rtc driver
-
ఖమ్మంలో విషాదం.. రన్నింగ్ బస్సులో డ్రైవర్‌కు గుండెపోటు
ఖమ్మం: జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. గుండెపోటుతో ఆర్టీసీ డ్రైవర్ కన్నుమూశాడు. సత్తుపల్లి నుంచి ఖమ్మం బయల్దేరిన బస్సులో డ్రైవర్ శ్రీనివాసరావుకు ఛాతీలో నొప్పి వచ్చింది. అయితే ఆయన ఆలస్యం చేయలేదు. ప్రయాణికులతో ఉన్న ఆ బస్సును వెంటనే పక్కకు ఆపారు. ఆపై దగ్గరిలోని ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. గుండెపోటుతోనే ఆయన కన్నుమూసినట్లు వైద్యులు ధృవీకరించారు. ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాసరావు స్వస్థలం వేంసూరు మండలం రామన్నపాలెంగా తెలుస్తోంది. -
ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి కేసులో గ్యాంగ్ లీడర్ అరెస్ట్
నెల్లూరు (క్రైమ్): కావలిలో ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి ఘటనతో పాటు తక్కువ ధరకే బంగారం, నోట్ల మార్పిడి తదితర నేరాలకు పాల్పడుతున్న గ్యాంగ్‌లీడర్ దేవరకొండ సుదీర్ అలియాస్ అజయ్‌రెడ్డిని శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. అతని ఇంట్లో సోదాలు నిర్వహించి ఎయిర్ గన్లు 4, హ్యాండ్‌కప్స్ 4, వాకీటాకీలు 4, కత్తులు రెండు, ఫోల్డింగ్ ఐరన్ స్టిక్‌లు రెండు, జామర్స్ 2, పెద్ద సంఖ్యలో సెల్ఫోన్లు, ల్యాప్టాప్స్, నగదు రూ.7 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. నెల్లూరులోని ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో గురువారం జిల్లా ఎస్పీ డాక్టర్ కె.తిరుమలేశ్వరరెడ్డి మీడియాకు వివరాలు వెల్లడించారు. నిందితుడిపై రాష్ట్రంలోని 10 పోలీస్ స్టేషన్లలో 25 కేసులున్నాయని, కావలి టూ టౌన్ పోలీసుస్టేషన్లో సస్పెక్టెడ్ షీటు ఉందన్నారు. నిందితుడు అనుచరులతో గ్యాంగ్‌ను ఏర్పాటు చేసి ఏపీ, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో తక్కువ ధరకు బంగారం, నోట్ల మార్పిడి, నకిలీ పోలీసుల అవతారంలో నేరాలు, మోసాలకు పాల్పడుతున్నాడని ఎస్పీ తెలిపారు. ఇటీవల నిందితుడి మోసాలపై పలువురు ఫిర్యాదులు చేయగా.. వాటిపై కేసులు నమోదు చేస్తున్నట్టు చెప్పారు. పరారీలో ఉన్న మిగిలిన వారి కోసం గాలిస్తున్నామని వివరించారు. సమావేశంలో ఏఎస్పీ హిమవతి, కావలి డీఎస్పీ వెంకటరమణ పాల్గొన్నారు. -
డ్రైవర్‌ను సస్పెన్షన్ చేసిన ఆర్టీసీ అధికారులు.. దీనితో డ్రైవర్ తీవ్రనిర్ణయం..
గోపాల్పేట: ఉరేసుకుని ఆర్టీసీ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వనపర్తి జిల్లా గోపాల్పేట మండలం తాడిపర్తిలో చోటుచేసుకుంది. ఎస్ఐ వెంకటేశ్వర్లు వివరాల మేరకు.. తాడిపర్తికి చెందిన చంద్రశేఖర్‌గౌడ్ (52) కొన్నేళ్లుగా ఆర్టీసీ డ్రైవర్‌గా పని చేస్తుండేవాడు. నాలుగు నెలల కిందట ఆర్టీసీ అధికారులు చంద్రశేఖర్‌గౌడ్‌ను సస్పెన్షన్ చేశారు. అప్పటి నుంచి తాగుడుకు బానిసయ్యాడు. ఈ క్రమంలో ఆర్థిక ఇబ్బందులకు తోడు కుటుంబ సభ్యులు అతడిపై కోపంతో ఇటీవల హైదరాబాద్‌కు వెళ్లారు. గురువారం రాత్రి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ తెలిపారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com విద్యుదాఘాతంతో ‘భగీరథ’ లైన్‌మేన్ మృతి గోపాల్పేట: విద్యుదాఘాతంతో మిషన్ భగీరథ పథకం లైన్‌మేన్ మృతి చెందిన ఘటన గోపాల్పేట మండలం తాడిపర్తిలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. తాడిపర్తిలో మిషన్ భగీరథ ప్రధాన పైప్‌లైన్ లీకేజీ అయింది. పైప్‌లైన్‌కు మరమ్మతు చేసేందుకుగాను కాశీంనగర్‌కు చెందిన వాటర్‌మేన్ సతీష్ (45) వెల్డింగ్ మిషన్‌కు విద్యుత్ కనెక్షన్ ఇచ్చే క్రమంలో ప్రమాదవశాత్తు షాక్‌కు గురయ్యాడు. స్థానికులు గమనించి చికిత్స నిమిత్తం వనపర్తి జిల్లా ఆస్పత్రికి తరలించగా, అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ విషయంపై ఎటువంటి ఫిర్యాదు అందలేదని ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. పోక్సో కేసులో 20ఏళ్ల జైలుశిక్ష చిన్నచింతకుంట: పోక్సో కేసులో నిందితుడికి మహబూబ్‌నగర్ ఫాస్ట్‌ట్రాక్ స్పెషల్ కోర్టు న్యాయమూర్తి శుక్రవారం 20ఏళ్ల జైలుశిక్ష, రూ.5 వేల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు. చిన్నచింతకుంట మండలం లాల్‌కోటకు చెందిన ట్రాక్టర్ డ్రైవర్ పోగుల రాజుపై 2018లో పోక్సో కేసు నమోదైంది. కోర్టులో వాదోపవాదాల అనంతరం నేరం రుజువు కావడంతో నిందితుడికి 20ఏళ్ల జైలుశిక్ష, రూ.5వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారని ఎస్ఐ శేఖర్ తెలిపారు. -
దాడి చేసింది టీడీపీ రౌడీలే
సాక్షి, అమరావతి: ఆర్టీసీ డ్రైవర్‌పై కావలిలో దాడి చేసిన రౌడీలు విపక్ష టీడీపీ, జనసేన, బీజేపీకి చెందినవారేనని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. దాడి చేసిన రౌడీలు ‘ఐ సపోర్ట్ బాబు..’ బ్యానర్లు పట్టుకున్నట్లు తెలిపారు. నిందితుల్లో ఒకరు జనసేన జెండా కప్పుకోగా మరొకరు బీజేపీ నేత అనుచరుడిగా ఉన్నట్లు చెప్పారు. ఆధారాలతో సహా రౌడీ మూకల ఫోటోలను మీడియాకు ఆయన విడుదల చేశారు. ప్రశాంత ప్రాంతం కావలిలో ఎవరు ఎటువంటి వారో ప్రజలకు బాగా తెలుసన్నారు. ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి ఆదివారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ వాస్తవాలు తెలుసుకోకుండా లోకేశ్, పవన్ కల్యాణ్ బుర్రలేని మాటలు మాట్లాడారని విమర్శించారు. దొంగలే.. దొంగ దొంగ అంటూ దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు. సాయంత్రం 6.30 గంటల సమయంలో మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డితో కలసి తాను ఆర్టీవో కార్యాలయాన్ని ప్రారంభించి వెళ్తుండగా సంఘటన స్థలం వద్ద ఏం జరిగిందో వివరాలు సేకరించాలని పోలీసులకు సూచించినట్లు చెప్పారు. టీడీపీ, దాని తోక పార్టీలు ప్రతి విషయాన్ని వైఎస్సార్ సీపీకి ఆపాదించే యత్నాలు చేస్తున్నాయని మండిపడ్డారు. డ్రైవర్‌పై దాడి చేసిందెవరో కావలి ప్రజలందరికీ తెలుసని చెప్పారు. నిందితుడు సుధీర్‌పై నాలుగు రాష్ట్రాల్లో వందల కేసులున్నాయని, అవన్నీ బయటకు తీస్తామని తెలిపారు. ఈ ఘటనలో తమ పార్టీకి చెందిన వారు ఒక్కరున్నా రాజకీయాల నుంచి తప్పుకుంటానని మరి లోకేశ్ అందుకు సిద్ధమేనా? అని సవాల్ చేశారు. ప్రధాన ముద్దాయి సుధీర్ గతంలో తన కారుపై కూడా దాడి చేసినట్లు పేర్కొన్నారు. టీడీపీ టికెట్ కోసం ప్రయత్నిస్తున్న పసుపులేటి సుధాకర్ అనే వ్యక్తి పక్కన నిందితుడు గుర్రంకొండ అరుణ్ కుమార్ ఉన్నట్లు వెల్లడించారు. గతంలో జనసేన తరఫున తనపై పోటీ చేసిన సుధాకర్ వద్ద ఇలాంటి గ్యాంగులు చాలా ఉన్నాయని, వాటిని హైదరాబాద్‌లో మోహరించి ఏం చేస్తున్నాడో తమకు సమాచారం ఉందన్నారు. అరుణ్ కుమార్ అనే వ్యక్తి ‘ఐ సపోర్ట్ బాబు’ అనే బ్యానర్ పట్టుకున్నాడని చెప్పారు. శివారెడ్డి జనసేన కార్యకర్తే అనే విషయాన్ని పవన్ తెలుసుకుంటే మంచిదన్నారు. ఎవరు రౌడీ షీటర్లను పక్కన పెట్టుకుని తిరుగుతున్నారో గుర్తు పెట్టుకోవాలన్నారు. -
రౌడీమూకపై ఉక్కుపాదం
సాక్షి, అమరావతి: అసాంఘిక శక్తులను ఏమాత్రం ఉపేక్షించొద్దని పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విస్పష్టంగా ప్రకటించిన నేపథ్యంలో కావలిలో ఆర్టీసీ డ్రైవర్ రామ్‌సింగ్‌పై దాడిని తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఘటనపై తక్షణమే స్పందించిన పోలీసు శాఖ 14 మంది నిందితులను గుర్తించడంతోపాటు ఏడుగురిని 24 గంటల్లోనే అరెస్ట్ చేయడం గమనార్హం. నిందితులకు అధికార వైఎస్సార్సీపీతో ఏమాత్రం సంబంధం లేదని, వారిపై గతంలోనే పలు కేసులు నమోదైనట్లు వెలుగులోకి వచ్చింది. ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి ఘటనను రాజకీయ లబ్ధి కోసం వినియోగించుకునేందుకు విపక్ష టీడీపీ – జనసేన వేసిన ఎత్తుగడలు పారలేదు. పరారీలో ప్రధాన నిందితుడు ఆర్టీసీ డ్రైవర్ రామ్‌సింగ్‌పై రౌడీమూకల దాడిని ప్రభుత్వం అత్యంత తీవ్రంగా పరిగణించింది. దాడికి పాల్పడ్డవారిని ఏమాత్రం ఉపేక్షించకుండా తక్షణం కఠిన చర్యలు చేపట్టాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పోలీసు శాఖను ఆదేశించారు. ఈ క్రమంలో రంగంలోకి దిగిన పోలీసు శాఖ దాడి దృశ్యాల వీడియో ఫుటేజీని పరిశీలించి 14 మంది నిందితులను గుర్తించింది. కావలి – తుమ్మలపెంట మార్గంలో రాష్ట్రం దాటేందుకు ప్రయత్నిస్తున్న ఏడుగురు నిందితులను శనివారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. బండి విల్సన్, పుట్టా శివకుమార్‌రెడ్డి, షేక్ ఖాజావలి, కుప్పాల వంశీ, షేక్ కలీమ్ చోటు, షేక్ ఇలియాజర్, షేక్ బాజీలను అరెస్ట్ చేసినట్టు ఆదివారం ప్రకటించారు. 24 గంటల్లోనే ఏడుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు మరో ఏడుగురి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ప్రధాన నిందితుడు దేవరకొండ సుధీర్‌తోపాటు మిగిలినవారిని అదుపులోకి తీసుకునేందుకు ప్రత్యేక బృందాలను నియమించి ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాతోపాటు అన్ని చోట్లా విస్తృతంగా గాలిస్తున్నారు. గతంలోనే నేర చరిత్ర.. రామ్‌సింగ్‌పై దాడికి పాల్పడిన నిందితులకు గతంలోనే నేర చరిత్ర ఉంది. కావలి ప్రాంతంలో ఈ ముఠా ఎన్నో ఏళ్లుగా రౌడీయిజం, సెటిల్మెంట్లు చేస్తూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతోంది. అమాయకులను మోసగిస్తున్న నిందితులపై గతంలోనే పోలీసులు సస్పెక్ట్ షీట్లు తెరిచారు. బండి విల్సన్‌పై 14 కేసులు, శివకుమార్‌రెడ్డిపై 8 కేసులు ఉండటం గమనార్హం. మిగిలిన ఐదుగురిని వీరి అనుచరులుగా గుర్తించారు. ఆర్టీసీ డ్రైవర్ రామ్‌సింగ్‌పై దాడికి పాల్పడిన నిందితులపై పోలీసులు తీవ్రమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. 143, 341, 332, 307, 323, 427 రెడ్‌విత్ 34 సీఐపీ సెక్షన్ల కింద కావలి రూరల్ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. రాజకీయ రాద్ధాంతం డ్రైవర్ రామ్‌సింగ్‌పై దాడిని అధికార వైఎస్సార్ సీపీతోపాటు అంతా ఖండించినా టీడీపీ – జనసేన రాజకీయ లబ్ధి కోసం దుష్ప్రచారం చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దాడికి పాల్పడిన నిందితులతో అధికార పార్టీకి ఎలాంటి సంబంధం లేకున్నా లోకేశ్ సహా టీడీపీ నేతలు దిగజారుడు రాజకీయాలకు పాల్పడ్డారు. 24 గంటల్లోనే వాస్తవాలు బహిర్గతం కావడంతో విపక్ష నేతలు తోక ముడిచారు. ఆర్టీసీ యూనియన్ల హర్షం ఘటన అనంతరం రాష్ట్ర ప్రభుత్వం సత్వరమే స్పందించిన విధానం, ఏడుగురు నిందితులను 24 గంటల్లోనే అరెస్ట్ చేయడం పట్ల ఆర్టీసీ యూనియన్లు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యమంత్రి జగన్‌తోపాటు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఆర్టీసీ ఎండీ సీహెచ్.ద్వారకా తిరుమలరావుకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాయి. ఈ ఉదంతం వెలుగులోకి రాగానే నిందితులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని ఆర్టీసీ సంఘాలకు ఎండీ భరోసానిచ్చారు. సుధీర్ ముఠా మోసాలపై ఫిర్యాదు చేయాలి వీడియోల ఆధారంగా నిందితులను గుర్తించాం. కావలికి చెందిన ప్రధాన నిందితుడు దేవరకొండ సుధీర్ కుమారుడి నిశ్చితార్థం గురించి తెలుసుకున్న పోలీసులు అక్కడకు వెళ్లడంతో పరారయ్యాడు. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. త్వరలోనే మిగిలిన నిందితులను కూడా అరెస్ట్ చేస్తాం. రూ.1.5 కోట్ల విలువైన రెండు వాహనాలను జప్తు చేశాం. ఇలాంటి ఘటనలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదు. సుధీర్ ముఠా చేతిలో మోసపోయిన వారు ఆయా పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. బాధితులు ధైర్యంగా ముందుకొచ్చి ఫిర్యాదు చేయాలని కోరుతున్నాం. – తిరుమలేశ్వరరెడ్డి, ఎస్పీ, నెల్లూరు జిల్లా -
ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి.. ఆరుగురి అరెస్ట్
కావలి/సాక్షి, అమరావతి: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి వద్ద ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి చేసిన కేసులో పోలీసులు శనివారం ఆరుగురిని అరెస్టు చేశారు. మిగిలినవారి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. ఘటన జరిగిన వెంటనే ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిన పోలీసులు 24 గంటల్లోపే నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై హత్యాయత్నం సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అరెస్టు చేసిన ఆరుగురిని ఆదివారం మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. మిగిలిన నిందితులను వీలైనంత త్వరగా అదుపులోకి తీసుకునేందుకు ఏఎస్పీ నేతృత్వంలోని ప్రత్యేక బృందాలు విస్తృతంగా గాలిస్తున్నాయి. కాగా దాడి ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బెంగళూరు నుంచి విజయవాడ వెళ్తున్న ఆర్టీసీ బస్సు(ఏపీ16జెడ్0702) డ్రైవర్ బి.రామ్‌సింగ్ కావలి ట్రంక్‌రోడ్డు వద్ద కారును పక్కకు తీయాలంటూ హారన్ మోగించాడు. దీంతో కారు యజమాని ఆర్టీసీ డ్రైవర్‌తో వాగ్వాదానికి దిగాడు. స్థానికులతో పాటు అక్కడే ఉన్న కానిస్టేబుల్ సర్దిచెప్పడంతో అతడు అక్కడి నుంచి కోపంగా వెళ్లిపోయాడు. అనంతరం తన స్నేహితుడైన దేవరకొండ సుధీర్‌తో పాటు మరికొందరికి ఫోన్ చేశాడు. వారంతా కారు, ద్విచక్రవాహనాల్లో బస్సును వెంబడించి మద్దూరుపాడు వద్ద అడ్డుకున్నారు. డ్రైవర్ రామ్సింగ్ను బస్సు నుంచి కిందకు దించి విచక్షణారహితంగా దాడి చేశారు. అనంతరం నిందితులంతా అక్కడి నుంచి పారిపోయారు. అటుగా వెళ్తున్న కావలి రూరల్ సీఐ ఎం.రాజేశ్ ప్రయాణికులు రోడ్డుపై ఉండటాన్ని గమనించి వివరాలు ఆరా తీశారు. గాయపడిన డ్రైవర్ రామ్సింగ్ను చికిత్స నిమిత్తం వెంటనే కావలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాధితుడితో మాట్లాడి నిందితులపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. డీఎస్పీ ఎం.వెంకటరమణ మాట్లాడుతూ.. దాడి ఘటనకు సంబంధించి దేవరకొండ సుధీర్, విల్సన్, శివారెడ్డి, మల్లి, కిరణ్ సహా మొత్తం 10 మందిపై హత్యాయత్నం సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. నెల్లూరు జిల్లా ఏఎస్పీ హిమవతి నేతృత్వంలో కావలి డీఎస్పీ, ముగ్గురు సీఐలు, ఐదుగురు ఎస్ఐలు, 50 మంది కానిస్టేబుళ్లు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి వివిధ ప్రాంతాల్లో నిందితుల కోసం తీవ్రంగా గాలించారు. కావలిలో ఆర్టీసీ కార్మికుల ఆందోళన కాగా ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి ఘటనను వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. నిందితులను వెంటనే అదుపులోకి తీసుకుని కఠినంగా శిక్షించాలని కోరారు. కావలిలో ఆర్టీసీ కార్మికులు ఆందోళన నిర్వహించి.. నిందితులను శిక్షించాలని డిమాండ్ చేశారు. కాగా డ్రైవర్ రామ్‌సింగ్‌పై దాడిని పీటీడీ వైఎస్సార్ ఎంప్లాయీస్ అసోసియేషన్, ఎంప్లాయీస్ యూనియన్(ఈయూ) వేర్వేరు ప్రకటనల్లో ఖండించాయి. దాడికి నిరసనగా ఆదివారం నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరై నిరసన తెలపనున్నట్టు పీటీడీ వైఎస్సార్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు చంద్రయ్య, ఈయూ నేతలు పలిశెట్టి దామోదరరావు, వై.శ్రీనివాసరావు, అప్పారావు ప్రకటించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి, ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావుకు వినతిపత్రం సమర్పిసా్తమన్నారు. అంతకుముందు విజయవాడలో చికిత్స పొందుతున్న రామ్సింగ్ను ఈయూ నేతలు పరామర్శించారు. -
ఆసిఫాబాద్: ఛాతీలో నొప్పి.. దూకేసిన ఆర్టీసీ డ్రైవర్
కుమ్రం భీం ఆసిఫాబాద్: జిల్లాలో ఆర్టీసీ బస్సు బోల్తా పడిన ఘటన చోటు చేసుకుంది. ఆసిఫాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న మార్గంలో ప్రమాదం సంభవించింది. బస్సు నడుపుతుండగా డ్రైవర్‌కు ఛాతీలో నొప్పి వచ్చింది. దీంతో డ్రైవర్ బస్సు నుంచి బయటకు దూకేశాడు. అదుపు తప్పిన బస్సు.. బోల్తా పడింది. ప్రమాదం జరిగినప్పుడు సదరు సూపర్ లగ్జరీ బస్సులో బస్సులో ఏడుగురు ప్రయాణికులు ఉండగా.. ఒకరికి గాయాలైనట్లు సమాచారం. ప్రయాణికుడితో పాటు ఛాతీ నొప్పికి గురైన డ్రైవర్‌ను ఆస్పత్రికి తరలించారు. -
Telangana: ఆర్టీసీలోనూ 95% పోస్టులు స్థానికులకే
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీలోనూ ఇకపై 95 శాతం పోస్టులను స్థానికులకే కేటాయించనున్నారు. జోనల్, మల్టీజోనల్ పద్ధతిలో పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో ‘95 శాతం స్థానికత’ను పరిగణనలోకి తీసుకొనేలా శాసనసభ ఇటీవల ఆమోదించడంతో దాన్ని ఆర్టీసీలో అమలు చేయనున్నారు. ఈ మేరకు ఆర్టీసీ పాలకమండలి శుక్రవారం ప్రత్యేకంగా సమావేశమైంది. స్థానికులకే పోస్టుల ప్రక్రియ అమలు విధివిధానాలకు సంబంధించి కొన్ని అంశాలను ప్రతిపాదించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 33 రెవెన్యూ జిల్లాలు ఉండగా ఆర్టీసీలో మాత్రం 11 రీజియన్లే ఉన్నాయి. అలాంటప్పుడు స్థానికతను ఏ రకంగా పరిగణనలోకి తీసుకోవాలనే విషయమై పాలకమండలి సభ్యులు చర్చించారు. ఓ ప్రతిపాదనను ఖరారు చేసి ప్రభు త్వానికి ప్రతిపాదించాలని నిర్ణయించారు. ప్రభు త్వం ఆమోదించాక కొత్త రిక్రూట్మెంట్ చేపట్టనున్నారు. ప్రస్తుతానికి డిపో మేనేజర్ కంటే దిగువ అధికార పోస్టుల్లో ఖాళీలు ఉండగా త్వరలో డ్రైవర్, కండక్టర్ పోస్టుల్లో కూడా ఖాళీలు ఏర్పడనున్నాయి. ఆర్టీసీ ఆసుపత్రికి ఐదుగురు వైద్యులు.. తార్నాకలోని ఆర్టీసీ ఆసుపత్రిలో ఐదుగురు వైద్యులను ఔట్ సోర్సింగ్ ద్వారా తీసుకోవాలని పాలకమండలి సభ్యులు నిర్ణయించారు. ఆసుపత్రికి అనుబంధంగా ఏర్పాటైన నర్సింగ్ కాలేజీకి ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్, కొత్తగా అందిస్తున్న సూపర్ స్పెషాలిటీ సేవలకు సంబంధించి డయాలసిస్ టెక్నీషియన్లు, నర్సులను ఔట్ సోర్సింగ్ కింద నియమించుకొనేందుకు ఆసుపత్రి పాలకమండలికి బోర్డు అనుమతించింది. చదవండి: మునుగోడుపై టీఆర్ఎస్ పోస్ట్‌మార్టం.. ‘పోలైన ఓట్లలో 50శాతం మనకే’ -
సండే స్టోరీ: ఈ ప్రేమ బస్సు ఇలా సాగిపోనీ...
‘మరో చరిత్ర’ సినిమాలో కమల హాసన్, సరితల మధ్య సంవత్సరం ఎడబాటు పెడతారు తల్లిదండ్రులు ప్రేమను నిరూపించుకోమని. కేరళలో గిరి, తార ఏకంగా 20 ఏళ్లు ఎడబాటును పాటించారు– ఎందుకంటే వాళ్ల ప్రేమ పెళ్లి దాకా వెళ్లడానికి జాతకాలు కలవలేదు గనక. కేరళ ఆర్.టి.సిలో ఒకే బస్సుకు అతను డ్రైవర్‌గా ఆమె కండక్టర్‌గా పని చేస్తారు. బస్సులో సొంత ఖర్చుతో అనేక హంగులు పెట్టారు. వారికీ, వారి బస్సుకీ ఫ్యాన్స్ బోలెడు. అజ్ఞాతంగా ఉన్న వీరి ప్రేమ సోషల్ మీడియా ద్వారా ఇప్పుడు దేశాలు దాటుతోంది. సండే రోజు బస్సు ప్రేమను తెలుసుకోవచ్చు. ఈ ప్రేమ కథ 2000 వ సంవత్సరంలో మొదలైంది. ఆమె, అతడూ కాకుండా మధ్యలో ఒక బస్సు కూడా ముఖ్య పాత్ర ధరించింది. ‘నువ్వు ఎక్కవలసిన బస్సు ఇరవై ఏళ్లు లేటు’ అన్నట్టు పెళ్లి మాత్రం 2020లో జరిగింది. అయితే ఏమి వారు సంతోషంగా ఉన్నారు. ఒకరితో ఒకరు అంతే ప్రేమగా ఉన్నారు. ఒకరి కోసం ఒకరు ప్రాణం ఇచ్చేలా ఉన్నారు. అలెప్పీ.. ఒరు ప్రేమకథ గిరి గోపీనాథ్‌కు అప్పుడు 26. తారా దామోదరన్‌కు 24. ఆమె అలెప్పీకి సమీపంలోనే ఉండే ముత్తుకులం అనే పల్లె నుంచి సిఏ కోర్సుకు ఆడిటింగ్ నేర్చుకోవడానికి అలెప్పీలోని ఒక కోచింగ్ సెంటర్‌కు వచ్చేది. గిరి మేనమామది ఆ కోచింగ్ సెంటర్. అప్పటికి సరైన ఉద్యోగం లేని గిరి ఆ కోచింగ్ సెంటర్లో మేనమామకు సహాయంగా ఉండేవాడు. అతనికి తార నచ్చింది. తారకు గిరి. ‘మొదటిసారిగా వాలెంటైన్స్ డే రోజు ఒక గ్రీటింగ్ కార్డు ద్వారా నా ప్రేమను ఆమెకు తెలియచేశాను. ఆమె కూడా ఓకే అంది’ అంటాడు గిరి. కొన్నాళ్లు ఈ గ్రీటింగ్ కార్డులతోనే వాళ్ల సందేశాలు నడిచాయి. ‘పెళ్లి చేసుకుందాం’ అని గిరి అంటే ‘మా ఇంటికొచ్చి మాట్లాడు’ అని తారా అంది. గిరి పెద్దలతో కలిసి ఆమె ఇంటికెళ్లాడు. ‘మాకు ఓకే. కాని జాతకాలు కలవాలి’ అని అమ్మాయి తరఫువారు అన్నారు. జాతకాలు కలవలేదు. గిరి కుటుంబం కూడా కలవని జాతకాలను చూసి జంకింది. ఈ పెళ్లి ఏ మాత్రం జరగదు అని ఇరుపక్షాలు తేల్చి చెప్పారు. గిరి మనసు విరిగిపోయింది. తార కుంగిపోయింది. కాని ఇద్దరి మధ్య ప్రేమ మరింత పెరిగింది. గిరి కోచింగ్ సెంటర్లో పని మానేసి 2007లో కేరళ ఆర్టీసీలో డ్రైవర్ అయ్యాడు. తార కోసం పెళ్లాడకుండా ఉండిపోయాడు. ‘నా కోసం ఒకతను వేచి ఉండగా నేను మరొకరిని ఎలా చేసుకుంటాను..’ అని తార కూడా వచ్చిన సంబంధాలను తిరగ్గొట్టసాగింది. అంతేనా... తానూ ఎలాగో పరీక్షలు రాసి 2010లో ఆర్టీసి కండక్టర్ అయ్యింది. ఇద్దరూ అలెప్పీలోని హరిపాద్ బస్టాండ్‌లో రూట్ నంబర్ 220కు డ్రైవర్, కండక్టర్లుగా మారారు. వారిద్దరి మధ్య ప్రేమ ఉన్నట్టు మెల్లగా మొదట బస్సుకు, తర్వాత ఆర్టీసి స్టాఫ్‌కు, ఆపైన పై అధికారులకు తెలిసింది. ‘బస్సే మా ప్రేమ వారధి’ అనుకుని వారిద్దరూ పెళ్లి మాట ఎత్తకనే కొనసాగారు. 2020లో పెళ్లి 2019లో కరోనా లాక్డౌన్ వచ్చాక బస్సులు వాటితో పాటు వీరిరువురి ప్రేమ హాల్ట్ అయ్యింది. కలుసుకోవడం వీలు కాలేదు. కావడం లేదు. అప్పటికి వారి వయసు 46, 44లకు చేరాయి. పెళ్లి చేసుకోకుండా అలాగే ఉండిపోయిన వీరిరువురి పట్టుదలకు పెద్దలు తల వంచారు. జాతకాలు ఓడిపోయాయి. ఏప్రిల్ 5, 2020న తమ హరిపాద్ ఆర్టీసి బస్టాండ్‌లో తమ రూట్ నం 220 బస్సును సాక్షిగా పెట్టి దండలు మార్చుకున్నారు. అంతేనా? పై అధికారులకు చెప్పి విహార అటవీ ప్రాంతమైన మలక్కపారాకు స్పెషల్ ట్రిప్ బుక్ చేసుకున్నారు. అలా ఒక బస్సులో ప్రేమించుకుని, ఆ బస్సు ఎదుట పెళ్లి చేసుకుని, దానిలోనే హనీమూన్‌కు వెళ్లిన జంటగా వీళ్లు రికార్డు స్థాపించారు. సోషల్ మీడియాలో వైరల్ పెళ్లి సమయంలో వీరి మీధ కథనాలు వచ్చినా వారం క్రితం వల్లికదన్ అనే ఒకతను ఇన్‌స్టాలో వీరి ప్రేమ కథను వీడియో తీసి పెట్టడంతో పెద్ద రెస్పాన్స్ వచ్చింది. పది లక్షల మంది వీరి ప్రేమ కథ చూశారు. వీరి ప్రేమ బలానికి ఫిదా అయ్యారు. అలెప్పీ వెళితే రోజూ ఉదయం 5.30కు హరిపాద్‌లో బయలుదేరే వీరి రూట్ నంబర్ 220 బస్ ఎక్కండి. ఆ ప్రేమ బస్సులో అలా సాగిపోండి. ఎన్నో హంగులు... డ్యూటీలో డ్రైవర్, కండెక్టర్లు అయినా వాస్తవానికి వారు ప్రేమికులే కదా. అందుకని పై అధికారుల పర్మిషన్తో ఒక మ్యూజిక్ సిస్టమ్ పెట్టారు. హాయిగా పాటలు వింటూ ప్రయాణిస్తారు. తాము ఉండే బస్సు అందంగా ఉండాలని సొంత ఖర్చుతో ప్రత్యేక అలంకరణలు చేశారు. నేరాలు జరిగి ఉద్యోగాలు దెబ్బ తినకుండా సిసి టీవీలు బిగించుకున్నారు. ఎల్ఇడి డిస్ప్లే కూడా. ఇవన్నీ ప్రయాణికులకు నచ్చాయి. హరిపాద్ బస్ స్టాండ్ నుంచి 220 రూట్లో తిరిగే పాసింజర్లు ఆ బస్సుకు– గిరి తారలకు ఫ్యాన్స్‌గా మారారు. అంతేనా... వారంతా ఒక అభిమాన సంఘంగా మారారు. ఈ ప్రేమ ఎక్కడిదాకా వెళ్లిందంటే ఈ సభ్యులు ‘లీజర్ ట్రిప్’ బుక్ చేసుకుని ఈ బస్సులో పిక్నిక్లకు వెళ్లేవారు. ప్రేమజంట గిరి తారలకు ఈ ట్రిప్పులే డ్యూయెట్లు. -
డ్రైవింగ్ చేస్తుండగా గుండెపోటు
రాయదుర్గం: డ్రైవింగ్ చేస్తుండగా ఒక్కసారిగా తీవ్రమైన గుండెపోటు. ఆ సమయంలోనూ ప్రయాణికుల క్షేమం గురించి ఆలోచించాడు. ఓ వైపున నొప్పి గుండెను మెలిపెడుతున్నప్పటికీ పంటి బిగువన బాధను భరిస్తూనే బస్సును నియంత్రించాడు. 40 మంది ప్రయాణికులను కాపాడి.. తాను మాత్రం కన్నుమూశాడు. ఈ విషాదకర ఘటన అనంతపురం జిల్లాలో ఆదివారం చోటుచేసుకుంది. కండక్టర్ హరినాథ్ తెలిపిన వివరాల మేరకు.. రాయదుర్గం పట్టణానికి చెందిన ఇస్మాయిల్ (56) స్థానిక ఆర్టీసీ డిపోలో ఔట్ సోర్సింగ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఆదివారం ఉదయం ఏపీ 02 జెడ్ 4341 నంబరు గల బస్సును తీసుకుని రాయదుర్గం నుంచి బళ్లారికి వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో మార్గ మధ్యంలోని డి.హీరేహాళ్ మండలం సోమలాపురం వద్దకు రాగానే ఉన్నట్టుండి ఛాతిలో నొప్పి మొదలైంది. నీళ్లు తాగి సముదాయించుకుని బస్సును అలాగే ముందుకు నడిపాడు. కొంత సేపటికే నొప్పి మరింత తీవ్రమైంది. వేగంగా వెళుతున్న బస్సును నియంత్రించి రోడ్డు ప్రక్కగా నిలిపాడు. ప్రయాణికులు పరిస్థితిని అర్థం చేసుకుని వెంటనే డ్రైవర్ ఇస్మాయిల్‌ను సమీపంలోని ఓ ఆర్ఎంపీ వద్దకు తీసుకెళ్లారు. అక్కడ మాత్ర మింగిన కొద్దిసేపటికే ఇస్మాయిల్ మృతి చెందాడు. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లోనూ డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించి దేవుడిలా తమ ప్రాణాలు కాపాడాడని ప్రయాణికులు పేర్కొన్నారు. -
ఆ డ్రైవర్ తొలగింపు చెల్లదు: ఏపీ హైకోర్టు ధర్మాసనం
సాక్షి, అమరావతి: మద్యం మత్తులో డ్రైవర్ బస్సు నడిపారంటూ ప్రయాణికులు, సహోద్యోగులు చెప్పిన సాక్ష్యం ఆధారంగా ఆర్టీసీ డ్రైవర్‌ను సర్వీసు నుంచి తొలగించడాన్ని హైకోర్టు ధర్మాసనం తప్పుపట్టింది. డ్రైవర్‌ను ఉద్యోగం నుంచి తొలగించడాన్ని తప్పుపడుతూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సమర్థించింది. డ్రైవర్‌ను తిరిగి సర్వీసులోకి తీసుకోవడంతోపాటు అతనికి ప్రయోజనాలన్నీ ఇవ్వాలని ఆర్టీసీ యాజమాన్యాన్ని ఆదేశించింది. ఈ ఆదేశాలను 8 వారాల్లో అమలు చేయాలని స్పష్టం చేసింది. సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేస్తూ విశాఖ ఆర్టీసీ డిపో మే నేజర్ దాఖలు చేసిన అప్పీల్‌ను ధర్మాసనం కొట్టేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్‌కుమార్‌మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది. మద్యం మత్తులో బస్సు నడుపుతున్నారన్న ఆరోపణలపై విశాఖపట్నంలోని జ్ఞానాపురానికి చెందిన సీహెచ్ వెంకటేశ్వరరావు అనే డ్రైవర్‌ను సర్వీసు నుంచి తొలగిస్తూ ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. దీనిపై వెంకటేశ్వరరావు ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. ట్రిబ్యునల్ వెంకటేశ్వరరావు తొలగింపును సమర్థిం చింది. దీనిపై ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన సింగిల్ జడ్జి, మద్యం తాగి వాహనం నడిపారన్న విషయంలో ప్రయాణికులు, సహోద్యోగి చెప్పిన సాక్ష్యం ఆధారంగా వెంకటేశ్వరరావును సర్వీసు నుంచి తొలగించడం చెల్లదన్నారు. మద్యం తాగారని నిరూపించేందుకు వైద్య పరమైన సాక్ష్యం ఉండాలని తీర్పునిచ్చారు. సింగిల్ జడ్జి ఇచ్చిన ఈ తీర్పును సవాల్ చేస్తూ విశాఖపట్నం ఆర్టీసీ డిపో మేనేజర్ సీజే ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేశారు. ఈ అప్పీల్‌పై విచారణ జరిపిన ధర్మాసనం పైన పేర్కొన్న మేరకు తీర్పునిచ్చింది. -
ఆర్టీసీ బస్సు డ్రైవర్ చొక్కా పట్టుకొని మహిళ వీరంగం
-
ఎమ్మెల్యే వాహనానికే సైడ్ ఇవ్వవా..
షాద్‌నగర్: ఆర్టీసీ బస్సు తమ వాహనానికి సైడ్ ఇవ్వలేదని ఓ ఎమ్మెల్యే అనుచరులు హల్చల్ చేసిన సంఘటన రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పరిధిలోని బూర్గుల గ్రామ శివారులో చోటు చేసుకుంది. వనపర్తి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి షాద్‌నగర్ మీదుగా వనపర్తికి వెళ్తోంది. అదే సమయంలో వెనుక నుంచి వచ్చిన ఓ వాహనంలోని వ్యక్తులు బస్సును ఓవర్ టేక్ చేసి బెంగళూరు హైవేపై మధ్యలో నిలిపేశారు. కొందరు వ్యక్తులు వాహనంలోనుంచి దిగి ఎమ్మెల్యే వాహనానికే సైడ్ ఇవ్వవా.. అంటూ ఊగిపోయారు. బస్సు దిగి కిందికి రావాలంటూ బూతు మాటలతో విరుచుకుపడి కర్రతో డ్రైవర్‌పై దాడికి యత్నించారు. దీంతో వాహనాలు కొద్ది సేపు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఎమ్మెల్యే అనుచరులమని చెప్పుకుంటున్న వ్యక్తులు జాతీయ రహదారిపై హల్చల్ చేస్తున్న దృశ్యాలను అటువైపు నుంచి వెళ్తున్న ప్రయాణికులు చిత్రీకరించారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. జాతీయ రహదారిపై హల్చల్ చేసిన వ్యక్తులు అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే అనుచరులని సమాచారం. కాగా, ఈ ఘటనపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఎలా స్పందిస్తారో అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. -
20 మంది ప్రాణాలు కాపాడి.. గుండెపోటుతో మృతి
సేలం/తమిళనాడు: విధుల్లో ఉన్న ఓ ఆర్టీసీ బస్సు డ్రైవర్ గుండెపోటుతో ఆదివారం మృతిచెందారు. గుండెనొప్పి రాగానే బస్సును డ్రైవర్ చాకచక్యంగా నిలిపివేయడంతో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఈరోడ్ జిల్లా కౌందంపాడికి చెందిన సెల్వరాజ్ (52) ప్రభుత్వ బస్సు డ్రైవర్. ఆదివారం ఉదయం 7.30 గంటలకు కౌందంపాడి నుంచి పెరుందురైకి 20 మంది ప్రయాణికులతో వెళుతున్నారు. మార్గమధ్యంలో సెల్వరాజ్‌కు ఛాతిలో నొప్పి రావడంతో బస్సును రోడ్డు పక్కన ఆపి కండక్టర్‌కి విషయం చెప్పాడు. ప్రయాణికులు సెల్వరాజ్‌ను మరో వాహనంలో సిరువల్లూరు పీహెచ్‌సీకి తరలించారు. పరీక్షించిన వైద్యు లు అప్పటికే మృతిచెందినట్లు చెప్పారు. సిరు వల్లూరు పోలీసులు మృతదేహాన్ని గోపిచెట్టి పాళయం ప్రభు త్వ ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
హైదరాబాద్ : డిపో ముందు పురుగుల మందు తాగి ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య
-
ఆర్టీసీ డ్రైవర్ ఇంటికెళ్లి సర్ప్రైజ్ చేసిన స్టార్ హీరో
సాధారణంగా ఓ వ్యక్తికి సమాజంలో గుర్తింపు, హోదా వచ్చిదంటే చాలు.. వారు ఇక సెలెబ్రిటీ అయిపోతారు. హోదాని దృష్టిలో పెట్టుకొని, తమకంటే తక్కువ స్థాయిగల వారితో మాట్లాడడానికే నిరాకరిస్తారు. చిత్రపరిశ్రమలో అయితే ఇది మరీ ఎక్కువ. ఒక్క సినిమా తీసి హిట్ కొడితే చాలు.. ఇక ఆ హీరో చరిత్రే మారిపోతుంది. ఉండే ఇల్లు మొదలు... చేసే స్నేహం వరకు అన్ని మారిపోతాయి. గతం మర్చిపోయి కొత్త జీవితాన్ని ఎంజాయ్ చేస్తారు. తన ఎదుగుదలకు సహకరించిన వారితో పాటు, చిన్ననాటి స్నేహితులను కూడా మర్చిపోతారు. కానీ కన్నడ స్టార్ హీరో దర్శన్ మాత్రం ఇందుకు విరుద్దం. చిన్ననాటి స్నేహితులతో పాటు, తనను స్కూల్‌కు తీసుకెళ్లిన ఆర్టీసీ డ్రైవర్ని కూడా మర్చిపోలేదు. తాజాగా ఆయన చిన్నతనంలో తనను స్కూల్‌కు తీసుకెళ్లిన ఆర్టీసీ డ్రైవర్ ఇంటికి వెళ్లి అందరిని ఆశ్చర్యపరిచాడు. ఆ ఆర్టీసీ డ్రైవర్ నిన్న (మార్చి 22)80వ పుట్టిన రోజు జరుపుకున్నాడు. ఈ విషయం హీరో దర్శన్ దృష్టికి వెళ్లింది. ఎప్పటి నుంచో తనను కలుద్దామనుకున్న దర్శన్.. ఇదే మంచి సమయం అనుకొని బర్త్‌డే రోజు ఆయన ఇంటికి వెళ్లి సర్ప్రైజ్ చేశాడు. ఆయనకు పుష్పగుచ్ఛం ఇచ్చి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశాడు. ఇందుకు సంబంధించిన పోటోలను దర్శన్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. దర్శన్ చేసిన పనిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. దర్శన్ రియల్ హీరో అని కామెంట్లు చేస్తున్నారు. Sarathi meets the real sarathi who used to be KSRTC bus route driver of Our school, today Meet & wished him on his 80th birthday and took his blessings pic.twitter.com/prEQOd4ZZk — Darshan Thoogudeepa (@dasadarshan) March 22, 2021 -
డ్రైవర్ల కుటుంబంలో విషాదం..
