ఏడుగురు ఆర్టీసీ డ్రైవర్లు అరెస్ట్‌ | The arrest of the seven RTC drivers | Sakshi
Sakshi News home page

ఏడుగురు ఆర్టీసీ డ్రైవర్లు అరెస్ట్‌

Feb 11 2017 2:03 AM | Updated on Aug 21 2018 5:51 PM

తమిళ కూలీలు బెంగళూరు నుంచి వైఎస్సార్‌ జిల్లా రావడానికి సహకరించిన ఏడుగురు ఆర్టీసీ డ్రైవర్లను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

ఖాజీపేట: తమిళ కూలీలు బెంగళూరు నుంచి వైఎస్సార్‌ జిల్లా రావడానికి సహకరించిన ఏడుగురు ఆర్టీసీ డ్రైవర్లను పోలీసులు అరెస్ట్‌ చేశారు. గత కొంతకాలంగా ఖాజీపేట, మైదుకూరు, దువ్వూరు ప్రాంతాల్లోని లంకమల కొండల్లోకి తమిళకూలీలు అధికంగా వస్తున్నారని మైదుకూరు డీఎస్పీ బీఆర్‌. శ్రీనివాసులు,  తెలిపారు. శుక్రవారం  విలేకరుల తో మాట్లాడుతూ  శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కావలి, ఆత్మకూరు, ఉదయగిరి డిపోలకు చెందిన డ్రైవర్లు తమిళకూలీలు ఇక్కడికి వచ్చేందుకు సహకరిస్తున్నట్లు తేలిందన్నారు.

వారిలో కావలి డిపోకు చెందిన నోటి మాలకొండారెడ్డి, పెట్లూరి ప్రభాకర్‌రావు, షేక్‌ మహబూబ్‌ సుభాని, సెనగల వెంకటేశ్వర్లు, సాన సుధాకర్, కట్ట సురేష్, ఆత్మకూరు డిపోకు చెందిన షేక్‌ సర్ధార్‌ బాషాలను అదుపులోకి తీసుకుని విచారించామని చెప్పారు. తమిళ కూలీలు వచ్చేందుకు వారు సహకరించినట్టు తేలడంతో అరెస్ట్‌ చేశామని తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement