స్టార్ హీరో కాపురంలో చిచ్చు.. హీరోయిన్‌కి వార్నింగ్ ఇచ్చిన భార్య? | Darshan Wife Vijayalakshmi Warn Actress Pavithra Gowda After Her Post With Her Husband Goes Viral, Deets Inside - Sakshi
Sakshi News home page

Darshan-Pavithra Gowda: స్టార్ హీరోతో సన్నిహితంగా.. ఫొటోలన్నీ బయటపెట్టిన హీరోయిన్

Published Fri, Jan 26 2024 5:36 PM | Last Updated on Fri, Jan 26 2024 6:24 PM

Darshan Wife Warn Actress Pavithra Gowda - Sakshi

'సలార్' రిలీజ్ టైంలో ఓ కన్నడ స్టార్ హీరో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ సినిమాకు భయపడేది లేదని అన్నాడు. దీంతో ఇతడు ఎవరబ్బా అని తెలుగు ప్రేక్షకులు మాట్లాడుకున్నారు. రీసెంట్‌గా ఇతడు హీరోగా నటించిన 'కాటేరా' సినిమా హిట్ అయింది. ఇప్పుడు ఈ స్టార్ హీరో ఇంట్లో గొడవలు జరుగుతున్నాయట. అది కూడా ఓ హీరోయిన్ వల్ల. ఒక్క వీడియోనే దీనికి కారణమని అంటున్నారు. 

అసలేం జరిగింది?
కన్నడలో స్టార్ హీరో దర్శన్. ఇతడిని అభిమానులు ముద్దుగా డి-బాస్ అని పిలుస్తుంటారు. ఎప్పుడూ ఏదో ఓ అనవసరమైన కామెంట్స్ చేస్తూ వివాదాల్లో ఉంటాడు. అలాంటిది ఇప్పుడు ఇతడి సంసారంలో చిచ్చు రేగినట్లు తెలుస్తోంది. ఇదంతా కూడా పవిత్ర గౌడ అనే హీరోయిన్.. ఇన్ స్టాలో ఓ వీడియో పోస్ట్ చేయడంతో వచ్చింది. '10 ఏళ‍్ల రిలేషన్‌షిప్ ఇది. ఎప్పటికీ ఇలానే ఉండిపోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక‍్యూ దర్శన్' అని వీడియో దిగువన క్యాప్షన్ పెట్టింది.

(ఇదీ చదవండి: 'సలార్' నటుడికి కోర్టు నోటీసులు.. కారణం అదే?)

స్టార్ హీరో భార్య వార్నింగ్
అయితే చాన్నాళ్ల నుంచి దర్శన్-పవిత్ర గౌడ మధ్య ఏదో ఉందని కన్నడ ఇండస్ట్రీలో రూమర్స్ వస్తూనే ఉన్నాయి. కానీ వాటిని పెద్దగా పట్టించుకోలేదు. కాకపోతే తాజాగా పోస్ట్ చేసిన వీడియోలో హీరో దర్శన్‌తో పవిత్ర గౌడ.. సన్నిహితంగా ఉన్న ఫొటోలు కూడా కొన్ని ఉన్నాయి. వీటిని చూసి నెటిజన్స్ అవాక్కయ్యారు. ఇక దర్శన్ భార్య విజయలక్ష్మి మరింత సీరియస్ అయిందట. ఏకంగా సెట్‌కి వెళ్లి మరీ పవిత్ర గౌడకు వార్నింగ్ ఇచ్చిందట.

ఇకపై దర్శన్‌తో కనిపించొద్దని పవిత్ర గౌడకు గట్టిగానే విజయలక్ష్మి చెప్పిందట. ప్రస్తుతం ఈ విషయం కన్నడ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారిపోయింది. ఈ విషయం మీద అవసరమైతే లీగల్ యాక్షన్ కూడా తీసుకుంటానని పవిత్రని దర్శన్ భార్య హెచ్చరించిందట. ఇందులో నిజానిజాలు ఏంటనేది తెలియాల్సి ఉంది. 

(ఇదీ చదవండి: మాజీ భార్యతో డేటింగ్‌.. నేను మారిపోయా: నటుడు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement