ప్రయాణికుడి దాడిలో ఆర్టీసీ డ్రైవర్ మృతి | RTC driver died in passenger | Sakshi
Sakshi News home page

ప్రయాణికుడి దాడిలో ఆర్టీసీ డ్రైవర్ మృతి

Published Thu, Apr 23 2015 11:25 PM | Last Updated on Fri, Sep 28 2018 3:39 PM

RTC driver died in passenger

అనంతపురం: ప్రయాణికుడు దాడిలో ఆర్టీసీ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన గురువారం అనంతపురం బస్టాండ్ సమీపంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. అనంతపురం బస్టాండ్ నుంచి వెలుపలకు వచ్చిన బస్సును ఆపితే బ్రడ్ కొనుక్కుని వస్తానని నారాయణప్ప అనే ప్రయాణికుడు... బస్సు డ్రైవర్ ఆంజనేయులకు తెలిపాడు.

అందుకు అతడు నిరాకరించాడు. దీంతో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. ఆ క్రమంలో బస్సులో ఉన్న ఐరన్ రాడ్ తీసి... డ్రైవర్ తలపై కొట్టాడు. డ్రైవర్ కుప్పకూలిపోయాడు. దాంతో బస్సులోని ఇతర ప్రయాణికులు నారాయణప్పను పోలీసులకు అప్పగించారు. పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మద్యం మత్తులో నారాయణప్పు ఉన్నాడని పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement