబర్మతి రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును సమర్థిస్తున్న బీజేపీ ఇక్కడ మూసీ అభివృద్ధి ప్రాజెక్టును ఎందుకు వ్యతిరేకిస్తోందని ప్రశ్నించారు. -
గ్రామాల్లో మంచినీటి సహాయకులు
సాక్షి, హైదరాబాద్: గ్రామాల్లో తాగునీటి సరఫరా విషయంలో నూతన ఒరవడికి ప్రభుత్వం నాంది పలికిందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క తెలిపారు. ప్రతి గ్రామంలో మంచినీటి సహాయకుడిని నియమించి శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం 15 జిల్లాల్లోని 60 ప్రాంతాల్లో శిక్షణ కొనసాగుతోందని.. ఈ నెలాఖరులోగా అన్ని గ్రామాలకూ సహాయకులను నియమించి శిక్షణ పూర్తి చేస్తామన్నారు. తాగునీటి నాణ్యత పరిశీలనతోపాటు బోర్లు పాడైతే అదే రోజు మరమ్మతులు జరిగేలా, లీకేజీలను సరిచేసేలా గ్రామాల్లో మంచినీటి సహాయకులు కృషి చేస్తారని వివరించారు. సోమవారం సచివాలయం నుంచి శాఖాపరమైన సమీక్ష సందర్భంగా వివిధ విభాగాలవారీగా పనుల్లో వేగం పెంచాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. కొనసాగుతున్న పనుల పురోగతిని ఆమె అడిగి తెలుసుకున్నారు. బీఆర్ఎస్ హయాంలోని పెండింగ్ బిల్లులను త్వరలో చెల్లిస్తామని చెప్పారు. విభాగాలవారీగా నూతన పనులకు కార్యాచరణ సిద్ధం చేసి పనులు ప్రారంభించాలని ఆదేశించారు. ఈ సమావేశానికి పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి లోకేశ్ కుమార్, సెర్ప్ సీఈవో దివ్యా దేవరాజన్, పీఆర్ ఆర్డీ కమిషనర్ అనితా రామచంద్రన్, స్పెషల్ కమిషనర్ షఫీఉల్లా హాజరయ్యారు. -
జైనూరు బాధితురాలికి రూ.లక్ష తక్షణ సాయం
గాంధీ ఆస్పత్రి: కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూరు ఘటనలో గాయపడి సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలిని మహిళా శిశుసంక్షేమ శాఖ మంత్రి సీతక్క గురువారం పరామర్శించారు. బాధితురాలికి తక్షణసాయంగా లక్ష రూపాయల చెక్కును అందించారు. కాగా మంత్రి వస్తున్న సమాచారం తెలుసుకున్న బీజేపీ మహిళా శ్రేణులు గాంధీ ఆస్పత్రి వద్దకు చేరుకుని మంత్రిని అడ్డుకున్నారు. ఆస్పత్రి ప్రాంగణంలో ప్లకార్డులు ప్రదర్శించి ధర్నా నిర్వహించారు. ఈ క్రమంలో స్వల్ప ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆదివాసీ బిడ్డగా నాకే ఎక్కువ బాధ్యత... ఈ సందర్భంగా మంత్రి సీతక్క మీడియాతో మాట్లాడుతూ, జైనూరు ఘటనపై కొంతమంది వ్యక్తులు, రాజకీయ పార్టీ లు చేస్తున్న విషప్రచారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆడబిడ్డకు అన్యాయం జరిగిందని తెలియగానే ప్రభుత్వం స్పందించిందని, నిందితునిపై ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశామని, కఠినశిక్ష పడేలా చర్యలు చేపట్టామన్నారు. ఈ ఘటనలో దోషులను శిక్షించేందుకు ఆడబిడ్డగా, ఆదివాసీ బిడ్డగా తనకే ఎక్కువ బాధ్యత ఉందన్నారు. జైనూ రు ఘటనకు మతం రంగు పూసేందుకు కొందరు యతి్నస్తున్నారని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఆదివాసీల జీవితాలతో చెలగాటం: ఏలేటి బంగ్లాదేశ్‌తోపాటు ఇతర రాష్ట్రాలకు చెందిన రోహింగ్యా లు, ముస్లింలు ఏజెన్సీ ప్రాంతాలను ఆక్రమించుకుని, ఆదివాసీల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని బీజేపీ అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేశ్వరరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జైనూరు ఘటనలో చికిత్స పొందుతున్న బాధితురాలిని గురువారం పరామర్శించిన అనంతరం ఆయన మీడియా తో మాట్లాడారు.కేంద్ర నిబంధనల మేరకు ఆదివాసీల ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనేతరులు ఉండకూడదని, కానీ జైనూరు అటవీప్రాంతంలో వేలాది మంది ముస్లింలు, గిరిజనేతరులు స్థిరనివాసాలు ఏర్పరుకున్నారని ఆరోపించారు. -
మహిళల భద్రతకు ప్రత్యేక నిధి!
సాక్షి, హైదరాబాద్: పని ప్రదేశంలో మహిళలు ధైర్యంగా ఉండేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తోందని మంత్రి సీతక్క వెల్లడించారు. ఇటీవల దేశవ్యాప్తంగా జరుగుతున్న ఘటనలతో మహిళలు భయాందోళనకు గురవుతున్నారని, ఈ పరిస్థితిని అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. మహిళలపై దాడులు చేసిన వారికి వెంటనే శిక్ష అమలయితేనే ఇలాంటి ఘటనలు తగ్గుతాయని మంత్రి అభిప్రాయపడ్డారు.మహిళల భద్రతపై బుధవారం సచివాలయంలో మంత్రి సీతక్క సమావేశం నిర్వ హించారు. మహిళలపై హింస పెరగడానికి డ్రగ్స్, గంజాయి కూడా కారణమవుతున్నాయని వివరించారు. ఆసుపత్రులు, మెడికల్ కాలేజీల్లో షీ టీమ్స్ గస్తీ పెంచుతామన్నారు. పబ్లిక్ ప్లేసుల్లో, ఆసుపత్రుల్లో సీసీ కెమెరాలను పెంచుతామన్నారు. మంత్రులు, ఉన్నతాధికారులతో కోర్ కమిటీని ఏర్పాటు చేస్తామని, అన్ని శాఖల్లో త్వరలో ఉమెన్ సేఫ్టీ కమి టీలు నియమిస్తామని తెలిపారు. మహిళల భద్రత కోసం ప్రతి శాఖకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించే అంశాన్ని తమ ప్రభు త్వం పరిశీలిస్తోందన్నారు. మహిళా ఉద్యోగుల భద్రతపై ప్రతీ కార్యాలయంలో కమిటీలు ఏర్పాటు చేయాలని మహి ళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద సూచించారు. బచ్పన్ బచావోతో కలసి పనిచేస్తాం.. బాల కారి్మకులు, బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న బచ్పన్ బచావో ఆందోళన్ ప్రతినిధుల బృందం బుధవారం సచివాలయంలో మంత్రి సీతక్కతో సమావేశమయింది. నోబెల్ అవార్డు గ్రహీత కైలాశ్ సత్యార్థి నేతృత్వంలో బచ్పన్ బచావో ఆందోళన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు సంపూర్ణ బెహరా, ధనుంజయ్ తింగాల్, ప్రతినిధులు వీఎస్ శుక్లా, చందన, వెంకటేశ్వర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బచ్పన్ బచావో ఆందోళన్‌తో రాష్ట్ర ప్రభుత్వం కలసి పనిచేస్తుందని తెలిపారు. -
కేటీఆర్ ‘రికార్డింగ్ డ్యాన్స్’ వ్యాఖ్యలు జుగుప్సాకరం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మహిళలపై చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని పంచాయతీరాజ్, మహిళా సంక్షేమశాఖ మంత్రి సీతక్క డిమాండ్ చేశారు. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఆర్టీíసీ బస్సుల్లో మహిళలు బ్రేక్ డ్యాన్సులు, రికార్డింగ్ డ్యాన్సులు చేసుకోవచ్చు’ అని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు అత్యంత జుగుప్సాకరంగా ఉన్నాయని గురువారం ఓ ప్రకటనలో ఆమె ఖండించారు. ‘మీ తండ్రి మీకు నేర్పిన సంస్కారం ఇదేనా కేటీఆర్? మీ ఆడపడుచులు అంతా బ్రేక్ డ్యాన్సులు చేస్తున్నారా? ఆడవాళ్లంటే మీకు గౌరవం లేదు. మహిళలను కించపరిచే విధంగా బ్రేక్ డ్యాన్సులు చేసుకోండి అనడం మీ బుర్రలో ఉన్న బురదకు నిదర్శనం. పదేళ్లుగా హైదరాబాద్‌లో క్లబ్బులు, పబ్బులు, బ్రేక్ డాన్సులు ఎంకరేజ్ చేసిన చరిత్ర మీది’ అని సీతక్క మండిపడ్డారు. ‘మహిళలు ఆర్థికంగా ఎదగాలనే వారి కోసం సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం. అందులో భాగంగా పేద మహిళలకు రవాణా భారాన్ని తగ్గించేందుకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించాం’ అని స్పష్టం చేశారు. శ్రమజీవులు, శ్రామిక మహిళలు ప్రయాణ సమయంలో సమయం వృథా చేయకుండా ఏదో పని చేసుకుంటే తప్పేంటి? అని ఆమె కేటీఆర్‌ను ప్రశ్నించారు. ‘ప్రజలకు ఉపయోగపడే పథకాలు మీకు నచ్చవు.ఉచిత బస్సు ప్రయాణం ఆలోచన మీకు రాలేదు. పదేళ్లు మీరు చేయలేదు. మేము చేస్తే దాని మీద సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు ’అని సీతక్క ధ్వజమెత్తారు. -
గాంధీలో జూడాల విధుల బహిష్కరణ
గాంధీ ఆస్పత్రి: కోల్‌కతాలో విధి నిర్వహణలో ఉన్న వైద్యవిద్యార్థినిపై లైంగికదాడి, హత్యలకు నిరసనగా సికింద్రాబాద్ గాం«దీ ఆస్పత్రిలో జూనియర్ వైద్యులు నిరసన చేపట్టారు. బుధవారం అవుట్‌పేòÙంట్ విభాగ విధులను బహిష్కరించి, ఆస్పత్రి ప్రాంగణంలో ధర్నా, ర్యాలీ నిర్వహించారు. దేశవ్యాప్తంగా వైద్యులు, వైద్య విద్యార్థులపై జరుగుతున్న దాడుల పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జూడాల సంఘం గాంధీ యూనిట్ అధ్యక్షుడు వంశీకృష్ణ మీడియాతో మాట్లాడుతూ ఇక్కడ పనిచేస్తున్న వైద్యులు, వైద్య విద్యార్థుల ప్రధానమైన 9 డి మాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరారు. ఇవీ డిమాండ్లు రెసిడెంట్, మహిళ, పురుష వైద్యులకు వేర్వేరు గా హైజెనిక్ డ్యూటీరూమ్లను ఏర్పాటు చే యాలని, డాక్టర్స్ గ్రీవెన్స్ రెడ్రెసెల్ కమిటీ ఏ ర్పాటు, వైద్యులు, వైద్యవిద్యార్థులు విధులు నిర్వహించే ప్రాంతాల్లో 24 గంటలూ సీసీ కెమె రాల పర్యవేక్షణ ఉండాలని, ఆస్పత్రి మెయిన్ ఎంట్రన్స్, అత్యవసర విభాగం, ఇతర ప్రదేశా ల్లో సెక్యూరిటీ గార్డులను నియమించి, పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలని, కళాశాల మైదానంలో అసాంఘిక కార్యకలాపాలను నిరోధించాలని, ఆస్పత్రి ప్రాంగణంలోని జయశంకర్ విగ్రహం నుంచి బాయ్స్ హస్టల్, ఇతర చీకటి ప్రదేశాల్లో వీధిదీపాలను ఏర్పాటు చేయాలని, ఆస్పత్రి ప్రాంగణంతోపాటు హాస్టల్స్ పరిసర ప్రాంతాల్లో వీధికుక్కలను నిరోధించాలని, పీజీ హాస్టల్‌కు సింగిల్ ఎంట్రీ, ఎగ్జిట్ వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి సెక్యూరిటీ వ్యవస్థను మరింత పటిష్టపర్చాలని కోరుతూ ఆస్పత్రి, మెడికల్ కాలేజీ పా లనాధికారులకు వి నతిపత్రం సమర్పించారు. జూడాల ఓపీ విధుల బహిష్కరణ ఫలితంగా వైద్యసేవల్లో జాప్యంతో నిరుపేద రోగులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కాగా, అన్ని ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో బుధవారం ఈ నిరసన కార్యక్రమాలు కొనసాగాయి. గురు వారం కూడా విధులు బహిష్కరించి నిరసన కార్యక్రమాల్లో పాల్గొననున్నట్లు తెలంగాణ జూనియర్ డాక్టర్ల సంఘం ప్రధాన కార్యదర్శి ఐజాక్ న్యూటన్ తెలిపారు. వైద్యులకు అండగా మేమున్నాం: మంత్రి సీతక్క కోల్‌కతాలో వైద్యురాలిపై జరిగిన హత్యాచారం అత్యంత హేయమైన చర్య అని మంత్రి సీతక్క తీవ్రంగా ఖండించారు. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ రోగిని పరామర్శించిన అనంతరం అక్కడ ఆందోళన చేస్తున్న జూడాల వద్దకు వచ్చి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా సీతక్క మీడియాతో మాట్లాడుతూ వైద్యులకు తాము అండగా ఉన్నామని భరోసా ఇచ్చారు. సీఎం రేవంత్‌రెడ్డితో మాట్లాడి, మహిళలపై దాడులు, లైంగిక వేధింపులు, హత్యాయత్నాలు జరగకుండా కఠినమైన చట్టాలను తేవడంతో పాటు ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలను రూపొందించి అమలు చేస్తామని హామీనిచ్చారు. -
ఆత్మవంచన బీఆర్ఎస్ నైజం
సాక్షి, హైదరాబాద్: ‘మాజీ ఆర్థిక మంత్రిగా హరీశ్‌రావుకు పెండింగ్ బిల్లుల బాగోతం తెలుసు. అయినప్పటికీ పదేపదే వాస్తవాలను వక్రీకరించడం అంటే ఆత్మవంచన చేసుకోవడమే అవుతుంది’ అని మంత్రి సీతక్క పేర్కొ న్నారు. ‘గత ప్రభుత్వ హయాంలో సర్పంచులతో బలవంతంగా పనులు చేయించారు.. వందలకోట్ల బిల్లులు చెల్లించకపోవడంతో ఎంతో మంది సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ప్రజాసేవ కోసం వచ్చిన సర్పంచులను పాడెనెక్కించింది మీరే’ అంటూ ఆమె ధ్వజమెత్తారు. ‘గ్రామ పంచాయతీల సమస్యలపై మీరు మాట్లాడటం అంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టే.గ్రామ స్వరాజ్యాన్ని గంగలో కలిపి ఇప్పుడు నీతి సూక్తులు వల్లిస్తే ఎలా?’ అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై, పీఆర్ మంత్రిగా తనపై మాజీ మంత్రి హరీశ్‌రావు చేసిన విమర్శలపై ఆయా అంశాల వారీగా మంత్రి సీతక్క గురువారం ఓ ప్రకటనలో బదులిచ్చారు. పంచాయతీల బాగుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. గత ప్రభుత్వంలో ఏళ్లుగా బిల్లులు పెండింగ్ పెట్టడంతో గ్రామపంచాయతీల్లో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు.‘పంచాయతీలకు మేము ఏం చేశామో ప్రజలకు తెలుసు. 15వ ఫైనాన్స్ కమిషన్‌కి సంబంధించి రూ.431.32 కోట్ల నిధులు విడుదల చేశాం. దీనికి అదనంగా రూ.323.99 కోట్ల సీఆర్డీ నిధులిచ్చాం. అయినా 9 నెలల్లో 9 పైసలు కూడా విడుదల చేయలేదని అనడం విడ్డూరంగా ఉంది’ అంటూ హరీశ్‌రావుపై సీతక్క ధ్వజమెత్తారు. -
సీతక్కకు భయపడి తీసుకున్నారు
-
అంగన్వాడి టీచర్లకు 2 లక్షలు.. ఆయాలకు లక్ష
సాక్షి, హైదరాబాద్, రహమత్‌నగర్: పదవీ విరమణ పొందే అంగన్ వాడీ టీచర్లకు రూ. రెండు లక్షలు, ఆయాలకు (హెల్పర్లు) రూ.లక్ష రిటైర్మెంట్ ప్యాకేజీని పంచాయతీరాజ్, మహిళా సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క ప్రకటించారు. దీనికి సంబంధించి ఆర్థిక శాఖ ఫైల్ క్లియర్ చేసిందని, రెండు మూడు రోజుల్లో అధికారిక ఉత్తర్వులు వెలువడుతాయని చెప్పారు. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలోని రహమాత్ నగర్ డివిజన్లో అమ్మ మాట – అంగన్ వాడీ బాట కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన మంత్రి సీతక్క ఇకపై అంగన్వాడీ కేంద్రాల్లో ఆంగ్ల భాష బోధనా విధానం ప్రవేశపెడతామని వెల్లడించారు. ఆయా కేంద్రాల్లో విద్యార్ధులకు యూనిఫామ్స్, ఆట వస్తువులు అందించనున్నట్లు తెలిపారు. కార్పొరేట్ స్కూళ్లకు ఏ మాత్రం తీసిపోని విధంగా ఉన్న అంగన్ వాడీ కేంద్రాల్లో పిల్లలను చేర్చించాలని తల్లి దండ్రులకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా చిన్నారుల చేత మంత్రి సీతక్క మొక్కలు నాటించారు. మై ప్లాంట్ మై ఫ్యూచర్ అని చిన్నారులతో పలికించారు. మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి వాకాటి కరుణ, కమిషనర్ కాంతి వెస్లీ. రహమత్ నగర్ డివిజన్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి పాల్గొన్నారు.మహిళా రైతులకు 50 శాతం రాయితీపై పరిశీలన: సీతక్కసాగు భూమి రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ చార్జీలు, స్టాంప్ డ్యూటీలో మహిళా రైతులకు 50 శాతం రాయితీ ఇచ్చే అంశాన్ని ప్రభు త్వం పరిశీలిస్తోందని మంత్రి ధనసరి అనసూయ సీతక్క వెల్లడించారు. మంగళవారం ప్రజా భవన్లో మంత్రితో మహిళా రైతుల హక్కుల సాధనకు కృషిచేస్తున్న ‘మహిళా కిసాన్ అధికార్ మంచ్’ (మకామ్) ప్రతినిధులు డా. ఉషా సీతా మహాలక్ష్మి, డా. వి రుక్మిణి రావు, ఎస్. ఆశాలత సమావేశమయ్యారు. మహిళలకు భూ యాజ మాన్య హక్కులు కల్పించేలా చర్యలు చేపట్టాలని వారు సమర్పించిన వినతి పత్రంపై మంత్రి సానుకూలంగా స్పందించారు. రైతు భరోసా పథకాన్ని పదెకరాల వరకే అమలు చేయాలన్న డిమాండ్ ఊపందుకున్న నేపథ్యంలో.. కుటుంబ సభ్యుల మధ్య భూ పంపకాలు జరిగే అవకాశా లున్నాయని ’మకాం’ ప్రతినిధులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. పెళ్లికాని కుమార్తెలు, ఒంటరి మహిళలు, గృహిణుల పేర్లపై భూ రిజిస్ట్రేషన్లు పెంచేలా.. రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ చార్జీలు, స్టాంప్ డ్యూటీలో మహిళలకి రాయితీ ఇవ్వాలని సూచించారు. ఈ అంశాలను సీఎం, ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి సాగు భూమి రిజిస్ట్రేషన్ల చార్జీలో 50 శాతం రాయితీలు ఇస్తూ విధాన పరమైన నిర్ణయం తీసుకునేందుకు ప్రయ త్నిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. -
అమ్మమాట.. అంగన్వాడీ బాట..
సాక్షి, హైదరాబాద్: అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారుల సంఖ్యను పెంచేందుకు ‘అమ్మ మాట–అంగన్వాడీ బాట’నినాదంతో వారం రోజుల పాటు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని పంచాయతీరాజ్ గ్రామీ ణ అభివృద్ధి, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఆదేశించారు. సచివాలయంలో బుధవారం మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ అధికారులతో అంగన్వాడీ కేంద్రాలు, మహిళా భద్రత, దత్తత, చైల్డ్ కేర్ తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల్లో నర్సరీ తరగతులను బోధించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ము ఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డిని ప్రత్యేకంగా ఆహా్వనించినట్లు తెలిపారు. అంగన్వాడీ కేంద్రాలకు పంపి ణీ చేస్తున్న సరుకులు, సేవల నాణ్యతను పెంచేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలన్నా రు. కొన్ని కేంద్రాలకు నాసిరకం కోడిగుడ్లు, పాల ప్యాకెట్లు సరఫరా అయిన నేపథ్యంలో.. వాటి కట్టడి కోసం జిల్లాస్థాయి క్షేత్రస్థాయి అధికారులు కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. నాసిరకం సరుకులు సరఫరా అయితే అంగన్వాడీ టీచర్లు తిరస్కరించాలని సూచించారు.సరుకుల నాణ్యతను పరిశీలించేందుకు ఫ్లయింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. జిల్లా అధికారులు ఎప్పటికప్పుడు కేంద్రాలను సందర్శించి తనిఖీ చేసి నివేదిక సమరి్పంచాలని మంత్రి ఆదేశించారు. అంగన్వాడీలోని చిన్నారులకు త్వరలో యూనిఫాంలు అందజేస్తామని తెలిపారు. దేశంలోనే తొలిసారిగా అంగన్వాడీ చిన్నారులకు యూనిఫాంలు ఇస్తున్న రాష్ట్రంగా తెలంగాణ రికార్డు సాధిస్తుందన్నారు. అంగన్వాడీ కేంద్రాలకు పెయింటింగ్ పనులు పూర్తి చేయాలని సూచించారు.మహిళలు చిన్నారులపై దాడులు, అఘాయిత్యాలు జరిగితే తక్షణమే స్పందించేలా సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. యునిసెఫ్ సౌజన్యంతో రూపొందించిన న్యూట్రీíÙయన్ చాంపియన్ పుస్తకాన్ని, న్యూట్రీషియన్ కిట్లను మంత్రి సీతక్క ఈ సందర్భంగా ఆవిష్కరించారు. సమీక్షలో రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి వాకాటి కరుణ, కమిషనర్ కాంతి వెస్లీ తదితరులు పాల్గొన్నారు. -
ప్రతీ ఇంటికి రక్షిత మంచినీరు అందించడమే లక్ష్యం
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలోని అన్ని ఆవాస గ్రామాలకు సురక్షిత మంచి నీరు అందేలా చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి సీతక్క ఆదేశించారు. తెలంగాణ డ్రింకింగ్ వాటర్ సప్లై కార్పొరే షన్తో అన్ని ఆవాసాలను అనుసంధానించాలని సూచించారు. కుళాయి ద్వారా రక్షిత మంచి నీరు అందని గ్రామాలను గుర్తించి తక్షణమే పనులు ప్రారంభించాలన్నారు. శనివారం సచివాలయంలో మంత్రి సీతక్క అధ్యక్షతన జరిగిన తెలంగాణ డ్రింకింగ్ వాటర్ సప్లై కార్పొరేషన్ లిమిటెడ్ బోర్డు సమావేశంలో అధికారులు మిషన్ భగీరథ పథకంపై అధికారులు ఆడిట్ నివేదిక సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ...ఏజెన్సీ ప్రాంతాల్లో, అడవుల్లో నివసించే ప్రజలకు సైతం కుళాయి నీళ్లు అందించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అటవీ ఆవాస గ్రామాల్లో సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసి బోర్ల ద్వారా తాగునీటి సౌకర్యాన్ని కల్పించాలన్నారు. పీఆర్ శాఖ కార్యదర్శి లోకేశ్ కుమార్ మిషన్ భగీరథ ఇంజనీర్ ఇన్ చీఫ్ కృపాకర్‌రెడ్డి, తెలంగాణ రూరల్ డ్రింకింగ్ వాటర్ సప్లై కార్పొరేషన్ అధికారులు పాల్గొన్నారు. -
కేసీఆర్ కు సీతక్క లీగల్ నోటీసులు
-
కేసీఆర్‌కు మంత్రి సీతక్క లీగల్ నోటీసులు
సాక్షి, హైదరాబాద్: మాజీ సీఎం కేసీఆర్‌కు పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క లీగల్ నోటీసులు పంపించారు. కేసీఆర్‌తో పాటు బీఆర్ఎస్ పార్టీకి కూడా నోటీసులు ఇచ్చారు. తన ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నందుకు రూ.100 కోట్ల మేరకు నష్టపరిహారంగా చెల్లించాలని పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాల్లో తన ప్రతిష్టను దెబ్బతీసేలా బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ప్రచారానికి ఆమె ఈ నోటీసులు పంపించారు. ‘ఇందిరమ్మ రాజ్యంలో– ఇసుకాసుర రాజ్యం’అంటూ సీఎం, సీతక్కతో పాటు మంత్రులపై గత కొంతకాలంగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని మంత్రి తీవ్రంగా పరిగణించారు.సామాజిక మాధ్యమాల్లో తనపై నిరాధారమైన ఆరోపణలు చేసినందుకు లిఖిత పూర్వకంగా క్షమాపణలు చెప్పాలని, ఆ మేరకు అరోపణల వీడియో అసత్యమని అంగీకరిస్తూ ఒక వీడియో పోస్ట్ చేయాలని ఆ నోటీసుల్లో మంత్రి పేర్కొన్నారు. ఈ నోటీసులకు స్పందించి క్షమాపణలు చెప్పకపోతే.. చట్టపరంగా సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటామన్నారు. జూన్ 24న బీఆర్ఎస్ అధికారిక సోషల్ మీడియా పేజీలో ఈ పోస్టులు పెట్టిన నేపథ్యంలో లీగల్ నోటీసులు పంపించినట్టు మంత్రి తరఫు న్యాయవాది నాగులూరు కృష్ణకుమార్ తెలిపారు. ఈ మాధ్యమాల్లో పోస్ట్ చేసిన వీడియోలో సీతక్కతో సీఎం, కేబినెట్ మంత్రులు అక్రమ ఇసుక రవాణాకు పాల్పడినట్టుగా చూపడాన్ని తప్పు బట్టారు. పనిగట్టుకుని ఎలాంటి ఆధారాలు లేకుండా అవాస్తవాలతో చేస్తున్న దు్రష్పచారంతో తమ క్లయింట్, మంత్రి సీతక్క ప్రతిష్టకు తీరని విఘాతంతోపాటు, ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న ములుగు నియోజకవర్గం ఓటర్లలో ఆమెకున్న ప్రతిష్టను దెబ్బతీసేలా ఉన్నాయని ఆయన అభ్యంతరం వ్యక్తంచేశారు. -
దివ్యాంగుల సంక్షేమ బడ్జెట్ 75 రెట్లు పెంచాం
సాక్షి, హైదరాబాద్/చాదర్‌ఘాట్/గన్‌ఫౌండ్రీ: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభు త్వం ఏర్పాటైన తర్వాత వికలాంగుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. గురువారం మలక్‌పేటలోని వికలాంగుల సంక్షేమ శాఖ కార్యాలయ ఆవరణలో హెలెన్ కెల్లర్ విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించారు. అనంతరం హెలెన్ కెల్లర్ జయంతిని పురస్కరించుకుని నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గత ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపుల్లో భాగంగా రూ.కోటి మాత్రమే కేటాయిస్తే... కాంగ్రెస్ ప్రభుత్వం రూ.75 కోట్లు కేటాయించిందన్నారు. గత ప్రభుత్వ కేటాయింపులతో పోలిస్తే ప్రస్తుత ప్రభుత్వం 75రెట్లు అధికంగా కేటాయింపులు జరిపిందన్నారు. అదేవిధంగా ఉన్న త విద్యా సంస్థల్లో దివ్యాంగులకు కనీసం 5శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని, వయో పరిమితి కూడా ఐదేళ్లు పెంచిందన్నారు. తమ ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమానికి కట్టుబడి ఉందని, ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో దివ్యాంగులకు 5 శాతం రిజర్వేషన్లు, ఉద్యాగాల కల్పనలో 4 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామన్నారు. అనంతరం తెలంగాణ వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య మాట్లాడుతూ, ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన రోజే రజినికి ఉద్యోగం ఇచ్చారని గుర్తు చేశారు. కార్యక్రమంలో మహిళాభివృద్ధి, శిశు, వికలాంగుల సంక్షేమ శాఖ కార్యదర్శి వాకాటి కరుణ, వికలాంగుల సంక్షేమ శాఖ సంచాలకులు బి.శైలజ తదితరులు పాల్గొన్నారు. దివ్యాంగుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం.. రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమానికి కట్టుబడి ఉందని మంత్రి సీతక్క అన్నారు. గురువారం రవీంద్రభారతిలో దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో హెలెన్ కిల్లర్ 144వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.... వికలాంగులను బాధ్యతగా చూడలేనివారు, వికలాంగులను స్వార్థ ప్రయోజనాలకోసమే వాడుకునేవారు నిజమైన వికలాంగులన్నారు. అనంతరం దివ్యాంగుల కోసం వివిధ సంస్థలు ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించి పరికరాల గురించి అడిగి తెలుసుకున్నారు. -
దాడికి భూ వివాదమే మూలం
లక్డీకాపూల్ (హైదరాబాద్): నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం మొలచింతలపల్లి దాడి ఘటనకు భూ వివాదమే కారణమని తాము భావిస్తున్నట్లు మహిళా శిశుసంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. చెంచుల పునరావాసం కోసం కేటాయించిన భూములపై కన్నేసిన కొందరు ఇలాంటి దాడులకు తెగబడుతున్నారన్నారు. బుధవారం మంత్రి నిమ్స్‌లో చికిత్స పొందుతున్న చెంచు మహిళ ఈశ్వరమ్మను పరమర్శించారు. బాధితు రాలితో మాట్లాడి దాడి ఘటన వివరాలు తెలుసుకు న్నారు. జిల్లా ఎస్పీతో ఫోన్లో మాట్లాడి కేసు పురోగతిని తెలుసుకున్న మంత్రి.. నిందితులకు కఠి న శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ, గతంలో భూములు అమ్ముకున్న భూ యాజమానులకు ధరణి తర్వాత తిరిగి పాస్ పుస్తకాలు రావడంతో చెంచులపై దాడులు చేస్తున్నారన్నారు. ఆ భూముల విలువ పెరగడంతో.. వాటిని లాక్కునేందుకు కుట్రలు చేస్తున్నారన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరక్కుండా పోలీసులు కఠినంగా వ్యవహ రించాలన్నారు. మహిళలపై దౌర్జన్యాలకు పాల్పడితే కఠినంగా శిక్షించేలా పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఉంటుందన్నారు. జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావు, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ, అధికారులు బాధి తురాలికి అండగా నిలిచారన్నారు. బాధిత కుటుంబానికి పూర్తి రక్షణ కల్పిస్తామని చెప్పారు. బాధితు రాలి మామయ్య నాగయ్య మృతిపై అనుమా నాలు న్నందున ఆ కేసును పునఃవిచారణ చేయాల న్నారు. చెంచులకు అండగా ఉంటామని తెలిపారు. బాధిత కుటుంబానికి తాత్కాలికంగా రూ.25 వేలు అందజే శామన్నారు. మహిళా శిశుసంక్షేమ శాఖ కమిషనర్ కాంతి వెస్లీ, నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ నగరి బీరప్ప, నాగ ర్ కర్నూల్ ఐటీడీఓ రోహిత్ తదితరులు మంత్రి వెంట ఉన్నారు. మంత్రి సీతక్కతో పాటు ఈశ్వరమ్మను పరామర్శించిన వారిలోప్రగతిశీల మహిళా సంఘం అధ్యక్షురాలు సంధ్య తదితరులున్నారు. -
మహిళాశక్తి క్యాంటీన్లు ఒక బ్రాండ్‌గా ఎదగాలి
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో 151 మహిళా క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి సంకలి్పంచారని, మహిళాశక్తి క్యాంటీన్లు ఒక బ్రాండ్‌గా ఎదగాలని మంత్రి సీతక్క ఆకాంక్షించారు. శుక్రవారం డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ సచివాలయంలో గ్రౌండ్‌ఫ్లోర్, థర్డ్‌ఫ్లోర్‌లో మహిళాశక్తి క్యాంటీన్లను సీఎస్ శాంతికుమారితో కలిసి ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ఈ క్యాంటీన్లు కార్పొరేట్ క్యాంటీన్లను తలపిస్తున్నాయన్నారు. మహిళాశక్తి క్యాంటీన్లు ప్రతి ఇంటి అమ్మచేతి వంటలా నాణ్యతకు మారుపేరుగా నిలవాలని చెప్పారు. పల్లెరుచులు, ఇప్పపువ్వు లడ్డూలు, నన్నారి వంటి వాటిని పట్టణాలకు పరిచయం చేయాలన్నారు. రానున్న ఐదేళ్లలో మహిళా సంఘాలకు బ్యాంకు రుణాలు అందిస్తామన్నారు. జిల్లా ఆస్పత్రుల్లోనూ.... మహిళా శక్తి క్యాంటీన్లకు సచివాలయంలో మొదటి అడుగు పడిందని, 20 రోజుల్లో జిల్లా ఆస్పత్రుల్లో మహిళాశక్తి కాంటీన్లు ప్రారంభించే పనులను వేగవంతం చేయాలని అధికారులను సీఎస్ శాంతికుమారి ఆదేశించారు. తెలంగాణ మహిళాసంఘాలు దేశానికే ఆదర్శంగా ఎదుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, పీఆర్ అండ్ ఆర్ డీ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానీయ, సీఎం కార్యాలయ కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి, సెర్ప్ డైరెక్టర్ గోపాల్‌రావు, అధికారులు నర్సింహారెడ్డి, సునీతరెడ్డి, రజిత తదితరులు పాల్గొన్నారు. -
ఐదేళ్లలో మహిళా సంఘాలకు రూ.లక్ష కోట్ల రుణాలు
సాక్షి, హైదరాబాద్: మహిళా సంఘాల ఆర్థిక బలోపేతానికే ‘మహిళా శక్తి’కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు పంచాయతీరాజ్, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. వడ్డీ వ్యాపారులు, మైక్రో ఫైనాన్స్ సంస్థల వేధింపుల నుంచి మహిళలకు విముక్తి కలి్పంచేందుకే.. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు అందిస్తున్నామన్నారు. వచ్చే ఐదేళ్లలో ఈ సంఘాలకు రూ.లక్ష కోట్ల రుణాలు అందిస్తామన్నారు. క్షేత్రస్థాయి వాస్తవాలు, ప్రజల అవసరాలు, వనరుల లభ్యతకు తగ్గట్టుగా బిజినెస్ మోడల్ ఉండాలన్నారు. స్థానికంగా లభ్యమయ్యే వస్తువుల ఆధారంగా వ్యాపారం చేస్తే అద్భుతాలు సాధించగలమన్నారు. ఇందుకు అనుగుణంగా మహిళా సంఘాల కోసం మంచి బిజినెస్ మోడళ్లను అధికారులు గుర్తించాలని సూచించారు. మహిళా సంఘాలను డిమాండ్ ఉన్న వ్యాపారాల్లో ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. మహిళల ఉన్నతితోనే తెలంగాణ ప్రగతి సాధ్యమని.. ఆధార్ కేంద్రాలు, మీసేవ సెంటర్లు, పౌల్ట్రీ, డెయిరీ వ్యాపారాలు, క్యాంటీన్లు, స్టార్టప్ కంపెనీలు ఏర్పాటు చేసేలా మహిళా సంఘాలకు రుణ సౌకర్యం కలి్పస్తున్నామన్నారు. మహిళా సంఘాలకు ఆర్థికంగా చేయుతనందించేందుకు కలెక్టర్లతో త్వరలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తామన్నారు.గురువారం రాజేంద్రనగర్‌లోని తెలంగాణ గ్రామీణాభివృద్ధి సంస్థలో మహిళా శక్తి రాష్ట్రస్థాయి కార్యాచరణ ప్రణాళిక తయారీపై డీఆర్డీవోలు, అదనపు డీఆర్డీవోలతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. పీఆర్, గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులే ‘మహిళా శక్తి’కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్లు అని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్‌లను సకాలంలో అందించిన అధికారులను అభినందించారు. ఆగస్టు 15 న ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మరో జత యూనిఫామ్ అందించేలా అధికారులు కార్యాచరణ సిద్ధం చేయాలని సూచించారు. పీఆర్ఆర్డీ ముఖ్యకార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, టీజీఐఆర్డీ సీఈవో కాత్యాయిని, స్పెషల్ కమిషనర్ షఫీ ఉల్లా, ఈఎస్డీ కమిషనర్ రవికిరణ్, శ్రీనిధి ఎండీ విద్యాసాగర్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.నేడు మహిళా శక్తి క్యాంటీన్లు ప్రారంభంసాక్షి, హైదరాబాద్: సచివాలయంలో శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు రెండు మహిళా శక్తి క్యాంటీన్లను పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ప్రారంభించనున్నారు. మహి ళా సంఘాల ఆధ్వర్యంలో ఈ క్యాంటీన్ల ఏర్పాటు ద్వారా మహిళల ఆర్థిక పురోగతికి కృషి చేయాలన్న సీఎం రేవంత్‌రెడ్డి సూచనలకు అనుగుణంగా వీటికి మంత్రి తుదిరూపునిచ్చారు. బిహార్‌లో అమలు చేస్తున్న దీదీ–కి–రసోయి మోడల్‌కు అనుగుణంగా రాష్ట్రంలో మహిళా శక్తి క్యాంటీన్లను రూపొందిస్తున్నారు.సచివాలయంతో పాటు కలెక్టర్ ఆఫీస్ కేంద్రాలు, ఆసుపత్రులు, పర్యాటక ప్రాంతాలు, ఆలయాలు, ఆర్టీíసీ బస్టాండ్లు, ఇండ్రస్టియల్ పార్కులు, రిజి్రస్టేషన్ ఆఫీసుల్లో వీటిని ఏర్పాటు చేయాలని సంకలి్పంచారు. రెండేళ్లలో జిల్లాకు ఐదు చొప్పున మొత్తం 150 క్యాంటీన్ల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. క్యాంటీన్లు పెట్టే మహిళాసంఘాలకు హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం, హాస్పిటాలిటీ మేనేజ్మెంట్లో శిక్షణ, వివిధ రూపాల్లో ప్రభుత్వ సహకారాన్ని అందించనున్నారు. క్యాంటీన్ల మోడళ్లను బట్టి ఒక్కో దానికి ఏటా రూ.ఏడున్నర లక్షల నుంచి రూ.12 లక్షల దాకా లాభం ఉంటుందని అంచనా వేస్తున్నారు. -
ఎస్‌హెచ్‌జీలకు రూ.20 వేల కోట్లు
సాక్షి, హైదరాబాద్: 2024–25లో రాష్ట్రంలోని 3,56, 273 స్వయం సహాయక మహిళా సంఘాలకు (ఎస్‌హెచ్‌జీ) రూ.20,000.39 కోట్లు అందించే లక్ష్యంగా బ్యాంక్ లింకేజీ వార్షిక రుణ ప్రణాళికను పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఆవిష్కరించారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ– గ్రామీణాభివృద్ధి సంస్థ ఎస్‌హెచ్‌జీ– బ్యాంక్ లింకేజి వార్షిక ఋణ ప్రణాళికలో భాగంగా శనివారం దీనిని విడుదల చేశారు. ఎస్‌హెచ్‌జీ వార్షిక ఋణ ప్రణాళికను ఆవిష్కరించిన అనంతరం మంత్రి సీతక్క మాట్లాడుతూ ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.20 వేల కోట్లకు వార్షిక రుణ ప్రణాళికతో పాటు అదనంగా 2,25,000 మహిళలకు వివిధ జీవనోపాధి కార్యక్రమాల నిమిత్తం రూ.4,500 కోట్లు బ్యాంకుల నుంచి సహాయం అందించనున్నట్టు తెలియజేశారు. మహిళాశక్తి క్యాంటీన్లను త్వరలోనే ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. కాంగ్రెస్ ప్రభు త్వం వచ్చాక మహిళల ఆర్థిక అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యతనివ్వడంతో పాటు బ్యాంకుల ద్వారా వ్యక్తిగత రుణాలు ఇప్పిస్తున్నట్టు తెలిపారు. మహిళా సంఘాలకు ఏ పూచీకత్తు లేకుండా ఇతోధికంగా ఋణాలు అందిస్తున్నందుకు మహిళల తరపున, ప్రభుత్వం తరపున బ్యాంకు అధికారులకు ధన్యవాదాలు తెలియజేశారు. సమావేశంలో పీఆర్‌శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, నాబార్డ్ సీజీఎం సుశీల చింతల తదితరులుపాల్గొన్నారు. -
15 వేల అంగన్వాడీ కేంద్రాల్లో ఇంగ్లిష్ మీడియం
ములుగు: ఆంధ్రప్రదేశ్‌లో అమలవుతున్న తరహా లోనే తెలంగాణలో కూడా ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డి ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 15 వేల అంగన్వాడీ సెంటర్లను మినీ ఇంగ్లిష్ మీడియం స్కూళ్లుగా అప్డేట్ చేస్తున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. గురువారం మంత్రి ములుగు జిల్లా బండారుపల్లి మోడల్సూ్కల్ విద్యార్థులకు ప్రభుత్వం తరఫున యూనిఫాం, నోట్ పుస్తకాలను అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఎంపీ బలరాంనాయక్ మోడల్ స్కూళ్లను మంజూరు చేయించారని గుర్తు చేశారు. తర్వాత ములుగు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో వానాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. కొందరి పనితీరుపై మాట్లాడుతూ, ఇష్టం ఉంటే గ్రామీణ, ఏజెన్సీ ప్రాంతాల ప్రజల అభివృద్ధికి పనిచేయాలని, లేనిపక్షంలో ట్రాన్స్ఫర్ చేసుకొని వెళ్లిపోవచ్చని హెచ్చరించారు. ఇదే క్రమంలో అర్హత పేరుతో ఆశ కార్యకర్తలకు పరీక్ష నిర్వహించే విధానాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో ఆశ కార్యకర్తలు కలెక్టరేట్ పక్కన బైఠాయించారు. క్షేత్రస్థాయిలో అన్ని రకాల వైద్య సేవలు అందిస్తున్న తమకు ఫిక్స్డ్ వేతనంగా రూ.18 వేలు అందించాలని నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న డీఎంహెచ్ఓ అల్లెం అప్పయ్య కొంత మంది ఆశ కార్యకర్తలను మంత్రి వద్దకు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా వారు మంత్రికి వినతిపత్రం అందించారు. కాగా, ఆశ కార్యకర్తల డిమాండ్లు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయని, ఆగస్టు వరకు సమస్య పరిష్కరిస్తామని మంత్రి సీతక్క హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. -
నిరసనల ’ప్రజావాణి’
లక్డీకాపూల్: మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్‌లో మంగళవారం ప్రజావాణి కార్యక్రమం నిరసనలు, ఆందోళనల మధ్య సాగింది. లోక్‌సభ ఎన్నికల నియమావళి ముగిసిన తర్వాత పునఃప్రారంభమైన ప్రజావాణికి పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క హాజరై ప్రజల నుంచి అర్జీలు స్వీకరించడంతో పాటు వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తమకు అన్యాయం జరిగిందనీ, న్యాయం చేయాలంటూ వివిధ సంఘాల నేతలు ప్రజాభవన్ ఎదుట బైఠాయించారు. విధుల నుంచి తొలగించిన తమకు న్యాయం చేయాలంటూ పెద్దఎత్తున ఆర్టీసీ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. పెరిగిన డీజిల్, పెట్రోల్ ధరలకు అనుగుణంగా ప్యాకేజీ పెంచాలని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ డ్రైవర్స్ కం ఓనర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో పాత ప్యాకేజీపై వాహనాలు నడపడం చాలా కష్టమని, ప్యాకేజీని రూ.55 వేలకు పెంచాలని అసోసియేషన్ నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంత్రి సీతక్కకు అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సి.రాజేశ్వరరావు, జి. దేవేందర్ వినతిపత్రాన్ని సమర్పించారు. తాను కొనుగోలు చేసిన భూమిని ధరణిలో నమోదు చేయకపోవడంతో కబ్జాకి గురైందంటూ మాజీ సీఆర్పీఎఫ్ ఉద్యోగి ఇమ్మడి సోమయ్య ఆందోళన వ్యక్తం చేశారు. ఇలా అన్ని విభాగాలకు సంబంధించి మొత్తం 702 దరఖాస్తులు నమోదయ్యాయి. రెవెన్యూ పరమైన సమస్యలకు సంబంధించి 219 దరఖాస్తులు, మున్సిపల్ శాఖకు సంబంధించి 54, హోం శాఖకు సంబంధించి 52, హౌసింగ్ శాఖకు సంబంధించి 44, పౌరసరఫరాల శాఖకు సంబంధించి 46, ఇతర శాఖలకు సంబంధించి 287 దరఖాస్తులు అందినట్లు ప్రజావాణి ప్రత్యేక అధికారి, మున్సిపల్ శాఖ సంచాలకులు దివ్య వెల్లడించారు. కార్యక్రమంలో ప్రజావాణి ఇంఛార్జి, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ జి.చిన్నారెడ్డి, ఆయా శాఖల సీనియర్ అధికారులు పాల్గొన్నారు. -
మంత్రి సీతక్క గిరిజన డ్యాన్స్
-
అవ్వ డప్పుకు అడుగు కదిపిన సీతక్క
-
కాంగ్రెస్‌లో చేరిన కోనప్ప
కాగజ్‌నగర్ రూరల్: సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాగజ్ నగర్ పట్టణంలోని విన య్ గార్డెన్లో గురువా రం నిర్వహించిన సమా వేశంలో ఉమ్మడి ఆదిలా బాద్ జిల్లా ఇన్చార్జ్ మంత్రి సీతక్క కండువా కప్పి కోనప్పను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. కోనప్పతోపాటు ఆయన సోదరుడు, ఇన్చార్జ్ జెడ్పీ చైర్మన్ కోనేరు కృష్ణారావు, కాగజ్‌నగర్ మున్సిపల్ చైర్పర్సన్ షాహీనా సుల్తానా, వైస్‌చైర్మన్ రాజేందర్, పలువురు ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ముఖ్య నాయకులు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ ఆదిలాబాద్ ఎంపీ స్థానాన్ని గెలిపించడానికి కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు కొక్కిరాల విశ్వప్రసాద్‌రావు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, మాజీ ఎమ్మెల్యే రేఖానాయక్, సిర్పూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ రావి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
ఆగస్టు నుంచి ట్రైబల్ వర్సిటీలో క్లాసులు
ములుగు, రాయదుర్గం: సమ్మక్క–సారక్క ట్రైబల్ యూనివర్సిటీలో తొలి ఏడాది బీఏ (ఇంగ్లిష్), బీఏ (సోషల్ సైన్స్) కోర్సులను ఆగస్టు 1వ తేదీ నుంచి ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి వెల్లడించారు. ములుగు జిల్లా జాకారం సమీపంలోని యూత్ ట్రైనింగ్ సెంటర్లో యూనివర్సిటీ తాత్కాలిక క్యాంపు కార్యాలయాన్ని శుక్రవారం ఆయన.. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖమంత్రి సీతక్క, ఎంపీ మాలోత్ కవితతో కలిసి ప్రారంభించారు. అనంతరం కిషన్‌రెడ్డి మాట్లాడుతూ, అటవీశాఖ అభ్యంతరాలతో మధ్యలోనే నిలిచిన 50 ఎకరాల స్థలాన్ని త్వరితగతిన అప్పగించినట్లయితే పీఎం మోదీ, సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా గిరిజన యూనివర్సిటీకి భూమి పూజ చేసుకుందామని అన్నారు. ఇప్పటివరకు వివిధ కారణాలతో ఆ లస్యమైనప్పటికీ 337 ఎకరాలను రాష్ట్రం కేటాయించిందని చెప్పారు. అన్ని రకాల క్లియరెన్స్ వస్తే కాంపౌండ్ వాల్, డీపీఆర్, టెండర్ ప్రక్రియలను ప్రారంభిస్తామని తెలిపారు. ట్రైబల్ యూనివర్సిటీ గిరిజన యువతలో గేమ్ చేంజర్‌గా మారనుందని కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. యూనివర్సిటీలో 33 శాతం రిజర్వేషన్లను గిరిజనులకే కేటాయిస్తామని ఆయన స్పష్టం చేశారు. గిరిజన ఆచారాలు, సంస్కృతి, వైద్యపరమైన మూలికలు, అడవి జీవన విధానాలు రీసెర్చ్‌లో భాగంగా ఉంటాయని తెలిపారు. ఈ యూనివర్సిటీకి మెంటార్ యూనివర్సిటీగా గచ్చి బౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వ్యవహరిస్తుందని తెలిపారు. యూజీసీ అ«దీనంలోని వెళ్లేంతవరకు హెచ్‌సీయూ అసోసియే ట్ ప్రొఫెసర్ వంశీ కృష్ణారెడ్డిని ఓఎస్డీగా నియమించినట్టు వివరించారు. అనంతరం వెంకటాపురం(ఎం) మండలంలోని యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయాన్ని కేంద్ర మంత్రి సందర్శించి రామలింగేశ్వరుడికి పూజలు చేశారు. ఈ సందర్భంగా ప్రసాద్ పథకంలో భాగంగా చేపడుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. కార్యక్రమంలో గిరిజన శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ శరత్, కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఐటీడీఏ పీఓ చిత్ర మిశ్రా, కంట్రోలర్ ఎగ్జామినేషన్ పోరిక తుకారాం తదితరులు పాల్గొన్నారు. వేయిస్తంభాల గుడిలో కల్యాణ మండపాన్ని ప్రారంభించిన కిషన్‌రెడ్డి హనుమకొండ కల్చరల్: పవిత్రమైన మహాశివరాత్రి రోజున వేయిస్తంభాల కల్యాణ మండపాన్ని మహాశివుడికి అంకితం చేస్తున్నామని కేంద్ర పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం వరంగల్ నగరంలోని శ్రీరుద్రేశ్వరస్వామి వారి వేయిస్తంభాల దేవాలయంలో కల్యాణమండపాన్ని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రారంభించారు. అంతకుముందు ఆయన కుటుంబ సమేతంగా శ్రీరుద్రేశ్వరశివలింగానికి అభిõÙకం నిర్వ హించారు. కార్యక్రమంలో శాసనమండలి డిప్యూటీ చైర్మ న్ బండా ప్రకాశ్, ఎంపీ పసునూరి దయాకర్, హనుమకొండ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి పాల్గొన్నారు. -
సర్వం సిద్ధం..
ఎస్ఎస్ తాడ్వాయి: మేడారం మహాజాతర కుంభమేళాకు సర్వం సిద్ధం చేశామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళ, శిశు సంక్షేమశాఖ మంత్రి ధనసరి సీతక్క అన్నారు. ఆదివారం ములుగు జిల్లా ఎస్‌ఎస్‌తాడ్వాయి మండలం మేడారంలో శ్రీ సమ్మక్క–సారలమ్మలను దర్శించుకుని పూజలు చేసిన అనంతరం మంత్రి మాట్లాడారు. ఈనెల 21 నుంచి 24 వరకు జరిగే మహాజాతరకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని, జంపన్నవాగుపై స్నాన ఘట్టాలు, క్యూ లైన్లు, తాగునీరు, రోడ్లు, బస్టాండ్ పనులు పూర్తయ్యాయని తెలిపారు. ఈనెల 23న సీఎం రేవంత్‌రెడ్డి, గవర్నర్‌తో పాటు రాష్ట్రపతి మేడారానికి వచ్చే అవకాశం ఉందని తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి, అదనపు కలెక్టర్ శ్రీజ, ఐటీడీఏ పీఓ అంకిత్, ఎస్పీ డాక్టర్ శబరీశ్, ఈఓ రాజేంద్రం పాల్గొన్నారు. ఈనెల 14న మండమెలిగె పండుగ మహాజాతర ప్రారంభానికి ఇంకా తొమ్మిది రోజుల సమయం మాత్రమే ఉంది. ఇప్పటికే లక్షల సంఖ్యలో భక్తులు వనదేవతలను దర్శించుకున్నారు. ఆదివారం కూడా తెలుగు రాష్ట్రాలతోపాటు ఛత్తీస్‌గఢ్, ఒడిశా, మహారాష్ట్ర నుంచి లక్షలాది మంది తరలివచ్చారు. 14న బుధవారం సమ్మక్క– సారలమ్మ పూజారులు మండమెలిగె పండుగ నిర్వహించనున్నారు. ఉత్సవ కమిటీ చైర్మన్‌గా లచ్చుపటేల్ సమ్మక్క–సారలమ్మ మహాజాతర ఉత్సవ కమిటీని దేవాదాయ శాఖ నియమించింది. చైర్మన్‌గా అరెం లచ్చుపటేల్, కమిటీ సభ్యులుగా మిల్కూరి అయిలయ్య, కోడి గోపాల్, గంగెర్ల రాజారత్నం, కొంపెల్లి శ్రీనివాస్‌రెడ్డి, యాప అశోక్, పోరిక నారాయణ్‌సింగ్, ముంజల భిక్షపతి, సుంచ హైమావతి, చామర్తి కిషోర్, కొరం అబ్బయ్య, ఆలం శశిధర్, వద్దిరాజు రవిచంద్ర, అంకం క్రిష్ణస్వామి, ఎక్స్ అఫీషియో మెంబర్‌గా పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావును నియమించారు. చైర్మన్‌తో పాటు డైరెక్టర్ల ప్రమాణ స్వీకారం త్వరలో చేయనున్నట్లు తెలిసింది. -
మేడారం జాతరకు రావాలని గవర్నర్ తమిళిసైని ఆహ్వానించిన సీతక్క
-
మేడారం జాతర ఏర్పాట్లపై..సీతక్క సీరియస్
-
ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల్లో అనాథలకు 2 % కోటా
సాక్షి, హైదరాబాద్ : ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల్లో తల్లిదండ్రులు లేనివారికి (అనాథలు) రెండు శాతం కోటా కేటాయించేందుకు కసరత్తు చేయాలని అధికారులను రాష్ట్ర పీఆర్, మహిళ, శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క ఆదేశించారు. పిల్లలను దత్తత తీసుకునేందుకు అనేకమంది ఆసక్తి కనబరుస్తున్నా, నిబంధనలు కఠినంగా ఉండడంతో ఎక్కువమంది ముందుకు రావడం లేదన్నారు. దీనికి సంబంధించిన నిబంధనలను కూడా సులభతరం చేయాలని సూచించారు. అంగన్వాడీలకు వచ్చే పాలను సాధ్యమైనంత వరకు మండల కేంద్రాల్లో ఉన్న డెయిరీల ద్వారా సేకరించాలని, ఇందుకు ఒక పైలట్ ప్రాజెక్టు చేపట్టాలని ఆదేశించారు. మంగళవారం సచివాలయంలో మహిళ, శిశు సంక్షేమశాఖపై ఆమె సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ పిల్లల రక్షణ యూనిట్స్‌కు ట్రైనింగ్ ఇవ్వాలని, ఎన్జీవోల ఆధ్వర్యంలో నడిచినా డిపార్ట్మెంట్ నియంత్రణ ఉండాలన్నారు. ఇతర ప్రాంతాల నుంచి ఒకటి, రెండు రోజుల పనికోసం వచ్చే వర్కింగ్ ఉమెన్‌కు ముఖ్యమైన పెద్ద నగరాల్లో శాఖాపరంగా హాస్టళ్లు ఏర్పాటు చేసే ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. ప్రతి జిల్లాలో వృద్ధాశ్రమాలు కూడా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల దగ్గరే అంగన్వాడీ కేంద్రాలు ఉండేవిధంగా అధికారులు చొరవ చూపాలనన్నారు. ఈ సందర్భంగా శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రికి వివరించారు. ఈ సమావేశంలో మహిళ, శిశు సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాకాటి కరుణ, ఇతర అధికారులు పాల్గొన్నారు. ‘స్త్రీ నిధి’ దుర్వినియోగంపై విచారణ కమిటీ అధికారులకు మంత్రి సీతక్క ఆదేశం సాక్షి, హైదరాబాద్: స్త్రీ నిధి పథకంలో నిధుల దుర్వినియోగం ఫిర్యాదులపై శాఖాపరమైన విచా రణ కమిటీని ఏర్పాటు చేయాలని అధికా రులను పంచాయతీరాజ్, మహిళా శిశుసంక్షేమ శాఖల మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) ఆదేశించారు. ఈ నిధులు పక్కదారి పట్టకుండా చర్యలు తీసుకోవా లని సూచించారు. ఈ నిధుల దుర్వినియోగంపై ఉమ్మడి వరంగల్ జిల్లాలో వస్తున్న ఆరోపణలు, జరిగిన ప్రచారం వల్ల దీనిపై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లే ప్రమాదం ఉందని, ఈ నేపథ్యంలో కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. మంగళవారం సచివా లయంలో స్త్రీనిధి క్రెడిట్ కో ఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్‌పై సమీక్ష సందర్భంగా సీతక్క మాట్లాడుతూ, స్త్రీనిధిలో పెండింగ్‌లో ఉన్న అన్ని లోన్లను వెంటనే క్లియర్ చేయాలని, మారుమూల ప్రాంతాల్లో ఉండే ప్రజలకు రుణాలు ఎక్కువ ఇచ్చేలా చొరవ చూపాలని సూచించారు. హైవేలతో పాటు ఇతర ప్రధానమైన రోడ్లకు ఇరుపక్కల వివిధ రకాల పండ్లు, కూరగా యలు, ఇతర వస్తువులు అమ్ముకునే వారికి షెడ్స్ ఏర్పాటు ద్వారా మరింత ఉపాధి పొందటానికి అవ కాశం ఉంటుందని చెప్పారు. ఈ తరహా ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ట్రైబల్ ఏరియాలో ఎలాంటి అవసరాలు ఉన్నాయో గుర్తించేందుకు అవసరమైన అధ్యయనం చేయాలని సూచించారు. మహిళలు వంద శాతం స్వయం సహాయక సంఘాలలో జాయిన్ అయ్యేలా చూడాలని ఆదేశించారు. ఇక నుంచి ప్రతినెలా ఒకసారి సమీక్షా సమావేశం ఉంటుందని, మహిళల ఆర్థిక సాధికారికత పెంచేందుకు తీసుకోవాల్సిన అన్ని చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి ఆదేశించారు. సమావేశంలో పీఆర్, ఆర్డీ ముఖ్యకార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, మహిళ, శిశు సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాకాటి కరుణ, స్త్రీనిధి డైరెక్టర్ విద్యాసాగర్‌రెడ్డి పాల్గొన్నారు. -
విద్యార్థుల ప్రతిభతోనే..దేశ గౌరవం ఇనుమడిస్తుంది
సాక్షి, హైదరాబాద్: విద్యార్థులు కనబర్చే ప్రతిభతోనే దేశ గౌరవం పెరుగుతుందని రాష్ట్రప్రతి ద్రౌపదీ ముర్ము చెప్పారు. విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత గురువులదేనన్నారు. మంగళవారం హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (హెచ్‌పీఎస్) శతాబ్ది ఉత్సవాల్లో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించేలా పట్టుదలతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. విద్యార్థులు జీవన నైపుణ్యాలను నేర్చుకోవడంపైనా దృష్టి సారించాలని సూచించారు. ప్రకృతి, పర్యావరణంపైనా అవగాహన పెంచుకోవాలని, స్వార్థ ప్రయోజనాలు కాకుండా ఇతరులకు సహాయపడే గుణాన్ని అలవర్చుకోవాలని చెప్పారు. జీవితంలో అభిరుచులను స్థిరంగా కొనసాగించడం చాలా అవసరమని, ఇవి సానుకూల శక్తిని పెంపొందించడమే కాకుండా ఇతరులకు ప్రేరణగా పని చేస్తాయన్నారు. దేశానికి గుర్తింపు తెచ్చి పెట్టింది.. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ గొప్ప గొప్ప విద్యార్థులను అందించి దేశానికి మంచి గుర్తింపును తెచ్చిపెట్టిందని ద్రౌపదీ ముర్ము కొనియాడారు. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్ల లాంటి అనేకమంది గొప్పవాళ్లను ఈ స్కూల్ అందించిందని గుర్తు చేశారు. వందేళ్ల చరిత్ర కలిగిన ఈ సంస్థ అనేక సవాళ్లను ఎదుర్కొని ఉండొచ్చని, దాని అనుభవాల ఆధారంగా విద్యార్థులను శక్తివంతంగా తీర్చిదిద్దవచ్చన్నారు. విభిన్న నేపథ్యాల నుంచి వచ్చిన విద్యార్థులు కలిసి చదువుకోవడానికి, ఒకరి నుంచి ఒకరు నేర్చుకోవడానికి ప్రోత్సహించే వాతావరణాన్ని కల్పించినందుకు హెచ్‌పీఎస్‌ను అభినందించారు. పాఠశాల శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొనడం సంతోషదాయకంగా ఉందంటూ... ఈ స్కూల్లో చదివిన విద్యార్థులను ఉన్నత స్థాయికి తీసుకెళ్లిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. చదువు, క్రీడలు రెండు కళ్లు: గవర్నర్ విద్యార్థులకు చదువు, క్రీడలు రెండు కళ్లలాంటివని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. విద్యార్థులను తరగతి గదుల నుంచి క్రీడా, సామాజిక రంగానికి తరలించడం అత్యవసరమని అభిప్రాయపడ్డారు. అప్పుడే సమాజంలో ఎలా ప్రవర్తించాలో అలవడుతుందని చెప్పారు. హెచ్‌పీఎస్ ఆనేక దిగ్గజాలను తయారు చేసిందని, ఇక్కడ చదువుకున్న విద్యార్థులు రాష్ట్ర, దేశాభివృద్ధికి పాటుపడుతున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క, విద్యా శాఖ ముఖ్యకార్యదర్శి బి.వెంకటేశంపాల్గొన్నారు. అంతకుముందు స్కూల్ శతాబ్ది ఉత్సవాలను రాష్ట్రపతి జెండా ఊపి ప్రారంభించారు. వేడుకలు ఏడాది పొడవునా జరగనున్నాయి. -
మేడారం జాతరను దిగ్విజయం చేయాలి
ములుగు/ఎస్‌ఎస్‌తాడ్వాయి: ప్రజాప్రతినిధులు, అధికారులు, సంబంధిత వర్గాలు పార్టీలకు అతీతంగా పనిచేసి మేడారం జాతరను దిగ్విజయం చేయాలని పంచాయతీరాజ్, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఆదివారం తొలిసారిగా ములుగు నియోజకవర్గంలో అడుగు పెట్టిన ఆమెకు కాంగ్రెస్ పార్టీ నేతలు ఘనస్వాగతం పలికారు. అనంతరం విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. మేడారం జాతర ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష అనంతరం మంత్రి మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మేడారం మహాజాతరకు నిధుల మంజూరులో అలస్యమైందని, కాంగ్రెస్ నూతన ప్రభుత్వం ఏర్పడిన వారం రోజుల్లోనే సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి ఈ విషయం తీసుకెళ్లగా వెంటనే ఆయన నిధులు మంజూరు చేశారని తెలిపారు. జాతర ప్రాంతంలో అభివృద్ధి పనులను శాశ్వతంగా చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని, భక్తులకు తగిన సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని గతంలో కేంద్ర ప్రభుత్వాన్ని కోరామని, అలాగే జాతరకు నిధులు కేటాయించాలని కోరామని, ఈసారి కేటాయిస్తారని ఆశిస్తున్నామని పేర్కొన్నారు. అంతకుముందు మేడారంలోని ఐటీడీఏ అతిథిగృహంలో మంత్రి సీతక్క.. కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఐటీడీఏ పీఓ అంకిత్, అదనపు కలెక్టర్ శ్రీజ, ఎస్పీ గాష్ ఆలం, ఎంపీ మాలోత్ కవిత, జెడ్పీచైర్‌పర్శన్ బడే నాగజ్యోతితో కలసి జాతర ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. మేడారం జాతరకు ప్రాముఖ్యత పెరుగుతున్న నేపథ్యంలో భక్తుల తాకిడి జనవరి చివరి వారం నుంచే మొదలవుతున్నందున పనులన్నీ జనవరి 20 నాటికి పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. జాతరకు వచ్చే భక్తులకు రవాణా విషయంలో ఇబ్బందులు లేకుండా రోడ్లు వేయాలని, అవసరమైన చోట మరమ్మతులకు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మేడారంలో పార్కింగ్, వసతుల కల్పనలో ఇబ్బందులు రాకుండా అటవీ శాఖ అధికారులు సానుకూలంగా స్పందించాలని కోరారు. పర్యావరణ పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చి ప్లాస్టిక్ ఫ్రీ జాతరగా నిర్వహించడానికి కృషి చేయాలని సూచించారు. ములుగు ప్రజలకు మొదటి ప్రాధాన్యం.. ములుగులో జరిగిన ర్యాలీలో మంత్రి సీతక్క మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ మంత్రులు, స్థానిక నాయకులు కుట్రలు చేసి తనను అనేక ఇబ్బందుకు గురిచేశారని గుర్తుచేశారు. వెనుకబడిన ప్రాంతాల్లో రోడ్లు, నీటి సరఫరా వంటి సౌకర్యాలను క ల్పించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ములుగు నియోజకవర్గమే తన ఇల్లని.. మొదటి ప్రాధాన్యం ములుగు ప్రజలకే ఇస్తానని, అవసరం అయితే ఇక్కడి నుంచే రాష్ట్రవ్యాప్త కార్యక్రమాలను కొనసాగిస్తానని సీతక్క చెప్పారు. -
గ్రామీణ ప్రాంతాల నీటిసరఫరాపై పర్యవేక్షణ ఉంచండి
సాక్షి, హైదరాబాద్: గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా పరిస్థితిని ప్రతిరోజూ నిశితంగా పర్యవేక్షించాలని అధికారులను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) ఆదేశించారు. ప్రతి గ్రామానికి రోజువారీ నీటి సరఫరా జరిగేలా చూడాలని శాఖ ఇంజనీర్లను కోరారు. మేడారం జాతరపై త్వరలోనే వివిధ విభాగాలతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. మిషన్ భగీరథ శాఖ కార్యకలాపాలపై చీఫ్ ఇంజనీర్లు, సూపరింటెండింగ్ ఇంజనీర్లతో శుక్రవారం మంత్రి సీతక్క సమీక్ష నిర్వహించారు. వేసవికాలంలో నీటి ఎద్దడి నివారణ చర్యలు తీసుకోవాలని, రిజర్వాయర్లు, నదులు తదితర తాగునీటి వనరుల స్థాయిలను నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా మిషన్ భగీరథ శాఖ కార్యకలాపాల గురించి ఆ శాఖ కార్యదర్శి స్మితా సభర్వాల్ మంత్రికి వివరించారు. -
మేడారం జాతరకు జాతీయ హోదా కోసం కృషి
సాక్షి, హైదరాబాద్: మేడారం సమ్మక్క–సారక్క జాతరకు జాతీయ పండుగ హోదా దక్కేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క చెప్పారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి మరోసారి ప్రతిపాదనలు పంపాలని అధికారులను ఆమె ఆదేశించారు. జాతీయ పండుగ హోదాతో రాష్ట్ర ప్రభుత్వమిచ్చే నిధులకు కేంద్ర నిధులు తోడైతే జాతరను మరింత ఘనంగా నిర్వహించుకునే అవకాశం ఉంటుందన్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించే జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. సమ్మక్క–సారక్క జాతర ఏర్పాట్లపై సోమవారం డీఎస్ఎస్ భవన్లో గిరిజన సంక్షేమ శాఖ అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. కోయ గిరిజన ఇలవేల్పుల సమ్మేళనం ఈసారి జాతర సమయంలో జరిగేటట్లు చూడాలని, తద్వారా భక్తులకు గిరిజన సాంస్కృతిక వైభవం గురించి బాగా తెలుస్తుందని మంత్రి సూచించారు. జాతర ఏర్పాట్లపై వచ్చే వారం ఏటూరునాగారంలోని ఐటీడీఏలో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించనున్నట్లు వెల్లడించారు. పల్లె ప్రజలకు మరింత చేరువ కావాలి పంచాయతీ రాజ్ శాఖ ద్వారా జరిగే కార్యక్రమాలు గ్రామీణ ప్రాంత ప్రజలకు నిత్యం ఎంతో ఉపయోగ పడేవనీ, వాటిని మరింత సమర్ధవంతంగా ప్రజలకు చేరువయ్యేలాగా అధికారులు పనిచేయాలని ఆశాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క సూచించారు. సోమవారం రాజేంద్రనగర్ టి.ఎస్.ఐ.ఆర్.డి.లో శాఖ ఉన్నతాధికారులతో సమావేశమైన మంత్రి శాఖ పని తీరును సమీక్షించారు. పీఆర్ ఆర్డీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, స్పెషల్ కమిషనర్ ప్రదీప్ కుమార్ శెట్టి, ఇంజనీర్ ఇన్ చీఫ్ సంజీవ రావు, స్త్రీనిధి ఎండీ విద్యాసాగర్ రెడ్డి ఆయా విభాగాల వారీగా చేపడతున్న కార్యక్రమాల గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. -
మంచి శాఖలు కేటాయించారు, ప్రజలకు సేవచేస్తా..