ప్రకాశం, కారంచేడు: ఆ తండ్రికి నలుగురు కొడుకులు.. అందరూ డ్రైవింగ్‌నే వృత్తిగా ఎంచుకున్నారు. ఆర్టీసీ డ్రైవర్‌గా పనిచేసి రిటైర్ అయిన తండ్రి గతంలోనే కాలం చేయగా ఆయన కుమారుల్లో ఇద్దరు బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఇటీవల చనిపోయిన తోటి ఉద్యోగి కర్మకాండలకు వెళ్లొస్తున్న సోదరులను టిప్పర్ రూపంలో మృత్యువు బలితీసుకుంది. మండలంలోని దగ్గుబాడు గ్రామ సమీపంలో ద్విచక్ర వాహనాన్ని టిప్పర్ ఢీకొన్న ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే ఊపిరి వదిలారు. అన్నదమ్ములిద్దరూ మృత్యువాత పడటం, వారిలో ఒకరి పుట్టిన రోజు కూడా కావడంతో వారి స్వగ్రామం పర్చూరులో తీవ్ర విషాదం అలముకుంది. స్థానిక ఎస్ఐ బి.నరసింహారావు తెలిపిన వివరాల మేరకు.. చీరాల ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా పని చేసిన చెరుకూరి జగన్మోహనరావు పర్చూరులో స్థిరపడ్డాడు. ఆయనకు భార్య, నలుగురు కుమారులు ఉన్నారు. పదవీ విరమణ అనంతరం జగన్మోహనరావు మృతి చెందగా ఆయన భార్య కూడా ఇటీవలే కాలం చేసింది. ఆయన నలుగురు కుమారులు కూడా అందరూ డ్రైవర్లుగానే స్థిరపడ్డారు. వీరిలో పెద్ద కుమారుడు కోటేశ్వరావు పర్చూరులో స్కూల్ బస్సు డ్రైవర్, రెండవ కుమారుడు హనుమంతరావు చీరాల ఆర్టీసీ డ్రైవర్, మూడవ కుమారుడు పర్చూరులో స్కూల్ బస్సు డ్రైవర్, చిన్నకుమారుడు చీరాలలోని టాక్సీ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఇటీవల చినగంజాంకు చెందిన ఆర్టీసీ కండక్టర్ శ్రీనివాసరావు మృతి చెందగా బుధవారం ఆయన దశ దిన ఖర్మకు హాజరయ్యేందుకు చీరాల ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా పని చేస్తున్న హనుమంతరావు (53) ఆయన తమ్ముడు శ్రీనివాసరావు(51) ఉదయం ద్విచక్ర వాహనంపై వెళ్లారు. మధ్యాహ్నం తిరుగు ప్రయాణంలో ఇంకొల్లు వైపు నుంచి పర్చూరు వస్తుండగా పర్చూరు వైపు నుంచి ఇంకొల్లు వైపు వెళ్తున్న టిప్పర్ మండలంలోని దగ్గుబాడు కోల్డ్ స్టోరేజీ సమీపంలో వీరి బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో హనుమంతరావు, శ్రీనివాసరావు ఇద్దరూ ఎగిరి రోడ్డుపై పడి తలలు పగిలి అక్కడికక్కడే మృతి చెందారు. ఒకే రోజు ఇద్దరు అన్నదమ్ములు మృతి చెందడం, రెండు కుటుంబాలు వీధిన పడటంతో పర్చూరులో విషాదఛాయలు అలముకున్నాయి. హనుమంతరావుకు భార్య, వివాహాలు అయిన కుమారుడు, కుమార్తె ఉన్నారు. శ్రీనివాసరావుకు భార్య, వివాహాలు అయిన ఇద్దరు కుమార్తెలున్నారు. పుట్టిన రోజు మృత్యు ఒడికి.. బుధవారం శ్రీనివాసరావు పుట్టినరోజు. సాయంత్రం ఇంటికి వచ్చిన తరువాత పుట్టిన రోజు వేడుకను కుటుంబ సభ్యులతో కలిసి పంచుకుందామని చెప్పాడు. తల స్నానం చేసి, కొత్త బట్టలు వేసుకొని వెళ్లిన భర్త విగత జీవిగా ఇంటికి రావడంతో కుటుంబ సభ్యులు కన్నీరు, మున్నీరుగా విలపిస్తున్నారు. అన్నతో కలిసి ఇంటికి బయలుదేరిన శ్రీనివాసరావును టిప్పర్ రూపంలో మృత్యువు కబళించిందని గ్రామస్తులు వాపోయారు. ప్రమాదం జరిగిన వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న ఎస్ఐ బి.నరసింహారావు వివరాలు సేకరించి, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
ఆర్టీసీ సమ్మె: మృత్యు ఒడిలోకి కార్మికుడు
సాక్షి, వరంగల్: తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల మరణాలు ఆగడం లేదు. ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వం కఠినవైఖరి వీడకపోవటంతో తీవ్ర మనస్థాపానికి చెందిన ఓ ఆర్టీసీ డ్రైవర్ గుండెపోటుకు గురయ్యాడు. ఈ ఘటన వరంగల్ రూరల్ జిల్లాలోని నర్సంపేటలో చోటుచేసుకుంది. నర్సంపేటకు చెందిన యాకుబ్ ఆర్టీసీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. గత 46 రోజులుగా కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మెలో చురుకుగా పాల్గొంటున్నాడు. అయితే కార్మికుల పక్షాన కోర్టు తీర్పు రాకపోవడంతో తీవ్ర మానసిక సంఘర్షణకు లోనయ్యాడు. ఈ క్రమంలో ఆయనకు గుండెపోటు రాగా కుటుంబసభ్యులు ఎంజీఎంలో చేర్పించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందారు. కార్మికుని మృతిపై జేఏసీ నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇది ప్రభుత్వం చేసిన హత్య అని ఆర్టీసీ కార్మికులు ఆరోపిస్తున్నారు. మూడు నెలలుగా జీతాల్లేక ప్రభుత్వం పరోక్షంగా వేధించడం వల్లే యాకుబ్ మరణించాడని ఆయన సన్నిహితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీ కార్మికుల మృత్యు ఘోష ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వినిపించటం లేదా అంటూ పలువురు మండిపడుతున్నారు. -
పురుగుల మందు తాగి ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య
-
తెలంగాణ ఆర్టీసీలో మరో బలిదానం
సాక్షి, మహబూబాబాద్: తెలంగాణలో మరో ఆర్టీసీ కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. గత 40 రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్న నేపథ్యంలో మరో ప్రాణం బలైపోయింది. మహబూబాబాద్ డిపో డ్రైవర్ నరేష్ బుధవారం ఉదయం పురుగుల మందు తాగాడు. వెంటనే అతన్ని సమీపంలోని ఆస్పత్రికి తరలించినప్పటికీ లాభం లేకపోయింది. అప్పటికే నరేష్ ప్రాణాలు విడిచాడు. నరేష్‌కు భార్య పోలమ్మ, ఇద్దరు పిల్లలు శ్రీకాంత్, సాయికిరణ్ ఉన్నారు. అతను 2007 నుంచి ఆర్టీసీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. గత ఐదేళ్లుగా నరేష్ భార్య హృద్రోగంతో బాధపడుతోందని, నెలకు రూ. 5వేల మందులు వాడుతున్నారని, మరోవైపు ఇద్దరు పిల్లలు చదువుతుండటంతో నరేష్ ఆర్థికంగా అనేక బాధలు పడుతున్నాడని, ఈ క్రమంలో మొదలైన సమ్మె ఎంతకూ పరిష్కారం కాకపోవడంతో అతను ఆత్మహత్య చేసుకున్నాడని తోటి కార్మికులు చెప్తున్నారు. నరేష్ ఆత్మహత్య వార్త తెలియడంతో అఖిలపక్ష నాయకులు, ఆర్టీసీ కార్మికులు పెద్ద ఎత్తున ఆస్పత్రికి చేరుకుంటున్నారు. ఇది ప్రభుత్వ హత్యేనని, కోర్టు విచారణ పేరిట కాలయాపన చేయకుండా కార్మికులతో ప్రభుత్వం వెంటనే చర్చలు జరిపి.. సమస్యను పరిష్కరించాలని కార్మిక సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. నా చావుకు ముఖ్యమంత్రే కారణం! ఆత్మహత్య చేసుకునే ముందు ఆర్టీసీ డ్రైవర్ నరేష్ సూసైడ్ లెటర్ రాసినట్టు తెలుస్తోంది. ‘నా చావుకు ముఖ్యమంత్రే కారణం. నా వల్ల ఆర్టీసీ కార్మికులకు న్యాయం జరగాలి. ఆర్టీసీలో నాదే చివరి బలిదానం కావాలని ముఖ్యమంత్రిగారిని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. నా కుటుంబానికి వచ్చిన ఇబ్బంది మరో కుటుంబానికి రాకూడదు. ఇది నేను సొంతంగా రాసిన లేఖ. నా అంత్యక్రియలకు అశ్వత్థామరెడ్డి హాజరుకావాలి. ఆర్టీసీ కార్మికులు బాగుండాలి’ అంటూ ఈ లేఖలో నరేష్ పేర్కొన్నాడు. ఈ లేఖను చూసి ఆర్టీసీ కార్మికులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. -
ఆర్టీసీ డ్రైవర్‌కు గుండెపోటు
వర్ధన్నపేట: ఆర్టీసీ సమ్మె కొనసాగుతుండటంతో తీవ్ర మానసిక ఒత్తిడి గురైన ఓ ఆర్టీసీ డ్రైవర్ గుండె పోటుకు గురయ్యాడు. ఈ సంఘటన వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేట మండలం కొత్తపల్లిలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన చీకటి వీరస్వామి తొర్రూరు డిపోలో డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ నెలాఖరున ఆయన రిటైర్మెంట్ ఉంది. ఈ క్రమంలో సమ్మె కొనసాగుతుండటంతో తాను ఒక్కడినే విధుల్లో చేరాలా.. వద్దా అని నిర్ణయించుకోలేక మానసిక సంఘర్షణకు లోనయ్యాడు. విధుల్లో చేరకపోతే రావాల్సిన డబ్బులు వస్తాయో రావో అని ఆందోళన చెందుతున్నాడు. ఈ క్రమంలో గురువారం గుండె పోటు రావడంతో కుటుంబ సభ్యులు హన్మకొండలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు. ఆర్టీసీ కార్మికుడి ఆత్మహత్యాయత్నం మేడ్చల్: నగరంలోని రాణిగంజ్ డిపోలో మెకానిక్‌గా పని చేస్తున్న ఆర్టీసీ కారి్మకుడు గురువారం ఉదయం ఆత్మహత్యాయత్నం చేశాడు. మండలంలోని డబీల్‌పూర్ గ్రామానికి చెందిన షేక్‌బాబా రాణిగంజ్ ఆర్టీసీ డిపోలో మెకా నిక్‌గా పని చేస్తున్నాడు. ఆర్టీసీ సమ్మె ఎటూ తేలకపోవడంతో మనస్తాపం చెందిన షేక్‌బాబా ఇంట్లో ఉన్న గుళికల్ని కూల్‌డ్రింక్‌లో కలుపుకుని తాగా డు. షేక్బాబాను గమనించిన కుటుంబ సభ్యులు అతడిని చికిత్స కోసం నగర శివార్లలోని ఓ ఆస్పత్రికి తరలించినట్లు గ్రామస్తులు తెలిపారు. -
ఆర్టీసీ సమ్మె : విధుల్లో చేరేందుకు మరొకరు సిద్ధం
సాక్షి, కామారెడ్డి : ముఖ్యమంత్రి కేసీఆర్ డెడ్‌లైన్‌తో మరో ఆర్టీసీ కార్మికుడు విధుల్లో చేరేందుకు సిద్ధమయ్యారు. కామారెడ్డి డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్న సయ్యద్ హైమద్ తిరిగి విధుల్లో చేరుతున్నట్టు డిపో మేనేజర్‌కు ఆదివారం మధ్యాహ్నం రిపోర్టు చేశారు. రెండు నెలల నుంచి జీతాలు రాక ఇబ్బందులు ఎదురవుతున్నాయని హైమద్ మీడియా ఎదుట వాపోయారు. ఎన్నికల ముందు సమ్మె చేస్తే లాభం ఉండేదని ఆయన అభిప్రాయపడ్డారు. పండగల ముందు సమ్మెతో ప్రజలు ఇబ్బందులు పడ్డారని తెలిపారు. విధుల్లో చేరేందుకు తనపై ఎవరి ఒత్తిడి లేదన్నారు. స్వచ్ఛందంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. ఇదిలాఉండగా..హైమద్ నిర్ణయంతో పల్లెబాట కార్యక్రమాన్ని డిపో కార్మికులు రద్దు చేసుకున్నారు. అతని కుటుంబ సభ్యులకు సర్ది చెప్పే యత్నం చేశారు. ఇక ఉప్పల్ డిపోలో అసిస్టెంట్ డిపో మేనేజర్‌గా పనిచేస్తున్న కేశవ కృష్ణ.. తిరిగి విధుల్లో చేరుతున్నట్టు తెలిపారు. ఈ మేరకు ఆయన ఆదివారం డిపో మేనేజర్‌కు లేఖ అందజేశారు. (చదవండి : కేసీఆర్ డెడ్‌లైన్.. విధుల్లో చేరిన ఉద్యోగి) చేరండి.. పూర్తి భద్రత కల్పిస్తాం సాక్షి, నారాయణపేట : సమ్మెలో ఉన్న ఆర్టీసీ కార్మికులు నిర్భయంగా విధుల్లో చేరొచ్చునని జిల్లా ఎస్పీ డాక్టర్ చేతన చెప్పారు. విధుల్లో చేరాలనుకునే కార్మికులకు పోలీస్ శాఖ తరపున పూర్తి భద్రత కల్పిస్తామని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. -
డోర్ మూయకుంటే డ్రైవర్, కండక్టర్‌పై చర్యలు
తమిళనాడు, తిరువొత్తియూరు: ప్రయాణిస్తున్న బస్సు తలుపులు మూయకుంటే డ్రైవర్, కండక్టర్లపై చర్యలు తీసుకుంటామని రవాణశాఖ అధికారులు హెచ్చరించారు. రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ తరపున నిత్యం 19 వేల బస్సులు నడుస్తున్నాయి. ఇందులో చెన్నై, కోవై, మదురై, తిరుచ్చి నగరాలకు వెళ్లే బస్సుల్లో రద్దీ ఉంటుంది. ఉదయం, సాయంత్రం సమయాల్లో పాఠశాల, కళాశాల విద్యార్థులు, ప్రజలు ఫుట్‌బోర్డుపై వేలాడుతున్నట్టు ప్రయాణం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో బస్సు తలుపులను మూయడానికి వీలు పడడం లేదు. తద్వారా పెద్ద ప్రమాదం జరుగే అవకాశం ఉంది. ఇప్పటి వరకు బస్సు ఫుట్‌రోడ్డుపై నుంచి కింద పడిన కొన్ని సంఘటనలు ఉన్నాయని, ఈ ప్రమాదాలను నివారించటానికి తప్పనిసరిగా డ్రైవర్లు బస్సు ప్రయాణిస్తున్న సమయంలో డోర్లు మూసి ఉంచాలని లేని పక్షంలో బస్సు డ్రైవర్, కండక్టర్లకు నోటీసులు పంపించి చర్యలు తీసుకుంటామని రవాణ శాఖ ఉన్నతాధికారి తెలిపారు. -
మోతీ నగర్లో తప్పిన ప్రమాదం; అదుపులో తాత్కాలిక డ్రైవర్
సాక్షి, హైదరాబాద్ : ఆర్టీసీలో కార్మికులు సమ్మె చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం తాత్కాలికంగా డ్రైవర్లు, కండక్టర్లను నియమించుకొని కొంత మేర ప్రజలకు ఉపశమనం కలిగిస్తున్న విషయం తెలిసిందే. అయితే వారికి సిటీలో నడిపిన అనుభవం లేకపోవడం వల్ల తరుచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా మంగళవారం సనత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని మోతీ నగర్లో కూకట్పల్లి డిపోకి చెందిన ఆర్టీసీ బస్సు ఇన్నోవా కారుపై దూసుకెళ్లింది. ఇన్నోవా డ్రైవర్ గమనించి అప్రమత్తమవడంతో ప్రమాదం తప్పింది. విషయం తెలుసుకున్న పోలీసులు బస్సు డ్రైవర్‌ను తమ అదుపులోకి తీసుకున్నారు. కాగా, కొద్ది నిమిషాల ముందే ఇన్నోవా వాహనంలో స్కూలు పిల్లలను వారి ఇండ్ల దగ్గర వదిలేసి రావడం గమనార్హం. -
అశ్వత్థామరెడ్డిపై కేసు పెట్టిన డ్రైవర్
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సమ్మె 21వ రోజు కూడా కొనసాగింది. సీఎం కేసీఆర్ ప్రకటన తో కార్మికుల్లో కొంత గందరగోళం నెలకొన్నా శుక్రవారం కూడా కార్మికులు ఉధృతంగానే నిరసనలు వ్యక్తం చేశారు. కొందరు కార్మికులు డిపో మేనేజర్లకు ఫోన్ చేసి విధుల్లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారన్న ప్రచారం జరుగుతుండటంతో జేఏసీ నేతలు అలర్ట్ అయ్యారు. ఎవరూ విధుల్లోకి వెళ్లకుండా జాగ్రత్త పడుతున్నారు. కూకట్పల్లి డిపోలో డ్రైవర్‌గా పని చేస్తున్న కోరేటి రాజు విధుల్లో చేరుతున్నట్లు లిఖిత పూర్వకంగా డీఎంకు దరఖాస్తు సమర్పించి జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన వల్లే ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చిందని ఆరోపించడంతో రాష్ట్రవ్యాప్తంగా ఈ అంశం చర్చనీయాంశమైంది. దీని వెనుక ప్రభుత్వ హస్తం ఉందంటూ జేఏసీ నేతలు మండిపడుతున్నారు. ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ మంచిర్యాల, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో పర్యటించి నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. హన్మకొండ ఏక శిలా పార్కులో కార్మికులు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. భూపాలపల్లిలో విద్యా సంస్థలకు వెళ్లి కార్మికులు విద్యార్థుల మద్దతు కోరారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల మద్దతు.. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు అఖిల పక్షనేతలు, విద్యార్థి, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలు మద్దతు ఇస్తూ నల్లగొండ డిపో వద్ద నిరసన ర్యాలీ నిర్వహించారు. సూర్యాపేటలో ఆర్టీసీ జేఏసీ, టీజేఎస్, ఎమ్మార్పీఎస్, సీఐటీయూ నేతలు కొత్త బస్టాండ్ వద్ద సీఎం దిష్టి బొమ్మ దహనం చేశారు. ఖమ్మం బస్టాండ్ వద్ద జేఏసీ, అఖిలపక్ష నేతలు నిరసన దీక్ష చేపట్టారు. నార్కట్‌పల్లి డిపో డ్రైవర్ జమీల్ గుండెపోటుతో మృతి చెందటంతో ఆయన మృతదేహంతో డిపో వద్ద కార్మికులు ధర్నా చేశారు. మృతుడి కుటుంబసభ్యులకు చెరుకు సుధాకర్ రూ.10 వేల ఆర్థిక సాయం అందజేశారు. దామరచర్ల మండలం నర్సాపురంలో రమావత్ దీప్లా అనే డ్రైవర్ సెల్‌టవర్ ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. యాదగిరిగుట్టలో కార్మికుల నిరసన కార్యక్రమాల్లో సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం పాల్గొన్నారు. అలాగే శుక్రవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. వంటావార్పు.. సంగారెడ్డి బస్టాండ్ వద్ద వంటా వార్పు చేపట్టారు. మంత్రి హరీశ్‌రావు పర్యటన ఉండటంతో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. మెదక్‌లో కార్మికులు ర్యాలీ నిర్వహించి నిరాహారదీక్షలో పాల్గొన్నారు. సిద్దిపేట డిపో వద్ద ఏర్పాటు చేసిన నిరసనసభలో సీపీఐ నేత చాడవెంకట్‌రెడ్డి పాల్గొన్నారు. కరీంనగర్ మంకమ్మ తోటలో బస్సుల కోసం ఎలగందుల స్కూల్ విద్యార్థులు రాస్తారోకో నిర్వహించారు. జగిత్యాల నిరసన కార్యక్రమాల్లో కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. మెట్పల్లి డిపోవద్ద కార్మికులు చెవుల్లో పూలు పెట్టుకుని నిరసన తెలిపారు. రామగుండం కార్పొరేషన్ ఆఫీస్ ఎదుట గోదావరిఖని డిపో కార్మికులు మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. 30న సభకు జనసమీకరణపై దృష్టి ఈ నెల30 సరూర్‌నగర్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయించిన జేఏసీ.. జన సమీకరణ చేసేందుకు ఏర్పాట్లలో నిమగ్నమైంది. ఇందుకు రాజకీయ పార్టీల సాయాన్ని కోరింది. కార్మికుల కుటుంబసభ్యులతో పాటు సాధారణ ప్రజలు, పార్టీల కార్యకర్తలు పెద్ద ఎత్తున వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. ఇందుకు శుక్రవారం మధ్యాహ్నం జేఏసీ నేతలు బీజేపీ కార్యాలయానికి వెళ్లి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, ఇతర నేతలతో చర్చించారు. జన సమీకరణకు పూర్తి స్థాయిలో సహకరిస్తామని వారు హామీ ఇచ్చారు. సమ్మె విషయంలో సీఎం కేసీఆర్ భేషజాలకు పోతున్నందున అవసరమైతే కేంద్రం జోక్యం చేసుకునేలా చూస్తామని హామీ ఇచ్చారు. అనంతరం సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కతో భేటీ అయ్యారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో కూడా జన సమీకరణ చేస్తామని హామీ ఇచ్చారు. సరూర్‌నగర్ బహిరంగ సభలో అన్ని పార్టీల నేతలు పాల్గొనేలా జేఏసీ నేతలు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఈ సభకు పోలీసులు అనుమతించకపోతే హైకోర్టును ఆశ్రయించాలని జేఏసీ నేతలు భావిస్తున్నారు. ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని కలిసిన అశ్వత్థామరెడ్డి రంగంలోకి విద్యార్థి సంఘాలు ఉస్మానియా యూనివర్సిటీలో పోలీసులు అడ్డు కున్నా శుక్రవారం రాత్రి విద్యార్థులు భారీ బహి రంగ సభ నిర్వహించారు. మధ్యాహ్నం నుంచే సభకు ఏర్పాట్లు జరిగినా అనుమతిలేదంటూ పోలీసులు మైకులను స్వాధీనం చేసుకున్నారు. దీనికి పెద్ద సంఖ్యలో విద్యార్థులు హాజరుకావటం జేఏసీకి ఉత్సాహాన్నిచ్చింది. ఇకపై ఉద్యమాన్ని తాము ముందుకు తీసుకెళ్తామని వారు పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి సంఘాలు సమ్మెకు సంఘీభావం తెలుపుతూ ప్రత్యక్షంగా పాల్గొంటాయని వెల్లడించారు. 72 శాతం బస్సులుతిప్పాం రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం ఎక్కువ సంఖ్య(72 శాతం)లో బస్సులు తిప్పినట్లు ఆర్టీసీ ప్రకటించింది. శుక్రవారం 6,519 బస్సులు తిప్పామని, ఇందులో ఆర్టీసీ బస్సులు 4591 ఉండగా, ఆర్టీసీ అద్దె బస్సులు 1,928 ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. -
మరో ఆర్టీసీ కార్మికుడి మృతి
సాక్షి, హైదరాబాద్ : ఆర్టీసీలో మరో గుండె ఆగింది. ముషిరాబాద్ డిపోలో డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్న రమేష్(37) బుధవారం గుండెపోటుతో మృతి చెందాడు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మాల్ గ్రామానికి చెందిన రమేష్ గత 17 రోజులుగా సమ్మెలో చురుగ్గా పాల్గొన్నాడు. రెండు రోజుల గుండెనొప్పి రావడంతో మలక్‌పేటలోని యశోదా ఆస్పత్రిలో ఆడ్మిట్ అయ్యారు. చికిత్స పొందుతూ బుధవారం కన్నుమూశారు. తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె 19వ రోజుకు చేరింది. ప్రభుత్వం చర్చలు జరపకపోవడంతో కార్మికులు ఆందోళన చెందుతున్నారు. నేడు అన్ని డిపోల వద్ద కార్మికులు ఆందోళన నిర్వహించారు. తమ సమ్మెకు మద్దతు తెలపాలని కార్మిక సంఘాల నేతలు ప్రజాప్రతినిధులను కోరనున్నారు. (చదవండి : గుండెపోటుతో ఆర్టీసీ డ్రైవర్ మృతి) -
ఖమ్మంలో ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం
-
బస్సులపై దాడి చేసిన ఆర్టీసీ కార్మికులు
సాక్షి, ఖమ్మం: ఓ వైపు ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉద్ధృతంగా సాగుతుంటే.. మరోవైపు ప్రభుత్వ వైఖరితో కార్మికులు ఆందోళనకు గురవుతున్నారు. తాజాగా ఓ ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. గత ఎనిమిది రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. సమ్మెతో తన కుటుంబం రోడ్డున పడిందంటూ ఖమ్మం డిపోలో డ్రైవర్‌గా పని చేస్తున్న శ్రీనివాస్‌రెడ్డి శనివారం ఒంటిపై కిరోసిన్ పోసుకున్నాడు. తీవ్రంగా గాయపడిన అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఖమ్మం కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత శ్రీనివాస్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో ఆర్టీసీ కార్మికులు ...ఖమ్మం కలెక్టరేట్ వద్ద ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా బస్సులపై కార్మికులు దాడి చేయడంతో నాలుగు బస్సుల అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఈ నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాగా సమ్మెలో పాల్గొన్న వారిని ఉద్యోగాల నుంచి తొలగిస్తామని, వారికి జీతాలు కూడా చెల్లించేది లేదంటూ ప్రభుత్వం ప్రకటించడంతో తీవ్ర మనస్తాపానికి గురై మియాపూర్ డిపో ఆర్టీసీ డ్రైవర్ లక్ష్మయ్య నిన్న (శుక్రవారం) గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. అలాగే సమ్మె నేపథ్యంలో ఆందోళనలు, నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్న పలువురు కార్మికులు కూడా ఆస్పత్రి పాలైయ్యారు. మరోవైపు సమ్మె చేస్తున్న కార్మికులతో చర్చలు జరిపేది లేదని రాష్ట్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. సమ్మెలో ఉన్నవారికి జీతాలు చెల్లించేది లేదని, విధుల్లో ఉన్నవారికి మాత్రమే జీతాలు చెల్లిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. -
సెల్ టవర్ ఎక్కి ఆర్టీసీ డ్రైవర్ నిరసన
సాక్షి, కడ్తాల్: తమ డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం రావిచెడ్‌లో వెంకటేష్ అనే ఆర్టీసీ డ్రైవర్ సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపాడు. తమ డిమాండ్లు నెరవేరేవరకు సెల్ టవర్ దిగబోనని అతను భీష్మించుకొని కూర్చున్నాడు. దాదాపు గంటసేపు టవర్‌పైన ఉండి నిరసన తెలిపిన వెంకటేశ్‌ను పోలీసులు, స్థానికుల నచ్చజెప్పి కిందకు దించారు. తమ డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు రెండో రోజు ఆదివారం కూడా సమ్మె కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. సమ్మె విషయంలో ఇటు ప్రభుత్వం అటు కార్మిక సంఘాలు పట్టువిడవడం లేదు. సమ్మె ఎన్నిరోజులు కొనసాగినా కార్మికులతో చర్చలు ఉండబోవని ప్రభుత్వం స్పష్టం చేయగా.. సమ్మెపై వెనక్కి తగ్గేది లేదని కార్మికులు తేల్చిచెబుతున్నారు. ప్రభుత్వం విధించిన డెడ్‌లైన్ ముగిసినా కార్మికులంతా సమ్మె కొనసాగిస్తున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే వరకు సమ్మె కొనసాగిస్తామని తేల్చిచెబుతున్నారు. -
ఒక చేత్తో డ్రైవింగ్ మరో చేతిలో సెల్‌ఫోన్
-
ఆర్టీసీ బస్సు నడిపిన ఎమ్మెల్యే
సాక్షి, భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి కాసేపు ఆర్టీసీ బస్సు డ్రైవర్ అవతారమెత్తారు. భూపాలపల్లి బస్‌డిపోకు నూతనంగా వచ్చిన సూపర్ లగ్జరీ బస్సును బుధవారం ఆయన ప్రారంభించారు. అనంతరం డిపో నుంచి బస్టాండ్ వరకు బస్సును నడిపి ప్లాట్‌ఫాంపై ఉంచారు. దీంతో బస్టాండ్‌లో ఉన్న ప్రయాణికులంతా నివ్వెరపోయారు. అందరూ బస్సు వద్దకు వచ్చి చూడ సాగారు. పచ్చడి బాగుందే అక్కా.. బాగున్నారా? అందరూ పచ్చడే తెచ్చుకున్నారా? మీతో నాకూ కాస్త వడ్డించండి అంటూ ములుగు ఎమ్మెల్యే సీతక్క వరి నాటు కూలీలతో కలసి రోడ్డుపై కూర్చుని భోజనం చేశారు. బుధవారం ఎమ్మెల్యే మహబూబాబాద్ జిల్లా ఎంచగూడెం గ్రామానికి వెళ్తుండగా.. మార్గమధ్యలో కూలీలు రోడ్డుపై కూర్చుని భోజనం చేస్తున్నారు. వారిని చూసిన ఎమ్మెల్యే కారు ఆపి కూలీలతో మాట్లాడారు. మీతోపాటు నాకూ వడ్డించండి అని కూలీలతో కలసి భోజనం చేశారు. పచ్చడి బాగుందంటూ కితాబిచ్చారు. -
బస్సులోనే డ్రైవర్‌కు రాఖీ కట్టిన చెల్లెలు
సాక్షి, కరీమాబాద్(కరీంనగర్) : హైదరాబాద్‌లోని కుషాయిగూడలో ఉంటున్న గట్టు కృష్ణవేణి తన అన్నయ్యకు రాఖీ కట్టుందుకు వరంగల్ అర్బన్ జిల్లాలోని ఉర్సుకు గురువారం వచ్చింది. అయితే ఆమె సోదరుడు ఆర్టీసీ లోకల్ డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్న గడ్డం జితేందర్ అప్పటికే డ్యూటికీ వెళ్లాడు. ఈ క్రమంలో కృష్ణవేణి అన్నయ్యకు ఫోన్‌చేయగా.. వరంగల్ బస్టాడ్ ప్రాంతంలో ఉన్నానని చెప్పడంతో ఆమె అక్కడికే వెళ్లి బస్సులోనే రాఖీ కట్టి తన ఆనందాన్ని పంచుకుంది. -
కరీంనగర్లో తృటిలో తప్పిన ప్రమాదం
సాక్షి, కరీంనగర్: ఆర్టీసీ డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో కరీంనగర్లో బుధవారం తృటిలో పెను ప్రమాదం తప్పింది. ట్రాఫిక్ రద్దీగా ఉండే రోడ్డుపై బస్సు బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. డ్రైవర్ అప్రమత్తతతో ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. వివరాల్లోకి వెళితే...కరీంనగర్ బస్ స్టేషన్ నుంచి సిరిసిల్లకు బయలుదేరిన ఆర్టీసీ పల్లె వెలుగు బస్సు ప్రతిమ మల్టీప్లెక్స్ ముందు ట్రాఫిక్ సిగ్నల్ వద్ద బ్రేక్ ఫెయిల్ అయింది. ఆ సమయంలో ట్రాఫిక్ సిగ్నల్ లేకపోవడంతో బ్రేక్ ఫెయిల్ అయిందని గమనించిన డ్రైవర్ కలెక్టరేట్ రోడ్డు వైపు బస్సు తిప్పి డివైడర్‌ను ఢీ కొట్టాడు. వేగంగా ఉన్న బస్సు డివైడర్ పైకి ఎక్కి నిలిచిపోయింది. ఆ సమయంలో బస్సులో 20 మంది ప్రయాణికులు ఉన్నారు. సిగ్నల్ వద్ద బస్సును స్లో చేసేందుకు డ్రైవర్ బ్రేక్ వేయగా బస్సు ఆగకపోవడంతో కలెక్టర్ వైపు తిప్పి డివైడర్‌ను ఢీ కొట్టినట్లు డ్రైవర్ తెలిపారు. కాగా డ్రైవర్ అప్రమత్తంగా లేకపోతే సిగ్నల్ వద్ద ఆగి ఉన్న వాహనదారులు పాదచారులపై బస్సు దూసుకెళ్లి పెద్ద ప్రమాదం జరిగేదని స్థానికులు భావిస్తున్నారు. ఆర్టీసీ అధికారులు అక్కడికి చేరుకొని బస్సును పరిశీలించి ఘటనపై విచారణకు ఆదేశించారు. మొత్తానికి తృటిలో పెద్ద ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. -
ఆర్టీసీ బస్సు ఢీ.. డ్రైవర్ దుర్మరణం
రోజూ మాదిరిగానే ఇద్దరు కూతుళ్లకు టాటా చెప్పి విధులకు బయలుదేరిన ఆ తండ్రి అనుకోలేదు.. కాసేపట్లో మృత్యువు కబళిస్తుందని.. ఓ ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యానికి.. మరో ఆర్టీసీ డ్రైవర్ ఆయువు అర్ధంతరంగా ముగిసిపోయింది. యాదగిరిగుట్ట డిపోలో సోమవారం చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ డ్రైవర్ దుర్మరణం చెందాడు. దీంతో రాజాపేట మండల పరిధిలో విషాదం అలుముకుంది. సాక్షి, యదగిరిగుట్ట (ఆలేరు): రాజపేట మండలం బొందుగుల గ్రామానికి చెందిన ఆర్టీసీ డ్రైవర్ గోపగాని నరేష్ గౌడ్ (33) యాదగిరిగుట్ట ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. విధులు నిర్వహించేందుకు సోమవారం ఉదయం 7.20 గంటలకు ఆర్టీసీ బస్టేషన్‌లోని గ్యారేజీలోకి చేరుకున్నాడు. సుమారు ఉదయం 7.30గంటల ప్రాంతంలో గ్యారేజీలోని డీజిల్‌బంక్ వద్దకు వెళ్లి, అక్కడ లాక్‌షీట్ తీసుకుని, కేఎంపీఎల్ రాసుకుంటు వస్తున్నాడు. ఇదే క్రమంలో ఏపీ 29 జెడ్ 1871 ఎక్స్‌ప్రెస్ బస్సును డ్రైవర్ బి.కిష్టయ్య తీసుకెళ్లెందుకు సిద్ధమయ్యాడు. ఈ క్రమంలోనే బ్రేక్ చెకింగ్ చేసుకుంటూ ట్రయల్ నిర్వహిస్తున్నాడు. అప్పటికే డీజిల్ బంక్ దాటి ముం దుకు వచ్చిన గోపగాని నరేష్‌ను ట్రయల్ వేస్తున్న బస్సు రైట్ సైడ్ నుంచి ఢీ కొట్టింది. దీంతో వెంటనే నరేష్ కిందపడిపోవడంతో వెనుక టైర్ ఆయన మీదికి ఎక్కింది. ఇది గమనించిన తోటి కార్మికులు వెంటనే నరేష్‌ను హుటాహుటిన చికిత్స నిమిత్తం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. మార్గ మధ్యలోకి వెళ్లగానే నరేష్ మరణించాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఘటన స్థలాన్ని పరిశీలించిన సీఐ ఆర్టీసీ బస్సు డిపో గ్యారేజీలో జరిగిన ప్రమాదస్థలాన్ని యాదగిరిగుట్ట పట్టణ ఇన్స్పెక్టర్ నర్సింహారావు సందర్శించారు. ప్రమాదానికి గల వివరాలు అక్కడ ఉన్న కార్మికులకు, ఆర్టీసీ సెక్యూరిటీ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ నర్సింహారావు మాట్లాడుతూ కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాలికి గాయమైందని చెప్పారు... డిపో గ్యారేజీలో ఎక్స్‌ప్రెస్ బస్సు ఢీ కొట్టిన మాట వాస్తమేనని, ఆయనకు ఎలాంటి ప్రాణహానీ లేదని, కాలికి మాత్రమే గాయమైందని ఆర్టీసీ అధికారులు తమకు చెప్పారని కుటుంబ సభ్యులు వాపోయారు. భువనగిరి ఏరియా ఆస్పత్రికి వెళ్లి చూస్తే నరేష్ విగత జీవిగా కనిపించారని కన్నీరుమున్నీరయ్యారు. డ్యూటీ నుంచి సాయంత్రం వస్తానని, పిల్లలు జాగ్రత్తా అంటూ భార్యకు నరేష్ చెప్పి వెళ్లాడని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కన్నీరు పెట్టుకున్నారు. డ్రైవర్ నిర్లక్ష్యంతో నరేష్‌ను పొట్టనపెట్టుకున్నారని, తమకు న్యాయం చేయాలని, లేకుంటే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. -
బస్సు డ్రైవర్‌ను చితకబాదిన అల్లరిమూక
-
ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యానికి రెండు ప్రాణాలు బలి
ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యానికి రెండు నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఎదురుగా వస్తున్న మోటార్ సైకిల్‌కు ఆర్టీసీ డ్రైవర్ దారి వదలకుండా బస్సు నడపడంతో బైక్ అదుపు తప్పింది. ఈ సంఘటనలో బైక్ వెనుక సీటులో కూర్చున్న తల్లీబిడ్డలు బస్సు వెనుక చక్రాల కిందపడి అక్కడికక్కడే దుర్మరణం చెందారు. బైక్ నడుపున్న వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటన గురువారం మదనపల్లె మండలం బొమ్మనచెరువులో చోటుచేసుకుంది. చిత్తూరు, మదనపల్లె టౌన్: రూరల్ పోలీసులు, స్థానికులు, మృతుల కుటుంబ సభ్యుల కథనం.. రామసముద్రం మండలం గుంతలపేటకు చెందిన నారాయణస్వామి (37) కార్పెంటర్‌గా పనిచేస్తున్నాడు. రామసముద్రంలోని చెంబకూరు రోడ్డులో ఓ అద్దె ఇంటిలో నివసిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతనికి భార్య శివమ్మ, పిల్లలు ప్రసన్న, బాబు ఉన్నారు. ఈ నేపథ్యంలో సొంతపనిపై మోటార్ సైకిల్లో మదనపల్లెకు భార్య, కుమారుడిని వెంట తీసుకుని బయలుదేరాడు. మార్గమధ్యంలోని బొమ్మనచెరువు వద్ద మదనపల్లె నుంచి రామసముద్రం వైపు వస్తున్న మదనపల్లె–2 డిపో బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా వాహనాన్ని నడుపుతూ బైక్‌ను ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో బైక్ నుంచి అదుపు తప్పి తల్లీబిడ్డలిద్దరూ బస్సు వెనుక చక్రాల కింద పడ్డారు. ఈ దుర్ఘటనలో బస్సు టైర్లు శివమ్మ, బాబు మీదుగా వెళ్లడంతో ఇద్దరూ అక్కడిక్కడే దుర్మరణం చెందారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలో ఉన్న నారాయణస్వామిని 108 సిబ్బంది గోపి, అమర హుటాహుటిన మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలికి రూరల్ సీఐ రమేష్, ఎస్ఐ దిలీప్ చేరుకుని పరిశీలించారు. ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యం వలనే ప్రమాదం జరిగిందని నిర్ధారించుకున్నారు. పంచనామా అనంతరం మృతదేహాలను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మిన్నంటిన బంధువుల రోదన ఆర్టీసీ బస్సు ఢీకొని మదనపల్లె సమీపంలో కోడలు శివమ్మ, మనవడు బాబు చనిపోయారని సమాచారం అందుకున్న హనుమన్న వారి కుటుంబ సభ్యులు ఉరుకులు పరుగులతో బొమ్మనచెరువుకు చేరుకున్నారు. మృతులను చూసి గుండెలవిసేలా రోదించారు. వారిని ఓదార్చడం ఎవరితరమూ కాలేదు. అక్కడికి వచ్చిన ఆర్టిసీ అధికారులపై స్థానికులు, మృతుల బంధువులు గొడవకు దిగారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఇద్దరి ప్రాణాలు పోయాయని మండిపడ్డారు. -
‘గుండె’ను పిండేసిన స్ఫూర్తి
సాక్షి, గోదావరిఖని : ప్రాణాపాయంలోనూ బాధ్యతాయుతంగా వ్యవహరించి స్ఫూర్తిదాయకంగా నిలిచాడో ఆర్టీసీ డ్రైవర్. ఒకవైపు గుండెపోటు బాధిస్తున్నా.. 52 మంది ప్రయాణికులు క్షేమండా ఉండాలనే ఏకైక తలంపుతో క్షేమంగా బస్సును రోడ్డు పక్కకు దించాడు. ఆ తర్వాతే తీవ్రమైన నొప్పితో విలవిల్లాడుతూ స్టీరింగ్‌పైనే కుప్పకూలిపోయాడు. గోదావరిఖని డిపోకు చెందిన ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్ బస్సు బుధవారం ఉదయం 5.15 గంటలకు వయా యైటింక్లయిన్‌కాలనీ మీదుగా పెద్దపల్లి నుంచి హైదరాబాద్ బయలుదేరింది. బస్సులో 52 మంది ప్రయాణికులున్నారు. 6.35 గంటల సమయంలో రాఘవాపూర్ సమీపంలో డ్రైవర్ మహేందర్ (45) ఛాతీలో నొప్పితో విలవిల్లాడిపోయాడు. ఆ సమయంలో బస్సు వేగం గంటకు 60 కిలోమీటర్లు. ఓ వైపు నొప్పి బాధిస్తున్నా బస్సును నియంత్రించి రోడ్డు పక్కన ఆపి.. స్టీరింగ్ పైనే కుప్పకూలాడు. దీన్ని గమనించిన ప్రయాణికులు 108కు ఫోన్ చేసినా.. అది ఆలస్యమయ్యేట్లు కనిపించింది. డ్రైవర్ విషమ పరిస్థితి గమనించిన బస్సులో ప్రయాణిస్తున్న సింగరేణి ఉద్యోగులు అప్రమత్తమయ్యారు. ఓసీపీ–3లో పనిచేస్తున్న ఎంవీ డ్రైవర్ వెంకటరమణ, ఈపీ ఆపరేటర్ ఆకుల రాజయ్యలు.. మహేందర్‌కు ప్రథమ చికిత్స అందించారు. ఓసీపీ–1లో ఈపీ ఆపరేటర్‌గా పనిచేస్తున్న తిరుపతి బస్సును నడుపుకుంటూ 10 నిమిషాల్లో పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. మహేందర్‌ను పరీక్షించిన వైద్యులు.. గుండెపోటుగా నిర్ధారించి వైద్యం అందించారు. మెరుగైన చికిత్స కోసం కరీంనగర్‌కు తరలించారు. సరైన సమయంలో ప్రాథమిక చికిత్స అందడంతో.. డ్రైవర్ మహేందర్‌కు ప్రాణాపాయం తప్పింది. తన ప్రాణాన్ని లెక్కచేయక మహేందర్ సమయస్ఫూర్తితో వ్యవహరించి 52 ప్రాణాలు కాపాడారు. పెద్దపల్లి ప్రభుత్వాసుపత్రి నుంచి కరీంనగర్ తీసుకెళ్లేందుకు అంబులెన్స్‌లో డీజిల్ లేకపోవడంతో.. కండక్టర్ డబ్బులిచ్చి డీజిల్ పోయించడంతో బండి ముందుకు కదిలింది. తమ ప్రయాణాన్ని వాయిదా వేసుకుని డ్రైవర్ ప్రాణాలు కాపాడేందుకు బస్సులో ప్రయాణిస్తున్న సింగరేణి ఉద్యోగులు పరితపించారు. -
డ్రైవరు బలవన్మరణం కేసు దర్యాప్తు ఇలాగేనా?
విశాఖపట్నం, గోపాలపట్నం(విశాఖ పశ్చిమ): డిపో మేనేజర్ దివ్య వేధింపుల వల్లే చనిపోతున్నానని రాతపూర్వక వాం గ్మూలం ఇచ్చి సింహాచలం ఆర్టీసీ గ్యారేజి డిపోలో డ్రైవరు చింతా నాగేశ్వరరావు బలవన్మరణానికి పాల్పడితే ఇటు ఆర్టీసీ ఉన్నతాధికారులు, అటు పోలీసులూ స్పందించే తీరు ఇలాగేనా అంటూ జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు కె.రాములు మండిపడ్డారు. చిన్నపాటి తప్పులకే అరెస్టులు, సస్పెన్షన్లు చేసే అధికారులు ఇంత అఘాయిత్యం జరిగితే దర్యాప్తు ఏం చేశారని ప్రశ్నించారు. నాగేశ్వరరావు ఆత్మహత్యా సంఘటన నేపథ్యంలో ఆయన దళిత నాయకులతో కలిసి డిపోకు వచ్చారు. దీంతో ఆర్టీసీ రీజినల్ మేనేజర్ సుధేష్‌కుమార్, సీఐ పైడియ్య కూడా ఇక్కడికి చేరుకున్నారు. వారితో రాములు చర్చించారు. డ్రైవరు నాగేశ్వరరావుపై డీఎం దివ్య విధి నిర్వహణలో ఒత్తిడి, వేధింపులకు పాల్పడడం వల్లే మరణించినట్లు తెలుస్తోందని ఆరోపించారు. సంఘటన జరిగి నెల రోజులవుతున్నా ఆర్టీసీ అధి కారులు, పోలీసులు శాఖాపరంగా ఎటువంటి చర్యలూ తీసుకోకపోవడం అన్యాయమన్నారు. చిన్నపా టి తప్పిదానికే డ్రైవర్లు, కండక్టర్లను సస్పెండ్ చేసే అధికారులు.. దివ్య విషయంలో అలా స్పందించకపోవడమేంటని ప్రశ్నిం చారు. తన చావుకి కారణం డీఎం అని చేతిపై రాసుకుని చనిపోతే దివ్యను అరెస్టు చేయకపోవడమేంటని సీఐను ప్రశ్నించారు. దీనిపై సీఐ వివరణ ఇస్తూ.. ఈ కేసు దర్యాప్తు ఎస్సీ ఎస్టీ విభాగం ఏసీపీ ప్రవీణ్‌కుమార్ చేపడుతున్నారన్నా రు. దీంతో ప్రవీణ్‌కుమార్‌ను రాములు ఫోన్లో ఆరా తీశారు. దర్యాప్తు చేస్తున్నామని ఏసీపీ వివరణ ఇచ్చారు. శాఖాపరంగా తాము కూడా దర్యాప్తు చేస్తున్నామని సుధేష్‌కుమార్ వివరించారు. నాగేశ్వరరావు కుటుంబంలో ఒకరికి ఉద్యో గం ఇవ్వడానికి తాను హామీ ఇచ్చానని, దీనికి సంబంధించి సంస్థ యాజమాన్యంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు చెప్పారు. దర్యాప్తు విషయంలో జాప్యం చేస్తే పరిణా మాలు తీవ్రంగా ఉంటాయని రాములు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి వెంకటరమణ, దళిత సంఘాల నాయకుడు బూసి వెంకటరావు, డిపో ఎస్సీ ఎస్టీ నాయకులు టీఎన్ రావు, బీవై రత్నం, బీఎస్ నారాయణ, డీకే రాజు, బీఏ రావు తదితరులు పాల్గొన్నారు. అంబేడ్కర్ విగ్రహం ధ్వంసం దారుణం అక్కిరెడ్డిపాలెం(గాజువాక): పెదగంట్యాడ ఎస్సీ షాపింగ్ కాంప్లెక్స్ ఆవరణలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసి 19 రోజులు గడుస్తున్నా దుండగులను పట్టుకోవడంలో పోలీసులు విఫలమయ్యారని జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడు కె.రాములు విమర్శించారు. ఈ మేరకు సోమవారం ఆయన ధ్వంసమైన అంబేడ్కర్ విగ్రహాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ ఘటనకు నిరసనగా వివిధ సంఘాలు చేపట్టిన రిలే నిరాహార దీక్షలను సైతం కలెక్టర్, ఆర్డీవో, పోలీస్ కమిషనర్, డీజీపీ కానీ పట్టించుకోకపోవడం దారుణమన్నారు. దళితులంటే అంత చులకనా అని ప్రశ్నించారు. 24 గంటల్లోపు ఈ ఘటనపై చర్యలు తీసుకోకపోతే కలెక్టర్, సీపీ ఢిల్లీ వచ్చి సమాధానం చెప్పాల్సి ఉంటుందని హెచ్చరించారు. తరువాత రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎస్.అప్పలరాజు, బాబూరావు, రోజారాణి, వనజాక్షి పాల్గొన్నారు. -
నా చావుకు డీఎం దివ్య కారణం.. !
గోపాలపట్నం(విశాఖ పశ్చిమ)/పాతపోస్టాఫీసు(విశాఖ దక్షిణ): సింహాచలం ఆర్టీసీ డిపోలో ఘోరం జరిగిపోయింది. రోడ్డు ప్రమాద సంఘటనపై డిపో మేనేజర్ విచారణకు పిలిచిన నేపథ్యంలో ఆర్టీసీ డ్రైవర్ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడడం సంచలనం రేపింది. తీవ్ర ఆందోళన రేపిన సంఘటన వివరాలిలా ఉన్నాయి. పోలీసుల కథనం ప్రకారం... ఇక్కడి డిపోలో 1991 నుంచి చింతా నాగేశ్వరరావు(55) డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. ఆయన ఈ నెల 21న 55వ నంబరు బస్సు నడుపుతుండగా ఎన్ఏడీ కూడలిలో ఓ కారు తగిలింది. దీంతో కారు డ్రైవింగ్ చేసిన యజమానికి, నరసింగరావుకి మధ్య వాగ్వాదం జరిగింది. ఇది కారు డ్రైవర్ తప్పిదమో, నరసింగరావు పొరపాటో తెలీదు. అయితే తన తండ్రి ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వద్ద అసిస్టెంట్ ట్రాపిక్ మేనేజర్ అని చెప్పి సదరు కారు యజమాని హెచ్చరించినట్లు తెలిసింది. అనంతరం ఫిర్యాదు చేయడంతో రీజినల్ మేనేజర్, ఉన్నతాధికారుల నుంచి ఆరా తీయడంతో డీఎం దివ్య శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో నాగేశ్వరరావుని ప్రశ్నించారు. కారు ఓనర్‌తో వివాదాన్ని సెటిల్ చేసుకోవాలని చెప్పడంతో తాను తప్పు చేయలేదని నాగేశ్వరరావు చెప్పినట్లు సమాచారం. డీఎం విచారణ తర్వాత కొద్ది సేపటికి బయటకు వెళ్లిన నాగేశ్వరరావు నురగలు కక్కుతూ తిరిగి వచ్చి నేను చనిపోతున్నానంటూ అక్కడ కనిపించిన కార్మికులకు ఆందోళనగా చెప్పారు. అనంతరం డిపోలో ఉన్న గుడి వద్ద పడిపోవడంతో అక్కడే ఉన్న ఆర్టీసీ విజిలెన్స్ విభాగం సిబ్బంది హుటాహుటిన నాగేశ్వరరావు వద్దకు చేరుకున్నారు. అపస్మారక స్థితిలో ఉన్న అతడి జేబులో లభించిన సూసైడ్ నోట్‌ను చదివి స్వాధీనం చేసుకున్నారు. మృతుడు తన అర చేతిమీద తన మరణానికి ఎవరు కారణం అన్న విషయాన్ని స్పష్టంగా రాసుకున్నాడు. అపస్మారక స్థితిలో ఉన్న నాగేశ్వరరావును తొలుత గోపాలపట్నంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని అక్కడి వైద్యులు చెప్పడంతో 108 అంబులెన్స్‌లో కేజీహెచ్‌కి తరలించారు. ఇంతలోనే నాగేశ్వరరావు ప్రాణం వదిలేశారని వైద్యులు వెల్లడించారు. జరిగిన సంఘటనపై గోపాలపట్నం ఎస్ఐ తమ్మినాయుడు విచారణ చేపట్టారు. చెదల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. మరోవైపు తమ తోటి ఉద్యోగి మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలంటూ ఆర్టీసీ కార్మికులు, మృతుని బంధువులు శుక్రవారం రాత్రి కేజీహెచ్ ఓపీ గేట్ వద్ద నిరసన చేపట్టారు. నా చావుకు డీఎం దివ్య కారణం ఆత్మహత్యకు ముందు నాగేశ్వరరావు తన చేతిపై... తన చావుకి డీఎం కారణం... ఆమె వేధింపుల వల్లే చనిపోతున్నా... అని రాసుకున్నాడు. జేబులో సూసైడ్ నోట్ రాసిపెట్టుకున్నాడు. మరోవైపు ఈ విచారణకు సంబంధించి ఈడీ పేషీలో సత్యనారాయణకు సంబంధించిన వివాదంగా రాసి ఉంది. ఇలా రాసి ఉండడాన్ని పోలీసులు గుర్తించారు. ఇదిలా ఉండగా జరిగిన సంఘటనపై కార్మికులు ఆందోళన వెలిబుచ్చారు. చిన్నపాటి సంఘటనలపైనా ఆర్టీసీ అధికారులు తీవ్రంగా స్పందిస్తున్నారని ఆరోపించారు. సంఘటనను, సమస్యను విచారించకుండా డ్రైవర్లపైనే నిందలేసి శిక్షిస్తున్నారని ఆందోళన వెలిబుచ్చారు. యల్లపువానిపాలెంలో విషాదం నాగేశ్వరరావు మృతితో యల్లపువానిపాలెం ఎస్సీ కాలనీలో విషాదం నెలకొంది. ఆయనకు భార్య అమ్మాజీ, ఇద్దరు కుమారులు ఉన్నారు. సున్నిత మనస్కుడైన నాగేశ్వరరావు కార్మికులకు ఏ ఆపదొచ్చినా తాను ముందుకెళ్లి స్పందించే వారు. ఇలా శుక్రవారం మధ్యాహ్నం విచారణకు ముందు కూడా కార్మికుల సమస్యలపై డిపో గేటు వద్ద ఎన్ఎంయూ జెండా పట్టుకుని ధర్నా చేశారు. ఇంతలోనే ఇలా జరగడంపై కార్మికులు ఆవేదన చెందుతున్నారు. నాగేశ్వరరావు భార్య అమ్మాజీకి గుండె సమస్య ఉండడంతో ఆయన మరణ వార్తను శుక్రవారం రాత్రయినా తెలియనీయలేదు. పోలీసులు కేవలం నాగేశ్వరరావు కొడుకులకే చెప్పారు. తన భర్త వస్తారనే అమ్మాజీ ఎదురు చూస్తుండడం స్ధానికులను కలచివేసింది. స్టేట్మెంట్ మాత్రమే కోరాను నాగేశ్వరరావు మరణం బాధాకరం. ఎన్ఏడీ జంక్షన్ సమీపాన బస్సు, కారు ఢీకొన్న సంఘటనలో కారు యజమాని ఆర్టీసీ ఆన్లైన్లో సెంట్రల్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై ఏం జరిగిందో నాగేశ్వరరావుని స్టేట్మెంట్ మాత్రమే అడిగాను. కారుకి తన బస్సు తగల్లేదని నాగేశ్వరరావు చెప్పాడు. అదే విషయాన్ని రాసివ్వాలని సూచించాను. ఆ సమయంలో నాగేశ్వరరావుతో పాటు కార్మికులు కూడా ఉన్నారు. అనంతరం బయటకు వెళ్లిపోయాక ఆత్మహత్యకు పాల్పడ్డారు.– దివ్య, డిపో మేనేజర్ డిపో మేనేజర్ వేధింపులే కారణం డ్రైవర్ నాగేశ్వరరావు బలవన్మరణానికి డిపో మేనేజర్ హరిదాసుల దివ్య వైఖరే కారణం. ఆమె పెడుతున్న క్షోభ, మానసిక హింస వల్లే చనిపోయాడు. దళితుడైన నాగేశ్వరరావును అందరి ఎదుట పలుమార్లు కులం పేరిట దివ్య దూషించిన సందర్భాలున్నాయి. ఆమెపై గతంలో గోపాలపట్నం పోలీస్ స్టేషన్లోను, ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేయడం జరిగింది. అయినప్పటికీ పోలీసులు చర్యలు చేపట్టలేదు. నాగేశ్వరరావు మరణానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలి.– ఎస్.పి.సిహెచ్.దత్, విశ్రాంత ఆర్టీసీ ఉద్యోగి, ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు -
విస్తరిస్తున్న ‘వన్‌మ్యాన్’ సర్వీసులు
ఆర్టీసీలో విస్తరిస్తున్న వన్‌మ్యాన్ సర్వీసులు ప్రయాణికులను భయపెడుతున్నాయి. డ్రైవింగ్ చేసే డ్రైవరే టిక్కెట్ కూడా కలెక్ట్ చేస్తూ ఉద్యోగం నిర్వహించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిణామం ఏమాత్రం మంచిది కాదని, ఇది ప్రయాణికుల భద్రతకే ప్రమాదమని పలువురు పేర్కొంటున్నారు. విజయనగరం అర్బన్: ఆర్టీసీలో వన్‌మ్యాన్ (సింగిల్ డ్రైవర్ బస్సులు) సర్వీసుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. ఇటీవలే పలు డిపోలలో కండక్టర్లను పంపకుండా సింగిల్ డ్రైవర్ సర్వీసులను ఆర్టీసీ నార్త్ ఈస్‌కోస్ట్ రీజియన్ పెంచింది. జిల్లా పరిధిలోని నాలుగు డిపోలలో గతంలో కేవలం 15 మాత్రమే ఉండేవి. ఇప్పుడు ఈ సర్వీసులను 28 బస్సులకు పెంచి, సింగిల్ డ్రైవర్ సర్వీసులుగా నడుపుతున్నారు. అత్యధికంగా పార్వతీపురం డిపో నుంచి 14, ఎస్.కోట డిపో నుంచి 8, సాలూరు డిపో నుంచి 6 బస్సులలో సింగిల్ డ్రైవర్లు విధులు నిర్వహిస్తున్నారు. మోటార్ యాక్ట్‌కు విర్దుదంగా వన్‌మ్యాన్ సర్వీసులు నడుపుతున్న అధికారులు సంబంధిత డ్రైవర్‌కి టిక్కెట్ ఇష్యూయింగ్ మిషన్ (టిమ్) ఇచ్చి కండక్టర్ వ్యవస్థను నీరుగారుస్తున్నారు. దీంతో కార్మికులపై పనిభారం పెరిగింది. ప్రయాణికుల భద్రత ప్రశ్నార్ధకంగా మారుతోంది. ఓటీలో కోతే లక్ష్యంగా... ఓవర్ టైమ్ (ఓటీ) సర్వీసుల వేళల్లో కోత విధించి కార్మికుల పొట్టకొట్టాలని చూస్తున్నారనే ఆరోపణలతో కార్మిక సంఘాలు గగ్గోలు పెడుతున్నాయి. ఓటీ సర్వీసులు నెక్ రీజియన్ పరిధిలో రోజుకు సుమారు వంద వరకు ఉన్నాయి. మోటార్ వాహన నిబంధనల ప్రకారం డ్రైవర్లతో రాత్రి వేళల్లో నాలుగు గంటలు మాత్రమే బస్సులు నడిపించాలి. దీన్ని ఆరు గంటలకు పెంచారు. కానీ రోడ్డు రవాణ సంస్థ డ్రైవర్లు వెళ్లే దూర ప్రాంత వన్‌మ్యాన్ సర్వీసుల్లో ఒకే డ్రైవర్ ఉన్న కారణంగా 8 గంటల నుంచి 10 గంటల వరకు ఒకే డ్రైవర్ బస్సు నడపాల్సిన పరిస్థితి ఉంది. స్పెషల్ టైపు (ఎక్స్‌ప్రెస్, డీలక్స్, సూపర్ లగ్జరీ) బస్సులకు ఒక డ్రైవర్ చేత 200 కిలో మీటర్ల వరకు మాత్రమే నడిపించాలి. దీన్ని కూడా 250 కిలోమీటర్లకు పెంచినా అనధికారికంగా 350 నుంచి 371 కిలోమీటర్ల వరకు నడిపిస్తున్నారు. పాలకొండ నుంచి విశాఖ, పార్వతీపురం నుంచి విశాఖ, శ్రీకాకుళం నుంచి విశాఖ సర్వీసులను ఇందుకు ఉదాహరణగా చెప్పొచ్చు. ఇలా కడుపు కొట్టనున్నారు... కార్మిక చట్టం ప్రకారం 8 గంటలకు మించి విధులు నిర్వహించే కార్మికులకు ఓటీ సొమ్ము చెల్లించాలి. 9 గంటల పాటు విధులు నిర్వహిస్తే ఒక గంట ఓటీ ఇవ్వాలి. కార్మికుడు నెల వేతనంలో గంటకు ఎంత మొత్తం అవుతుందో లెక్కించి ఆ మొత్తం కంటే రెట్టింపు డబ్బును కార్మికుడికి ఇవ్వాలి. ఈ క్రమంలో బస్సు ఇన్కమింగ్ సమయాన్ని కుదించారు. ఉదాహరణకు విజయనగరం నుంచి బొబ్బిలికి 97 కిలోమీటర్లు దూరం ఉంది. ఒక సింగిల్ డ్యూటీకి ఇప్పటి వరకు 1.30 గంటలు సమయం ఉండేది. దీనిని 1.15 గంటలకు కుదించనున్నారు. ఈ లెక్కన నాలుగు సింగిల్స్ డ్యూటీ చేస్తే ప్రతి సింగిల్‌కు పావు గంట చొప్పున ఒక గంట శ్రమను కోల్పోవాల్సి వస్తోంది. ఇలా ఓటీ రూపంలో రావాల్సిన ఒక గంట శ్రమను సింగిల్ సర్వీసు రూపంలో కోల్పోతారు. మరోవైపు అనుకున్న సమయానికి గమ్యం చేర్చడం కూడా సాధ్యం కాదని కార్మిక సంఘాల నాయకులు పేర్కొంటున్నారు. పరిమిత స్టాప్ల రూట్లలోనే... పరిమిత సంఖ్యలో స్టాప్‌లున్న రూట్లలోని బస్సుల సర్వీసుల్లోనే ‘వన్‌మ్యాన్’ డ్యూటీ విధులను ఏర్పాటు చేస్తున్నాం. రెండేళ్ల కిందట ప్రయోగాత్మకంగా పెట్టిన ఈ సర్వీసులను ఎప్పటికప్పుడు విస్తరింపజేస్తున్నారు. ఈ విధులు చేయడానికి డ్రైవర్లు ఇష్టపూర్వకంగానే వస్తున్నారు. –ఎన్వీఎస్.వరప్రసాద్, డిప్యూటీ సీటీఎం, ఆర్టీసీ ఒత్తిడితో డ్రైవింగ్ అదుపుతప్పొచ్చు... ఒక చేత్తో టిమ్, మరో చేత్తో స్ట్రీరింగ్ ఒకేసారి రెండు విధులు నిర్వహించడం ప్రమాదకరం. దీంతో మానసిక ఒత్తిడి పెరిగి డ్రైవింగ్‌లో నాణ్యత కొరవడి, ప్రయాణికులకు భద్రత భరోసాను ఇవ్వలేని పరిస్థితి ఎదురవుతుంది. తక్షణమే వన్‌మ్యాన్ సర్వీసులను రద్దు చేయాలి. –జి.రవికాంత్, అధ్యక్షుడు, ఎంప్లాయీస్ యూనియన్ రీజియన్ కమిటీ -
బస్సు పక్కన నిలిపి స్పృహ కోల్పోయిన ఆర్టీసీ డ్రైవర్
టెక్కలి రూరల్ : వడదెబ్బకు గురైన ఆర్టీసీ డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులకు ఎటువంటి ప్రమాదం జరగకుండా చాకచక్యంతో బస్సును నిలిపి ఆయన స్పృహ కోల్పోయారు. దీంతో 30 మంది సురక్షితంగా బయటపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పలాస డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఇచ్ఛాపురం నుంచి విశాఖపట్నం సోమవారం వెళుతోంది. బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారు. ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో డ్రైవర్ ఎం.డి ఇలియాస్ వడదెబ్బకు గురయ్యారు. కళ్లు తిరుగుతున్నాయని గుర్తించిన ఆయన.. ప్రయాణికులకు ఎటువంటి ప్రమాదం జరగకూడదని భావించి బస్సును నెమ్మది చేస్తూ టెక్కలి సమీపంలోని రహదారి పక్కన నిలిపివేసి ఒక్కసారిగా కిందకు పడిపోయారు. ఇది గమనించిన కండక్టర్.. డ్రైవర్ ఇలియాస్‌ను హుటాహుటిన టెక్కలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యుడు మహరాజ్ వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇలియాస్ వడదెబ్బకు గురయ్యారని వైద్యులు తెలిపారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి ప్రాణాలు కాపాడిన డైవ్రర్‌ను ప్రయాణికులు అభినందించారు. -
గాలిలో ప్రాణాలు
