సాక్షి, హైదరాబాద్: అటవీ ప్రాంతాల్లో నివసిస్తున్న గిరిజనులు వారి హక్కుల కోసం ఎలాంటి పోరాటాలు చేయడం లేదన్న అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సమాధానంపై కాంగ్రెస్ సభ్యురాలు సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏళ్ల తరబడి పోరాటాలు జరుగుతున్నా, పోడు వ్యవసాయం చేసుకుంటున్న తమకు ఆ భూములపై హక్కులు కలి్పంచా లని కోరుతున్నా, ప్రభుత్వానికి కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. కేంద్రం తెచి్చన అటవీ హక్కుల చట్టం మేరకు అర్హులైన వారికి పట్టాలు అందించాలని కోరారు. మంత్రి స్పం దిస్తూ రాష్ట్రంలోనూ కేంద్రం చట్టాన్ని అమలు చేస్తున్నామని, అర్హులకు భూ హక్కులు కలి్పంచామని తెలిపారు. హరితహారంపై పెద్ది సుదర్శన్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి బదులిస్తూ, రాష్ట్రంలో హరితహారం కింద 131 కోట్ల మొక్కలు నాటినట్లు, దీనికోసం రూ. 3,765 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment