ఫోన్‌ చేసి సొమ్ము కొట్టేశారు | money with draw | Sakshi
Sakshi News home page

ఫోన్‌ చేసి సొమ్ము కొట్టేశారు

Published Wed, Sep 14 2016 10:24 AM | Last Updated on Wed, Aug 29 2018 7:09 PM

ఫోన్‌ చేసి సొమ్ము కొట్టేశారు - Sakshi

ఫోన్‌ చేసి సొమ్ము కొట్టేశారు

  • మోసపోయిన ఆర్టీసీ డ్రైవర్‌
  • రూ.14,900  డ్రా చేసిన మాయగాళ్లు
  • తూర్పు గోదావరి (అమలాపురం టౌన్‌) :
    ఓ ఫోన్‌ కొట్టాడు.. ఏటీఎం కార్డు సమాచారాన్ని రాబట్టాడు. ఖాతాలో ఉన్న డబ్బును డ్రా చేసి కాజేశాడు. వివరాల్లోకి వెళితే.. అమలాపురం రూరల్‌ మండలం సమనస గ్రామానికి చెందిన గోడ సత్యనారాయణ అనే ఆర్టీసీ డ్రైవర్‌ ఇంట్లో ఉండగా మంగళవారం 76549 41429 సెల్‌ ఫోన్‌ నుంచి కాల్‌ వచ్చింది. ఫోన్‌ ఎత్తిన సత్యనారాయణకు ‘మేమ బ్యాంక్‌ నుంచి మాట్లాడుతున్నాం. మీ ఏటీఎం కార్డు పనిచేయటం లేదు. దానిని సరి చేయాలి. ముందు మీ ఆధార్‌ కార్డు నెంబరు చెప్పండి’ అని అడిగాడు.

    దాంతో సత్యనారాయణ తన ఆధార్‌ కార్డు నెంబరు చెప్పారు. అనంతరం మరింత సమాచారం అడిగాడు.  అన్నింటికి సమాధానం చెప్పిన సత్యనారాయణ ఫోన్‌కు రెండు దఫాలుగా రూ.14,900 డ్రా చేసినట్టు మేసేజ్‌లు వచ్చాయి. కంగారు పడి ఏటీఎంకి వెళ్లి చూడగా డిపాజిట్‌లో ఉన్న మొత్తం రూ.16 వేలకు గాను రూ.14,900 డ్రా అయినట్టు తెలిసింది. తనకు ఫోన్‌ వచ్చిన సెల్‌ నెంబర్‌కు ఫోన్‌ చేస్తుంటే ఎవరో హిందీలో మాట్లాడుతున్నారు. మోసపోయానని గ్రహించిన సత్యనారాయణ సంబంధిత బ్యాంకు అధికారులకు చెబుదామంటే మంగళవారం బ్యాంకులకు సెలవు కావటంతో తనకు జరిగిన మోసంపై అమలాపురం పట్టణ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement