గాంధీ ఆస్పత్రిలో మంత్రి సీతక్కను అడ్డుకున్న బీజేపీ శ్రేణులు
గాంధీ ఆస్పత్రి: కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూరు ఘటనలో గాయపడి సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలిని మహిళా శిశుసంక్షేమ శాఖ మంత్రి సీతక్క గురువారం పరామర్శించారు.
బాధితురాలికి తక్షణసాయంగా లక్ష రూపాయల చెక్కును అందించారు. కాగా మంత్రి వస్తున్న సమాచారం తెలుసుకున్న బీజేపీ మహిళా శ్రేణులు గాంధీ ఆస్పత్రి వద్దకు చేరుకుని మంత్రిని అడ్డుకున్నారు. ఆస్పత్రి ప్రాంగణంలో ప్లకార్డులు ప్రదర్శించి ధర్నా నిర్వహించారు. ఈ క్రమంలో స్వల్ప ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఆదివాసీ బిడ్డగా నాకే ఎక్కువ బాధ్యత...
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మీడియాతో మాట్లాడుతూ, జైనూరు ఘటనపై కొంతమంది వ్యక్తులు, రాజకీయ పార్టీ లు చేస్తున్న విషప్రచారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆడబిడ్డకు అన్యాయం జరిగిందని తెలియగానే ప్రభుత్వం స్పందించిందని, నిందితునిపై ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశామని, కఠినశిక్ష పడేలా చర్యలు చేపట్టామన్నారు. ఈ ఘటనలో దోషులను శిక్షించేందుకు ఆడబిడ్డగా, ఆదివాసీ బిడ్డగా తనకే ఎక్కువ బాధ్యత ఉందన్నారు. జైనూ రు ఘటనకు మతం రంగు పూసేందుకు కొందరు యతి్నస్తున్నారని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కోరారు.
ఆదివాసీల జీవితాలతో చెలగాటం: ఏలేటి
బంగ్లాదేశ్‌తోపాటు ఇతర రాష్ట్రాలకు చెందిన రోహింగ్యా లు, ముస్లింలు ఏజెన్సీ ప్రాంతాలను ఆక్రమించుకుని, ఆదివాసీల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని బీజేపీ అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేశ్వరరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జైనూరు ఘటనలో చికిత్స పొందుతున్న బాధితురాలిని గురువారం పరామర్శించిన అనంతరం ఆయన మీడియా తో మాట్లాడారు.
కేంద్ర నిబంధనల మేరకు ఆదివాసీల ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనేతరులు ఉండకూడదని, కానీ జైనూరు అటవీప్రాంతంలో వేలాది మంది ముస్లింలు, గిరిజనేతరులు స్థిరనివాసాలు ఏర్పరుకున్నారని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment