ప్రతీకాత్మక చిత్రం
నందిపేట్ (ఆర్మూర్): రోడ్డు ప్రమాదానికి కారణమైన ఆర్టీసీ బస్సు డ్రైవర్‌కు ఆర్నెళ్ల జైలుశిక్షతో పాటు రూ.1500 జరిమానా విధిస్తూ ఆర్మూర్ జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు గురువారం తీర్పు వెలువరించింది. నందిసేట్ ఎస్సై సంతోష్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని జోర్‌పూర్ గ్రామానికి చెందిన ఏడ మహేశ్ తన స్నేహితుడైన బచ్చు రాముతో కలిసి 2015 మార్చి 31న పొలానికి వెళ్తుండగా, ఎదురుగా వచ్చిన ఆర్మూర్ డిపో బస్సు ఢీకొట్టింది.
తీవ్రంగా గాయపడిన ఇద్దరిని ఆస్పత్రికి తరలించగా, మహేశ్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ కేసు గురువారం విచారణకు రాగా ప్రమాదానికి కారణమైన బస్ డ్రైవర్ మేకల రాజశేఖర్‌కు ఆర్నెళ్ల జైలు శిక్షతో పాటు రూ.1500 జరిమానా విధిస్తూ ఆర్మూర్ మేజిస్ట్రేట్ ఉదయ్‌కుమార్ తీర్పు చెప్పారు. ఈ కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా ప్రవీణ్ నాయక్, ఇన్వెస్టిగేషన్ అధికారిగా జాన్‌రెడ్డి వ్యవహరించారు.
Comments
Please login to add a commentAdd a comment