సాక్షి, హైదరాబాద్/కాచిగూడ: పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా, శిశు సంక్షేమ శాఖలను తనకు కేటాయించడంపట్ల మంత్రి ధనసరి అనసూయ(సీతక్క) సంతృప్తి వ్యక్తం చేశారు. శనివారం తనను కలిసిన మీడియా ప్రతినిధులతో సీతక్క మాట్లాడుతూ.. తనకు మంచి శాఖలను కేటాయించారని, గ్రామస్థాయిలో ప్రజల సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడతామని చెప్పారు. సర్పంచ్ల సమస్యలపై దృష్టి సారిస్తామని తెలిపారు. తండాలను పంచాయతీలుగా చేసినా వాటి అభివృద్ధికి గత ప్రభుత్వం నిధులు కేటాయించలేదని, అడవి బిడ్డగా గిరిజన, ఆదివాసీ తెగలకు న్యాయం చేసేందుకు కృషి చేస్తానన్నారు. కాగా, మంత్రి సీతక్కను జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య నేతృత్వంలో పలువురు బీసీ నేతలు శనివారం మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. బీసీల సమస్యలు పరిష్కరించేలా చొరవ తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు, సీనియర్ కాంగ్రెస్ నేత నీరడి భూపేష్ సాగర్, నీలం వెంకటేష్, వేముల రామకృష్ణ, నిఖిల్ పాల్గొన్నారు. -
మంత్రి రేసులో సీతక్క, సురేఖ
సాక్షి ప్రతినిధి, వరంగల్: ‘తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసే ప్రభుత్వంలో తొలి కేబినేట్లో ఉమ్మడి జిల్లా నుంచి ఎవరికి అవకాశం దక్కుతుంది? 18 మంది మంత్రివర్గ సహచరులతో కొత్త సీఎం పరిపాలన చేయనున్న నేపథ్యంలో జిల్లాలో ఎందరికి అవకాశం దక్కనుంది? జిల్లాలో మొత్తం 10 స్థానాల నుంచి గెలిచిన ఎమ్మెల్యేల్లో ఎవరిని మంత్రి పదవి వరించనుంది?’ ఇదీ ఉమ్మడి వరంగల్‌లో సర్వత్రా సాగుతున్న చర్చ. 2023 అసెంబ్లీ ఎ న్నికల ఫలితాలు వెలువడిందే తడవుగా ప్రభుత్వం ఏర్పాటులో భాగంగా సోమవారం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని హోటల్ ఎల్లాలో ఏఐసీసీ నేతలు మాణిక్‌రావు ఠాగూర్, డీకే శివకుమార్, టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, నేతలు భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తదితరులతో పాటు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించారు. ఏకవాక్య తీర్మానంతో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు నిర్ణయాధికారం అప్పగించారు. సాయంత్రం వరకు సీఎల్పీ నేత ఎంపిక పూర్తవుతుందని భావించినా.. అది మంగళవారానికి వాయిదా పడింది. సీఎల్పీ నిర్వహించిన ఏఐసీసీ పరిశీలకులకు ఢిల్లీ నుంచి ఆహ్వానం అందింది. సీఎల్పీ నేత ఎంపికతో పాటు మంత్రివర్గ కూర్పు కూడా అక్కడే జరగనున్న నేపథ్యంలో.. ఆజాబితాలో జిల్లా నుంచి ఎవరుంటా రు? ఉమ్మడిజిల్లా నుంచి మంత్రిగా ఎవరికి అవకా శం దక్కుతుందనేది చర్చనీయాంశంగా మారింది. మంత్రి రేసులో సీతక్క, సురేఖ ఉమ్మడి వరంగల్‌లో 12 అసెంబ్లీ స్థానాలకుగాను 10 చోట్ల కాంగ్రెస్ విజయం సాధించగా.. ఇక్కడి నుంచి ఇద్దరికి అవకాశం లభించవచ్చంటున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలోనూ పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్సీ సత్యవతిరాథోడ్‌కు మంత్రి పదవులు దక్కాయి. ఈనేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ ఇద్దరికి అవకాశం ఉంటుందంటున్నారు. ములుగు నుంచి వరుసగా రెండోసారి 33,700 పైచిలుకు ఓట్లతో గెలిచిన ధనసరి సీతక్కకు మొదట కీలకమైన మంత్రి పదవి వరించనుందనే చర్చ జరుగుతుండగా.. రెండో మంత్రి కోసం కొండా సురేఖ రేసులో ఉన్నట్లు చెబుతున్నారు. ► ములుగు మండలం జగ్గన్నపేటకు చెందిన వ్యవసాయకూలీల కుటుంబంలో పుట్టిన సీతక్క రాజకీయాల్లోకి రాకముందు జనశక్తి పార్టీకి సంబంధించిన అజ్ఞాత దళంలో దళ కమాండర్‌గా పని చేశారు. ఆతర్వాత జనజీవన స్రవంతిలో కలిసి ఎల్ఎల్బీ పూర్తి చేశారు. న్యాయవాదిగా వరంగల్ కోర్టులో ప్రాక్టీసు చేశారు. అనంతరం రాజకీయ రంగ ప్రవేశం చేసి రెండుసార్లు ము లుగు నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మూడోసారి గెలిచి కీలక నాయకురాలిగా ఎదిగిన ఆమెను రేవంత్‌రెడ్డి దేవుడిచ్చిన ఆడబిడ్డగా చెప్పారు. ఏఐసీసీ అధిష్టానంలోనూ మంచిపేరున్న ఆమెకు మంత్రి పదవి ఖాయమైనట్లే అంటున్నారు. ► రెండో మంత్రి పదవి కోసం వరంగల్ తూర్పు నుంచి గెలుపొందిన కొండా సురేఖ ప్రయత్నంలో ఉన్నారు. బీసీ(పద్మశాలి) సామాజిక వర్గానికి చెందిన కొండా సురేఖ ఎంపీటీసీ నుంచి మంత్రి వరకు అనేక పదవుల్లో కొనసాగారు. గీసుకొండ ఎంపీపీగా, 1999, 2004 శాయంపేట ఎమ్మెల్యేగా, 2009 పరకాల, 2014లో వరంగల్ తూర్పు ఎమ్మెల్యేగా, 2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్ కేబినెట్లో రాష్ట్ర మంత్రిగా పని చేశారు. భర్త కొండా మురళి సహకారంతో రాజకీయాల్లో రాణించి ఆమె కూడా ఈసారి వరంగల్ తూర్పు నుంచి గెలిచి మంత్రి పదవి ఆశిస్తున్నారు. ► టీడీపీ నుంచి 1994, 1999, 2004లో నర్సంపేట నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన రేవూరి ప్రకాశ్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరి ఈ ఎన్నికల్లో పరకాల నుంచి పోటీ చేసి ఘన విజయం సాధించారు. సీనియర్ నేత, శాసనసభ్యుడిగా ఉన్న రేవూరి కూడా మంత్రి పదవి ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. 7న ప్రమాణ స్వీకారం చేసే అవకాశం.. సోమవారం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని హోటల్ ఎల్లాలో ఏఐసీసీ నేతలు మాణిక్‌రావు ఠాగూర్, డీకే శివకుమార్.. ఎమ్మెల్యేలతో భేటీ అయిన నేపథ్యంలో సీఎల్పీ నేత, సీఎం పేరు ప్రకటిస్తారని అందరూ భావించారు. ఏకవాక్య తీర్మానంతో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు నిర్ణయాధికారం అప్పగించిన కొద్ది గంటల్లో సీఎల్పీ నేత ఎంపిక పూర్తయి కొత్త సీఎం రాత్రి 8.30 గంటలకు ప్రమాణస్వీకారం పూర్తవుతుందనకున్నారు. పూర్తిస్థాయిలో మంత్రివర్గంతో సోనియాగాంధీ జన్మదినం రోజున లాల్‌బహదూర్ స్టేడియంలో ప్రమాణ స్వీకారం ఉంటుందని కాంగ్రెస్ పెద్దలు ప్రకటించారు. సీఎల్పీ నేత ఎంపికపై స్పష్టమైన ప్రకటన రాకపోగా.. అందుకు భిన్నంగా ఏఐసీసీ పరిశీలకులుగా ఉన్న డీకే శివకుమార్, మాణిక్‌రావు ఠాగూర్ తదితరులకు ఢిల్లీకే రావాల్సిందిగా అధిష్టానం సూచించడంతో హుటాహుటిన బయల్దేరి వెళ్లారు. ఢిల్లీలోనే మంగళవారం సమావేశం కానున్న ఏఐసీసీ, టీపీసీసీ నేతలు.. సీఎంతో పాటు మంత్రి వర్గం కూర్పుపై తేల్చనున్నారని సమాచారం. కాగా ఇప్పటికే సీఎంగా రేవంత్‌రెడ్డి పేరు ఖరారైందని, 5, 6 తేదీల్లో మంచిరోజులు లేకపోవడంతో 7న ఉదయం 10 గంటలకు కొత్త సీఎం ప్రమాణస్వీకారం ఉంటుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ నుంచి ఎంపికయ్యే మంత్రులు కూడా అదే రోజు ప్రమాణం చేసే అవకాశం ఉందని పార్టీవర్గాల సమాచారం. -
సీతక్కకు మంత్రి పదవి !
-
గెలిపిస్తే మంత్రిగా తిరిగి వస్తా: సీతక్క
మహబూబాబాద్: రాష్ట్రంలో రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వమే అని తనను గెలిపిస్తే మంత్రిగా తిరిగి వచ్చి అభివృద్ధి చేస్తా అని ఎమ్మెల్యే అభ్యర్థి ధనసరి సీతక్క అన్నారు. మంగళవారం మండలంలోని నారాయణపూర్, రామారావుపల్లి, వెంకటేశ్వర్లపల్లి, బుర్గుపేట, రామకృష్ణాపూర్, ఆనందపూర్, పట్వారుపల్లి, లక్ష్మీదేవిపేట గ్రామాల్లో సీతక్క ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎంత మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వచ్చి బీఆర్ఎస్ తరఫున ప్రచారం చేసి రూ.కోట్లు ఖర్చు చేసిన ములుగులో కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయమన్నారు. తెలంగాణ రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షుడు నాయిని భరత్ సీతక్కకు మద్దతు పలికి ప్రచారంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర కిసాన్ సెల్ అధ్యక్షుడు అన్వేష్‌రెడ్డి, పీసీసీ సభ్యుడు మల్లాడి రాంరెడ్డి, మండలాధ్యక్షుడు సుర్యనారాయణ, నాయకులు బండి శ్రీనివాస్, అయిలయ్య, రవి పాల్గొన్నారు. సీతక్కను భారీ మెజారిటీతో గెలిపించాలి గోవిందరావుపేట: సీతక్కను భారీ మెజారిటీతో గెలిపించాలని కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి గనపాక సుధాకర్ అన్నారు. మండల కేంద్రంలోని బుస్సాపూర్ గ్రామంలో గ్రామ కమిటీ అధ్యక్షుడు పాలెం యాదగిరి ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు. ఏటూరునాగారం: మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సీతక్క తరఫున మండల నాయకుడు మనోజ్‌కుమార్ ఆధ్వర్యంలో ప్రచారం చేశారు. నర్సయ్య, లక్ష్మణ్, భాగ్య పాల్గొన్నారు. మంగపేట: మండలంలోని కమలాపురంలో కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు గుమ్మడి సోమయ్య సమక్షంతో చైతన్య ఆటో యూనియన్ మండల అధ్యక్షుడు ఎండి మైమూద్ ఆధ్వర్యంలో 70 మంది మంగళవారం రాత్రి కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారిని సోమయ్య కండువాలు కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో నాయకులు తూడి భగవాన్‌రెడ్డి, నర్సింహారావు, సంపత్, శివ, నూకల రాజేష్, అశోక్ పాల్గొన్నారు. -
35 మందితో కాంగ్రెస్ తొలి జాబితా!
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం వేగంగా సన్నద్ధమవుతున్న కాంగ్రెస్ పార్టీ.. ఈ నెలాఖరులోగా అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. తొలి విడతలో బలమైన, ముఖ్యమైన అభ్యర్థులతో ఏకాభిప్రాయం ఉన్న 30–35 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించాలని నిర్ణయించినట్టు తెలిసింది. తొలి జాబితాలో పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సీతక్క, పొదెం వీరయ్య, శ్రీధర్‌బాబు, జగ్గారెడ్డి, దామోదర రాజనర్సింహ, జీవన్‌రెడ్డి, జి.వినోద్, షబ్బీర్‌అలీ, సంపత్‌కుమార్, వంశీచంద్‌రెడ్డి, గడ్డం ప్రసాద్‌కుమార్, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వర్రావు, ఫిరోజ్‌ఖాన్, ప్రేమ్‌సాగర్‌రావు, అంజన్‌కుమార్ యాదవ్, పద్మావతిరెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, విజయరమణారావు, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, వంశీకృష్ణ తదితరులు పేర్లు ఉండొచ్చని భావిస్తున్నారు. అక్టోబర్ రెండో వారానికి పూర్తి జాబితా... అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో భాగంగా ఇప్పటికే హైదరాబాద్‌లో తొలి భేటీ జరిపిన కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ.. గురువారం ఢిల్లీలోని కాంగ్రెస్ వార్‌రూమ్‌లో రెండో భేటీ నిర్వహించింది. కమిటీ చైర్మన్ మురళీధరన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కమిటీ సభ్యులతో పాటు రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే, రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మధుయాష్కీగౌడ్, ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు, ఇతర కార్యదర్శులు పాల్గొన్నారు. సుదీర్ఘంగా 8 గంటల పాటు జరిగిన ఈ భేటీలో 119 నియోజకవర్గాల నుంచి షార్ట్‌లిస్ట్ చేసిన 300 పేర్లపై చర్చించారు. అందులో ఒకే అభ్యర్థి ఉన్న స్థానాలు 30–35 వరకు ఉండగా.. రెండేసి పేర్లున్న స్థానాలు 20–30, ముగ్గురి చొప్పున ఉన్నవి 30–35, నలుగురు, ఆపైన పోటీపడుతున్న స్థానాలు 10–15 వరకు ఉన్నట్టు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ఇందులో ఒకే అభ్యర్థి ఉన్న జాబితాకు పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ ఆమోదం తీసుకుని.. ఈ నెలాఖరులోగా ప్రకటించాలని నిర్ణయించినట్టు సమాచారం. అక్టోబర్ తొలివారంలో రెండో జాబితా, రెండో వారంలో తుది జాబితా ప్రకటించాలని యోచనకు వచ్చినట్టు తెలిసింది. వరుసగా మూడుసార్లు ఓడిన నేతలకు టికెట్లు ఇవ్వకూడదని సమావేశంలో అభిప్రాయం వ్యక్తమైనట్టు తెలిసింది. ఇలాంటి నియోజకవర్గాలు 6 నుంచి 8 వరకు ఉన్నట్టు సమాచారం. సర్వేల ఆధారంగా.. స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు తాము చేసిన సర్వేల నివేదికను అందజేసినట్టు తెలిసింది. ఇద్దరు, ముగ్గురు, అంతకన్నా ఎక్కువ మంది పోటీపడుతున్న స్థానాల్లో ఎవరెవరికి ఎంత శాతం గెలుపు అవకాశాలు ఉన్నాయ న్న వివరాలను అందజేసినట్టు సమాచారం. దీనిని పరిగణనలోకి తీసుకున్న కమిటీ నేతలు.. అందులో నియోజకవర్గాల వారీగా 35 శాతానికిపైగా గెలుపు అవకాశాలున్న నేతల పేర్లను పరిగణనలోకి తీసుకుంటూ షార్ట్ లిస్ట్ సిద్ధం చేసినట్టు తెలిసింది. మరోవైపు బీజేపీ నుంచి చేరికలు ఉంటాయన్న అంశం కూడా భేటీలో ప్రస్తావనకు వచ్చింది. అలా చేరే అవకాశమున్న స్థానాలకు అభ్యర్థుల ప్రకటనను వారం పాటు పెండింగ్‌లో పెట్టాలని అభిప్రాయానికి వచ్చినట్టు తెలిసింది. టికెట్ దక్కని నేతలకు హామీలు! టికెట్ ఆశించి దక్కని నేతలకు వారి ప్రాధాన్యాన్ని బట్టి నేరుగా హైకమాండ్ పెద్దలతో పార్టీ, ప్రభుత్వ పదవులపై హామీలు ఇప్పించాలని స్క్రీనింగ్ కమిటీ భేటీలో నిర్ణయించినట్టు తెలిసింది. పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ పదవులతోపాటు పారీ్టలో ప్రాధాన్యం కలి్పంచే విషయాన్ని పార్టీ పెద్దలు మల్లికార్జున ఖర్గే, రాహుల్, ప్రియాంకగాంధీలతో చెప్పించనున్నారని సమాచారం. కాగా, టికెట్ ఆశిస్తున్న కొందరు నేతలు ఢిల్లీకి వెళ్లి అక్కడే మకాం వేసి ముఖ్య నేతలను ప్రస న్నం చేసుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు. 6 చోట్ల ప్రాధాన్యత కోరిన పొంగులేటి! స్క్రీనింగ్ కమిటీ భేటీ ముందు ఠాక్రే, రేవంత్, ఉత్తమ్, భట్టిలతో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి భేటీ అయ్యారు. ఖమ్మం జిల్లాకు సంబంధించి అభ్యర్థుల ఎంపికపై తన అభి ప్రాయాలను నేతలకు పొంగు లేటి వివరించి నట్టు తెలిసింది. ఖమ్మం, పాలేరు, సత్తుపల్లి, కొత్తగూడెం, అశ్వారావుపేట, పినపాక నియోజ కవర్గాల్లో తన వర్గం నేతలకు అవకాశం ఇవ్వా లని ఆయన కోరినట్టు సమాచారం. తనతో పాటు పార్టీలో చేరిన తుడి మేఘారెడ్డికి వన పర్తిలో ప్రాధాన్యం ఇవ్వాలని ప్రతిపాదించి నట్టు తెలిసింది. సర్వేలతో పోల్చి చూసి ఖరారు చేస్తామని ఠాక్రే హామీ ఇచ్చినట్టు తెలిసింది. -
రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్యే సీతక్క పీఏ దుర్మరణం
ములుగు: జిల్లా కేంద్రంలోని సాధన హైస్కూల్ సమీపంలో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ములుగు ఎమ్మెల్యే సీతక్క అంతర్గత పీఏ కొట్టం వెంకటనారాయణ(జబ్బర్) (36) దుర్మరణం పాలయ్యారు. వెంకటనారాయణ వ్యక్తిగత పనిమీద నర్సంపేటకు బైక్‌పై వెళ్లాడు. పని ముగించుకుని ములుగుకు చేరుకున్న ఆయన ఇంటికి వెళ్తున్న క్రమంలో సాధన హైస్కూల్ సమీపంలోకి రాగానే బైక్ స్కిడ్ అయ్యి డివైడర్‌ను ఢీకొట్టాడు. తల రోడ్డుకు బలంగా తగలడంతో తీవ్రరక్తస్రావమై అక్కడికక్కడే చనిపోయాడు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఏరియా ఆస్పత్రికి తరలించారు. వెంకటనారాయణ సీతక్క వద్ద 8 సంవత్సరాలుగా అంతర్గత పీఏగా పనిచేస్తున్నాడు. మృతుడికి భార్య సుమలత ఉంది. ఆమె స్థానికంగా కాంట్రాక్ట్ టీచర్‌గా పనిచేస్తుంది. ఒక కూతురు ఉంది. కాగా, హెల్మెట్ ఉంటే బతికేవాడని, తలకు బలమైన గాయాలు కావడంతో రక్తస్రావమై చనిపోయినట్లు స్థానికులు తెలిపారు. -
ఎన్నికల ప్రచారం కోసమే అసెంబ్లీ సమావేశాలు: సీతక్క
-
ఓటమి భయంతోనే సీతక్క డ్రామాలు
ములుగు: రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలవుతుందని సర్వేల్లో తేలినప్పటి నుంచి స్థానిక ఎమ్మెల్యే సీతక్క ఓటమి భయంతో డ్రామాలు మొదలుపెట్టిందని రెడ్కో చైర్మన్ యేరువ సతీశ్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని జెడ్పీ కార్యాలయంలో జెడ్పీ చైర్మన్ బడే నాగజ్యోతి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ పోరిక గోవింద్‌నాయక్‌తో కలిసి మంగళవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. గడిచిన నాలుగు రోజుల్లో వెంకటాపురం(ఎం) మండల పరిధిలోని బూర్గుపేట, కన్నాయిగూడెం మండలాల్లో కొంతమందిని ఎమ్మెల్యే సీతక్క ప్రలోభాలకు గురిచేసి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పిందన్నారు. జెడ్పీ చైర్మన్ జగదీశ్ మృతితో బాధలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ధైర్యం కోల్పోయే విధంగా ప్రయత్నాలు చేస్తుందని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ బూర్గుపేట గ్రామ పార్టీ అధ్యక్షుడు ప్రస్తుతం పార్టీలో ఉన్నారని తెలిపారు. గడిచిన తొమ్మిది సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూడకుండా పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతున్నారన్నారు. ఏం సాధించారని దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్నారని అడుగుతున్న వారికి కాళేశ్వరం ద్వారా 30 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కేవలం తెలంగాణలోనే 160లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ జరుగుతుందని తదితర అభివృద్ధి పథకాల గురించి వివరించారు. ములుగులో పార్టీ అభ్యర్థి ఓటమి చెందినా ములుగు జిల్లాను ఏర్పాటు చేసిన ఘనత సీఎం కేసీఆర్‌దని తెలిపారు. పార్టీ శ్రేణులు ఏకతాటిపై వచ్చి రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని పిలుపునిచ్చారు. అనంతరం నేడు మల్లంపల్లిలో కుసుమ జగదీశ్ దశదిన కర్మకు జిల్లాలోని నాయకులు తరలిరావాలని రెడ్కో చైర్మన్ సతీశ్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ వెంకటాపురం(ఎం) మండల అధ్యక్షుడు లింగాల రమణారెడ్డి, నాయకులు మల్క రమేష్, సానికొమ్ము రమేశ్‌రెడ్డి, మాసిపెద్ది సత్యనారాయణరావు, అశోక్, లింగాల రమణారెడ్డి, రమేష్, బుర్ర సమ్మయ్య, రామాచారి, స్వరూప పాల్గొన్నారు. -
కేటీఆర్ సీతక్కకు ఎంత ప్రాధాన్యత ఇచ్చాడో చూడండి
-
కాంగ్రెస్‌కు షాకిచ్చిన సీతక్క
-
సత్తా చాటాల్సిందే
సాక్షి, హైదరాబాద్: హుజూరాబాద్ ఉప ఎన్నికలో సత్తా చాటాలని కాంగ్రెస్ పార్టీ ఉవ్విళ్లూరుతోంది. టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి నియామకం తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికలో మంచి ఫలితం సాధించే దిశగా కార్యాచరణ రూపొందించుకుంటోంది. మొదటి నుంచీ పట్టున్న హుజూరాబాద్ నియోజకవర్గంలో కేడర్‌ను కాపాడుకోవడం ద్వారా వీలైనన్ని ఎక్కువ ఓట్లు రాబట్టవచ్చని, టీఆర్ఎస్–బీజేపీల బంధాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా ఓట్ల శాతాన్ని పెంచుకోవచ్చనే వ్యూహంతో ముందుకెళుతోంది. గతంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా తమకు 30 శాతానికి తగ్గకుండా ఓట్లు వచ్చిన పరిస్థితుల్లో ఈసారి కూడా ఆ ఓట్లను నిలబెట్టుకోవాలని, టీఆర్ఎస్–బీజేపీల మధ్య ఓట్ల చీలికను ఆసరాగా చేసుకొని గెలుపు తీరం చేరుకోవాలని ఆశిస్తోంది. మూడంచెల వ్యూహం... ఉపఎన్నికను మూడంచెల వ్యూహంతో ఎదు ర్కోవాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ ప్రణాళిక రూపొందిస్తున్నారు. నియోజకవర్గ స్థాయి పర్యవేక్షణలో మండలాలు, గ్రామాలవారీగా పని విభజన చేసుకొని ముందుకెళ్లేలా వ్యూహం రూపొందించారు. నియోజకవర్గ స్థాయి పర్యవేక్షణను స్వయంగా చేపడుతూ మండలాలవారీగా ఇన్చార్జీలను, చీఫ్ కో–ఆర్డినేటర్లను నియమించారు. ఇందులో కమలాపూర్‌కు ఎమ్మెల్యే సీతక్క, జమ్మికుంటకు శ్రీధర్‌బాబు, హుజూరాబాద్ పట్టణ, మండలానికి జగ్గారెడ్డి, ఇల్లంతుకుంట మండలానికి వేం నరేందర్‌రెడ్డి, వీణవంక మండలానికి ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డిలను నియమించారు. వారికి అనుబంధంగా మరో ఐదారుగురు నేతలను మండలాలవారీగా నియమించారు. వారి సమన్వయంతో ఆయా మండలాల్లోని గ్రామాల్లో పని విభజన చేయనున్నారు. ప్రతి గ్రామానికి టీపీసీసీ స్థాయి నాయకుడిని ఇన్చార్జిగా నియమించాలని, నియోజకవర్గవ్యాప్తంగా పూర్తిస్థాయిలో పార్టీ అనుబంధ సంఘాలను రంగంలోకి దింపాలని ఆయన ఇప్పటికే ఆదేశించారు. గాంధీభవన్‌లో కీలక నేతల భేటీ హుజూరాబాద్ ఉప ఎన్నికలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నేతలు శనివారం గాంధీ భవన్లో సమావేశమయ్యారు. టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు జగ్గారెడ్డి, సీతక్క, శ్రీధర్‌బాబు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్, ఎన్నికల కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ, వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్‌గౌడ్, కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ, అజ్మతుల్లా హుస్సేన్‌లు పాల్గొన్నారు. ప్రచారంలో భాగంగా రానున్న 20 రోజులపాటు అనుసరించాల్సిన వ్యూహాన్ని ఈ సమావేశంలో ఖరారు చేశారు. స్టార్ క్యాంపెయినర్లు వీరే.. హుజూరాబాద్ ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థి బల్మూరి వెంకట్ పక్షాన ప్రచారం చేసేందుకు స్టార్ క్యాంపెయినర్లను ప్రకటించారు. ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ఇన్చార్జి కె.సి. వేణుగోపాల్ ఈ పేర్లతో కూడిన లేఖను ఎన్ని కల సంఘానికి పంపినట్టు టీపీసీసీ సంస్థాగత వ్యవహారాల ఇన్చార్జి మహేశ్‌కుమార్‌గౌడ్ తెలిపారు. మొత్తం 20 మందితో కూడిన ఈ జాబితాలో మాణిక్యం ఠాగూర్, రేవంత్‌రెడ్డి, భట్టి, శ్రీనివాస కృష్ణన్, జీవన్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, దామోదర రాజనర్సింహ, మధుయాష్కీగౌడ్, ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, వీహెచ్, పొన్నాల, అజహరుద్దీన్, జగ్గారెడ్డి, షబ్బీర్ అలీ, సీతక్క, కవ్వంపల్లి సత్యనారాయణ, నాయిని రాజేందర్‌రెడ్డి ఉన్నారు. -
‘కరోనా విషయంలో కేసీఆర్ విఫలమయ్యారు’
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ గురించి ఆరునెలల క్రితం గవర్నర్‌కి చెప్తే తమని సీఎం కేసీఆర్ దూషించారని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మండిపడ్డారు. బుధవారం కాంగ్రెస్ పార్టీ నేతలు ఉత్తమ్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, సీతక్క మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, ‘తెలంగాణలో కరోనా కట్టడి చేయడంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందని గవర్నర్ స్వయంగా చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయి. కేసీఆర్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ప్రజలందరూ ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలకు అండగా కాంగ్రెస్ ఉందని తెలియజేయడానికి సీఎల్పీ ఆధ్వర్యంలో జిల్లా ఆసుపత్రుల పర్యటన చేపట్టాం. తెలంగాణలో టెస్టుల సంఖ్య పెంచకపోవడానికి కారణం ఏంటో ప్రభుత్వం చెప్పాలి? రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్యను ప్రభుత్వం తక్కువ చేసి చూపిస్తుందని ఆరోపణలు ఉన్నాయి. హెల్త్ అండ్ మెడికల్ విషయంలో కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయింది. మండల కేంద్రాల్లో 30 బెడ్స్, జిల్లా కేంద్రాల్లో 100 పడకల హాస్పటల్స్ ఎందుకు ఏర్పాటు చేయలేదు? 2014 ఎన్నికల్లో గిరిజనులకు హెలికాప్టర్ అంబులెన్స్ ఏర్పాటు చేస్తామని టీఆర్ఎస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పింది. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక 108 వ్యవస్థ పూర్తిగా బలహీనపడిపోయింది. కరోనా కట్టడి విషయంలో పక్కనే ఉన్న ఏపీ ప్రభుత్వాన్ని చూసి కేసీఆర్ నేర్చుకోవాలి. కాంట్రాక్టుర్లకు వేల కోట్లు ఇస్తున్న ప్రభుత్వం కరోనాను ఆరోగ్య శ్రీ లో ఎందుకు చేర్చడం లేదు? అని ఆయన ప్రశ్నించారు. సీఎల్పీనేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ, ‘ ఏజెన్సీ ఏరియాల్లో కరోనా విజృంభిస్తుందిజ వర్షాల వల్ల పంట పొలాలు దెబ్బతిన్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో కనీసం ఐసోలేషన్ సెంటర్స్ లేకపోవడం బాధాకరం. కరోనా చికిత్స కోసం ప్రైవేట్ హాస్పటల్స్‌లో ప్రభుత్వం ధరలు ఫిక్స్ చేసి మానిటరింగ్ చెయ్యాలి. మినరల్ రిసోర్స్ నిధులు సరిగ్గా వాడుకోవడం లేదు’ అని మండిపడ్డారు. ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ, కరోనా వ్యాధి ఏజెన్సీ ప్రాంత ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. కరోనా వచ్చినా వైద్యరంగంలో కొత్తగా ఎలాంటి ఏర్పాట్లు చెయ్యలేదు. చికిత్స చేయడానికి ఒక్కరిని కూడా పర్మినెంట్ ఉద్యోగులను తీసుకోలేదు. ఎమ్సీజీ జిల్లా ఆసుపత్రిలో అభివృద్ధి చేయడం ప్రభుత్వం మర్చిపోయింది. కరోనా వ్యాధి వల్ల పేదలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కరోనాను ఆరోగ్య శ్రీ లో చేర్చాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది’ అని ఆమె తెలిపారు. చదవండి: ఈ విషయంలో జోక్యం చేసుకోలేం: హైకోర్టు -
‘రాష్ట్రంలో నియంతృత్వ పాలన సాగుతోంది’
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో నియంతృత్వ పాలన సాగుతోందని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క ఆరోపించారు. వివిధ వర్గాలవారు అసెంబ్లీ ముట్టడికి వస్తుంటే.. రాష్ట్రంలో ఎలాంటి పాలన కొసాగుతుందో అర్థమవుతోందని అన్నారు. శనివారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆమె మాట్లాడుతూ.. ఓ ఒక్క రంగాన్ని పట్టించుకోని ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వమని విమర్శించారు. తమది ఫ్రెండ్లీ ప్రభుత్వం అని చెబుతున్న టీఆర్ఎస్.. మహిళలు, టీచర్లు, విద్యార్థులను అరెస్ట్ చేయడమే ఫ్రెండ్లీ ప్రభుత్వమా అని ప్రశ్నించారు. (మంత్రిపై సీతక్క ఆగ్రహం) ఆశా వర్కర్లను పిలిచి భోజనాలు పెట్టి వారి జీతాలు పెంచారు.. కానీ వారికి ఇప్పటి వరకు జీతాలు అందడం లేదని మండిపడ్డారు. ఆశా వర్కర్లను ప్రభుత్వం నమ్మించి గోంతు కోసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆశా వర్కర్లతో సర్వం పనులు చేయించుకుంటారు. కానీ వారి పనికి వేతనం కల్పించరని దుయ్యబట్టారు. నిన్న టీచర్లు, మొన్న ఆశా వర్కర్లు, అంతకముందు విద్యార్థులు.. ఇలా ప్రతి ఒక్కరినీ అరెస్టు చేసి వారిపై లాఠీ చార్జీ చేశారన్నారు. అరెస్ట్‌ను తీవ్రంగా ఖండిస్తున్నామని, వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని సీతక్క డిమాండ్ చేశారు. (‘టీఆర్ఎస్లో ఓనర్షిప్ల కొట్లాట మొదలైంది’) -
కాంగ్రెస్ పార్టీకి అంతం లేదు: కోమటిరెడ్డి
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన ఆవిర్భావ దినోత్సవ సత్యాగ్రహానికి అనుమతి ఇవ్వకపోవడంతో కాంగ్రెస్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ధ్వజమెత్తారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో ఆరెస్సెస్‌కు ఒక న్యాయం, కాంగ్రెస్‌కు మరో న్యాయమా? అని అనుమతి ఇవ్వకపోవడంపై ప్రశ్నించారు. దేశంలో కాంగ్రెస్ పార్టీకి అంతం లేదని, కేసీఆర్ నియంత పోకడలకు త్వరలోనే స్వస్తి పలుకుతామన్నారు. సీఎం కేసీఆర్ పాలనలో సత్యాగ్రహానికి అనుమతి ఇవ్వకపోడం సిగ్గుచేటని అన్నారు. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం అవలంబిస్తున్న ద్వంద వైఖరిని తప్పుబట్టారు. గతంలో కాంగ్రెస్ పార్టీనే టీఆర్ఎస్ భవన్ ఇచ్చిందనే విషయాన్ని కేసీఆర్ మర్చిపోవద్దని అన్నారు. సత్యాగ్రహాన్ని అడ్డుకోవడం కుట్ర అని, కేసీఆర్ మాయమాటలతో ఐదేళ్లు పాలన చేశారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎద్దేవా చేశారు. ములుగు జిల్లా ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ.. కేసీఆర్ చరిత్ర మర్చిపోయి మాట్లాడుతున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ దేశం, రాష్ట్రంలో అధికారంలో ఉన్నపుడే అభివృద్ధి జరిగిందని, దేశ ప్రజలను చైతన్యం చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని చెప్పుకొచ్చారు. బీజేపీ, ఎంఐఎం, టీఆర్ఎస్లు ఒక్కటే అని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకును చీల్చడం కోసం ఎంఐఎం దేశంలో పలు చోట్ల పోటీ చేస్తుందని, ప్రజలు ఈ విషయాన్ని మర్చిపోవద్దని ఆమె విజ్ఞప్తి చేశారు. -
చర్చల తర్వాతే కొత్త రెవెన్యూ చట్టం అమలు
పంజగుట్ట: సమగ్ర చర్చల అనంతరమే కొత్త రెవెన్యూ చట్టాన్ని అమలు చేయాలని పలు రాజకీయ పక్షాల నాయకులు డిమాండ్ చేశారు. తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ‘ప్రభుత్వం చేపట్టిన భూముల రికార్డుల సవరణ దాని పరిణామాలు’అనే అంశంపై రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ అన్వేష్ రెడ్డి, కోదండరెడ్డిల అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్ష నేత భట్టి విక్రమార్క, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి, ఎమ్మెల్యే సీతక్క, టీడీపీ నాయకులు రావుల చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం భూ రికార్డుల ప్రక్షాళన పేరుతో వాస్తవ సాగుదారుల నుంచి భూమిని లాక్కుని భూస్వాములకు అప్పగించే కుట్రలకు పాల్పడుతున్నారన్నారు. ఇందులో భాగంగానే కాలమ్ నంబర్ 16 తొలగించారన్నారు. భూప్రక్షాళన భవిష్యత్తులో రక్తపాతాన్ని సృష్టించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రం ఏర్పడి ఆరేళ్లు పూర్తయినా భూరికార్డులను పరిశీలించే సీసీఎల్ఎను నియమించలేదన్నారు. చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి హయాంలో రెవెన్యూ భూవివాదాలను ఓ కమిటీ పరిష్కరించేదని, సదరు కమిటీ ఎన్నో కీలక అంశాలను బయటకు తీసుకొచి్చందని వాటిని అమలు చేసే లోపే తెలంగాణ ఉద్యమం వచి్చందన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి రెవెన్యూ వ్యవస్థనే తొలగిస్తానని అహంకారపూరిత మాటలు మాట్లాడుతున్నారు.రావుల చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. రెవెన్యూ చట్టం తీసుకురావడం అవసరమే అయితే దీనికోసం విస్తృతంగా చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. ఎమ్మెల్యే సీతక్క, మాజీ ఎమ్మెల్యేలు వంశీచందర్ రెడ్డి, సంపత్‌కుమార్‌లు మాట్లాడుతూ .. రాష్ట్రంలో ఇప్పటికీ 8లక్షల 90వేల మందికి పాసు పుస్తకాలు అందలేదన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకురాలు పశ్య పద్మ, రైతు సంఘం నాయకుడు నర్సింహ్మ రెడ్డి, నల్సార్ యూనివర్సిటీ ఫ్యాకల్టీ సభ్యుడు సునీల్, కాంగ్రెస్ నాయకురాలు ఇందిరా, వివిధ సంఘాల, పారీ్టల నాయకులు చైతన్య పాల్గొన్నారు. -
మంత్రిపై సీతక్క ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: అటవీ ప్రాంతాల్లో నివసిస్తున్న గిరిజనులు వారి హక్కుల కోసం ఎలాంటి పోరాటాలు చేయడం లేదన్న అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సమాధానంపై కాంగ్రెస్ సభ్యురాలు సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏళ్ల తరబడి పోరాటాలు జరుగుతున్నా, పోడు వ్యవసాయం చేసుకుంటున్న తమకు ఆ భూములపై హక్కులు కలి్పంచా లని కోరుతున్నా, ప్రభుత్వానికి కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. కేంద్రం తెచి్చన అటవీ హక్కుల చట్టం మేరకు అర్హులైన వారికి పట్టాలు అందించాలని కోరారు. మంత్రి స్పం దిస్తూ రాష్ట్రంలోనూ కేంద్రం చట్టాన్ని అమలు చేస్తున్నామని, అర్హులకు భూ హక్కులు కలి్పంచామని తెలిపారు. హరితహారంపై పెద్ది సుదర్శన్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి బదులిస్తూ, రాష్ట్రంలో హరితహారం కింద 131 కోట్ల మొక్కలు నాటినట్లు, దీనికోసం రూ. 3,765 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. -
‘టీఆర్ఎస్లో ఓనర్షిప్ల కొట్లాట మొదలైంది’
సాక్షి, భూపాలపల్లి : తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)లో ఓనర్షిప్ కోసం నాయకులు గొడవలు పెట్టుకుంటూ ప్రజల ఆరోగ్యం, సంక్షేమం గురించి పట్టించుకోవడం లేదని కాంగ్రెస్‌పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. ఆదివారం జిల్లా కేంద్ర ఆసుపత్రిని విక్రమార్క, మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే సీతక్కతో పాటు పలువు నాయకులు కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని రోగులను, ప్రజలను మర్చిపోయి ఆసుపత్రులను నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. జిల్లా కేంద్ర ఆసుపత్రులు అంటే 250 పడకలతో ఉంటుందని, కానీ ఇక్కడ కేవలం 6 పడకలు మాత్రమే ఉన్నాయని విమర్శించారు. భూపాలపల్లి జిల్లాగా ఏర్పడి మూడేళ్లవుతున్నా ఎటువంటి మౌలిక వసతులు కల్పించకపోవడం, జిల్లా ఆసుపత్రిగా మార్చకపోవడం బాధాకరమైన విషయమన్నారు. ఆస్పత్రికి రోగుల రావాలంటే భయపడే పరిస్థితులు ఉన్నాయని, ప్రస్తుతం ఇన్ పేషంట్లు ఎవరూ లేరని భట్టి పేర్కొన్నారు. ఆస్పత్రిలో ఏంఆర్ఐ, సీటీ స్కాన్, ఎక్స్ రే ప్లాంట్, ఈసీజీ లేవని, ఇంతటి దుర్భర పరిస్థితులు ఎక్కడా ఉండవని మండిపడ్డారు. ప్రసూతి కోసం వచ్చే మహిళలకు ఉండాల్సిన గైనకాలజిస్టులు ఒక్కరు కూడా లేరని, ఆపరేషన్ థియేటర్ అత్యంత దారుణ పరిస్థితుల్లో ఉందని విక్రమార్క విమర్శించారు. ఆపరేషన్ థియేటర్‌ను స్టోర్ రూమ్‌గా మార్చిన పరిస్థితి కన్పిస్తుందని, కనీసం ఆస్పత్రిలో లాబ్ టెక్నీషియన్ కూడా లేరని దుయ్యబట్టారు. జిల్లా పరిసర ప్రాంతాల్లో ప్రజలు ఎక్కువగా కుక్క, కోతి కాట్లకు గురవుతున్నారని, అందుకు కావాల్సిన సిరంజీలు కూడా లేవని విమర్శించారు. ఆస్పత్రికి వచ్చిన రోగులు బయట సిరంజీలు కొనుక్కుంటే ఇక్కడ ఇంజక్షన్లు ఇస్తున్నారని, ఇది దుర్భరమైన పరిస్థితి బట్టి అంటూ భట్టి ఆవేదన వ్యక్తం చేశారు. -
ఆర్టీసీ బస్సు నడిపిన ఎమ్మెల్యే
సాక్షి, భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి కాసేపు ఆర్టీసీ బస్సు డ్రైవర్ అవతారమెత్తారు. భూపాలపల్లి బస్‌డిపోకు నూతనంగా వచ్చిన సూపర్ లగ్జరీ బస్సును బుధవారం ఆయన ప్రారంభించారు. అనంతరం డిపో నుంచి బస్టాండ్ వరకు బస్సును నడిపి ప్లాట్‌ఫాంపై ఉంచారు. దీంతో బస్టాండ్‌లో ఉన్న ప్రయాణికులంతా నివ్వెరపోయారు. అందరూ బస్సు వద్దకు వచ్చి చూడ సాగారు. పచ్చడి బాగుందే అక్కా.. బాగున్నారా? అందరూ పచ్చడే తెచ్చుకున్నారా? మీతో నాకూ కాస్త వడ్డించండి అంటూ ములుగు ఎమ్మెల్యే సీతక్క వరి నాటు కూలీలతో కలసి రోడ్డుపై కూర్చుని భోజనం చేశారు. బుధవారం ఎమ్మెల్యే మహబూబాబాద్ జిల్లా ఎంచగూడెం గ్రామానికి వెళ్తుండగా.. మార్గమధ్యలో కూలీలు రోడ్డుపై కూర్చుని భోజనం చేస్తున్నారు. వారిని చూసిన ఎమ్మెల్యే కారు ఆపి కూలీలతో మాట్లాడారు. మీతోపాటు నాకూ వడ్డించండి అని కూలీలతో కలసి భోజనం చేశారు. పచ్చడి బాగుందంటూ కితాబిచ్చారు. -
టీఆర్ఎస్లోకి సీతక్క?
ములుగు: కాంగ్రెస్ తరఫున ములుగు ఎమ్మెల్యేగా గెలిచిన ధనసరి అనసూయ(సీతక్క) టీఆర్ఎస్లో చేరనున్నారనే ప్రచారం స్థానికంగా సాగుతోంది. ఈ విషయం రెండు రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీనికి తోడు గురువారం ఓ ప్రధాన టీవీ ఛానల్లో భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్యతో పాటు సీతక్క సైతం కారు ఎక్కనున్నట్లు స్క్రోలింగ్ రావడంతో పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు హన్మకొండలోని సీతక్క నివాసానికి వెళ్లారు. మండల, జిల్లా పరిషత్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఘోర పరాజయం పాలు కావడంతోనే ఆమె టీఆర్ఎస్ చేరాలని నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతుండగా, అధికార పార్టీ నాయకులు అసత్య ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ నాయకత్వం స్పష్టం చేసింది. పార్టీలో చేరగానే పదవి.. ఆపై ఎమ్మెల్యే టీడీపీలో ఉన్న సీతక్క గత అక్టోబర్‌లో కాంగ్రెస్‌లో చేరారు. దీంతో ఆమెకు ఏఐసీసీ మహిళా విభాగం ప్రధాన కార్యదర్శిగా పదవి ఇవ్వడం తో పాటు ములుగు నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్న పొదెం వీరయ్యను కాదని ఆమెకు అసెంబ్లీ టికెట్ కూడా ఇచ్చారు. ఆ ఎన్నికల్లో సీతక్క భారీ మెజార్టీతో గెలిచారు. ఆ తర్వాత కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరినా సీతక్క మాత్రం అలాగే కొనసాగుతున్నారు. ప్రస్తుతం ములుగు నియోజకవర్గంతోపాటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రోజురోజుకూ దయనీయంగా మారుతుండడంతో సీతక్క మరో వారం రోజుల్లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకుంటారని ప్రచారం సాగుతోంది. అదంతా తప్పుడు ప్రచారమే.. కొంతమంది నాయకులు గతంలోనే టీఆర్ఎస్లో చేరాలని కోరినా తాను వెళ్లలేదని సీతక్క స్పష్టం చేశారు. ఇప్పుడు మళ్లీ టీఆర్ఎస్ నాయకులు ఇదే విషయంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. ఇందులో నిజం లేదని, కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆమె స్పష్టం చేశారు. -
బైక్‌ను ఢీకొన్న ఎమ్మెల్యే సీతక్క కారు, పాప మృతి
సాక్షి, వరంగల్ : ములుగు జిల్లా ఎమ్మెల్యే సీతక్క కారు ఓ ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ఘటనలో ఓ చిన్నారి మృతి చెందింది. ములుగు జిల్లా ఏటూరు నాగారం శివారులోని జీడివాగు సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. దంపతులు తమ చిన్నారిని తీసుకొని బైక్‌పై వెళ్తుండగా జీడివాగు సమీపంలో ఎదురుగా దూసుకొచ్చిన ఎమ్మెల్యే కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్‌పై ఉన్న చిన్నారి అక్కడికక్కడే మృతి చెందగా, దంపతులు గాయపడ్డారు. అయితే పాప తండ్రి పరిస్థితి విషమంగా ఉంది. దంపతులను చికిత్స నిమిత్తం ఏటూరు నాగారం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : ఎమ్మెల్యే సీతక్క వాహనం ఢీకొని చిన్నారి మృతి -
నెలన్నర కిందటే టచ్‌లోకి..
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, ఆత్రం సక్కు పార్టీ మార్పు నిర్ణయం ఇప్పటికిప్పుడు జరిగింది కాదని, జనవరి తొలి రెండు వారాల్లోనే ఈ మేరకు సంప్రదింపులు జరిగాయని విశ్వసనీయంగా తెలిసింది. జనవరి 17 నుంచి 20 వరకు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేసిన అనంతరం జనవరి 19న కాంగ్రెస్‌కు చెందిన ఆదివాసీ ఎమ్మెల్యేలు పొదెం వీరయ్య, సీతక్కలతో కలసి సక్కు, కాంతారావులు సీఎం కేసీఆర్ ను కలిశారు. ఈ సందర్భంగా ఆదివాసీలు, పోడు భూముల సమస్యలపై కేసీఆర్‌తో మాట్లాడారు. అయితే అంతకంటే ముందే సక్కు, కాంతారావులు సీఎంను కలిశారని, పార్టీ మారేందుకు సంసిద్ధతను వ్యక్తం చేశారని సమాచారం. సరైన సమయంలో నిర్ణయం తీసుకుందామని కేసీఆర్ వారికి సూచించారని, ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంలో నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. అయితే కాంతారావు పార్టీపై తనకున్న అసంతృప్తిని బహిరంగంగానే ప్రకటిం చారు. డీసీసీ అధ్యక్షుల నియా మకం సందర్భంగా కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడిని తనను సంప్రదించకుండానే నియమించారంటూ పార్టీ పదవులకు కాంతారావు రాజీనామా చేశారు. కానీ దాన్ని కూడా కాంగ్రెస్ నాయకత్వం పట్టించుకోలేదు. ఐదుగురిని నిలబెట్టినప్పుడే... కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరబోతున్నారనే చర్చ గత వారం నుంచి జరుగుతోంది. కాంగ్రెస్, టీడీపీలకు కలిపి ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని గెలుచుకునే బలమున్నప్పటికీ ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఐదుగురిని (మిత్రపక్షం ఎంఐఎంతో కలిపి) కేసీఆర్ బరిలో దింపినప్పుడే ఈ చర్చ ప్రారంభమైం ది. ఆ సభ్యులు ఎవరనేది మాత్రం శనివారం వరకు సస్పెన్స్‌గానే సాగింది. చివరకు సక్కు, రేగా తాము టీఆర్ఎస్లో చేరబోతున్నామని ప్రకటించడంతో సస్పెన్స్‌కు తెరపడింది. మళ్లీ ఇప్పుడు ఇంకా ఎంతమంది, ఎవరెవరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇలాంటి ప్రకటనలు చేస్తారో అనే ఉత్కంఠకు తెరలేచింది. ‘చే’జారినట్టే..! కాంగ్రెస్‌కు చెందిన ఇద్దరు సభ్యులు టీఆర్ఎస్లో చేరడంతో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థి ఓడిపోయినట్టేనని రాజకీయ వర్గాలంటున్నా యి. ఇప్పుడు కాంగ్రెస్‌కున్న 17 మంది, టీడీపీకి ఉన్న ఒక సభ్యుడు కాంగ్రెస్ అభ్యర్థికి ఓటేసినా వచ్చేది 18 ఓట్లేనని, అప్పుడు కచ్చితంగా ద్వితీయ ప్రాధాన్యత ఓటుకు వెళ్లాల్సి ఉంటుందని, ఆ ఓటుతో టీఆర్ఎస్ లేదా ఎంఐఎంకు చెందిన ఐదో అభ్యర్థి గెలవడం ఖాయంగా కనిపిస్తోంది. ఒకవేళ కాంగ్రెస్ డిమాండ్ చేస్తున్న విధంగా రేగా, సక్కులతో ఓటు వేయించకపోయినా అధికార పక్షానికి వచ్చే నష్టం ఏమీ లేదని, కాంగ్రెస్‌కు వచ్చే 18 ఓట్లతో ఆ పార్టీ గెలుపు సాధ్యం కాదని లెక్కలు చెబుతున్నాయి. దీం తో ఇక గ్రాడ్యుయేట్స్ కోటాలో బరిలో ఉన్న మాజీ మంత్రి జీవన్‌రెడ్డి గెలుపుపైనే గంపెడాశలు పెట్టుకుం ది. మరోవైపు అధిష్టానం ఎమ్మెల్యేలను పట్టించుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని కాంగ్రెస్ నేతలే అంటున్నారు. ఆదివారం జరిగిన సీఎల్పీ సమావేశంలో నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ ఎమ్మెల్యేలకు రాష్ట్ర నాయకత్వంపై నమ్మకం లేకుండా ఎన్నాళ్లు కొనసాగుతామని ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ఎన్నికలకు ముందు సీనియర్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, దళిత ఎమ్మెల్యే సంపత్‌లను అసెంబ్లీ నుంచి బహిష్కరించడం, వారికి భద్రత తీసేసి, వారి నిధులు నిలిపేసినప్పుడు పార్టీ నాయకత్వం ఎలాంటి చర్యలూ తీసుకోలేకపోయిందని ఈ సందర్భంగా ఆయన విమర్శించినట్టు సమాచారం. ఎమ్మెల్యేలైనా, ఏ స్థాయి ప్రజాప్రతినిధులైనా పార్టీపరంగా భరోసా కల్పించకపోతే భవిష్యత్తులోనూ ఇలాంటి పరిణామాలు జరిగే అవకాశం లేకపోలేదని ఆయన వాఖ్యానించినట్లు తెలిసింది. -
వాస్తుపై ఉన్న శ్రద్ధ మహిళా రక్షణపై ఏది?
