రేణుకాస్వామిని హీరోను చేయడం ఆపండి.. దర్శన్‌కు యాంకర్‌ సపోర్ట్‌ | Anchor Hemalatha Support for Darshan, Says Stop Making Renukaswamy a Hero | Sakshi
Sakshi News home page

ఏదేమైనా నీ స్నేహం విడువను.. దర్శన్‌కు మద్దతుగా యాంకర్‌

Published Wed, Jun 26 2024 5:36 PM | Last Updated on Wed, Jun 26 2024 6:30 PM

Anchor Hemalatha Support for Darshan, Says Stop Making Renukaswamy a Hero

స్క్రీన్‌పై హీరోగా మెప్పించే దర్శన్‌ నిజ జీవితంలో మాత్రం కరడుగట్టిన విలన్‌గా మారాడు. తన ప్రియురాలు పవిత్ర గౌడను వేధిస్తున్నాడన్న నెపంతో తన గ్యాంగ్‌తో కలిసి అభిమాని రేణుకాస్వామిని అతి దారుణంగా చంపాడు. ఈ నేరాన్ని కప్పిపుచ్చేందుకు ప్రయత్నించాడు. కానీ సీసీ కెమెరాల్లో అడ్డంగా దొరికిపోవడంతో ఇప్పుడు జైల్లో ఊచలు లెక్కపెడుతున్నాడు.

ఒక్కసారి ఆ బంధంలో..
ఈ కేసు విషయంలో అందరూ దర్శన్‌ను దుమ్మెత్తిపోస్తుండగా యాంకర్‌ హేమలత మాత్రం హీరోకు మద్దతుగా నిలబడింది. ఇక నా వల్ల కావడం లేదు. ఎవరు ఏమైనా అనుకోని.. ఒకరిపై మనం పెంచుకున్న ప్రేమకు, స్నేహానికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటాం. ఒక్కసారి స్నేహం అనే బంధంలో ఇరుక్కున్నాక దాని నుంచి బయటకు రాలేము. అప్పుడు, ఇప్పుడే కాదు.. భవిష్యత్తులోనూ ఆ బంధాన్ని వదిలేయాలని అనుకోము. 

ఆ గౌరవం అలాగే..
జరిగిన ఘటన గురించి ఏమని మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. కానీ మీ(దర్శన్‌) మీద ఉన్న ప్రేమ, గౌరవం మాత్రం ఎప్పటికీ అలాగే ఉంటుంది. దయచేసి రేణుకాస్వామిని హీరో చేయడం ఆపండి అని రాసుకొచ్చింది. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిన ఈ పోస్టుకు దర్శన్‌తో కలిసి ఉన్న ఫోటోను జత చేసింది.

చదవండి: ప్రియుడితో బిగ్‌బాస్‌ బ్యూటీ బ్రేకప్.. అందుకే అలా చేశారా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement