
సాక్షి, భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి కాసేపు ఆర్టీసీ బస్సు డ్రైవర్ అవతారమెత్తారు. భూపాలపల్లి బస్‌డిపోకు నూతనంగా వచ్చిన సూపర్ లగ్జరీ బస్సును బుధవారం ఆయన ప్రారంభించారు. అనంతరం డిపో నుంచి బస్టాండ్ వరకు బస్సును నడిపి ప్లాట్‌ఫాంపై ఉంచారు. దీంతో బస్టాండ్‌లో ఉన్న ప్రయాణికులంతా నివ్వెరపోయారు. అందరూ బస్సు వద్దకు వచ్చి చూడ సాగారు.
పచ్చడి బాగుందే
అక్కా.. బాగున్నారా? అందరూ పచ్చడే తెచ్చుకున్నారా? మీతో నాకూ కాస్త వడ్డించండి అంటూ ములుగు ఎమ్మెల్యే సీతక్క వరి నాటు కూలీలతో కలసి రోడ్డుపై కూర్చుని భోజనం చేశారు. బుధవారం ఎమ్మెల్యే మహబూబాబాద్ జిల్లా ఎంచగూడెం గ్రామానికి వెళ్తుండగా.. మార్గమధ్యలో కూలీలు రోడ్డుపై కూర్చుని భోజనం చేస్తున్నారు. వారిని చూసిన ఎమ్మెల్యే కారు ఆపి కూలీలతో మాట్లాడారు. మీతోపాటు నాకూ వడ్డించండి అని కూలీలతో కలసి భోజనం చేశారు. పచ్చడి బాగుందంటూ కితాబిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment