స్టార్‌ హీరోపై చెప్పు విసిరిన వ్యక్తి.. వీడియో వైరల్‌ | Slipper Thrown at Kannada Hero Darshan | Sakshi
Sakshi News home page

Darshan: స్టేజీపై ఉన్న హీరోపై చెప్పుతో దాడి.. బాధించిందన్న శివ రాజ్‌కుమార్‌

Published Mon, Dec 19 2022 6:55 PM | Last Updated on Mon, Dec 19 2022 7:19 PM

Slipper Thrown at Kannada Hero Darshan - Sakshi

కన్నడ హీరో దర్శన్‌కు చేదు అనుభవం ఎదురైంది. సాంగ్‌ లాంఛ్‌ కోసం వెళ్లిన అతడిపై ఓ వ్యక్తి చెప్పు విసరడం దారుణంగా అవమానించాడు. ఆదివారం 'క్రాంతి' సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా కర్ణాటకలోని హోస్పేట్‌లో సాంగ్‌ లాంఛ్‌ కార్యక్రమానికి హాజరయ్యాడు దర్శన్‌. స్టేజీపై నిలబడి అభిమానులకు అభివాదం చేస్తున్న సమయంలో అతడిపై ఓ వ్యక్తి చెప్పు విసిరాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై కన్నడ స్టార్‌ శివరాజ్‌కుమార్‌ ఆవేదన వ్యక్తం చేశాడు. 'నిన్న జరిగిన చర్య నా మనసును బాధించింది. ఎవరూ మానవత్వాన్ని మరిచి ఇలాంటి అమానవీయ ఘటనలకు పాల్పడవద్దని కోరుతున్నాను. అభిమానంతో ప్రేమను చూపించండి. అంతేకానీ ద్వేషం, అగౌరవం కాదు'' అంటూ ఓ వీడియో షేర్‌ చేశాడు.

కాగా దర్శన్‌ ఇటీవల అదృష్ట దేవతపై చేసిన అనుచిత వ్యాఖ్యల కారణంగానే ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. 'అదృష్ట దేవత ప్రతిసారీ తలుపు తట్టదు. తలుపు తట్టినప్పుడే చేయి పట్టుకుని బెడ్‌రూమ్‌లోకి లాక్కెల్లి దుస్తులు విప్పేయాలి. అప్పుడు ఆమె ఎక్కడికీ వెళ్లదు' అని దర్శన్‌ చేసిన కామెంట్లు ఎంతగానో వివాదాస్పదమయ్యాయి. అదృష్ట దేవతను లక్ష్మీ దేవతగా భావిస్తారు. శ్రీ విష్ణుమూర్తి భార్య అయిన లక్ష్మీదేవిపై అంత నీచంగా ఎలా మాట్లాడతావంటూ అతడిపై దారుణమైన ట్రోల్స్‌ వచ్చాయి.

చదవండి: బేబీ బంప్‌తో ఉపాసన, ఫోటోలు వైరల్‌
అమ్మ ఆత్మహత్య చేసుకుంది: ఆదిరెడ్డి ఎమోషనల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement