కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి మంత్రి సీతక్క హితవు
సాక్షి, హైదరాబాద్: బీజేపీ నేతలు ఈ నెల 25న ఇందిరాపార్కు వద్ద తలపె ట్టిన ధర్నాను విరమించుకోవాలని, గత పదేళ్లలో మూసీ ప్రక్షాళనకు, మూసీ ప్రాంత ప్రజల సంక్షేమం, ఉపాధికి నయా పైసా కేటాయించని కేంద్రం ఎదుట ధర్నా చేయాలని మంత్రి సీతక్క హితవు పలికారు. యూపీఏ హయాంలో మూసీ ప్రక్షాళనకు రూ.335 కోట్లు మంజూరు చేస్తే, మోదీ పాలనలో పైసా మంజూరు కాకపోయినా కిషన్‌రెడ్డి ఎందుకు పెదవి విప్పలేదని మంగళవారం ఓ ప్రకటనలో నిలదీశారు. ఇతర నదుల ప్రక్షాళన కు నిధులిచ్చి మూసీ ప్రక్షాళనకు పైసా కేటాయించకపోవడం తెలంగాణపై కేంద్రం వివక్షతకు నిదర్శనం కాదా? అని ప్రశ్నించారు.
సొంత నియోజకవర్గం మీదుగా మూసీ పారు తున్నా ఏనాడూ కేంద్రం నుంచి నిధులు తీసుకురాని కిషన్‌రెడ్డి ఇప్పుడు ధర్నాకు పిలుపునివ్వడం ఏమిటో ఆయన ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. మూసీ పరీవాహక ప్రాంతంలో బీజేపీకి చెందిన ముగ్గురు ఎంపీలు, ఒక కేంద్రమంత్రి ప్రాతిని ధ్యం వహిస్తున్నందున.. కేంద్రంతో చర్చించి హైదరాబాద్ జీవనరేఖగా భావించే మూసీ పునరుజ్జీవానికి రూ.10 వేల కోట్లు మంజూరు చేయించాలని డిమాండ్ చేశారు. గుజరాత్‌లో సబర్మతి రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును సమర్థిస్తున్న బీజేపీ ఇక్కడ మూసీ అభివృద్ధి ప్రాజెక్టును ఎందుకు వ్యతిరేకిస్తోందని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment