
ఈ ప్రభుత్వానికి సిగ్గులేదు
మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత సీతక్క
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంలో ఆడిపాడిన విమలక్కపై కేసులు పెట్టి, కార్యాలయాన్ని సీజ్ చేసిన ఈ ప్రభుత్వానికి సిగ్గులేదని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత సీతక్క అన్నారు. ఆదివారం హైదరాబాద్‌లో విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ తీరుపై ఆమె తీవ్ర విమర్శలు చేశారు.
తెలంగాణ ఉద్యమానికి సిద్ధాంతకర్తగా పనిచేసిన ఆచార్య జయశంకర్‌ను మరిచిపోరుున సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లకు సిగ్గుందా అని ప్రశ్నించారు. నక్సల్స్ ఎజెండాను అమలుచేస్తామని చెప్పిన వారే ఎన్‌కౌంటర్ల పేరుతో యువకులను కాల్చిచంపుతున్నారన్నారు. అధికారమదంతో అమరవీరుల కుటుంబాలను మరిచిపోరుున మంత్రి కేటీఆర్‌కు సిగ్గులేదన్నారు.