అరుణాచలం..వయసు 64ఏళ్లు..ఆర్టీసీ డ్రైవరు. ఆదివారం రాత్రి చెన్నై నుంచి 50మంది ప్రయాణికులున్న బస్సు నడుపుకుంటూ తిరుపతి వస్తున్నాడు. రెడ్ హిల్స్ వద్ద అనారోగ్యంగా అనిపించింది. బస్సుఆపి మాత్ర వేసుకున్నారు. పిచ్చాటూరు మండలం కీళపూడి వచ్చేసరికి గుండెలో నొప్పి తీవ్రమైంది. బస్టాండులో ఆపి మాత్ర వేసుకుని బస్సు నడిపేందుకు సన్నద్ధమవుతుండగా స్టీరింగ్‌పై కుప్పకూలిపోయాడు..ప్రాణాలు విడిచాడు. గడచిన ఆర్నెళ్ల కాలంలో జిల్లాలో ఆరుగురు విధి నిర్వహణలోనే ప్రాణాలు కోల్పోయారు. 10 మంది అనారోగ్యంతో చనిపోయారు. తిరుపతి సిటీ: ఆర్టీసీలో డ్రైవర్లు తరచూ అనారోగ్యానికి గురవుతున్నారు. కొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. విధినిర్వహణలో జరగరానిది జరిగితే ప్రయాణికుల ప్రాణాలకు కూడా ముప్పే. తరచూ జిల్లాలో ఎక్కడో చోట బస్సు నడుపుతూ అనా రోగ్యం పాలవుతున్న సంఘటనలు ఎక్కువవడం చర్చనీయాంశమైంది. జిల్లాలో 14 డిపోల్లో 3,600 మంది డ్రైవర్లు ఉన్నారు. అందులో తిరుమల–తిరుపతి 416 వన్‌మెన్ సర్వీసులతోపాటు మరో 200 వన్‌మెన్ సర్వీసులను బెంగళూరు, చెన్నై, శ్రీకాళహస్తి, పుత్తూరుకు నాన్ స్టాప్ పేరుతో నడుపుతున్నారు. ఎక్కువగా ఒత్తిళ్లకు లోనై మృత్యువాత పడుతున్నారు. అధికారుల వేధింపులు..మానసిక ఒత్తిడికి గురై..... డ్రైవర్లకు పనిభారమెక్కువవుతోంది. ‘కిలోమీటరు–ఇంధన వినియోగం’పై ఆంక్షలు పెడుతుండటంతో వీరు ఒత్తిడికి గురవుతున్నారు. ఎక్స్‌ప్రెస్‌లలో కండక్టరు ఉండరు. డ్రైవరే టిమ్ మిషన్లతో టికెట్ కొట్టి డబ్బులు తీసుకోవాలి. ‘చిల్లర’ సమస్యలతో ప్రశాంత చిత్తానికి దూరమవుతున్నారు. నాలుగేళ్ల కిందట స్పెషల్ ఆఫ్ డ్యూటీలకు 300–400 కిలోమీటర్ల నడిపేవారు. ఇప్పుడు 500–700 కిలోమీటర్ల వరకు బస్సులను తప్పనిసరిగా నడపాల్సిన పరిస్థితి. 10 గంటలకు పైగా పనిచేయిస్తున్నారని డ్రైవర్లు ఆవేదన చెందుతున్నారు. ఎక్కువ ఆదాయం తీసుకు రావాలని బలవంతపెడుతున్నారని వాపోతున్నారు. లేనిపక్షంలో చార్జిషీట్ ఇప్పిస్తామని, సస్పెండ్ చేస్తామని భయపెడుతున్నారు. కలెక్షన్ తక్కువ తీసుకొస్తున్నారనే నెపంతో కండక్టర్లను, టిమ్ మిషన్ల డ్రైవర్లను టీఐ–3 స్థాయి అధికారులు మనోవేదనకు గురిచేస్తున్నారనే ఆరోపణ లున్నాయి. ఇవిగో ఉదాహరణలు.. ♦ ఆదివారం తిరుమల డిపోకు చెందిన అరుణాచలం బస్సు డ్రైవర్ గుండె పోటుకు గురై స్టీరింగ్ మీదనే ప్రాణా లొదిలాడు. ♦ పుత్తూరు డిపోకు చెందిన డీఎస్.రాజు, ఆయన కుమారుడు డి.ఉదయ్ భాస్కర్ గుండెపోటుకు గురై చనిపోయారు. ♦ సదుంకు చెందిన వైఆర్.బాబు సత్యవేడు డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తూ గుండెపోటుకు గురై మృతి చెందాడు. ♦ నగరికి చెందిన కృష్ణ మంగళం డిపోలో విధి నిర్వహణలో ప్రాణాలొదిలాడు. ♦ ఇటీవల కాలంలో 10 మందికి పైగా ఆనారోగ్య సమస్యలతో మృతి చెందారు. 7,200 మందికి ఇద్దరే వైద్యులు.. చిత్తూరు, తిరుపతి డివిజన్లలోని 7,200 మంది ఆర్టీసీ కార్మికులకు ఇద్దరే వైద్యులున్నారు. చిత్తూరులోని డిస్పెన్సరీలో ఒక రు, తిరుపతిలో ఒకరు విధులు నిర్వహిస్తున్నారు. వారు కూడా స్పెషలిస్టులు కారు. 45 ఏళ్లకు పైబడిన డ్రైవర్లకు 3 ఏళ్లకు ఒక్కసారి వైద్య పరీక్షలు నిర్వహించి ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇవ్వాల్సి ఉంది. అనుభవం లేని వైద్యులతోనే కంటిచూపు పరీక్షలు చేయ డం, బరువు, ఎత్తు, పొడవు పరీక్షించి ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. లేదంటే విజయవాడకు రెఫర్ చేసి చేతులు దులుపుకుంటున్నారు. ఆనారోగ్యం బారినపడిన కార్మికులకు ‘సిక్’ సర్టిఫికెట్లను మంజూరు చేయరాదని ముందస్తుగానే ఆర్ఎం, డిపో మేనేజర్లు వైద్యులకు హుకుం జారీ చేస్తున్నారు. సెలవులు లేకపోవడం, పలు రకాల జబ్బులతో నిత్యం సతమతమవుతున్నారు. కనీ సం చిత్తూరు, తిరుపతి లాంటి నగరాల్లో కార్పొరేట్ ఆసుపత్రులలో పరీక్షలు చేయించుకునేలా అధికారులు చొరవ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కార్మికులు చెబుతున్నారు. 2013 నుంచి భర్తీకి నోచుకోని పోస్టులు.. ఆర్టీసీలో 2013 నుంచి ఇప్పటివరకు డ్రై వర్ల పోస్టులు భర్తీ చేయలేదు. 2011లో ఎస్సీ,ఎస్టీ డ్రైవర్ల పోస్టులు 81 ఖాళీలకు గాను ఇటీవల 36 మందిని భర్తీ చేశారు. తిరుపతి డివిజన్ పరిధిలోని 7 డిపోల్లో డ్రై వర్ల కొరత తీవ్రంగా ఉంది. చిత్తూరు డివిజన్ పరిధిలోని డ్రైవర్లు ఉన్నప్పటికీ విధులు నిర్వహిస్తున్న వారిలో ఎక్కువ మందిని తిరుపతి, అలిపిరి, తిరుమల, మంగళం డిపోలకు బదిలీ చేస్తున్నారు. దీంతో వారు అక్కడ్నుంచి వచ్చి ఇక్కడ డ్యూటీలు చేసుకుని తిరిగి వారి సొంత ఊళ్లకు వెళ్లాల్సి ఉంది. కార్మికులకు పెరిగిన పనిభారం.. క్రమంగా కండక్టర్లను తొలగిస్తూ వస్తున్నారు. డ్రైవర్ల చేతి వారి విధులు చేయిస్తున్నారు. వన్‌మ్యాన్ సర్వీసుల పేరుతో లాంగ్ సర్వీసులను నడుపుతున్నారు. ఎక్స్‌ప్రెస్, లగ్జరీ, సూపర్ డీలక్స్ బస్సులకు 55 సంవత్సరాల్లో ఉన్నవారిని డ్రైవర్లుగా పంపిస్తున్నారు. డిమాండ్ పేరుతో కొన్నిసార్లు డ్రైవర్ చేతనే డబుల్ డ్యూటీలు చేయిస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. విధి గంటలు కూడా పది దాటిపోతున్నాయి. చార్టు ప్రకారమే డ్యూటీలు సీనియర్ డ్రై వర్లకు కోరుకున్న విధంగా ఛార్టు ప్రకారం డ్యూటీలు వేస్తున్నాం. చెన్నయ్‌కు వెళ్లే రహదారిలో పుత్తూరు నుండి ఊతుకోట వరకు రో డ్డు పూర్తిగా పాడైంది. ఆనార్యోగ సమస్యలు తలెత్తినప్పుడు సెలవులు మంజూరు చేస్తున్నాం.. 45 ఏళ్లు పైబడి వారికి వైద్య పరీక్షలు చేయిస్తున్నాం.- ఎం.భాస్కర్‌రెడ్డి, ఇన్చార్జ్ డిప్యూటీ సీటీఎం, తిరుపతి. -
మద్యం మత్తులో యువకుడి వీరంగం
యాదగిరిగుట్ట (ఆలేరు) : ఓ యువకుడు మద్యం మత్తులో వీరంగం సృష్టించాడు. గ్రామానికి వచ్చిన ఆర్టీసీ బస్సు అద్దాలు పగులగొట్టి.. డ్రైవర్‌పై దాడిచేశాడు. ఈ ఘటన యాదగిరిగుట్ట మండలం మహబూబ్‌పేటలో మంగళవారం చోటు చేసుకుంది. వివరాలు.. గ్రామానికి చెందిన గాజుల మల్లేషం కూలీ పని చేస్తుంటాడు. సాయంత్రం మోటకొండూర్ మండలం అమ్మనబోలు నుంచి యాదగిరిగుట్ట మండలం మహబూబ్‌పేట గ్రామం నుంచి భువనగిరికి వెళ్తున్న ఆర్టీసీ బస్సును గ్రామంలోకి రాగానే రాళ్లతో దాడికి దిగి నిలిపాడు. చొక్కా, ప్యాంట్ విప్పుకుంటూ బస్సులోకి వెళ్లి డ్రైవర్ రమేష్‌పై దాడి చేశాడు. దీనిని గమనించిన కండక్టర్, సుమారు 20 మంది ప్రయాణికులు భయాందోళనతో బస్సు దిగి వెళ్లిపోయారు. ఈ క్రమంలో డ్రైవర్ కాపాడేందుకు వచ్చిన గ్రామస్తులను తీవ్రమైన పదజాలంతో దూషిస్తు దాడికి యత్నించాడు. దీంతో వారంతా భయంతో పరుగులు తీశారు. ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం అందించి, గ్రామానికి చెందిన కొందరు ధైర్యంతో మల్లేష్‌ను తాళ్లతో కట్టేశారు. సంఘటన స్థలానికి యాదగిరిగుట్ట పోలీసులు చేరుకుని విషయం తెలుసుకున్నారు. మల్లేష్‌ను యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. -
ఏటీఎం కార్డ్ బ్లాక్ అయ్యిందంటూ మోసం
ఎమ్మిగనూరు రూరల్: ఓ సైబర్ మోసగాడు ఆర్టీసీ డ్రైవర్‌ను బురిడీ కొట్టించాడు. ఏటీఎం కార్డ్ బ్లాక్ అయ్యిందంటూ బ్యాంక్ ఖాతా నుంచి రూ. 75 వేలు అపహరించాడు. నందవరం మండలం మాచాపురం గ్రామానికి చెందిన ఆర్టీసీ డ్రైవర్ ఆర్.రామకృష్ణ సెల్‌కు సోమవారం ఉదయం 10.30 గంటల సమయంలో 6295665582 నంబర్ నుంచి ఫోన్ వచ్చింది. ‘ఎస్బీఐ బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తున్నాం. మీ ఏటీఎం బ్లాక్ అయ్యింది. ఆధార్ నంబర్ చెబితే సరి చేస్తాం’ అంటూ ఓ వ్యక్తి చెప్పాడు. లైన్లో ఉండి అతను అడిగిన సమాచారాన్ని రామకృష్ణ చెప్పేశాడు. మోసగాడి సూచన మేరకు సెల్‌కు వచ్చిన ఓటీపీ నంబర్ చెప్పడంతో పాటు మెసేజ్‌లను డిలీట్ చేశాడు. కొద్ది సేపటి తరువాత తన ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ (11164897488) నుంచి రూ.75 వేలు డ్రా అయినట్లు సెల్‌కు మెసేజ్ వచ్చింది. మోసపోయినట్లు గ్రహించిన బాధితుడు వెంటనే పట్టణంలోని ఎస్బీఐ బ్యాంక్ అధికారులను కలిశాడు. అయితే సైబర్ మోసాలను తాము పరిష్కరించలేమని, పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. -
డ్రైవర్ నిజాయితీ
శ్రీకాకుళం అర్బన్: విశాఖపట్నం నుంచి శ్రీకాకుళంనకు విశాఖలో బయలుదేరిన ఓ ప్రయాణికుడు నాన్‌స్టాప్ బస్సులో తన బ్యాగ్‌ను ఉంచి కిందికి దిగాడు. ఈలోగా బస్సు బయలుదేరింది. శ్రీకాకుళంలో ప్రయాణికులందరూ దిగిపోగా బస్సు సీటులో మాత్రం బ్యాగ్ కనిపించింది. దీంతో ఆ బస్సు డ్రైవర్ కృష్ణ ఆ బ్యాగ్‌ను తీసుకువచ్చి శ్రీకాకుళం ఒకటవ డిపో మేనేజర్‌కు అందజేసి తన నిజాయితీని చాటుకున్నాడు. వివరాల్లోకి వెళితే... పాతపట్నంనకు చెందిన టి.బాలకృష్ణ అనే వ్యక్తి సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్‌గా జమ్మూ–కశ్మీర్లో విధులు నిర్వహిస్తున్నాడు. వేసవి సెలవులకు ఇంటికి వచ్చేందుకు విశాఖపట్నం బస్‌స్టేషన్‌కు ఆదివారం చేరుకుని విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వచ్చే మధ్యాహ్నం 3.30 గంటలకు బయలుదేరే నాన్‌స్టాప్ బస్సుకు ఒక టికెట్ తీసుకున్నాడు. ఆ టికెట్‌తో బస్ వద్దకు చేరుకుని తన సీటులో బ్యాగ్, లగేజీని ఉంచి కిందికి దిగిపోయాడు. అతని కోసం కొంత సమయం వేచి చూసిన తర్వాత బస్సు విశాఖపట్నంలో 3.30 గంటలకు బయలుదేరి శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్‌కు సాయంత్రం 5.30కు చేరుకుంది. ప్రయాణికులంతా దిగిపోయిన తర్వాత సీటులో బ్యాగ్, లగేజీ ఉండడాన్ని గమనించిన హైర్బస్ డ్రైవర్ కృష్ణ ఆ లగేజీని శ్రీకాకుళం ఒకటవ డిపో మేనేజర్ డి.ఢిల్లేశ్వరరావుకు అప్పగించారు. దొరికిన ఆ బ్యాగ్‌లో క్యాష్ పర్సు, హేండ్ బ్యాగ్, లగేజీబ్యాగ్, ఏటీఎం కార్డు, సీఐఎస్ఎఫ్ ఐడెంటిటీ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్‌కార్డు తదితరవి ఉన్నాయి. వస్తువులను బస్సులో ఉంచిన బాలకృష్ణ అవి తనవే అని, విశాఖపట్నంలో బస్సు ఎక్కిన తర్వాత సీటులో పెట్టి అత్యవసర పనిపై కిందకి దిగానని, ఈలోగా బస్సు బయలుదేరడంతో తర్వాత బస్సుకు వచ్చి విచారించగా కాంప్లెక్స్‌లో అప్పగించినట్టు తెలుసుకుని వచ్చానని శ్రీకాకుళం ఒకటవ డిపో మేనేజర్ ఢిల్లేశ్వరరావుకు వివరించారు. బాలకృష్ణ చెప్పిన వివరాలు, ఐడెంటిటీ కార్డుల ఆధారంగా బస్సులో దొరికిన బ్యాగ్, వస్తువులు అతనివే అని నిర్ధారణ చేసుకుని బాలకృష్ణకు అందజేశారు. ఈ సందర్భంగా డ్రైవర్ కృష్ణకు బాలకృష్ణ అభినందిస్తూ రూ. 300 నగదు ప్రోత్సాహకం అందజేశారు. వారితో పాటు సెక్యూరిటీ గార్డు ఎంపీ రావు తదితరులు ఉన్నారు. -
ఒక్కసారి లేవండి...పిల్లల్ని చూడండి
కారంపూడి: ఆజీ.. ఏక్ బార్ దేఖో జీ... హుటో జీ.. బచ్చీ ఆయే...అంటూ గుండెపోటుతో విధి నిర్వహణలో బుధవారం మృతి చెందిన ఆర్టీసీ డ్రైవర్ సయ్యద్ తాజ్‌బాబు భార్య కైరున్ శోకమిది. ఒక్కసారి లేవండి... ఒక్క సారి చూడండి.. పిల్లల్ని చూడండి అంటూ ఆమె రోదన హృదయాన్ని పిండేసింది. ఎలాంటి అలవాట్లు లేవయ్యా...నిన్న విజయవాడ వెళ్లినప్పుడు ఫోన్ చేశా...ట్రాఫిక్‌లో ఉన్నాను, మళ్లీ ఫోన్ చేస్తానన్నాడు. తర్వాత చేశారు. రాత్రి ఇంటికి వచ్చి, మళ్లీ ఉదయాన్నే డ్యూటీకి వెళ్లాడు. ఇంతలోనే చావు కబురు వచ్చిందని విలపించింది. కుమార్తెలు షమీనా, షారీనా, అమీనాలు కూడా తండ్రి మృతదేహం వద్ద విలపిస్తున్న తీరు కలచివేస్తోంది. డ్రైవింగ్ చేస్తుండగానే గుండెపోటు పిడుగురాళ్ల నుంచి కారంపూడి వెళుతున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్ సయ్యద్ తాజ్బాబుకు మార్గం మధ్యలో జూలకల్లు గ్రామం దాటిన తర్వాత గుండెపోటు రావడంతో స్టీరింగ్ పైనే వాలిపోయాడు. దీంతో బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కనున్న చింత చెట్టును చెట్టును ఢీకొంది. డ్రైవర్ తాజ్‌బాబు(45) అక్కడికక్కడే మృతి చెందాడు. బస్సులో ప్రయాణిస్తున్న 22 మంది ప్రయాణికుల్లో 13 మంది గాయపడ్డారు. క్షతగాత్రులకు ఆర్డీవో పరామర్శ కారంపూడిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల్ని గురజాల ఆర్డీవో మురళి పరామర్శించారు. డీఎస్పీ ప్రసాద్, సీఐ హనుమంతరావు, ఎస్ఐ మురళీలు, ఆర్టీసీ అధికారులు, సంఘటన స్థలాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు. తాజ్‌బాబు మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం గురజాల తరలించారు. నోటి భాగంలో తీవ్ర గాయం కావడంతో కారంపూడి తహసీల్దార్ గుంటూరు ఆసుపత్రిలో చేరారు. ఆర్టీసీ ఎస్టీవో నర్సరావుపేటలో చికిత్స పొందుతున్నారు. ఆర్టీసీ యూనియన్ల నాయకులు తమ సహోద్యోగి తాజ్‌బాబు మృతికి సంతాపం వ్యక్తం చేశారు. డ్రైవర్ సమయస్ఫూర్తి వల్లే పెను ప్రమాదం తప్పింది గుండెపోటు వచ్చినప్పుడు బ్రేక్ వేద్దామన్నా సాధ్యం కాదని, డ్రైవర్ సమయస్ఫూర్తితో స్టీరింగ్ తిప్పబట్టి చెట్టుకు ఢీకొని బస్సు ఆగిందని డీఎస్పీ ప్రసాద్ అన్నారు. డ్రైవర్ తాను చనిపోతూ బస్సులో ఉన్న 22 మందికి ప్రాణాపాయం లేకుండా చేశారని, లేకపోతే ముందే ఉన్న ట్రాన్స్ఫార్మర్ను ఢీకొంటే పెద్ద ప్రమాదం జరిగేదని తెలిపారు. గాయపడిన వారి వివరాలు కారంపూడి తహసీల్దార్ సాయిప్రసాద్, ఆర్టీసీ బస్సు కండక్టర్ రాంబాబు, కారంపూడి ఏఎన్ఎం రమాదేవి, పిడుగురాళ్లకు చెందిన కార్మికులు వెంకటేశ్వర్లు, శ్రీను, యాకోబు, సునీల్, యర్రెయ్య, చిన్నమ్మ, సీతమ్మ మరో ఇద్దరు గాయపడ్డారు. మిగిలిన వారికి కూడా చిన్న చిన్న గాయాలయ్యాయి. ఆర్టీసీ యూనియన్ల నాయకులు తమ సహోద్యోగి తాజ్‌బాబు మృతికి సంతాపం వ్యక్తం చేశారు. -
ఆర్టీసీ డ్రైవర్‌కు ఆర్నెళ్ల జైలు
నందిపేట్ (ఆర్మూర్): రోడ్డు ప్రమాదానికి కారణమైన ఆర్టీసీ బస్సు డ్రైవర్‌కు ఆర్నెళ్ల జైలుశిక్షతో పాటు రూ.1500 జరిమానా విధిస్తూ ఆర్మూర్ జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు గురువారం తీర్పు వెలువరించింది. నందిసేట్ ఎస్సై సంతోష్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని జోర్పూర్ గ్రామానికి చెందిన ఏడ మహేశ్ తన స్నేహితుడైన బచ్చు రాముతో కలిసి 2015 మార్చి 31న పొలానికి వెళ్తుండగా, ఎదురుగా వచ్చిన ఆర్మూర్ డిపో బస్సు ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన ఇద్దరిని ఆస్పత్రికి తరలించగా, మహేశ్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ కేసు గురువారం విచారణకు రాగా ప్రమాదానికి కారణమైన బస్ డ్రైవర్ మేకల రాజశేఖర్‌కు ఆర్నెళ్ల జైలు శిక్షతో పాటు రూ.1500 జరిమానా విధిస్తూ ఆర్మూర్ మేజిస్ట్రేట్ ఉదయ్‌కుమార్ తీర్పు చెప్పారు. ఈ కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా ప్రవీణ్ నాయక్, ఇన్వెస్టిగేషన్ అధికారిగా జాన్‌రెడ్డి వ్యవహరించారు. -
డ్రైవర్ తొందరపాటు.. గర్భిణి మృతి
హైదరాబాద్: ఆర్టీసీ డ్రైవర్ తొందరపాటు ఆమె పాలిట శాపమైంది. రహ దారి సిగ్నల్‌ను పట్టించుకోని ఆ డ్రైవర్ బస్సును నిర్లక్ష్యంగా ముందుకు నడిపాడు. అదే సమయంలో రోడ్డు దాటుతున్న ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్ చెవులకు ఇయర్ ఫోన్లు ఉండటంతో ఇది గమనించలేదు. దీంతో ఆమెను బస్సు బలంగా ఢీకొట్టింది. కిందపడిన ఆమె పైనుంచి బస్సు ముందు చక్రం వెళ్లడంతో అక్కడికక్కడే చనిపోయింది. మృతురాలు 4 నెలల గర్భిణి కావడం గమనార్హం. ఈ హృదయవిదారక ఘటన బుధవారం బంజారాహిల్స్ ఠాణా పరిధిలోని పింఛన్ ఆఫీస్ సిగ్నల్స్ వద్ద చోటు చేసుకుంది. భద్రాద్రి జిల్లా కొత్తగూడానికి చెందిన అరవెల్లి శిరీష (26) సాఫ్ట్వేర్ ఇంజనీర్. బంజారాహిల్స్ రోడ్ నం.12లోని రత్నదీప్ సూపర్ మార్కెట్ పై అంతస్తులో ఉన్న సిన్సి సాఫ్ట్వేర్ సంస్థలో పనిచేస్తున్నారు. భర్త మురళీకృష్ణమాచార్యులతో కలసి గాజులరామారంలో నివసిస్తున్నారు. బుధవారం ఉద యం పింఛన్ ఆఫీస్ చౌరస్తాలో బస్సు దిగిన శిరీష.. ఎల్లో లైట్ పడటంతో రోడ్ నం.12 వైపు వచ్చేందుకు రోడ్డు దాటడానికి ఉపక్రమించారు. అదే సమయంలో మాసబ్‌ట్యాంక్ వైపు నుంచి బంజారాహిల్స్ వైపు వస్తున్న ఆర్టీసీ బస్సు సిగ్నల్స్‌ను పట్టించుకోకుండా మృత్యుశకటంలా దూసుకొచ్చింది. రోడ్డు దాటుతున్న శిరీషను ఢీకొట్టడంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే శిరీష మృతి చెందిందని గుర్తించిన స్థానికులు బస్సును ఆపి ఆందోళనకు దిగారు. కేసు నమోదు చేసుకున్న బంజారాహిల్స్ పోలీసులు డ్రైవర్ కె.బాబును అరెస్ట్ చేశారు. -
తాగకున్నా తాగినట్లు చూపితే ఎలా?
సాక్షి,ఆత్మకూరు: బ్రీత్ ఎనలైజర్ పరికరంలోని లోపం ఆర్టీసీ డ్రైవర్ల పాలిట శాపంగా మారింది. మద్యం అంటే ఏమిటో ఎరుగని కార్మికులను తాగినట్లుగా చూపించడంతో కార్మికులు అధికారులతో వాగ్వాదానికి దిగుతున్నారు. ఈ సంఘటన నెల్లూరు జిల్లాలో చోటుచేసుకంది. వివరాలివి.. చల్లా రవిరెడ్డి ఆత్మకూరు డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఆదివారం తెల్లవారుజామున డ్యూటీ ఎక్కుతున్న రవికి బ్రీత్ ఎనలైజర్ పరీక్ష చేశారు. అతను మద్యం సేవించినట్లు 10 పాయింట్లు నమోదవడంతో సస్పెండ్ చేసేందుకు డిపో అధికారులు సిద్ధమయ్యారు. మళ్లీ పరీక్ష చేయాలి.. దీంతో సహ కార్మికులు అసలు మద్యం ముట్టని రవిని మద్యం సేవించాడని నిర్ధారించడం సరికాదని వాగ్వాదానికి దిగారు. మళ్లీ పరీక్ష చేయాలని కోరగా అధికారులు ససేమిరా అన్నారు. విషయం తెలిసి అన్ని కార్మిక యూనియన్ల నాయకులు అక్కడికి చేరుకుని అనుమానం ఉంటే ప్రభుత్వాస్పత్రిలో పరీక్షలు చేయించాలని కోరారు. అలా కుదరిని పక్షంలో అదే పరికరంతో మళ్లీ పరీక్షించాల్సిందేనని పట్టుబట్టారు. ధర్నాకు దిగిన కార్మిక జేఏసీ.. యాజమాన్యం ఒప్పుకోకపోవడంతో కార్మిక జేఏసీ ఆధ్వర్యంలో ఆకస్మిక దర్నా చేపట్టారు. అప్పటికి డిపో నుంచి కేవలం ఒక్క బస్సు మాత్రమే బయటకు వెళ్లింది. అయితే మిగిలిన బస్సులను కదనివ్వబోమంటూ కార్మికులు నినాదాలు చేస్తూ ధర్నాకు దిగారు. డిపో మేనేజర్ త్రినాథరావు వచ్చి బ్రీత్ ఎనలైజర్ ద్వారా రెండోసారి పరీక్షలకు నిబంధనలు ఓప్పుకోవన్నారు. మద్యం అలవాటే లేని కార్మికులను తాగుబోతులుగా చూపుతున్న బ్రీత్ ఎనలైజర్‌ను మార్చాలని, న్యాయం జరిగే వరకు దర్నా విరమించేది లేదని కార్మికులు పట్టుబట్టారు. దీంతో మూడు గంటలకుపైగా బస్సులు డిపోలోనే నిలిచిపోయాయి. దిగొచ్చిన డీఎం.. విషయం తెలుసుకుని డిపోకు వచ్చిన మీడియాపై డీఎం త్రినాథరావు మిమ్మల్ని ఎవరు రమ్మన్నారని కోపం ప్రదర్శించారు. చివరకు ఆయన ఉన్నతాధికారులతో మాట్లాడి అందరి ఎదుట డ్రైవర్ రవిని రెండోసారి పరీక్షించగా సున్న(0)గా నమోదైంది. మిషన్‌లో పొరపాటు పెట్టుకుని కార్మికులను క్షభకు గురిచేయడం తగదని కార్మిక జేఏసీ అన్నారు. గతంలోనూ ఇలానే ఒకరిని సస్పెండ్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ కార్మికులు ధర్నా విరమించారు. కాగా, ఈ సంఘటనపై డీఎం త్రినాథరావును ప్రశ్నించగా రెండవసారి కార్మికుడు అధికంగా నీళ్లు తాగి పరీక్షలు చేయించకోవడంలో అలా నమోదైందని వ్యాఖ్యానించారు. -
ఆర్టీసీ డ్రైవర్‌పై టోల్‌ప్లాజా సిబ్బంది దాడి
కామారెడ్డి: ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై టోల్‌ప్లాజా మేనేజర్, సిబ్బంది దాడిచేశారు. ఈ సంఘటన కామారెడ్డిజిల్లా భిక్కనూర్ టోల్‌ప్లాజాలో జరిగింది. నిజామాబాద్ నుంచి తిరుపతి వెళ్లే నిజామాబాద్ డిపో-1కు చెందిన బస్సు భిక్కనూర్ టోల్ ప్లాజాకు చేరింది. అక్కడ బస్సును పక్కకు తిప్పే క్రమంలో టోల్‌ప్లాజా డివైడర్‌కు చిన్న పెచ్చు ఊడింది. దీంతో టోల్‌ప్లాజా సిబ్బంది, మేనేజర్ సంతోష్‌లు బస్సు డ్రైవర్‌ను దుర్భాషలాడారు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దాంతో డ్రైవర్ మారుతిపై టోల్‌ప్లాజా మేనేజర్ సంతోష్ దాడిచేశాడు. పైగా సుమారు గంటపాటు బస్సును నిలివేశారు. దీంతో భారీగా వాహనాలు నిలిచిపోవడంతో పోలీసులు చేరుకుని ట్రాఫిక్‌ను క్లియర్ చేసి బస్సును పంపించేశారు. అయితే ఇంత జరిగినా టోల్‌ప్లాజా సిబ్బందిపై చర్యలు తీసుకోలేదు. బస్సు డ్రైవర్‌పై దాడిచేసినట్లు సంతోష్ స్వయంగా ఒప్పుకున్నారు. -
హత్యాయత్నం..తలలో ఇరుక్కున్న కత్తి
-
ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం
డిపో అధికారుల నిర్లక్ష్యమే కారణమంటున్న కుటుంబ సభ్యులు హైదరాబాద్: కుషాయిగూడ ఆర్టీసీ బస్ డిపోలో పనిచేస్తున్న ఓ డ్రైవర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ప్రాణాపాయస్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఘటన మంగళవారం వెలుగు చూసింది. కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు...నల్లగొండ నుంచి డిçప్యుటేషన్‌పై గత 12 ఏళ్లుగా కుషాయిగూడ బస్ డిపోలో డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్న బొల్లంపల్లి తిరుపతిరెడ్డి (48) గత ఏడాది మేలో ఆయన అనారోగ్యం బారిన పడ్డాడు. డ్రైవర్‌గా విధులు నిర్వహించేందుకు అన్‌ఫిట్‌గా వైద్యులు నిర్థారించడంతో 16 నెలలుగా ఉద్యోగం లేక ఇబ్బందులు పడుతున్నాడు. డ్రైవర్‌గా కాకుండా ప్రత్యామ్నాయంగా అవకాశం కల్పించాలని గతంలో ఇక్కడ విధులు నిర్వహించిన డిపో మేనేజర్‌తో పాటు ప్రస్తుత డిపో మేనేజర్లను పలుమార్లు కోరినప్పటికీ ఈ విషయంలో అధికారులు నిర్లక్ష్యం వహించారు. దీంతో మానసికంగా కుంగిపోయిన తిరుపతి రెడ్డి సోమవారం ఘట్కేసర్లో పురుగు మందు తాగి అపస్మారకస్థితిలో రోడ్డు ప్రక్కన పడిపోయాడు. అక్కడి పోలీసులు సమాచారమివ్వటంతో కుటుంబ సభ్యులు అక్కడకు చేరుకొని ఆస్పత్రిలో చేర్పించారు. డిపో అధికారుల నిర్లక్ష్యంతోనే ఆయన ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు భార్య రమాదేవి, కుమారుడు విజయ్ ఆరోపిస్తున్నారు. కాగా, ఈ విషయంపై కుషాయిగూడ డిపో మేనేజర్ రమేశ్‌ను వివరణ కోరగా తిరుపతిరెడ్డి కుటుంబ సభ్యులు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. శ్రామిక్ కేటగిరీలో అవకాశం కల్పించాలన్న ఆయన అభ్యర్థన మేరకు పై అధికారులు గత ఏడాది జూన్ 20న అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, ఆయన నల్లగొండ నుంచి డిçప్యుటేషన్‌పై వచ్చారు కాబట్టి ఆయన ఫైల్‌ను నల్లగొండకు పంపినట్లు తెలిపారు. తిరుపతిరెడ్డికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్న నల్లగొండ డిపో అధికారులపైనే బాధ్యత ఉంటుందన్నారు. -
బస్టాండ్‌లో ఆర్టీసీ డ్రైవర్‌పై హత్యాయత్నం
మదనపల్లి: చిత్తూరు జిల్లా మదనపల్లి ఆర్టీసీ బస్టాండ్‌లో అందరూ చూస్తుండగానే డ్రైవర్‌పై ఓ వ్యక్తి కత్తితో దాడికి చేశాడు. గ్యారంపల్లికి చెందిన రెడ్డి శేఖర్(30) సోమవారం మధ్యాహ్నం బస్టాండ్‌లో నిలబడి ఉండగా ఓ ఆగంతకుడు అతడిని కత్తితో విచక్షణారహితంగా దాడిచేసి గాయపరిచాడు. అక్కడున్న వారు కేకలు వేయటంతో ఆ వ్యక్తి పారిపోయాడు. తీవ్రంగా గాయపడిన శేఖర్‌ను వెంటనే ఆస్పత్రికి తరలించారు. శేఖర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెబుతున్నారు. కాగా, ఈ ఘటనకు కారణాలు తెలియాల్సి ఉంది. నిందితుడు పోలీసులకు లొంగిపోయినట్లు సమాచారం. -
ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య
జగిత్యాల: జగిత్యాల జిల్లా చల్గల్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆర్టీసీలో డ్రైవర్‌గా పనిచేస్తున్న మద్దిడి రంగారావు(55) ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతని ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు. రంగారావుకి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఏడుగురు ఆర్టీసీ డ్రైవర్లు అరెస్ట్
ఖాజీపేట: తమిళ కూలీలు బెంగళూరు నుంచి వైఎస్సార్ జిల్లా రావడానికి సహకరించిన ఏడుగురు ఆర్టీసీ డ్రైవర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. గత కొంతకాలంగా ఖాజీపేట, మైదుకూరు, దువ్వూరు ప్రాంతాల్లోని లంకమల కొండల్లోకి తమిళకూలీలు అధికంగా వస్తున్నారని మైదుకూరు డీఎస్పీ బీఆర్. శ్రీనివాసులు, తెలిపారు. శుక్రవారం విలేకరుల తో మాట్లాడుతూ శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కావలి, ఆత్మకూరు, ఉదయగిరి డిపోలకు చెందిన డ్రైవర్లు తమిళకూలీలు ఇక్కడికి వచ్చేందుకు సహకరిస్తున్నట్లు తేలిందన్నారు. వారిలో కావలి డిపోకు చెందిన నోటి మాలకొండారెడ్డి, పెట్లూరి ప్రభాకర్‌రావు, షేక్ మహబూబ్ సుభాని, సెనగల వెంకటేశ్వర్లు, సాన సుధాకర్, కట్ట సురేష్, ఆత్మకూరు డిపోకు చెందిన షేక్ సర్ధార్ బాషాలను అదుపులోకి తీసుకుని విచారించామని చెప్పారు. తమిళ కూలీలు వచ్చేందుకు వారు సహకరించినట్టు తేలడంతో అరెస్ట్ చేశామని తెలిపారు. -
బస్సు డ్రైవర్ మృతి ఘటనలో విషాదం
-
బస్సు డ్రైవర్‌కు ఫిట్స్ : తప్పిన ప్రమాదం
సిరిసిల్ల : డ్యూటీలో ఉన్న ఆర్టీసీ బస్సు డ్రైవర్‌కు ఫిట్స్ రావడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన సిరిసిల్ల జిల్లాలో బుధవారం ఉదయం చోటుచేసుకుంది. కామారెడ్డి డిపోకు చెందిన బస్సు సిరిసిల్ల నుంచి రగుడు గ్రామం వైపు వెళ్తున్న సమయంలో డ్రైవర్ నరసింహులుకు ఒక్కసారిగా ఫిట్స్ వచ్చింది. దీంతో బస్సు రోడ్డుపక్కకు ఒరిగిపోయింది. అదృష్టవశాత్తూ ఆ సమయంలో డ్రైవర్ బ్రేకుపై కాలు వేసి ఉండడంతో బస్సుపక్కకు ఒరిగి ఆగిపోయింది. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఇది గమనించిన ప్రయాణికులు కిటికీ అద్దాల నుంచి బయటకు దూకారు. వెంటనే డ్రైవర్‌ను ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
చనిపోతూ 30 మందిని కాపాడాడు
- విధి నిర్వహణలో ఉన్న బస్సు డ్రైవర్‌కు గుండెపోటు - ప్రయాణికులను రక్షించి, ప్రాణాలు విడిచిన డ్రైవర్ నల్లగొండ క్రైం: ఆపద ముంచుకొస్తున్నపుడు పక్కవారి గురించి కూడా పట్టించుకోకుండా తమను తాము రక్షించుకునే వారెందరో.. అలాంటి వారికి విరుద్ధంగా ఓ ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్ సమయ ‘స్ఫూర్తి’తో వ్యవహరించి ఆదర్శప్రాయుడిగా నిలిచారు. విధి నిర్వహణలో ఉండగా గుండెపోటు వచ్చినా లెక్క చేయకుండా బస్సును రోడ్డు పక్కన నిలిపి 30 మంది ప్రయాణికుల ప్రాణాలు కాపాడి తాను మాత్రం ప్రాణాలొదిలాడు. ఈ విషాదకర ఘటన నల్లగొండలో చోటు చేసుకుంది. నల్లగొండ మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన బొడ్డు జానయ్య(36) స్థానిక ఆర్టీసీ డిపోలో అద్దెబస్సు డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. మంగళవారం ఉదయం 5:30 గంటలకు నల్లగొండ డిపో నుంచి 30 మంది ప్రయాణికులతో బస్సు దేవరకొండకు బయలు దేరింది. మార్గమధ్యలో నల్లగొండ శివారు వైఎస్సార్ విగ్రహం వద్దకు వెళ్లగానే జానయ్యకు ఒక్కసారిగా ఛాతీలో నొప్పి వచ్చింది. అమ్మా అంటూ ఓ చేత్తో ఛాతీని అదిమి పట్టుకుంటూనే సమయస్ఫూర్తితో వ్యవహరించి బస్సును రోడ్డు పక్కన నిలిపాడు. కండక్టర్‌తో గుండెలో నొప్పి వస్తుందంటూనే కుప్పకూలిపోయాడు. దీంతో అతడిని వెంటనే 108 అంబులెన్స్‌లో నల్లగొండ ఆస్పత్రికి తరలించేలోపే ప్రాణాలు విడిచాడు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. -
ఆర్టీసీ డ్రైవర్ సమయస్ఫూర్తి
తప్పిన ఘోర ప్రమాదం సంగం : ఆర్టీసీ డ్రైవర్ సమయస్ఫూర్తితో ప్రయాణికులకు ప్రమాదం తప్పిన సంఘటన గురువారం రాత్రి మండలంలోని వెంగారెడ్డిపాళెం వద్ద చోటుచేసుకుంది. వివరాలు.. ఉదయగిరి డిపోకు చెందిన ఏపీ 26జెడ్ 0075 నంబరు ఆర్టీసీ బస్సు నెల్లూరు నుంచి ప్రయాణికులతో ఉదయగిరికి వెళ్తోంది. మార్గమధ్యంలో మండలంలోని వెంగారెడ్డిపాళెం క్రాస్‌రోడ్డు వద్ద బస్సు డ్రైవర్ రజాక్ కడుపునొప్పి కారణంగా తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఈ సమయంలో రోడ్డు పక్కనే దువ్వూరు డ్రైన్ ఉండటాన్ని గుర్తించి అనారోగ్యాన్ని లెక్క చేయకుండా బస్సును కాలువ పక్కనే అతి కష్టం మీద నిలిపివేశాడు. ఈ సమయంలో వాంతులై స్టీరింగ్‌పై ఒరిగాడు. ప్రయాణికులు, కండెక్టర్ వెంకటేశ్వర్లు అతని పరిస్థితి గమనించి 108 ద్వారా బుచ్చిరెడ్డిపాళెంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. బస్సులో 50 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. డ్రైవర్ రజాక్ సమయస్ఫూర్తితో వ్యవహరించకుంటే బస్సు దువ్వూరు డ్రైన్లో పడి ఘోర ప్రమాదం జరిగి ఉండేది. -
గుండెపోటుతో ఆర్టీసీ డ్రైవర్ మృతి
మంగళగిరి బస్టాండ్‌లో ఘటన మంగళగిరి: గుండెపోటుతో ఓ ఆర్టీసీ డ్రైవర్ మృతి చెందిన ఘటన మంగళగిరి ఆర్టీసీ బస్టాండ్‌లో గురువారం చోటు చేసుకుంది. పట్టణ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పట్టణానికి చెందిన భీమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి(54) మంగళవారం రాత్రి హైదరాబాద్ నుంచి మంగళగిరి వచ్చే బస్సులో విధులు నిర్వహిస్తూ మంగళగిరి డిపోకు బుధవారం ఉదయం 6 గంటలకు చేరుకున్నాడు. అనంతరం కౌంటర్లో నగదు చెల్లించేందుకు వెళ్తూ ఆకస్మాత్తుగా బస్టాండ్‌లో కింద పడిపోయాడు. గమనించిన తోటి ఉద్యోగులు ప్రభాకర్‌రెడ్డిని లేపేందుకు ప్రయత్నించి అంబులెన్స్‌కు ఫోన్ చేయగా అంబులెన్స్‌లో వచ్చిన సిబ్బంది చూసి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ప్రభాకర్‌రెడ్డి మృతి పట్ల ఆర్టీసి కార్మిక సంఘాల నాయకులు, ఉద్యోగులు, కార్మికులు సంతాపం తెలిపారు. -
ఫోన్ చేసి సొమ్ము కొట్టేశారు
మోసపోయిన ఆర్టీసీ డ్రైవర్ రూ.14,900 డ్రా చేసిన మాయగాళ్లు తూర్పు గోదావరి (అమలాపురం టౌన్) : ఓ ఫోన్ కొట్టాడు.. ఏటీఎం కార్డు సమాచారాన్ని రాబట్టాడు. ఖాతాలో ఉన్న డబ్బును డ్రా చేసి కాజేశాడు. వివరాల్లోకి వెళితే.. అమలాపురం రూరల్ మండలం సమనస గ్రామానికి చెందిన గోడ సత్యనారాయణ అనే ఆర్టీసీ డ్రైవర్ ఇంట్లో ఉండగా మంగళవారం 76549 41429 సెల్ ఫోన్ నుంచి కాల్ వచ్చింది. ఫోన్ ఎత్తిన సత్యనారాయణకు ‘మేమ బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాం. మీ ఏటీఎం కార్డు పనిచేయటం లేదు. దానిని సరి చేయాలి. ముందు మీ ఆధార్ కార్డు నెంబరు చెప్పండి’ అని అడిగాడు. దాంతో సత్యనారాయణ తన ఆధార్ కార్డు నెంబరు చెప్పారు. అనంతరం మరింత సమాచారం అడిగాడు. అన్నింటికి సమాధానం చెప్పిన సత్యనారాయణ ఫోన్‌కు రెండు దఫాలుగా రూ.14,900 డ్రా చేసినట్టు మేసేజ్‌లు వచ్చాయి. కంగారు పడి ఏటీఎంకి వెళ్లి చూడగా డిపాజిట్లో ఉన్న మొత్తం రూ.16 వేలకు గాను రూ.14,900 డ్రా అయినట్టు తెలిసింది. తనకు ఫోన్ వచ్చిన సెల్ నెంబర్‌కు ఫోన్ చేస్తుంటే ఎవరో హిందీలో మాట్లాడుతున్నారు. మోసపోయానని గ్రహించిన సత్యనారాయణ సంబంధిత బ్యాంకు అధికారులకు చెబుదామంటే మంగళవారం బ్యాంకులకు సెలవు కావటంతో తనకు జరిగిన మోసంపై అమలాపురం పట్టణ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య
రాజుపేట: కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ ఆర్టీసీ డ్రైవర్ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా రాజుపేట మండలం బేగంపేట గ్రామ శివారులో సోమవారం వెలుగు చూసింది. గ్రామానికి చెందిన మూల రాజు యాదగిరిగుట్ట ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఈరోజు ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఆత్మహత్య చేసుకున్నాడా.. లేక మరేదైనా కారణం ఉందా అనే కోణంలో పోలీసులు దృష్టి సారిస్తున్నారు. -
వేధింపులు తాళలేక ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం
రాజోలు(తూర్పు గోదావరి జిల్లా) : ఉన్నతాధికారుల వేధింపులు తాళలేక రాజోలు ఆర్టీసీ డిపో డ్రైవర్ గొల్ల శేఖర్ శుక్రవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వెళ్లి తిరిగివస్తుండగా బస్సు టైర్ పంక్చర్ అయ్యింది. దాంతో టైరు మార్చుకొని రాజోలు డిపోకు వచ్చిన తర్వాత డిపోలో మెకానికల్ ఫోర్ మెన్ (ఎంఎఫ్) పంక్చరైన టైరును గ్యారేజీ నోటీసు బోర్డు వద్ద పెట్టి డ్రైవర్ శేఖర్ పేరు రాయడంతో అతను మనస్తాపం చెందినట్టు బంధువులు వివరించారు. నోటీసు బోర్డు వద్ద తన పేరు ఉండడంతో తోటి డ్రైవర్లు, కార్మికుల మధ్య అవమానం జరిగిందనే బాధతో శేఖర్ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బంధువులు హుటాహుటిన శేఖర్‌ను రాజోలు ఏరియా ఆస్పత్రికి తరలించారు. అతనికి ప్రాణాపాయం తప్పిందని యూనియన్ నాయకులు తెలిపారు. తరుచూ డిపోలో చాలా మంది డ్రైవర్లు వేధింపులను ఎదుర్కొనవలసి వస్తోందని వారు పేర్కొన్నారు. ఆర్టీసీ కార్మికులను, డ్రైవర్లను వేధిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు. -
బంద్‌లోనూ బస్ నడపాలని ఒత్తిడి
ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం తిరుపతి క్రైం: బంద్ జరుగుతున్నా బస్సు నడపాలని, నష్టం జరిగితే మీదే బాధ్యతని అధికారులు హుకుం జారీ చేయడంతో ఆర్టీసీ డ్రైవర్ కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యయత్నానికి పాల్పడిన సంఘటన మంగళవారం తిరుపతి బస్టాండ్‌లో చోటుచేసుకుంది. బాధితుడి కథనం మేరకు మంగళవారం బంద్ కావడంతో ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. ఉదయం 11 గంటల సమయంలో బస్సులను నడపాలని కండక్టర్లు, డ్రైవర్లను అధికారులు ఆదేశించారు. అవాంఛనీయ ఘటనల వల్ల బస్సుపై దాడి జరిగి నష్టం వాటిల్లితే తమది బాధ్యత కాదని డ్రైవర్లు, కండక్టర్లు తెలిపారు. అధికారులు మాత్రం చిన్నపాటి అద్దం పగిలినా మీదే బాధ్యత అని, బస్సులు తీయాలని ఆదేశించారు. అసలే చాలీచాలని జీతాలతో కుటుంబాన్ని లాక్కొస్తుంటే ఇలాంటివన్నీ తమ నెత్తిపై ఎక్కడ పడతాయోనన్న భయంతో డ్రైవర్ మునస్వామి కిరోసిన్ తెచ్చుకుని ఒంటిపై పోసుకుని అంటించుకునేందుకు ప్రయత్నించగా సహచర ఉద్యోగులు అడ్డుకున్నారు. అనంతరం పోలీసులు వచ్చి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. -
ఆర్టీసీ డ్రైవర్ కు షాకిచ్చిన ట్రాఫిక్ పోలీసులు
భాగ్యనగర్‌కాలనీ(హైదరాబాద్): రకరకాల కారణాలతో ప్రైవేటు వాహనదారుల నుంచి భారీగా చలాన్లు వసూలుచేసే ట్రాఫిక్ పోలీసులు.. ప్రభుత్వ వాహనాల విషయంలో మాత్రం కాస్త చూసీచూడనట్లు వ్యవహరిస్తారనే విమర్శ ఉంది. ఆ అపవాదు నుంచి బయటపడాలనుకున్నారో ఏమోగానీ ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించిన టీఎస్ఆర్టీసీకి చెందిన బస్సు డ్రైవర్ కు వెయ్యి రూపాయల జరిమానా విధించారు. హయత్‌నగర్ –2 డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు (ఏపీ 28జెడ్ 3543) ఆదివారం సాయంత్రం కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు వైపుగా వెళుతునప్పుడు. కూకట్పల్లి వై జంక్షన్ సమీపంలోకి రాగానే బస్సు నడుపుతున్న డ్రైవర్ శ్రీనివాస్ సెల్ఫోన్లో మాట్లాడుతూ ట్రాఫిక్ పోలీసుల కంట పడ్డాడు. ట్రాఫిక్ ఎస్ఐ సైదులు బస్సును పక్కకు పెట్టించి, డ్రైవర్‌కు వెయ్యి రూపాయల జరిమానా విధించారు. -
ఫోన్ మాట్లాడుతూ బస్సు డ్రైవింగ్
ఆర్టీసీ డ్రైవర్‌కు రూ. వెయ్యి జరిమానా భాగ్యనగర్‌కాలనీ : ఫోన్ లో మాట్లాడుతూనే బస్సు నడుపుతూ ఓ ఆర్టీసీ డ్రైవర్ కూకట్పల్లి ట్రాఫిక్ పోలీసులకు చిక్కాడు. సదరు డ్రైవర్‌కు పోలీసు లు చలానా విధించారు. మియాపూర్ డిపోకు చెంది న బస్సు (ఏపీ11జెడ్ 6563) శుక్రవారం కూకట్పల్లి వై జంక్షన్ వద్దకు చేరుకుంది. ఆ సమయంలో డ్రైవర్ సెల్ఫోన్లో మాట్లాడుతూ ఆ బస్సు నడుపుతున్నాడు. ఈ విషయం గమనించిన ట్రాఫిక్ పోలీసులు డ్రైవర్‌ను పట్టుకున్నారు. అతడికి రూ. వెయ్యి చలాన్ విధించారు. అనంతరం ట్రాఫిక్ ఎస్ఐ సైదులు మాట్లాడుతూ... వాహనం నడుపుతూ ఫోన్లో మాట్లాడంతో పాటు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే ఎంతటి వారిపైనైనా చర్యలు తీసుకుంటామన్నారు. -
రెండు బైక్‌లు ఢీ..ఆర్టీసీ డ్రైవర్ మృతి
ముండ్లమూరు: ముండ్లమూరు మండలం ఉల్లగల్లు వద్ద ఎదురెదురుగా వస్తోన్న రెండు బైక్‌లు ప్రమాదవశాత్తూ ఢీకొన్నాయి. ఈ ఘటనలో చెన్నయ్య(55) అనే ఆర్టీసీ డ్రైవర్ మృతిచెందాడు. చెన్నయ్య విధులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
సెల్‌ఫోన్ డ్రైవింగ్ .. ఆర్టీసీ డ్రైవర్ కు ఫైన్
హైదరాబాద్: బస్సు నడుపుతూ సెల్ఫోన్లో మాట్లాడుతున్న ఆర్టీసీ డ్రైవర్‌కు ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించారు. ఈ సంఘటన నగరంలోని కూకట్పల్లి వద్ద రెమెడీ ఆసుపత్రి వద్ద చోటు చేసుకుంది. బస్సు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నుంచి కేపీహెచీ వస్తుండగా ఈ సంఘటన జరిగింది. డ్రైవింగ్‌లో ఉన్నప్పుడు డ్రైవర్ సెల్ఫోన్లో మాట్లాడుతుండగా కంటపడటంతో స్థానిక ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రూ.1000 జరిమానా విధించాడు. -
బస్సు నడుపుతూ.. ఫోన్లో హలో హలో!
హైదరాబాద్: కూకట్పల్లి టు బీహెచ్ఈఎల్.. దాదాపు ఎనిమిది కిలోమీటర్లు ఉంటుంది. బాగా రద్దీగా ఉండే ఈ రోడ్డుపై వాహనాలు నడుపడమంటే మాటలు కాదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ప్రమాదాలు జరిగే అవకాశముంటుంది. కానీ ఓ ఆర్టీసీ డ్రైవర్ మాత్రం ఇదేమీ పట్టనట్టు.. తాపీగా బస్సు నడుపుతూ.. మరోవైపు సెల్ఫోన్లో బాతాఖానీ పెట్టాడు. ఓ చేతితో స్టీరింగ్ తిప్పుతూ.. మరో చేతితో సెల్‌ఫోన్ పట్టుకొని ముచ్చట్లు నడిపాడు. ఆ సమయంలో బస్సులో పలువురు ప్రయాణికులు కూడా ఉన్నారు. సెల్ఫోన్లో మాట్లాడుతూ డ్రైవర్ నిర్లక్ష్యంగా బస్సు నడుపుతున్న ఆ ఆర్టీసీ డ్రైవర్‌ను ట్రాఫిక్ ఎస్సై రవి గుర్తించి వెంటనే.. బస్సును ఆపేయించాడు. సెల్‌ఫోన్ డ్రైవ్ చేస్తున్నందుకు డ్రైవర్‌పై రూ. వెయ్యి జరిమానా విధించాడు. బుధవారం ఆర్టీసీ బస్సు కూకట్పల్లి నుంచి బీహెచ్ఈఎల్ వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. -
ఆర్టీసీ డ్రైవర్‌పై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు
హైదరాబాద్: మద్యం సేవించి బస్సు నడుపుతున్న ఆర్టీసీ డ్రైవర్‌పై శనివారం మలక్‌పేట ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేశారు. పికెట్ డిపోకు చెందిన ఏపీ29 జెడ్1319 నంబర్ బస్సు జేబీఎస్ నుంచి శ్రీశైలం వెళ్తుండగా.. డ్రైవర్ తాగి బస్సు నడుపుతున్నాడని గమనించిన ప్రయాణికులు మలక్‌పేట ట్రాఫిక్ పోలీసులకు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆజంపుర చౌరస్తా వద్ద బస్సును ఆపి డ్రైవర్ కె. ఆప్సర్ను తనిఖీ చేశారు. బీఏసీ 181 ఎంజీ లెవల్.. ఆల్కహాల్ ఉన్నట్లు నిర్ధారణ కావడంతో అతనిపై కేసు నమోదు చేసినట్లు సీఐ వెంకట్‌రెడ్డి తెలిపారు. -
నాటు తుపాకితో ఆర్టీసీ డ్రైవర్ అరెస్ట్
మంచాల: రంగారెడ్డి జిల్లాలో నాటు తుపాకి కలిగి ఉన్న ఓ వ్యక్తిని పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. మంచాల ఎస్సై యాదగిరి కథనం ప్రకారం... ఎల్లమ్మ తండా గ్రామానికి చెందిన సపావట్ రవి కుమార్. వృత్తి రీత్యా ఆర్టీసీ డ్రైవర్. ఆయన వద్ద తమ పూర్వీకులు వాడిన నాటు తుపాకిను కలిగి ఉన్నాడు. దానికి సంబంధించిన లైసెన్స్, ఎలాంటి అనుమతి పత్రాలు అతని వద్ద లేవు. గుట్టు చప్పుడు కాకుండా రవి కుమార్ తుపాకిని తన దగ్గర భద్రపర్చుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న స్పెషల్ బ్రాంచ్ పోలీసులు స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో మంచాల ఎస్సై యాదగిరి నాటు తుపాకిని స్వాధీనం చేసుకొని రవి కుమార్‌ను అరెస్టు చేశారు. -
ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం
దిల్సుఖ్నగర్: అన్యాయంగా తనను సస్పెండ్ చేశారనే మనస్తాపంతో ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన దిల్సుఖ్నగర్ బస్ డిపోలో జరిగింది. దిల్సుఖ్నగర్ ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్న సైదులును ఆర్టీసీ అధికారులు సస్పెండ్ చేశారు. దీంతో మనస్తాపం చెందిన సైదులు బుధవారం డిపో ఎదుట పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. చికిత్స కోసం ఆయనను స్థానిక ఆసుపత్రికి తరలించారు. దీనిపై తోటి ఉద్యోగులు డిపో ఎదుట ఆందోళనకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. -
మృతదేహంతో ఆర్టీసీ డిపో ఎదుట ధర్నా
వరంగల్: వరంగల్ జిల్లాలో ఆర్టీసీ కార్మికుడు గండె పోటుతో మృతి చెందాడు. జిల్లాలోని నర్సంపేటకు చెందిన తొగరు కుమారస్వామి గుండెపోటుతో సోమవారం రాత్రి మృతి చెందాడు. అయితే కుమార స్వామి మృతికి డీఎం వేధింపులే కారణమని మృతుని బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ నేపధ్యంలో మంగళవారం ఉదయం మృత దేహంతో నర్సంపేట డిపో ఎదుట కుటుంబ సభ్యులు ధర్నా చేపట్టారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. -
దంపతులపై దుండగుల దాడి: భర్త మృతి
పొన్నలూరు: ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలం పాగసింగరబట్ల పాలెంలో సోమవారం తెల్లవారుజామున దారుణం జరిగింది. బైకుపై వెళ్తున్న దంపతులపై ఇద్దరు దుండగులు దాడి చేశారు. ఈ ప్రమాదంలో భర్త మృతి చెందగా.. భార్యకు గాయాలయ్యాయి. మృతుడు ఆర్టీసీ డ్రైవర్ పుల్లారెడ్డిగా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
డిపో ఎదుట డ్రైవర్ ఆత్మహత్యాయత్నం
మెదక్(సంగారెడ్డి): సంగారెడ్డి ఆర్టీసీ డిపో ఎదుట ఓ ఆర్టీసీ డ్రైవర్ ఒంటిమీద కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేయబోయాడు. వెంటనే పోలీసులు అప్రమత్తమై డ్రైవర్ నుంచి కిరోసిన్ డబ్బా లాక్కోవడంతో ప్రమాదం తప్పింది. సమ్మెలో భాగంగా ఆర్టీసీ ఉద్యోగులు సంగారెడ్డి డిపోలో దీక్ష చేపట్టారు. ఎట్టి పరిస్థితిల్లో ఈ రోజు బస్సు నడిపించి తీరతామని పోలీసులు చెప్పడంతో డ్రైవర్ ఆత్మహత్యాయత్నం చేయబోయాడు. -
ప్రయాణికుడి దాడిలో ఆర్టీసీ డ్రైవర్ మృతి
అనంతపురం: ప్రయాణికుడు దాడిలో ఆర్టీసీ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన గురువారం అనంతపురం బస్టాండ్ సమీపంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. అనంతపురం బస్టాండ్ నుంచి వెలుపలకు వచ్చిన బస్సును ఆపితే బ్రడ్ కొనుక్కుని వస్తానని నారాయణప్ప అనే ప్రయాణికుడు... బస్సు డ్రైవర్ ఆంజనేయులకు తెలిపాడు. అందుకు అతడు నిరాకరించాడు. దీంతో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. ఆ క్రమంలో బస్సులో ఉన్న ఐరన్ రాడ్ తీసి... డ్రైవర్ తలపై కొట్టాడు. డ్రైవర్ కుప్పకూలిపోయాడు. దాంతో బస్సులోని ఇతర ప్రయాణికులు నారాయణప్పను పోలీసులకు అప్పగించారు. పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మద్యం మత్తులో నారాయణప్పు ఉన్నాడని పోలీసులు తెలిపారు. -
ఎస్ఐపై చర్యలకు డిమాండ్
పొన్నూరు రూరల్: తన మృతికి పోలీసు అధికారి కారణమంటూ సూసైడ్ నోట్ రాసి ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆందోళనకు దారితీసింది. మృతుడి బంధువులు పోలీస్‌స్టేషన్ ఎదుట మృతదేహంతో ధర్నాకు దిగారు. శనివారం పొన్నూరు పట్టణంలో చోటుచేసుకున్న ఈ ఘటన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. వివరాలు.. పిట్టలవానిపాలెం మండలం కోమలి గ్రామానికి చెందిన సాయికి రణ్ పొన్నూరు పట్టణంలోని ఓవర్ బ్రిడ్జిపై గురువారం రాత్రి ఆర్టీసీ బస్సు, ద్విచక్రవాహనం ఢీకొన్న ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదం జరిగిన సమయంలో అక్కడే ఉన్న ఏఎస్ఐ సత్యన్నారాయణ ప్రాథమిక దర్యాప్తు చేసి పొన్నూరు డిపో ఆర్డీసీ డ్రైవర్ బొనిగల రోశయ్య (35) తప్పేమీ లేదని నిర్ధారించారు. అనంతరం రోశయ్య బస్సు తీసుకుని వెళ్లారు. గాయాలతో చికిత్సపొందుతున్న సాయికిరణ్ మృతి చెందడంతో అర్బన్ ఎస్.ఐ. చరణ్ పొన్నూరు ఆర్టీసీ డిపోకు వెళ్లి సాయికిరణ్ మృతికి రోశయ్యే కారణమని బెదిరించడంతో రోశయ్య భయపడిపోయారు. పొన్నూరు డిపో ఇన్చార్జి మేనేజర్‌గా ఉన్న బాపట్ల డిపో మేనేజర్, ఆర్టీసీ సిబ్బంది శుక్రవారం ఎస్ఐ చరణ్‌తో చర్యలు జరిపినప్పటికీ ఎస్ఐ కేసు నమోదు చేశారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన రోశయ్య మన్నవలోని తన స్వగృహంలో శుక్రవారం అర్ధరాత్రి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తాను రాసిన సూసైడ్‌నోట్‌లో తన మృతికి ఎస్ఐ చరణ్ కారణమని, అతడిపై చర్యలు తీసుకోవాలని కోరాడు. భారీగా మోహరించిన పోలీసు బలగాలు.. డ్రైవర్ రోశయ్య ఆత్మహత్య చేసుకున్నాడన్న వార్త తెలిసి వివిధ డిపోలకు చెందిన ఆర్టీసీ సిబ్బంది పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. సూసైడ్ నోట్‌ను పరిశీలించిన మృతుడి బంధువులు, గ్రామస్తులు, ఆర్టీసీ సిబ్బంది రోశయ్య మృతదేహంతో పట్టణంలోని అర్బన్ పోలీస్‌స్టేషన్ ఎదుట ధర్నా చేపట్టారు. ఎస్ఐ చరణ్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. పలువురు ఎస్ఐలు, సీఐలతోపాటు డీఎస్పీలు విక్రమ్ శ్రీనివాస్, పి.మహేష్, అడిషనల్ ఎస్పీ శోభామంజరిలతో పాటు రెండు బెటాలియన్ల రాపిడ్ యాక్షన్‌ఫోర్స్ దిగింది. డీఎస్పీ మహేష్ సర్దిచెప్పడంతో ఆందోళన సద్దుమణిగింది. ఎస్ఐ చరణ్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని అడిషనల్ ఎస్పీ శోభామంజరి ప్రకటించడంతో రోశయ్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిడుబ్రోలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి కుమార్తె పూర్ణిమ, కుమారుడు నాగేంద్ర వరప్రసాద్ ఉన్నారు. -
డ్రైవర్ నిర్లక్ష్యంతో వ్యక్తి మృతి
కర్నూలు : నిర్లక్ష్యంతో డ్రైవర్ బస్ నడపడంతో వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన కర్నూల జిల్లా నందికొట్కూరు ఆర్టీసీ డిపోలో మంగళవారం ఉదయం జరిగింది. వివరాలు... ఆర్టీసీ డ్రైవర్ బస్‌ను రీవర్స్ తీస్తుండగా కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న కిషోర్(20) అనే వ్యక్తి తలపై వెళ్లడంతో అక్కడకక్కడే మృతి చెందాడు. సంఘటన స్థలానికి చేరకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాడు. -
ఎమ్మెల్యే సోదరుడినంటూ వీరంగం
బస్సు డ్రైవర్‌పై దాడి ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు మెహిదీపట్నంలో ఘటన గోల్కొండ: ‘ఎమ్మెల్యే సోదరుడిని.. నాకే సైడ్ ఇయ్యవా?’ అని దూషిస్తూ ఓ యువకుడు మరో యువకుడితో కలిసి ఆర్టీసీ డ్రైవర్‌ను చితకబాదారు. బస్సు అద్దాలు సైతం ధ్వంసమయ్యాయి. బస్సు డ్రైవర్ పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఘటన మంగళవారం రాత్రి ఆసిఫ్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బస్సు డ్రైవర్, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం..ఉప్పల్ డిపోకు చెందిన (రూట్ నం.113ఎం) బస్సు (ఏపీ29జెడ్-3680) మంగళవారం రాత్రి ఉప్పల్ నుంచి మెహిదీపట్నం వచ్చింది. మెహిదీపట్నం ప్రధాన బస్టాప్‌లోని పాయింట్లో ఆపడానికి డ్రైవర్ ముత్యంరెడ్డి పీవీ ఎక్స్‌ప్రెస్‌వే పిల్లర్ నంబర్ 22 వద్ద బస్సును యూటర్న్ తీసుకుంటున్నాడు. అదే సమయంలో స్కూటీపై ఉన్న ఓ ఇద్దరు వ్యక్తులు యూటర్న్ తీసుకుంటున్నారు. పూర్తిగా బస్సు ముందుకు వచ్చి స్కూటీని ఆపారు. షాహెద్, జాహెద్ అనే ఈ ఇద్దరు బస్సులోకి చొచ్చుకెళ్లి డ్రైవర్‌ను దుర్భాషలాడుతూ పిడి గుద్దులు కురిపించారు. వారిలో ఒకరు ‘నేను ఎమ్మెల్యే సోదరుడిని’ అంటూ బెదిరించి బస్సు దిగిపోయాడు. బస్సు పాయింట్ వద్దకు వచ్చి ఆగగానే మళ్లీ బస్సులోకి వచ్చిన ఆ యువకులు డ్రైవర్ ముత్యంరెడ్డిని చితకబాదారు. ఈ క్రమంలో బస్సు అద్దాలు ధ్వంసమయ్యాయి. దీంతో డ్రైవర్ ముత్యంరెడ్డి హుమాయూన్‌నగర్ పోలీస్‌స్టేషన్ ముందు బస్సు ఆపి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సంఘటన జరిగింది ఆసిఫ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోనిది అంటూ హుమాయూన్‌నగర్ పోలీసులు ముత్యంరెడ్డితో అన్నారు. దీంతో ముత్యంరెడ్డి బస్సు కండక్టర్ రామలింగంతో కలిసి ఆసిఫ్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. డ్రైవర్‌పై దాడి చేసినవారు ఓ ఎమ్మెల్యే బంధువులు అని చెబుతుండడంతో పోలీసులు ఆచితూచి వ్యవహరించారు. దాడిచేసిన షాహెద్, జాహెద్ లు ఆసిఫ్‌నగర్ పోలీస్‌స్టేషన్ లో ఉండగా మరికొందరు అక్కడకు వచ్చి తమ వారినే ప్రశ్నిస్తారా? అంటూ ఇన్స్పెక్టర్తో వాగ్వాదానికి దిగి వీరంగం సృష్టించారు. ఇదే సమయంలో ఏసీపీ డి.శ్రీనివాస్ అక్కడకు వచ్చి పరిస్థితిని చక్కదిద్దారు. డ్రైవర్ ముత్యంరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దాడికి పాల్పడిన షాహెద్, జాహెద్లను అదుపులోకి తీసుకున్నారు. వీరు పాతబస్తీలోని తలాబ్ కట్టకు చెందిన వారని, బట్టల వ్యాపారం చేస్తుంటారని తెలిసింది.