సాక్షి, హైదరాబాద్: ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్.. మహిళలను ద్వితీయ శ్రేణి పౌరుల్లా చూస్తున్నారని రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఆరోపించింది. యాదాద్రిలో వెలుగుచూసిన వ్యభిచార ఘటనలకు పోలీసులు, శిశుసంక్షేమ శాఖలే బాధ్యత వహించాలని అఖిల భారత మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సీతక్క, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షు రాలు నేరెళ్ల శారద డిమాండ్ చేశారు. శనివారం గాం ధీభవన్‌లో మీడియాతో సీతక్క మాట్లాడుతూ మోదీ, కేసీఆర్‌లు మహిళల భద్రతపై ప్రచార ఆర్భాటం చేస్తూ, రక్షణ మాత్రం గాలికొదిలేశారన్నారు. యాదా ద్రి క్షేత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతున్నామని చెప్పుకుంటున్న కేసీఆర్‌కు అక్కడ జరిగే పాపాలు పట్టవా అని ప్రశ్నించారు. వాస్తుపై పెట్టే శ్రద్ధ కూడా మహిళల రక్షణపై పెట్టకపోవడం దురదృష్టకరమన్నారు. కేసీఆర్ పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని శారద ఆరోపించారు. రాష్ట్రంలో మహిళా శిశు సంక్షేమ శాఖ నిద్రపోతోందని, పోలీసులు, శిశుసంక్షేమ శాఖల వైఫల్యం కారణంగానే యాదాద్రి వ్యభిచార కూపంగా మారిందన్నారు. వ్యభిచార గృహాల నిర్వాహకులపై నిర్భయ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. -
సీతక్కకు రాహుల్ ప్రాధాన్యం.. జాతీయ పదవి!
సాక్షి, న్యూఢిల్లీ : సీనియర్ నేత రేవంత్‌రెడ్డితో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరిన ములుగు మాజీ ఎమ్మెల్యే సీతక్కకు జాతీయస్థాయిలో పార్టీ పదవి లభించింది. ఆలిండియా మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా ఆమె శనివారం నియమితులయ్యారు. మాజీ మావోయిస్టు, టీడీపీలో సీనియర్ మహిళా నాయకుల్లో ఒకరిగా గుర్తింపు పొందిన సీతక్క ఇటీవల చంద్రబాబునాయుడు తెలంగాణలో టీడీపీకి ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో రేవంత్‌రెడ్డితో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. రేవంత్ వెంట కాంగ్రెస్‌లో చేరిన ఆమెకు మంచి ప్రాధాన్యం లభిస్తోంది. జాతీయ స్థాయిలో సీతక్కకు పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ప్రాధాన్యమిస్తున్నారు. కొద్దిరోజుల క్రితమే ఆదివాసీ కాంగ్రెస్ విభాగంలో సీతక్కకు రాహుల్ పదవి ఇచ్చారు. ఇప్పుడు ఏకంగా ఆలిండియా మహిళా కాంగ్రెస్ పదవి ఆమెను వరించడంతో సీతక్క అనుచరుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. -
ఈ ప్రభుత్వానికి సిగ్గులేదు
మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత సీతక్క సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంలో ఆడిపాడిన విమలక్కపై కేసులు పెట్టి, కార్యాలయాన్ని సీజ్ చేసిన ఈ ప్రభుత్వానికి సిగ్గులేదని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత సీతక్క అన్నారు. ఆదివారం హైదరాబాద్‌లో విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ తీరుపై ఆమె తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ ఉద్యమానికి సిద్ధాంతకర్తగా పనిచేసిన ఆచార్య జయశంకర్‌ను మరిచిపోరుున సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లకు సిగ్గుందా అని ప్రశ్నించారు. నక్సల్స్ ఎజెండాను అమలుచేస్తామని చెప్పిన వారే ఎన్కౌంటర్ల పేరుతో యువకులను కాల్చిచంపుతున్నారన్నారు. అధికారమదంతో అమరవీరుల కుటుంబాలను మరిచిపోరుున మంత్రి కేటీఆర్‌కు సిగ్గులేదన్నారు. -
‘ములుగు’ కోసం అఖిలపక్షం ధర్నా
మంత్రి, ఎంపీ రాజీనామా చేయాలి టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీతక్క ములుగు : ములుగు జిల్లా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం, జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో బుధవారం స్థానిక జాతీయ రహదారిపై ధర్నా, రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధనసరి సీతక్క మాట్లాడుతూ జిల్లా ఏర్పాటు కాకుంటే మంత్రి అజ్మీర చందూలాల్, ఎంపీ సీతారాంనాయక్ తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ గత ఎన్నికల ముందు ఓట్లు దండుకునేందుకు ములుగును సమ్మక్క–సారలమ్మ జిల్లాగా ప్రకటిస్తానని హామీ ఇచ్చారని, ఇప్పుడు రాజకీయ లబ్ధి కోసం బొందలగడ్డ భూపాలపల్లిని జిల్లా చేసేందుకు నిర్ణయం తీసుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. రాష్ట్రంలో నియంత పాలన సాగుతోందన్నారు. ఏ అర్హత లేని భూపాలపల్లికి ములుగు ప్రాంతంలో ఉన్న జిల్లా కార్యాలయాలను తరలిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. వరంగల్ జిల్లాలో భాగమై ఉన్న హన్మకొండను జిల్లా చేయడం కూడా రాజకీయ లబ్ధికోసమేనని అన్నారు. ధర్నా, రాస్తారోకోకు కళాశాల విద్యార్థులు మద్దతు తెలిపారు. మానవహారంగా ఏర్పడి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో రహదారిపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న ఎస్సై ముప్పిడి సూర్యనారాయణ అక్కడికి చేరుకుని ఆందోళన విరమింపజేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మస్రగాని వినయ్‌కుమార్, అఖిలపక్షం అధ్యక్షుడు నల్లెల్ల కుమారస్వామి, జిల్లా సాధన సమితి అధ్యక్షుడు ముంజాల బిక్షపతిగౌడ్, టీడీపీ మండల అధ్యక్షుడు పల్లె జయపాల్‌రెడ్డి, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ డివిజన్ నాయకుడు గూబ రాజు, నాయకులు ముసినేపల్లి కుమార్, చింతనిప్పుల బిక్షపతి, కోయిల రాంబాబు, బొమ్మకంటి రమేశ్, అచ్చునూరి కిషన్, యూనుస్, దూడబోయిన శ్రీనివాస్, మహేందర్, రాజునాయక్, ఉమాచందర్ తదితరులు పాల్గొన్నారు. -
రైతులకు అండగా ఉండాలి
టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీతక్క వరంగల్ : రైతులు మనోధైర్యం కోల్పోకుండా వారికి అండగా నిలబడాలని టీడీపీ అనుబంధ తెలుగు రైతు నాయకులకు ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధనసరి అనసూయ(సీతక్క) సూచించారు. జిల్లా తెలుగు రైతు కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం హన్మకొండ బాలసముద్రంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో మంగళవారం జరిగింది. జిల్లా పార్టీ అధ్యక్షుడు గండ్ర సత్యనారాయణరావు నూతన కార్యవర్గంతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈసందర్భంగా జిల్లా రైతు అధ్యక్షులు చాడ రఘునాథరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో సీతక్క మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల కుటుంబాలను టీఆర్ఎస్ నాయకులు పరామర్శించిన పాపానపోలేదన్నారు. ప్రాజెక్టుల పేరిట దోపిడీకి పాల్పడుతూ రైతు వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్నారని అన్నారు. రైతు సమస్యలపై పట్టింపేదీ? రైతు సమస్యలపై టీఆర్ఎస్ ప్రభుత్వానికి పట్టింపు లేదని, సీఎంకు ఫాంహౌస్‌పై ఉన్న శ్రద్ధ రైతులపై లేదని టీడీపీ జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణరావు అన్నారు. అవసరం లేకున్నా బహుళజాతి కంపెనీల ప్రయోజనాల కోసం కడుతున్న మల్లన్నసాగర్ రిజర్వాయర్ వల్ల రైతులు భూములు కోల్పోతున్నారని అన్నారు. కోర్టు, ప్రజాసంఘాలు, ప్రతిపక్ష పార్టీలు, మేధావులు హెచ్చరించినా పట్టించుకోకుండా రాక్షస పాలన సాగిస్తున్న కేసీఆర్‌కు భవిష్యత్తులో ప్రజలే బుద్ధి చెబుతారని అన్నారు. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈగ మల్లేషం, నాయకులు గట్టు ప్రసాద్‌బాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి అశోక్‌కుమార్, పరకాల ఇన్చార్జ్ గన్నోజు శ్రీనివాస్, జాటోత్ ఇందిర, జయపాల్, మన్సూర్హుస్సేన్, బాబా ఖాదర్అలీ, మార్గం సారంగం, రహీం, తెలుగుయువత జిల్లా అధ్యక్షుడు పాలడుగు వెంకటకృష్ణ, గుర్రం బాలరాజు, హన్మకొండ సాంబయ్య, టీఎన్ఎస్ఎఫ్ సంతోష్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
కేసీఆర్‌కు పుట్టగతులుండవ్
హన్మకొండ: తెలంగాణ ఉద్యమంలో ముందుండి పోరాడిన ఆదివాసీ బిడ్డలను సీమాంధ్రులకు బలిచ్చిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు పుట్టగతులుండవని ములుగు మాజీ ఎమ్మెల్యే ధనసరి అనసూయ (సీతక్క) మండిపడ్డారు. మహాజన సోషలిస్టు పార్టీ(ఎంఎస్పీ) ఆధ్వర్యంలో ఆదివారం వరంగల్‌లో జరిగిన జలదీక్ష కార్యక్రమానికి ఆమె సంఘీభావం తెలిపారు. కాపువాడ శివారులోని భద్రకాళి చెరువు మత్తడి వద్ద ఎంఎస్పీ నేతలతో కలిసి చెరువులో దిగి దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ నెల రోజుల నుంచి రక్షించండని ఆదివాసీలు రోదిస్తున్నా కేసీఆర్‌కు వినిపించ లేదా అని ప్రశ్నించారు. పోలవరం టెండర్లు దక్కించుకున్నందుకే నేడు కేసీఆర్ ఆదివాసీలను ముంచేందుకు సిద్ధపడ్డాడని దయ్యబట్టారు. ఇప్పటికైనా ఆదివాసీల పక్షాన నిలబడకుంటే గిరిజనుల బాణాలకు బలికాక తప్పదని సీతక్క హెచ్చరించారు. ఎంఎస్పీ సమన్వయకర్త మంద కుమార్ మాట్లాడుతూ ఒక్క గ్రామాన్ని కూడా వదులు కోవడానికి సిద్ధంగా లేమని ప్రకటించిన కేసీఆర్... 200కు పైగా ఆదివాసీ గ్రామాలు పోలవరంలో మునుగుతుంటే ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. -
ఉద్విగ్న భరిణెం
జనం చేరిన అమ్మ ప్రతిరూపం పులకించిన మేడారం.. ఉప్పొంగిన భక్తిభావం ఉదయం నుంచే.. సమ్మక్క రాక సందర్భంగా సమ్మక్క ప్రధాన పూజారి కొక్కెర కృష్ణయ్య, పూజారులు దోబె పగడయ్య, సిద్దబోయిన సమ్మయ్య(తండ్రి పొట్టయ్య), సిద్దబోయిన సమ్మయ్య (తండ్రి దానయ్య), మాదిరి పుల్లయ్య, మాదిరి నారాయణ గురువారం మేడారంలోని సమ్మక్క గుడిలో ప్రత్యేక పూజలు చేశారు. వేకువజామునే అడవికి వెళ్లి వనం(వెదురు) తీసుకొచ్చి గద్దెలపై ప్రతిష్ఠించారు. మధ్యాహ్నం 3.50 గంటలకు చిలకలగుట్టపైకి వెళ్లి పూజలు చేసి తల్లిని గద్దెలపైకి చేర్చారు. అడుగడుగునా నీరాజనాలు తల్లి సమ్మక్క గద్దెకు చేరుతుండగా భక్తులు అడుగడుగునా ఎదురుకోళ్లతో ఘనస్వాగతం పలికారు. గాలిలోకి కోళ్లు ఎగురవేస్తూ ఆహ్వానించారు. తల్లిపై ఒడి బియ్యం చల్లుతూ మొక్కులు చెల్లించుకున్నారు. దారిపొడవునా బారులుదీరి న భక్తులు తల్లిని ప్రత్యక్షంగా చూసేందుకు ఆ రాటపడ్డారు. అమ్మను కళ్లారా చూసి తరించా రు. యాటపోతులు, కోళ్లతో ఎదురెళ్లి బలిచ్చా రు. భక్తులు, శివసత్తులు పూనకాలతో ఊగిపోయారు. తల్లి నామస్మరణతో మేడారం హోరెత్తింది. థింసా నృత్యాలు అలరించాయి. పోలీసుల భారీ బందోబస్తు పోలీసుల భారీ బందోబస్తు మధ్య సమ్మక్కను చిలుకలగుట్ట నుంచి మేడారం గద్దెకు చేర్చారు. సమ్మక్కను పూజారులు తీసుకుని వస్తుండగా రెండు రోప్‌పార్టీలు రక్షణ ఇచ్చాయి. రూరల్ ఎస్పీ లేళ్ల కాళిదాసు ఆధ్వర్యంలో డీఎస్పీ దక్షిణామూర్తి, సీఐలు దేవేందర్‌రెడ్డి, కిరణ్‌కుమార్, ఇతర బలగాలు భద్రత చేపట్టాయి. అధికారుల ఘనస్వాగతం కలెక్టర్ కిషన్, రూరల్ ఎస్పీ కాళిదాసు, ములుగు ఎమ్మెల్యే ధనసరి సీతక్క, ఊరట్టం సర్పంచ్ గడ్డం సంధ్యారాణి, మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర ఈఓ దూస రాజేశ్వర్‌రావు తల్లికి ఘనస్వాగతం పలికారు. సాయంత్రం 5.39కు ఏకే-47తో రూరల్ ఎస్పీ గాల్లోకి కాల్పులు జరిపారు. గుట్ట దిగగానే 5.42 గంటలకు, గద్దెల ప్రాంగణానికి వస్తుండగా చిలకలగుట్ట రోడ్డుకు చేరిన సమయంలో, సాయంత్రం 5.55 గంటలకు మరోసారి కాల్పులు జరిపారు. గుట్టెక్కిన భక్తులు చిలకలగుట్ట నుంచి తల్లిని గద్దెలకు తీసుకెళ్లిన తర్వాత పెద్ద సంఖ్యలో భక్తులు చిలకలగుట్ట ఎక్కారు. పూజారుల పూజా విధానంపై ఆసక్తితో వారు గుట్ట ఎక్కినా అక్కడ ఎటువంటి ఆనవాళ్లు కనిపించకపోవడంతో కిందికి దిగారు. ఇక తల్లిపై వేసిన బియ్యాన్ని ఆమె వెళ్లిపోయిన తర్వాత భక్తులు సేకరించారు. అలాగే గుట్ట సమీపంలోని చెట్ల బెరడును కూడా తీసుకెళ్లారు. దేవతలను దర్శించుకున్న 30 లక్షల మంది తల్లీబిడ్డలు గద్దెలపై కొలువుదీరగానే సుమారు 30 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు. ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు గద్దెల వద్ద భక్తజన ప్రవాహం కొనసాగింది. అమ్మలకు ఇష్టమైన నిలువెత్తు బంగారం(బెల్లం) సమర్పించుకుని మొక్కులు చెల్లించారు. భక్తుల పుణ్యస్నానాలతో జంపన్నవాగు కిక్కిరిసింది. మొత్తంగా ఇప్పటివరకు సుమారు 70లక్షలమంది అమ్మవార్లను దర్శించుకున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.