
సాక్షి, సంగారెడ్డి: చిన్నవయసులోనే గుండెపోటుతో కన్నుమూస్తున్న వరుస ఘటనలు చూస్తున్నాం. తాజాగా సంగారెడ్డిలోనూ అలాంటి విషాద ఘటనే నెలకొంది. 12 ఏళ్ల బాలుడు నిద్రలోనే గుండెపోటుతో కన్నుమూసిన ఘటన స్థానికులతో కంటతడి పెట్టిస్తోంది.
కంగ్టి మండలం తడ్కల్‌కు చెందిన ఖలీల్(12) ఒంట్లో బాగోలేదని తల్లిదండ్రులకు చెప్పాడు. గతరాత్రి నిద్రలో అపస్మారక స్థితికి గురయ్యాడు. వెంటనే కుటుంబ సభ్యులు అతన్ని ఆస్పత్రికి తరలించారు. అయితే మార్గం మధ్యలోనే అతను కన్నుమూశాడు.
ఖలీల్‌ను పరిశీలించిన వైద్యులు గుండెపోటుతోనే కన్నుమూసినట్లు ధృవీకరించారు. దీంతో ఆ తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. నిన్నటిదాకా తమ కళ్ల ముందు ఆడిపాడిన చిన్నారి లేడనే విషయాన్ని వాడ ప్రజలు తట్టుకోలేక కంటతడి పెడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment