గుండెపోటుతో ఆర్టీసీ డ్రైవర్ మృతి
Published Thu, Nov 10 2016 9:18 PM | Last Updated on Fri, Sep 28 2018 3:41 PM
మంగళగిరి బస్టాండ్‌లో ఘటన
మంగళగిరి: గుండెపోటుతో ఓ ఆర్టీసీ డ్రైవర్ మృతి చెందిన ఘటన మంగళగిరి ఆర్టీసీ బస్టాండ్‌లో గురువారం చోటు చేసుకుంది. పట్టణ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పట్టణానికి చెందిన భీమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి(54) మంగళవారం రాత్రి హైదరాబాద్ నుంచి మంగళగిరి వచ్చే బస్సులో విధులు నిర్వహిస్తూ మంగళగిరి డిపోకు బుధవారం ఉదయం 6 గంటలకు చేరుకున్నాడు. అనంతరం కౌంటర్‌లో నగదు చెల్లించేందుకు వెళ్తూ ఆకస్మాత్తుగా బస్టాండ్‌లో కింద పడిపోయాడు. గమనించిన తోటి ఉద్యోగులు ప్రభాకర్‌రెడ్డిని లేపేందుకు ప్రయత్నించి అంబులెన్స్‌కు ఫోన్ చేయగా అంబులెన్స్‌లో వచ్చిన సిబ్బంది చూసి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ప్రభాకర్‌రెడ్డి మృతి పట్ల ఆర్టీసి కార్మిక సంఘాల నాయకులు, ఉద్యోగులు, కార్మికులు సంతాపం తెలిపారు.
Advertisement
Advertisement