ఆర్టీసీ డ్రైవర్ ఇంటికెళ్లి సర్‌ప్రైజ్ చేసిన స్టార్‌ హీరో‌‌ | Kannada Hero Darshan Meets RTC Driver And Celebrated His Birthday | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ డ్రైవర్ ఇంటికెళ్లి సర్‌ప్రైజ్ చేసిన స్టార్‌ హీరో

Published Tue, Mar 23 2021 12:22 PM | Last Updated on Tue, Mar 23 2021 2:06 PM

Kannada Hero Darshan Meets RTC Driver And Celebrated His Birthday - Sakshi

సాధారణంగా ఓ వ్యక్తికి సమాజంలో గుర్తింపు, హోదా వచ్చిదంటే చాలు.. వారు ఇక సెలెబ్రిటీ అయిపోతారు. హోదాని దృష్టిలో పెట్టుకొని, తమకంటే తక్కువ స్థాయిగల వారితో మాట్లాడడానికే నిరాకరిస్తారు. చిత్రపరిశ్రమలో అయితే ఇది మరీ ఎక్కువ. ఒక్క సినిమా తీసి హిట్‌ కొడితే చాలు.. ఇక ఆ హీరో చరిత్రే మారిపోతుంది. ఉండే ఇల్లు మొదలు... చేసే స్నేహం వరకు అన్ని మారిపోతాయి. గతం మర్చిపోయి కొత్త జీవితాన్ని ఎంజాయ్‌ చేస్తారు. తన ఎదుగుదలకు సహకరించిన వారితో పాటు, చిన్ననాటి స్నేహితులను కూడా మర్చిపోతారు. కానీ కన్నడ స్టార్‌ హీరో దర్శన్‌ మాత్రం ఇందుకు విరుద్దం. చిన్ననాటి స్నేహితులతో పాటు, తనను స్కూల్‌కు తీసుకెళ్లిన ఆర్టీసీ డ్రైవర్‌ని కూడా మర్చిపోలేదు.

తాజాగా ఆయన చిన్నతనంలో తనను స్కూల్‌కు తీసుకెళ్లిన ఆర్టీసీ డ్రైవర్ ఇంటికి వెళ్లి అందరిని ఆశ్చర్యపరిచాడు. ఆ ఆర్టీసీ డ్రైవర్‌ నిన్న (మార్చి 22)80వ పుట్టిన రోజు జరుపుకున్నాడు. ఈ విషయం హీరో దర్శన్‌ దృష్టికి వెళ్లింది. ఎప్పటి నుంచో తనను కలుద్దామనుకున్న దర్శన్‌.. ఇదే మంచి సమయం అనుకొని బర్త్‌డే రోజు ఆయన ఇంటికి వెళ్లి సర్‌ప్రైజ్‌ చేశాడు. ఆయనకు పుష్పగుచ్ఛం ఇచ్చి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశాడు. ఇందుకు సంబంధించిన పోటోలను దర్శన్‌ తన సోషల్‌ మీడియా ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. దర్శన్‌ చేసిన పనిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. దర్శన్‌ రియల్‌ హీరో అని  కామెంట్లు చేస్తున్నారు. 


No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement